psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 Raghu Rama Krishna Raju: చంద్రబాబుపై చేయి చేసుకునే ధైర్యం ఎవరికీ ఉండదు... ఆ సంగతి నాకు తెలుసు: రఘురామకృష్ణరాజు 09-09-2023 Sat 09:06 | Andhra స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఆరోపణలపై చంద్రబాబు అరెస్ట్ ఈ మూర్ఖుడు ఎంత పనిచేశాడంటూ రఘురామ స్పందన ఈ కేసులో విషయం లేదని కామెంట్ చంద్రబాబు ఈ సాయంత్రం లోపు బయటికి వచ్చేస్తాడని వ్యాఖ్యలు నంద్యాలలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు ఈ ఉదయం అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఈ మూర్ఖుడు ఎంత పనిచేశాడు? అంటూ సీఎం జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. "ఓవైపు జీ20 సదస్సు జరుగుతోంది... ప్రపంచ దేశాధినేతలు మనదేశానికి వచ్చారు... ఇలాంటి వేళ ఒక మహోన్నత శిఖరం వంటి చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఎన్నికలు వస్తున్నాయి... ఏదో ఒక కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయాలన్న కోరికతోనే ఈ విధంగా వ్యవహరించినట్టుంది. ఈ కేసులో విషయం లేదు... గతంలో నేను బయటికి వచ్చినట్టుగానే చంద్రబాబు ఈ మధ్యాహ్నానికో, సాయంత్రానికో, లేక 24 గంటల లోపు బయటికి వచ్చేస్తారు. ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం కావడంతో చంద్రబాబు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ వేయాల్సి ఉంటుంది, లేకపోతే నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు. ఇలాంటి పెట్టీ కేసుతో చంద్రబాబును అరెస్ట్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? ఈ ముఖ్యమంత్రి చెత్తవాడని తెలుసు కానీ, ఈ స్థాయికి దిగజారతాడని మాత్రం ఊహించలేదు. వైసీపీ సభ్యుడిగా చెబుతున్నా... కోపం ఉండొచ్చు... ఇంకేమైనా ఉండొచ్చు... కానీ ఎన్నికల సమయంలో ఇంత పిచ్చి పనిచేస్తారా? బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఇలా చేస్తాడా? పార్టీని సర్వనాశనం చేయడానికి ఇలాంటి పనికిమాలినవాడు ఒకడు అధ్యక్షుడుగా ఉంటే చాలనిపిస్తోంది. ఇవాళ్టితో యువజన శ్రామిక రైతు పార్టీ అనేదాన్ని జగన్ కూకటివేళ్లతో సహా పెకలించివేశాడు. ఈ అరెస్ట్ తో నా ప్రస్తుత పార్టీ పీడ విరగడ అవుతుంది... ఇక రాష్ట్రానికి మహర్దశ మొదలు కానుంది. అయితే, గతంలో నన్ను కొట్టారు... ఇప్పుడు చంద్రబాబుపై చేయి వేసేంత ధైర్యం ఎవరికీ ఉండదని నాకు తెలుసు. కానీ ఈ వెధవలు ఆయనతో తప్పుగా వ్యవహరించినా, అనుచితంగా ప్రవర్తించినా రాష్ట్రం తగలబడిపోయే అవకాశాలున్నాయి. దేశానికి ఇది ఎంతో అప్రదిష్ఠ కలిగించే అంశం. ప్రధాని మోదీ తదితరులు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, సంబంధిత మంత్రిత్వ శాఖకు ఎలాంటి సమాచారం లేకుండా ఈ అరెస్ట్ కు ఒడిగట్టడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించే అవకాశాలున్నాయి. కేంద్రం ఇతడ్ని ఉపేక్షిస్తుందని నేను అనుకోవడంలేదు" అని రఘురామ తన అభిప్రాయాలను పంచుకున్నారు. Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 Nara Lokesh: నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చను వేయలేవు జగన్: లోకేశ్ 09-09-2023 Sat 07:56 | Andhra స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఆరోపణలపై చంద్రబాబు అరెస్ట్ ఈ ఉదయం ఆరు గంటలకు చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నారా లోకేశ్ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు నంద్యాలలో అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ఏ1 కాగా, అచ్చెన్నాయుడు ఏ2గా ఉన్నారు. కాగా, తన తండ్రి చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేయడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. యువగళం పాదయాత్రలో ఉన్న లోకేశ్ వెంటనే చంద్రబాబు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో పొదలాడ వద్దే నిలిచిపోయారు. నా తండ్రిని చూడ్డానికి నేను వెళ్లకూడదా? అంటూ లోకేశ్ పోలీసులను ప్రశ్నించారు. అయితే పోలీసులు అందుకు సమాధానం చెప్పలేదు. నా వెంట నాయకులు ఎవరు రావడం లేదు... కుటుంబ సభ్యుడిగా నేను ఒక్కడినే వెళ్తున్నా... అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ పోలీసులను నిలదీశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, "పిచ్చోడు లండన్ కి... మంచోడు జైలుకి... ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం!" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. "ఎఫ్ఐఆర్ లో పేరు లేదు... ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు... మిగిలేది కేవలం లండన్ పిచ్చోడి కళ్లలో ఆనందం. నువ్వు తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్" అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు. Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 https://www.instagram.com/reel/Cw-braxshcI/?igshid=MzRlODBiNWFlZA== Quote
psycopk Posted September 9, 2023 Author Report Posted September 9, 2023 Galla Jayadev: చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు బాధాకరం: గల్లా జయదేవ్ 09-09-2023 Sat 22:23 | Andhra చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడంపై ఎంపీ గల్లా జయదేవ్ స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు బాధాకరమని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభ్యున్నతిపై దృష్టి సారించిన నేత చంద్రబాబు అని కొనియాడారు. కాగా, కుంచనపల్లి సిట్ కార్యాలయంలో చంద్రబాబుపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. దాదాపు రెండు గంటల నిరీక్షణ అనంతరం చంద్రబాబుతో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం కుటుంబ సభ్యులు సిట్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. Quote
VAAMPlRE Posted September 9, 2023 Report Posted September 9, 2023 Good way to satisfy your ego antunna @csrcsr to @ARYA uncle Quote
laxmiparvathin Posted September 9, 2023 Report Posted September 9, 2023 Not even one good central leader responded. Chesukunna vaariki chesukunnantha. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.