Jump to content

Recommended Posts

Posted

NCBN Case : చంద్రబాబు కేసులో వాదనలు పూర్తి.. టీడీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నా.. ఇదొక బిగ్ రిలీఫ్!

ABN , First Publish Date - 2023-09-10T15:12:44+05:30 IST

 

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులో (Chandrababu Case) కస్టడీకి సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. స్కిల్ డెవలప్‌మెంట్ (Skill Development Case) కేసులో అటు సీఐడీ.. ఇటు చంద్రబాబు తరఫున లాయర్ల వాదనలను ఏసీబీ కోర్టు విన్నది...

NCBN Case : చంద్రబాబు కేసులో వాదనలు పూర్తి.. టీడీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నా.. ఇదొక బిగ్ రిలీఫ్!
 

 

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేసులో (Chandrababu Case) కస్టడీకి సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. స్కిల్ డెవలప్‌మెంట్ (Skill Development Case) కేసులో అటు సీఐడీ.. ఇటు చంద్రబాబు తరఫున లాయర్ల వాదనలను ఏసీబీ కోర్టు విన్నది. ఉదయం నుంచి ఏడున్నర గంటలపాటు ఇరువాదనలు విన్న కోర్టు.. తీర్పు రిజర్వ్‌లో పెట్టింది. మరో గంటలో ఈ కేసులో కీలక తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. ఏ క్షణమైనా తీర్పు రావొచ్చని అక్కడున్న పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. కోర్టు తీర్పు ఎలా ఉంటుందా..? అనేదానిపై ఇరువర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబును రిమాండ్‌కు ఇవ్వాలని సీఐడీ.. అస్సలు ఇవ్వొద్దని, ఇదంతా కుట్రలో భాగమేనని లూథ్రా వాదించారు. మరోవైపు.. ఏసీబీ కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఒకవేళ రిమాండ్‌కు ఇస్తే కోర్టు నుంచి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడానికి ఆ రూట్లన్నీ పోలీసులు క్లియర్ చేశారు. దీంతో కీలక పరిణామమే చోటుచేసుకునే అవకాశాలే ఉన్నాయని తెలుస్తోంది.

 
 

Chandrababu-Car.jpg

ఏం జరగబోతోంది..?

ఏసీబీ కోర్టు బయట పోలీసులు భారీగా మోహరించడంతో పాటు.. భారీ కాన్వాయ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అని టీడీపీ శ్రేణులు టెన్షన్ పడుతున్నాయి. ఓ వైపు కోర్టు లోపల వాడివేడిగా వాదనలు.. మరోవైపు కోర్టు బయట కాన్వాయ్, పోలీసుల హడావుడిని చూసిన టీడీపీ శ్రేణులు.. టీవీలకు అతుక్కుపోయిన సామాన్య ప్రజలకు సైతం టెన్షన్ మొదలైంది. అంతా మంచే జరగాలని టీడీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబుకు ఎలాంటి రిమాండ్ ఇచ్చే పరిస్థితి లేదని.. తప్పకుండా బెయిల్ వస్తుందని టీడీపీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. 409 సెక్షన్ వర్తించదని ఏసీబీ కోర్టు చెప్పడంతో ఇది చంద్రబాబు బిగ్ రిలీఫ్ అనిచెప్పుకోవచ్చు. 2021లో నమోదైన ఈ కేసులో హైకోర్టులో ఇదివరకే వాదనలు పూర్తయిన విషయం తెలిసిందే. అంతేకాదు.. తీర్పు కూడా రిజర్వ్‌తో పాటు ఈ కేసు ఎప్పుడో ముగిసిపోయింది. అయితే ఇప్పుడు ఆ కేసును మళ్లీ రీ ఓపెన్ చేయడంతో ఇదంతా కుట్రపూరితమేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

CID-Vs-ACB.jpg

వాదనలు ఇలా..?

ఉదయం కోర్టుకు రాగానే చంద్రబాబు వాంగ్మూలం ఇవ్వడంతో పాటు.. అనుమతి తీసుకొని స్వయంగా వాదనలు కూడా బాబే వినిపించుకున్నారు. అనంతరం ఇరువర్గాల వాదనలు మొదలయ్యాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సీఐడీ తరఫున న్యాయవాది ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి (AAG Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించగా.. మధ్యాహ్నం నుంచి చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Justice Siddharth Luthra) వాదనలు వినిపించారు. ఈ ఏడున్నర గంటల్లో సుమారు మూడు గంటలు ఏకథాటిగా లూథ్రానే వాదనలు వినిపించారు. ఈ క్రమంలో సీఐడీపై ఏసీబీ కోర్టు జడ్జి ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ తర్వాత కేసు కథేంటి..? గవర్నర్ అనుమతి లేనిదే ఎలా అరెస్ట్ చేశారు..? సెక్షన్-409 అంటే ఏంటి..? అసలు సీఐడీకి అరెస్ట్ చేసే విధానం తెలుసా..? ఇలా పలు కేసులను ఉదహరించి మరీ లూథ్రా సుదీర్ఘ వాదనలు వినిపించారు. అంతకుమించి పలు సాంకేతిక ప్రశ్నలు సంధించి.. సీఐడీని చిక్కుల్లోకి నెట్టేలా వాదనలు వినిపించారు. లూథ్రా వాదనలు వినిపిస్తున్నంతసేపు వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది

Posted

అంతకుమించి పలు సాంకేతిక ప్రశ్నలు సంధించి.. సీఐడీని చిక్కుల్లోకి నెట్టేలా వాదనలు వినిపించారు. లూథ్రా వాదనలు వినిపిస్తున్నంతసేపు వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది

 

ABN gadi creativity @3$%

  • Haha 1
Posted

Weather change ante, urumulu merupulu  tufan lantivi anni court lone vachayi ani kavi bhavam

Posted
2 minutes ago, halwa_fan said:

అంతకుమించి పలు సాంకేతిక ప్రశ్నలు సంధించి.. సీఐడీని చిక్కుల్లోకి నెట్టేలా వాదనలు వినిపించారు. లూథ్రా వాదనలు వినిపిస్తున్నంతసేపు వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది

 

ABN gadi creativity @3$%

visionary vaadhisthunnapudu judges ki thadi aaripoyi water thaaguthune vunnaaarani raayaledha?

  • Haha 1
Posted

ABN gadu relief vundi annadu ante, CBN ki moodindi ani..

indirect ga hint isthundu janalaki

Posted
38 minutes ago, kingcasanova said:

visionary vaadhisthunnapudu judges ki thadi aaripoyi water thaaguthune vunnaaarani raayaledha?

Edhi explicit ga condemn cheyadu , accept cheyadu . Not for vote case choosam ga 

Posted

విజయవాడ: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం జడ్జిమెంట్ కాపీ టైపింగ్ అవుతోందని తెలుస్తోంది. జడ్జి తీర్పు వెల్లడించడానికి 20 నిమిషాలపైగా సమయం పడుతుందని సమాచారం. ఇదిలావుండగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు 409 సెక్షన్ వర్తించబోదని కోర్ట్ తెలిపినట్టు తెలుస్తోంది. అంతేకాదు సెక్షన్ 17Aని కూడా ఏసీబీ కోర్ట్ తిరస్కరించినట్టు సమాచారం. చివరికి చంద్రబాబుకి 41A నోటీసులు ఇచ్చి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉత్కంఠకు మరికొద్ది సేపట్లోనే తెలియనుంది.

 

ఇదిలావుండగా ఏసీబీ కోర్ట్ ఇవ్వునున్న తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఆదివారం ఉదయం వాదనలు మొదలయ్యాయి. సుదీర్ఘంగా సాగిన ఈ వాదనలు సాయంత్రం 3 గంటల సమయంలో ముగిశాయి. అనంతరం ఏసీబీ కోర్ట్ తీర్పు కోసం అందరూ ఎదురుచూస్తున్నా

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...