Jump to content

Nflx aunty enti idi.. what is trying to prove?


Recommended Posts

Posted

" తిరుమల లాంటి మతపరమైన ప్రదేశానికి సంబంధించి యే అవాంఛనీయ సంఘటన జరిగినా జాతీయస్థాయిలో ఫోకస్ ఉంటుంది.. కారణం ఆ పవిత్రకొండ చుట్టూ కోట్లసంఖ్యలో అల్లుకున్న సున్నిత భావోద్వేగాలు అలాంటివి మరి..

మీకు చెప్పేంతవాడ్ని కాదుగానీ..

భూమన కరుణాకర్ గారు ప్రెస్మీట్లో ఏమన్నారు..?? నా చిన్నప్పుడు తిరుపతి కొండ ఇంత దట్టంగా ఉండేది కాదు, బోడిగుండులా ఉండేది అని..!!

ఈ స్టేట్మెంట్ యే వైసీపీ అభిమానులో, సోషల్ మీడియా కార్యకర్తలో ఇచ్చారంటే అర్ధం ఉంది..!! కమిటీ ఛైర్మెన్గా మీరివ్వడం అస్సలు బాలేదు..

ఆనాటి అద్భుతమైన ప్రగతికి ఇప్పటికీ అందరూ ప్రామాణికంగా భావించే పీవీఆర్కే ప్రసాద్ గారి రచనలలో సైతం ఎక్కడిక్కడ అటవీప్రాంతం, దట్టమైన కొండలతో కూడిన అరణ్యం అనే ఉటంకించారు తప్ప బోడిగుండు, మైదానం అని పేర్కొనలేదు నేను చదివినంత వరకూ..

నిజానికి తిరుమల కొండ శతాబ్దాల తరబడి ఎప్పుడూ అలాగే ఉంది రకరకాల వన్యప్రాణులతో.. మనం ఈరోజొచ్చాం.. వాటి ప్రశాంతతకు భంగం కలిగేలా, వాటి ఆవాసాల మధ్యలోంచి మార్గాలు వేసుకుని చికాకు పెడుతోంది మనం.. ఆకలి తీరాకా ఆక్రమించుకోవడమనే మనిషికున్న సహజగుణం కొద్దీ కొండని మెల్లగా కబ్జా చేసి పారేశాం..

సరే, మనకున్నది ఒకేఒక్క ఏడుకొండల వాడు కాబట్టి తప్పట్లేదు.. ఇప్పటిదాకా win-win situation లాగా మృగాలు, మనుషులు ఓ మాట మీదకొచ్చి సామరస్యంగా పోతున్నప్పుడు అప్పుడప్పుడూ మనం బోర్డర్ దాటిన ప్రతీసారి అవి కూడా ప్రతాపాన్ని చూపిస్తుంటాయ్.. కనుక, పూర్తిస్థాయిలో పరిశోధించి ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామంటే సరిపోతుంది.. అంతేగాని ఇలాంటి స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు.

వన్యమృగాల దాడిని నివారించటానికి ఐసోలేషన్ పద్దతిలో మెట్ల చుట్టూ స్టీల్ స్ట్రక్చర్ ఫెన్స్ వేసి, వాటి మీదుగా ఎక్కడిక్కడ ఏటవాలుగా ర్యాంప్ బ్రిడ్జీలు నిర్మిస్తే ఆయా జంతువులు అవే నడుచుకుని పోతాయి. ఫెన్స్ లోపలికి చొరబడటానికి యే మాత్రం అవకాశాలు లేకుండా, ఎవాక్యూయేషన్ నిమిత్తం ప్రతీ పదిహేను మీటర్లకొక ఫైర్ ఎగ్జిట్ గేట్లతో నిర్మించడంలాంటివి టీటీడీ ఇంజినీరింగ్ విభాగాలు చూసుకుంటాయ్..

భక్త వల్లభుడి చెంత ఈ రక్షణాచర్యలు తీసుకోవడం అంత దుర్లభమేమీ కూడా కాదు..

గట్టిగా తల్చుకుని అందరితో మాట్లాడి..

శ్రీవారి దర్శన భాగ్యార్ధం ఈ పనులు చేపట్టబోతున్నాం, విరాళాలేమైనా ఇస్తారా అని ఒక్క ప్రకటన ఇస్తే చాలు.. అంబానీ నుంచి అమెరికాదాకా కనకవర్షం కురిపించడానికి కోట్లలో సిద్ధంగా ఉంటారు భక్తజనులు..!!  "

 

pasted from fb...

Posted
2 minutes ago, Netflixmovieguz said:

 

comparee thathaa

Chusanu.. apudu forest area storng gane undi.. em chepali anukuntaru??

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...