psycopk Posted September 9, 2023 Report Posted September 9, 2023 https://www.instagram.com/reel/Cw-braxshcI/?igshid=MzRlODBiNWFlZA== Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌పై మాజీ మంత్రి, తెలంగాణ నేత తుమ్మల నాగేశ్వర రావు 09-09-2023 Sat 19:47 | Both States చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమన్న తుమ్మల రాజకీయ కక్షతో ఆయన పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని వ్యాఖ్య అసత్యాలతో చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆవేదన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ ప్రాంతానికి చెందిన నేత తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. తుమ్మల మూడు దశాబ్దాలకు పైగా టీడీపీలో ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఆ పార్టీని వీడారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పని చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు. రాజకీయ కక్షతో ఆయన పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. అసత్యాలతో చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. అరెస్ట్ సమయంలో కనీస న్యాయసూత్రాలు పాటించలేదన్నారు. మాజీ సీఎం పట్ల అమర్యాదగా ప్రవర్తించారన్నారు. Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 Roja: లోకేశ్! మీ నాన్నను జైలుకు పంపించకుండా జైలర్ సినిమాకు పంపిస్తారా?: మంత్రి రోజా 09-09-2023 Sat 18:42 | Andhra పిచ్చోడు లండన్‌కు... మంచోడు జైలుకు అంటూ లోకేశ్ ట్వీట్ చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే అరెస్టయ్యాడని రోజా కౌంటర్ చంద్రబాబు అరెస్టుతో ఎన్టీఆర్ ఆత్మ సంతోషంగా ఉంటుందని వ్యాఖ్య మీ నాన్న నిప్పు అయితే కనుక విచారణ జరుపుకోమని ధైర్యంగా చెప్పాలని సవాల్ 'పిచ్చోడు లండన్‌కి... మంచోడు జైలుకి... ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం' అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన ట్వీట్‌కు మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే అరెస్టయ్యాడని, అవినీతికి పాల్పడిన వ్యక్తిని జైలుకు పంపించకుండా ఎక్కడకు పంపిస్తారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌తో ఇప్పుడు ఎన్టీఆర్ ఆత్మ సంతోషంగా ఉంటుందన్నారు. సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రోజా కౌంటర్ ఇచ్చారు. 'ఓ పిల్ల సైకో లోకేశ్... మీ డాడీ కేడీ కాబట్టే అరెస్టయ్యాడు' అంటూ విమర్శలు గుప్పించారు. మీ నాన్న మంచోడు కాదని, సూట్ కేసు కంపెనీలతో ముంచేసినోడని తెలుసుకో అన్నారు. ఇలాంటి కరప్షన్ కింగ్‌ను జైలుకు పంపించకుండా జైలర్ సినిమాకు పంపిస్తారా? అని ఎద్దేవా చేశారు. ఓ పప్పూ.. మీ నాన్న తుప్పు కాదు నిప్పు అయితే కనుక ఈ కుంభకోణంలో విచారణ జరుపుకోండని ధైర్యంగా చెప్పు అంటూ లోకేశ్‌కు సవాల్ చేశారు. ఈ కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబును ఏ దేవుడూ కాపాడలేడని, మీ తాత ఎన్టీఆర్ ఆత్మ ఇప్పటికి సంతోషిస్తుందన్నారు. బైబై తుప్పు.. బైబై పప్పు అంటూ ట్వీట్‌ను ముగించారు. Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 Nadendla Manohar: పవన్ విమానాన్ని కూడా నిలిపివేశారంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నామో అర్థమవుతోంది: నాదెండ్ల మనోహర్ 09-09-2023 Sat 18:39 | Andhra నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ సంఘీభావం తెలిపేందుకు ఏపీ రావాలనుకున్న పవన్ శంషాబాద్ లో విమానం టేకాఫ్ కు అనుమతి నిరాకరణ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వెనుదిరిగిన నాదెండ్ల ఇందుకేనా జగన్ కు 151 సీట్లు ఇచ్చింది అంటూ విమర్శలు టీడీపీ అధినేత చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ విమానం టేకాఫ్ కు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం తెలిసిందే. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రావాల్సిన పవన్ కల్యాణ్ విమానం రాకపోవడంతో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గన్నవరం విమానాశ్రయం నుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై నాదెండ్ల ధ్వజమెత్తారు. విజయవాడ వస్తున్న పవన్ కల్యాణ్ విమానాన్ని నిలిపివేశారంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నామో అర్థమవుతుందని పేర్కొన్నారు. పవన్ కోసం తాను ఎయిర్ పోర్టుకు వస్తుంటే దారిపొడవునా ఆంక్షలేనని వెల్లడించారు. పవన్ కల్యాణ్ అంటే అంత భయం ఎందుకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జీవించాలంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తోందని నిలదీశారు. ఇవాళ ఏపీలో ఆర్టీసీ బస్సులన్నీ నిలిపివేశారని, పోలీసులు నిర్బంధాలు, అరెస్టులు చేస్తున్నారని నాదెండ్ల విమర్శించారు. ఇందుకేనా జగన్ కు ప్రజలు 151 సీట్లు ఇచ్చింది... రాష్ట్రంలో పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలి అని పిలుపునిచ్చారు. Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 Chandrababu: చంద్రబాబు అరెస్ట్ వార్తను మీడియా ద్వారానే తెలుసుకున్న గవర్నర్ 09-09-2023 Sat 18:07 | Andhra కనీస సమాచారం లేకపోవడంపై గవర్నర్ విస్మయం వ్యక్తం చేసినట్టు సమాచారం అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి అంటున్న నిపుణులు 2021లో కేసు నమోదు చేసినప్పటి నుండి అనుమతి తీసుకోని వైనం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విస్మయం వ్యక్తం చేసినట్టు సమాచారం. తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై గవర్నర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడానికి గవర్నర్ కార్యాలయాన్ని సీఐడీ అధికారులు సంప్రదించలేదని తెలుస్తోంది. అవినీతి నిరోధక చట్టం-2018 సవరణల ప్రకారం ప్రజాప్రతినిధులు, అంతకుముందు మంత్రులుగా పని చేసినవారు నిర్వహించిన శాఖల్లో అవినీతి జరిగినట్లుగా ప్రభుత్వం దృష్టికి వస్తే వాటిని క్రోడీకరించి గవర్నర్‌కు నివేదికను సమర్పించాలని, ఆ తర్వాత గవర్నర్ నుంచి అనుమతి తీసుకొని విచారణ చేపట్టాలని న్యాయ నిపుణులు అంటున్నారు. అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ(సీ) ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరి. కానీ 2021లో కేసు నమోదు చేసినప్పటి నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. గవర్నర్ కూడా మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగానే అరెస్టు గురించి తెలుసుకున్నారని తెలుస్తోంది. దీంతో మాజీ సీఎం అరెస్ట్‌పై ఆయన విస్మయం వ్యక్తం చేసినట్టు సమాచారం. Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 VV Lakshminarayana: చంద్రబాబు అరెస్ట్ పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఏమన్నారంటే...! 09-09-2023 Sat 17:36 | Andhra స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ చంద్రబాబుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు ఈ కేసును విశ్లేషించిన లక్ష్మీనారాయణ చంద్రబాబును తొలుత ఏసీబీ కోర్టులో హాజరుపర్చాల్సి ఉంటుందని వెల్లడి సీఐడీ పిటిషన్ తిరస్కరణకు గురైతే చంద్రబాబు బెయిల్ దరఖాస్తు చేసుకోవచ్చని వివరణ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ పై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఆయనపై మోపిన అభియోగాలకు సంబంధించిన సెక్షన్లను ఆయన విశ్లేషించారు. చంద్రబాబుపై నమోదు చేసిన కేసులోని కొన్ని సెక్షన్లు ఆయన అరెస్ట్ కు సంబంధించినవని, మరికొన్ని ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లు అని తెలిపారు. ఈ విధంగా అరెస్ట్ చేసిన తర్వాత సదరు వ్యక్తిని 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలని సీఆర్పీసీ చెబుతోందని అన్నారు. ఇందులో కరప్షన్ యాక్ట్ కూడా ఉంది కాబట్టి చంద్రబాబును మొదట ఏసీబీ కోర్టులో హాజరు పర్చాల్సి ఉంటుందని, ఆ తర్వాత సీఐడీ ఏం అడుగుతుందనేది చూడాల్సి ఉంటుందని వివరించారు. "చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరే అవకాశాలున్నాయి. సీఐడీ కస్టడీ పిటిషన్ తిరస్కరణకు గురైతే జడ్జి జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు. అప్పుడు చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేసేందుకు వీలుంటుంది. ఇవాళ రిమాండ్ రిపోర్టులో ఏం రాశారన్నది జడ్జి పరిశీలించాక చంద్రబాబును సీఐడీ కస్టడీకి అప్పగించాలా? లేక జ్యుడిషియల్ కస్టడీ విధించాలా? అనే నిర్ణయం తీసుకుంటారు. జ్యుడిషియల్ కస్టడీ ఆర్డర్ వెలువడిన వెంటనే చంద్రబాబు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్టుల్లో జరిగే ప్రక్రియలు సాధారణంగా ఇలాగే ఉంటాయి. ఇక, సీఐడీ ప్రొసీడింగ్స్ కు, పోలీస్ ప్రొసీడింగ్స్ కు పెద్దగా తేడా ఉండదు. అయితే ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం సెక్షన్ ఉండడం వల్ల ప్రొసీడింగ్స్ మారిపోతాయి. చంద్రబాబును నేరుగా ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చాల్సి ఉంటుంది. ఇది ఆర్థికపరమైన అంశాలతో కూడిన కేసు కావడంతో సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా విచారించాల్సి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయం కావడంతో అన్ని అంశాలను పరిశీలించి బెయిల్ ఇవ్వాలని, కారణాలన్నీ రాయాలని సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో స్పష్టంగా చెప్పింది" అని లక్ష్మీనారాయణ వివరించారు. Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 Kesineni Nani: ఇవన్నీ తాత్కాలికమే... చంద్రబాబు తెల్ల కాగితంలా బయటికి వస్తారు: కేశినేని నాని 09-09-2023 Sat 16:44 | Andhra చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు మచ్చలేని నాయకుడన్న కేశినేని నాని అవినీతి మకిలి అంటని కొద్దిమందిలో చంద్రబాబు ఒకరని వెల్లడి తాము నిన్న ఉన్నాం, ఇవాళ ఉన్నాం, రేపు కూడా ఉంటామని ఉద్ఘాటన తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన కేశినేని మీడియాతో మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడు చంద్రబాబు అని కీర్తించారు. ప్రొసీజర్ ను అనుసరించకుండా ఆయనను అరెస్ట్ చేయడాన్ని తాము ఖండిస్తున్నట్టు తెలిపారు. తన రాజకీయ జీవితం మొదటి నుంచి చంద్రబాబు ప్రజల కోసం, సమాజంకోసం కృషి చేశారని కేశినేని కొనియాడారు. ప్రపంచస్థాయి నేతలు, వ్యాపారవేత్తల నుంచి ప్రశంసలు అందుకున్న వ్యక్తి చంద్రబాబు అని స్పష్టం చేశారు. "ఇలాంటివన్నీ తాత్కాలికమే అని నిన్ననే ఆయనకు చెప్పాను. భారతదేశంలో అవినీతి మకిలి అంటని అతి తక్కువ మంది రాజకీయ నేతల్లో చంద్రబాబు ఒకరు. ఈ వ్యవహారం నుంచి ఆయన క్లీన్ గా, ఒక తెల్ల కాగితంలా స్వచ్ఛంగా బయటికి వస్తారు. జగన్ మోహన్ రెడ్డికి ఒకటే చెబుతున్నాం... నిన్న మేం ఉన్నాం, ఇవాళ మేం ఉన్నాం, రేపు కూడా మేం ఉంటాం. రాజకీయాల్లో దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలే తప్ప కక్ష సాధింపు చర్యలతో ఏమీ చేయలేరు. పోలీసులు, ఐపీఎస్ లకు ఒకటే చెబుతున్నా... దేశం కోసం పనిచేస్తామని మీరు ప్రమాణం చేసి ఉంటారు. ఆ మాట నిలుపుకోండి. ఒక వ్యక్తి కోసం పనిచేయడం మానుకోండి" అంటూ కేశినేని నాని స్పష్టం చేశారు. Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 dulipalla narendra: సజ్జల సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారు: ధూళిపాళ్ల 09-09-2023 Sat 15:02 | Andhra చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను సమర్థించుకోవడానికే సజ్జల వక్రభాష్యాలని ఆగ్రహం ప్రాజెక్టుతో సంబంధం లేనప్పుడు సీమెన్స్ జమాఖర్చుల్లో ఎందుకు చూపిందని ప్రశ్న సీమెన్స్ సంస్థ యాజమాన్యాన్ని భయపెట్టి జగన్ సర్కార్ తప్పుడు అఫిడవిట్ తీసుకొచ్చిందని ఆరోపణ ఒప్పందంతో సంబంధం లేని వ్యక్తి చెబితే చంద్రబాబు తప్పుచేసినట్టా? అని నిలదీత స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై సీఎం జగన్ తరఫున పని చేసే వసూల్ రాజా సజ్జల రామకృష్ణారెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... 2013లో గుజరాత్‌లో ఆ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం, సీమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్, డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయన్నారు. అలాగే ఝార్ఖండ్, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు కూడా అదేవిధమైన ఒప్పందాలు చేసుకున్నాయని, ఆ తర్వాతే ఏపీలో నాటి టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ను రాష్ట్రంలో అమలు చేయడానికి సిద్ధమైందన్నారు. వసూల్ రాజా సజ్జల స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అమల్లో భాగంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలపై వక్రభాష్యాలు చెబుతున్నాడన్నారు. సీమెన్స్ సాఫ్ట్ వేర్ ఇండియా సాఫ్ట్ వేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏపీతో చేసుకున్న ఒప్పందంతో తమకు సంబంధంలేదని సజ్జల చెప్పడం హాస్యాస్పదమన్నారు. సీమెన్స్ సంస్థకు ఒప్పందంతో సంబంధం లేనప్పుడు, ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం తాలూకు సొమ్ముని ఎందుకు సదరు సంస్థ జమా ఖర్చుల్లో చూపిందో సజ్జల చెప్పాలని నిలదీశారు. ఒప్పందం ద్వారా వచ్చిన డబ్బుని సంస్థ లాభాల్లో చూపినవారు, ఒప్పందంతో తమకు సంబంధంలేదని సదరు సంస్థ చెప్పడం వెనక ఉన్న కుట్రను అర్థం చేసుకోలేని వారెవరూ లేరని సజ్జల తెలుసుకుంటే మంచిదన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ పొందిన 2,14,000 మంది యువతను అడిగితే ప్రాజెక్ట్ కోసం కేటాయించిన రూ.370 కోట్లు ఎటు వెళ్లాయో సజ్జలకు బోధపడుతుందన్నారు. జగన్ సర్కార్ సీమెన్స్ సంస్థ యాజమాన్యాన్ని భయపెట్టి, వారి నుంచి ఒప్పందంతో తమకు సంబంధం లేదన్నట్టు రాయించి తప్పుడు అఫిడవిట్ తీసుకొచ్చిందనేది పచ్చినిజమన్నారు. సజ్జల చెబుతున్న డేటా ఎంట్రీ ఆపరేటర్ యోగేష్ గుప్తా అనే వ్యక్తి, ఏపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా చేసుకున్న త్రైపాక్షిక ఒప్పందంలో భాగస్వామికాడని చెప్పారు. అతనికి ఒప్పందానికి ఎలాంటి సంబంధంలేదన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లను బెదిరించి, వారితో చంద్రబాబు పేరు చెప్పించినంత మాత్రాన టీడీపీ అధినేత తప్పుచేసినట్టు కాదన్నారు. సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ సంస్థ సహా, ఒప్పందానికి సంబంధించిన వివరాలు, వ్యక్తులు తనకు తెలియదని అదే యోగేశ్ గుప్తా ఈడీ విచారణలో వాంగ్మూలం ఇచ్చారన్నారు. ఈ విషయం వసూల్ రాజా సజ్జల ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. రూ.370 కోట్లు ఎటో పోయాయని చెబుతోన్న సజ్జల మాటలు అతని అజ్ఞానాన్ని, అసమర్థతను సూచిస్తున్నాయన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం టీడీపీ ప్రభుత్వం ఖర్చుపెట్టిన రూ.370 కోట్లు ఎటుపోయాయో ఈ ప్రాజెక్ట్ ద్వారా శిక్షణ పొందిన 2,14,000 మంది యువతను అడిగితే వారే సమాధానం చెబుతారన్నారు. శిక్షణార్థుల వద్దకెళ్లి చంద్రబాబు తప్పుచేశాడు.. మీరు ఆ తప్పులో భాగస్వాములని చెప్పే ధైర్యం సజ్జలకు, అతని ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చూపించని పత్రాలు, వాటిలోని సమాచారం బ్లూ మీడియా, అవినీతి మీడియాలో ఎలా వస్తుందో సజ్జల చెప్పాలన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఏజెన్సీకి, ఒప్పందం చేసుకున్న నాటి టీడీపీ ప్రభుత్వానికి సంబంధం లేకపోతే, సిట్ అధిపతిగా ఉన్న రఘురామిరెడ్డి మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడానికి ఎందుకు వెళ్లాడో సజ్జల చెప్పాలన్నారు. ప్రతి కేసులో ఆయనే వెళ్తున్నాడా? రాష్ట్రవ్యాప్తంగా నమోదయ్యే కేసుల అరెస్టుల కోసం స్వయంగా డీజీపీనే వెళ్తున్నాడా? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణం చెప్పి సంబంధిత పత్రాలు చూపమని చంద్రబాబు అడిగితే, ఆయనకు ఇవ్వని పత్రాల సమాచారం జగన్‌కు వంత పాడే బ్లూమీడియాలో ఎలా వస్తోందో సజ్జల సమాధానం చెప్పాలన్నారు. సీఐడీ, సిట్ వద్ద ఉండాల్సిన సమాచారం బ్లూమీడియా, అవినీతి మీడియాకు ఎలా వెళ్లింది? జీఎస్టీ కేసుని ఉదహరించిన సజ్జల... అదే వైసీపీ ఎంపీలు, వారికి చెందిన సంస్థలు చేసిన తప్పుడు జీఎస్టీ క్లెయిమ్స్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని నిలదీశారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా జరిగిన ఒప్పందంలో ఉన్న కంపెనీలకు, సజ్జల చెబుతున్న జీఎస్టీ కేసుకు ఎలాంటి సంబంధం లేదు... సంబంధంలేని సంస్థలకు చెందిన జీఎస్టీ కేసుని వసూల్ రాజా అతి తెలివితో చంద్రబాబుకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అమలుపై టీడీపీ ప్రభుత్వం వేసిన కమిటీల్లోని అధికారులను ఏపీ సీఐడీ, సిట్‌లు ఎందుకు విచారించలేదో సజ్జల చెప్పాలన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అమలు, సాధ్యాసాధ్యాలు పరిశీలించమని నాటి టీడీపీ ప్రభుత్వం కొందరు అధికారులతో రెండు కమిటీలు వేసిందని, ఆ కమిటీల్లోని అధికారులను విచారించకుండా, వారిపై చర్యలు తీసుకోకుండా కేవలం చంద్రబాబు ఒక్కడిదే తప్పని జగన్ ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది? చంద్రబాబు తప్పు చేశాడని వసూల్ రాజా సజ్జల ఎలా చెబుతున్నాడు? వీటికి సమాధానం చెప్పాలన్నారు. సీఐడీ ఈ కేసులో కొన్ని సంస్థల ఆస్తులు, ఖాతాలు సీజ్ చేస్తే, హైకోర్టు సహా కింది కోర్టులు సదరు ఖాతాలు, ఆస్తులను వదిలేయాలని చెప్పింది నిజం కాదా? సుప్రీంకోర్టు కూడా కింది కోర్టుల ఆదేశాలను సమర్థించింది నిజం కాదా? అని ధ్వజమెత్తారు. సీఐడీ సీజ్ చేసిన డిజైన్ టెక్ ఖాతాల్లో దేశస్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ నేషనల్ కంపెనీలు, దేశరక్షణలో భాగస్వామ్యంగా ఉన్న కంపెనీలు రకరకాల వ్యాపారాలు చేసిన సొమ్ము అని నిర్ధారణ అయ్యాకే న్యాయస్థానాలు ఖాతాల సీజ్‌ను తప్పుపట్టాయన్నారు. ఇవన్నీ తెలిసి కావాలనే సజ్జల టీడీపీపై, చంద్రబాబుపై నిస్సిగ్గుగా బురదజల్లుడు కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడన్నారు. నోటీసు ఇస్తే సమాధానం చెప్పే విషయానికి అరెస్ట్ చేయడమా? జగన్‌లానే చంద్రబాబు కూడా అవినీతిపరుడని సజ్జలకు అనిపించినట్లుగా ఉందని చురకలు అంటించారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు, తప్పులు, నేరాలు ఘోరాలు చేసే సజ్జల, జగన్‌లు ఇప్పుడు చంద్రబాబు తప్పు చేశాడంటున్నారని విమర్శించారు. వసూల్ రాజా అవాస్తవాలు, అసత్యాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికే మీడియా ముందుకొచ్చి తప్పుడు ప్రచారం చేశాడన్నారు. కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికి, చంద్రబాబు, లోకేశ్‌లకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే దొంగ ప్రభుత్వం తమ పార్టీ అధినేతను అరెస్ట్ చేసిందన్నారు. ఆధారాలు అన్నీ ఉన్నప్పుడు అవి చూపించి, చంద్రబాబుకి ఒక నోటీసు ఇచ్చి ఉంటే, ఆయనే కోర్టులకు సమాధానం చెప్పుకునేవారన్నారు. కానీ అలా చేయకుండా హడావిడిగా ఆయన ఉండేచోటుకు వెళ్లి, అర్థరాత్రి అరెస్ట్ పేరుతో డ్రామాలు ఎందుకు నడిపారో సజ్జల చెప్పాలన్నారు. డీఐజీ రఘురామిరెడ్డి రాష్ట్ర పోలీస్ అధికారి కాదని, ముమ్మాటికీ జగన్ రెడ్డి చెంచానే అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ ప్రభుత్వం విచారించిన సుమన్ బోస్ ఇప్పటికీ దేశంలోనే ఉన్నారని, ఆయనతోపాటు అరెస్ట్ కాబడి, వైసీపీ ప్రభుత్వ తప్పుడు కేసుల విచారణకు హాజరై, బెయిల్ పొందిన వారెవరూ దేశం విడిచి వెళ్లలేదన్నారు. జగన్, అతని ప్రభుత్వమే అలా వెళ్లారని దుష్ప్రచారం చేస్తోందని ధూళిపాళ్ల అన్నారు. Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 Botsa Satyanarayana: నిప్పులాంటి వ్యక్తి అయితే కోర్టులో తేల్చుకోవాలి: చంద్రబాబు అరెస్ట్‌పై బొత్స సత్యనారాయణ 09-09-2023 Sat 14:23 | Andhra చంద్రబాబు అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగిందన్న బొత్స స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయనే ప్రధాన సూత్రధారి అని వ్యాఖ్య అవినీతి చేశారు కాబట్టే సీఐడీ అరెస్ట్ చేసిందన్న మంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. శనివారం ఆయన మాట్లాడుతూ... ఈ అరెస్ట్ రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా జరిగిందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయనే ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతే సీఐడీ అరెస్ట్ చేసిందని, ఆయన ఏ తప్పు చేయకుంటే... నిప్పులాంటి వ్యక్తి అయితే కోర్టులో తేల్చుకోవాలని సూచించారు. ఏ విషయంలోనైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అవినీతికి పాల్పడిన వారికి శిక్ష పడవలసిందే అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. ఆయన అవినీతి చేశారు కాబట్టి అరెస్ట్ చేశారన్నారు. చంద్రబాబుపై బొత్స ట్వీట్లు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో బొత్స సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. 'కప్పిపుచ్చలేడు. స్కిల్ డెవెలప్‌మెంట్ స్కాం ద్వారా రూ. 371 కోట్ల ప్రజాధనాన్ని బాబు దారిమళ్లించాడు, దోచుకున్నాడు. 2014 నుండి 2019 వరకు బాబు పాలనలో దేశ చరిత్రలో ఎక్కడా జరగని అవినీతి ఏపీలో జరిగింది. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పి.. యువతకు మంచి చేయాల్సిన చోటే చంద్రబాబు తప్పుడు పనులు చేశాడు. అవినీతి చేసినవాడు చంద్రబాబేలే అని చట్టం ఊరుకుంటుందా?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 kanna lakshminarayana: ప్రభుత్వ పునాదులు కదులుతున్నాయనే సీఎం జగన్ బరితెగింపు: కన్నా లక్ష్మీనారాయణ 09-09-2023 Sat 13:24 | Andhra టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై ఆగ్రహం గొప్ప లక్ష్యంతో చేసిన ప్రాజెక్ట్ పై నిరాధార ఆరోపణలన్న కన్నా సైకో ముఖ్యమంత్రి కనుసన్నల్లో సీఐడీ, సీబీసీఐడీ అంటూ విమర్శలు జగన్ రెడ్డికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని వ్యాఖ్య యువగళంతో లోకేశ్, ప్రజాబలంతో చంద్రబాబు తన ప్రభుత్వ పునాదులు కదుపుతున్నారన్న భయంతోనే ముఖ్యమంత్రి జగన్ బరి తెగించాడంటూ మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు కురిపించారు. సదుద్దేశంతో, గొప్ప లక్ష్యంతో గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ పై ఆది నుంచి జగన్ రెడ్డి ప్రభుత్వం దురుద్దేశంతో నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో సీబీసీఐడీ, సీఐడీ విభాగాలు సైకో ముఖ్యమంత్రి కనుసన్నల్లో నడుస్తున్నాయనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన ఈ విషయమై విలేకరులతో మాట్లాడారు. “ ప్రభుత్వ పరిధిలో ప్రజల కోసం నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన సీబీసీఐడీ, సీఐడీ ఇతర సంస్థలు కేవలం జగన్ రెడ్డి కక్షసాధింపుల వ్యవహారాల్లోనే మునిగి తేలుతున్నాయి. రాయలసీమ పర్యటనలో, ప్రజల మధ్యలో ఉన్న చంద్రబాబునాయుడి వద్దకు అర్ధరాత్రి వెళ్లి అరెస్ట్ పేరుతో హంగామా చేయాల్సిన అవసరం ఏమిటో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గిట్టని వాళ్లను జైళ్లకు పంపాలన్న జగన్ రెడ్డి కోరికలో భాగమే చంద్రబాబు అక్రమ అరెస్ట్. జాతీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి విషయంలో విచారణ సంస్థలు పరిధి దాటి వ్యవహరించాయి’’ అని కన్నా లక్ష్మీ నారాయణ పేర్కొన్నారు. జగన్ రెడ్డి గతంలో అవినీతి కేసుల్లో తాను ఎలా జైలు పాలయ్యాడో.. అదే విధంగా తనకు గిట్టని వారిని జైళ్లకు పంపే ఉద్దేశ్యంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టు కన్నా ఆరోపించారు. దేశంలోనే ధనవంతుడిగా పేరు ప్రఖ్యాతులు పొందడం కోసం ఒకవైపు ప్రజల్ని దోపిడీ చేస్తూ.. మరోవైపు ప్రతిపక్షాలను తప్పుడు కేసులతో దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడని విమర్శించారు. ముద్దాయి ఇచ్చిన ఆదేశాలతో అమాయకులపై పోలీసులు జులుం ప్రదర్శించడం ఎంతమాత్రం సరైంది కాదన్నారు. సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి పనిగట్టుకొని మరీ చంద్రబాబుని అరెస్ట్ చేయడాని కి వెళ్లినప్పుడే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కేసు విచారణ ఎంత పారదర్శకంగా జరిగిందో స్పష్టమైందన్నారు. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ద్వారా 2లక్షల యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి లభించిందని.. రాష్ట్రవ్యాప్తంగా ఆ ప్రాజెక్ట్ పరిధిలోని శిక్షణా కేంద్రాలు ఉత్తమ శిక్షణతోపాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందించినట్టు జగన్ రెడ్డి ప్రభుత్వమే గతంలో ప్రశంసలతో కూడిన నివేదిక ఇచ్చిన విషయాన్ని కన్నా గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచీ చేసిన అవినీతి, దోపిడీ బయటపడి, ఎక్కడ తనను ప్రజలు అసహ్యించుకుంటారోనన్న భయంతోనే జగన్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని కుట్ర రాజకీయాలకు తెరలేపాయని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా వ్యవహరిస్తున్న సైకో ముఖ్య మంత్రికి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. సైకో చెప్పిందానికి తలాడించి, పరిధి దాటి వ్యవహరిస్తున్న అధికారులు కూడా భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమన్నారు. జగన్ రెడ్డి పైశాచిక వికృత చర్యలకు కర్రుకాల్చి వాతలు పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కన్నా తెలిపారు Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 Pawan Kalyan: చంద్రబాబు దీన్నుంచి త్వరగా బయటపడాలి.. ఆయనకు నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా!: పవన్ కల్యాణ్ 09-09-2023 Sat 12:19 | Andhra చంద్రబాబు అరెస్ట్ ను జనసేన ఖండిస్తోందన్న పవన్ చంద్రబాబు పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదని మండిపాటు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శ అధినేత అరెస్టయితే పార్టీ కేడర్ మద్దతుగా రావడం సహజమని వ్యాఖ్య చంద్రబాబు అరెస్ట్ ను కక్ష సాధింపులో భాగంగానే చూస్తున్నానన్న జనసేనాని టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రాథమిక ఆధారాలను కూడా చూపించకుండానే అర్ధరాత్రి వేళల్లో అరెస్ట్ చేసే విధానాన్ని ఏపీలో అవలంబిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది విశాఖపట్నంలో జనసేనపై పోలీసు వ్యవస్థ ఏ విధంగా వ్యవహరించిందో అందరూ చూశారని చెప్పారు. ఏ తప్పూ చేయని జనసేన నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి, అన్యాయంగా జైళ్లలో పెట్టారని దుయ్యబట్టారు. ఇప్పుడు నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన సంఘటన కూడా అలాంటిదేనని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ ను జనసేన సంపూర్ణంగా ఖండిస్తోందని పవన్ చెప్పారు. పాలనాపరంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు పట్ల వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన ఘటనను చూసినా... శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందనే విషయం అర్థమవుతోందని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని వైసీపీ నేతలు వరుసగా చెపుతున్నారని... లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సింది పోలీసులని... ఈ విషయంలో మీ పార్టీకి సంబంధం ఏమిటని మండిపడ్డారు. మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే శాంతిభద్రతలు దారుణంగా తయారయ్యాయని అన్నారు. ఒక పార్టీ అధినేత అరెస్టయితే వాళ్ల పార్టీ నేతలు, కార్యకర్తలు, కేడర్ మద్దతుగా రావడం సహజంగా జరిగే పనేనని... నాయకుడి కోసం అందరూ వస్తారని, ప్రజాస్వామ్యంలో ఇది భాగమని పవన్ చెప్పారు. ఇళ్ల నుంచి వాళ్లు బయటకు రాకూడదు, రోడ్ల మీదకు రాకూడదు అనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులేమో అక్రమాలు చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, జైళ్లలో మగ్గిపోవచ్చు... అయినా విదేశాలకు వెళ్లే అవకాశం మీకుంటుందని దుయ్యబట్టారు. నాయకుడు అరెస్టయినప్పుడు పార్టీ నేతలు ఇంట్లో నుంచి కూడా బయటకు రాకూడదని అనుకుంటే... దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ ను శాంతిభద్రతల అంశంగా కాకుండా, వైసీపీ రాజకీయ కక్ష సాధింపు అంశంగానే జనసేన చూస్తోందని స్పష్టం చేశారు. చంద్రబాబుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, దీన్నుంచి ఆయన త్వరగా బయటపడాలని కోరుకుంటున్నానని చెప్పారు. Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 Balakrishna: చంద్రబాబు అరెస్ట్.. జగన్ పై నిప్పులు చెరిగిన బాలకృష్ణ 09-09-2023 Sat 10:24 | Andhra ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని బాలయ్య మండిపాటు 2021లో ఎఫ్ఐఆర్ నమోదైతే.. ఇంతవరకు ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదని ప్రశ్న జగన్ అన్నం తినడం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని ఎద్దేవా టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై బాలకృష్ణ నిప్పులు చెరిగారు. జగన్ పాలకుడు కాదని... ఆయనొక కక్షదారుడని విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి కక్ష సాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. తాను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టుగా జగన్ కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు? అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. ఇది కావాలనే రాజకీయ కక్షతో చేస్తున్న కుట్ర అని చెప్పారు. 19.12.2021 లో ఎఫ్ఐఆర్ నమోదైందని, నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు ఛార్జ్ షీట్ వేయలేదని బాలయ్య ప్రశ్నించారు. డిజైన్ టెక్ సంస్ధ అకౌంట్ లు ప్రీజ్ చేసి నిధులు స్తంభింపజేసినప్పుడు కోర్టు మీకు చివాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంబంధించింది కాదని ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 2.13 లక్షల విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని, దీనిని కుంభకోణం అని ఏ విధంగా అంటారని స్వయంగా హైకోర్టు చెప్పలేదా? అని అడిగారు. మళ్లీ తప్పుల మీద తప్పులు చేసి కోర్టుల చేత ఎందుకు తిట్లు తింటారని అన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని ఎద్దేవా చేశారు. ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని... ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదు, దీనిపై న్యాయపోరాటం చేస్తాం, ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని అన్నారు. Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 Kanakamedala Ravindra Kumar: రాజకీయ అంశాలను వ్యక్తిగత కక్షగా మార్చుకుని చంద్రబాబుపై పగ సాధిస్తున్నారు: కనకమేడల 09-09-2023 Sat 10:18 | Andhra టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కనకమేడల రాష్ట్రంలో అప్రటికత ఎమర్జెన్సీ వాతావరణం సృష్టిస్తున్నారని విమర్శలు జగన్ అరాచకపు పాలనకు పరాకాష్ఠ అని వ్యాఖ్యలు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ సీనియర్ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పిరికింద చర్య అని అభివర్ణించారు. అర్ధరాత్రి వేళ నాయకులను అరెస్ట్ చేయడం, కార్యకర్తలను రోడ్లపైకి రానివ్వకుండా చేయడం, నాయకులెవరూ ప్రతిఘటించడానికి వీల్లేకుండా చేయడం, రాష్ట్రమంతటా ఒక ఆందోళనకర పరిస్థితిని సృష్టించడం అప్రకటిత ఎమర్జెన్సీ తప్ప మరొకటి కాదని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నవారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని కనకమేడల అన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకపు పాలనకు ఇది పరాకాష్ఠ అని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో న్యాయపరమైన అంశాలు పరిశీలించి, ఆ దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. "న్యాయపరమైన అంశాలు అని ఎందుకు చెబుతున్నానంటే... రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాలు అంటే కనీస గౌరవం లేదు. ఇక్కడి హైకోర్టు కానీ, అక్కడి సుప్రీంకోర్టు కానీ 250 కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టాయి. చీము నెత్తురు ఉన్నవాడైతే ఎప్పుడో రాజీనామా చేసి వెళ్లిపోయేవాడు" అంటూ కనకమేడల ధ్వజమెత్తారు. రాజకీయపరమైన అంశాలను వ్యక్తిగత కక్షగా మార్చుకుని చంద్రబాబుపై పగ సాధిస్తున్నారని విమర్శించారు. "రాజకీయాల్లో సాధారణంగా శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు ఉంటారు. కానీ ప్రత్యర్థులను శత్రువులుగా మార్చి, ఒక ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషిస్తున్నారు. ఏపీ సీఎం బ్యాక్ గ్రౌండ్ ఏమిటో ఒకసారి పరిశీలించండి. అతడు ఫ్యాక్షనిస్టు నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి. దానికి అధికారం తోడైంది. పోలీసుల వత్తాసుతో, రాజ్యాంగాన్ని కాలరాస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు పిరికిపంద చర్య అవుతుందే తప్ప, చట్టబద్ధమైన చర్య కాదు" అని కనకమేడల స్పష్టం చేశారు. Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 Konakalla Narayana: అప్పుడు వైఎస్సార్ చేసిన పని ఇప్పుడు జగన్ చేస్తున్నాడు.. జగన్ పతనం ప్రారంభమయింది: కొనకళ్ల నారాయణ 09-09-2023 Sat 09:57 | Andhra జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసమే చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారన్న కొనకళ్ల జగన్ చేతిలో పోలీసు అధికారులు కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారని విమర్శ సంబంధం లేని కేసులో చంద్రబాబును ఇరికించారని మండిపాటు వైసీపీ కార్యకర్తల మాదిరి పోలీసులు పని చేస్తున్నారని టీడీపీ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసమే చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. జగన్ చేతిలో పోలీసు అధికారులు కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సంబంధం లేని కేసులో చంద్రబాబును ఇరికించారని మండిపడ్డారు. చంద్రబాబుపై గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేసులు పెట్టారని... ఇప్పుడు ఆయన కొడుకు జగన్ కేసులు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ తో జగన్ పతనం ప్రారంభమయిందని చెప్పారు. జగన్ ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు కాబట్టే ఆయనను అరెస్ట్ చేశారని చెప్పారు. ఇతర పార్టీల నేతలను కూడా అరెస్ట్ చేయించి జగన్ పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారని విమర్శించారు. కొనకళ్లను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 Daggubati Purandeswari: చంద్రబాబు అరెస్ట్ ను బీజేపీ ఖండిస్తోంది: పురందేశ్వరి 09-09-2023 Sat 09:39 | Andhra సరైన నోటీసు ఇవ్వకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారన్న పురందేశ్వరి ఎఫ్ఐఆర్ లో పేరు కూడా పెట్టలేదని విమర్శ ప్రొసీజర్ ఫాలో కాకుండా అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదని వ్యాఖ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ ను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఖండించారు. ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ... ఈరోజు చంద్రబాబును అరెస్ట్ చేయడం జరిగిందని... సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, వివరణ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా ఆయనను అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ ను బీజేపీ ఖండిస్తోందని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు చేశారు. ఎవరినీ ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 CPI Ramakrishna: చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గం: సీపీఐ రామకృష్ణ 09-09-2023 Sat 09:20 | Andhra అర్ధరాత్రి పూట పోలీసులు హంగామా చేయాల్సిన అవసరం ఏముందన్న రామకృష్ణ ముందుగా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందని వ్యాఖ్య లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం దారుణమని మండిపాటు టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పూట వచ్చి హంగామా చేయాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ఏదైనా ఉంటే ముందుగానే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గమని అన్నారు. తన తండ్రి వద్దకు వెళ్లకుండా నారా లోకేశ్ ను పోలీసులు అడ్డుకోవడం దారుణమని అన్నారు. మరోవైపు చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఆయనను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.