psycopk Posted September 9, 2023 Report Posted September 9, 2023 Daggubati Purandeswari: చంద్రబాబు అరెస్ట్ ను బీజేపీ ఖండిస్తోంది: పురందేశ్వరి 09-09-2023 Sat 09:39 | Andhra సరైన నోటీసు ఇవ్వకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారన్న పురందేశ్వరి ఎఫ్ఐఆర్ లో పేరు కూడా పెట్టలేదని విమర్శ ప్రొసీజర్ ఫాలో కాకుండా అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదని వ్యాఖ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ ను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండించారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ... ఈరోజు చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగిందని... సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, వివరణ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా ఆయనను అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ ను బీజేపీ ఖండిస్తోందని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేశారు. ఎవరినీ ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 CPI Ramakrishna: చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గం: సీపీఐ రామకృష్ణ 09-09-2023 Sat 09:20 | Andhra అర్ధరాత్రి పూట పోలీసులు హంగామా చేయాల్సిన అవసరం ఏముందన్న రామకృష్ణ ముందుగా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందని వ్యాఖ్య లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం దారుణమని మండిపాటు టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పూట వచ్చి హంగామా చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఏదైనా ఉంటే ముందుగానే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమని అన్నారు. తన తండ్రి వద్దకు వెళ్లకుండా నారా లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం దారుణమని అన్నారు. మరోవైపు చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. Quote
Spartan Posted September 9, 2023 Report Posted September 9, 2023 Modi behind it annav kada mari BJP khandinchadam endi Quote
Netflixmovieguz Posted September 9, 2023 Report Posted September 9, 2023 Just now, Spartan said: Modi behind it annav kada mari BJP khandinchadam endi Avvasarraammm Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.