psycopk Posted September 7, 2023 Report Posted September 7, 2023 Lakshman: సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులు కేసీఆర్ కు కనిపించడంలేదా?: లక్ష్మణ్ 07-09-2023 Thu 23:01 | Telangana సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు కేసీఆర్ అందరికంటే పెద్ద హిందువునని చెప్పుకుంటాడన్న లక్ష్మణ్ ఉదయనిధి వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించిన వైనం తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. అందరికంటే తానే పెద్ద హిందువునని కేసీఆర్ చెప్పుకుంటాడని, కానీ సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులు కేసీఆర్ కు కనిపించడంలేదా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఉదయనిధి వ్యాఖ్యలపై ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాలు కీర్తిస్తుంటే, కొందరు సనాతన ధర్మంపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. సనాతన ధర్మంపై దాడులు చేసే వారికి ఓటుతోనే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. Quote
yemdoing Posted September 7, 2023 Report Posted September 7, 2023 Jaggadi aathulu kanipincha Leda ani read 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.