psycopk Posted September 13, 2023 Report Posted September 13, 2023 I am with NCB: చంద్రబాబుకు మద్దతుగా వేలాదిగా తరలి వచ్చిన ఐటీ ఉద్యోగులు.. విప్రో సర్కిల్ వద్ద ఉద్రిక్తత 13-09-2023 Wed 15:48 | Both States చంద్రబాబుకు సంఘీభావంగా ఐటీ ఉద్యోగుల ఆందోళన సైకో పోవాలి.. సైకిల్ రావాలని నినాదాలు జగన్ కు ఐటీ ఉద్యోగులు బుద్ధి చెపుతారని హెచ్చరిక హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ చంద్రబాబు నినాదాలతో మారుమోగుతోంది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వేలాది మంది ఐటీ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చంద్రబాబుకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినదిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు వల్లే తామంతా ఉన్నత జీవితాన్ని గడుపుతున్నామని, ఆయన మాత్రం జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిజన్ బ్యాచ్.. విజన్ బ్యాచ్ ను టార్గెట్ చేసిందని మండిపడ్డారు. బాబు గారిని వెంటనే విడుదల చేయాలి, ఐయాం విత్ సీబీఎన్ వంటి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు ఐటీ ఉద్యోగులు బుద్ధి చెపుతారని హెచ్చరించారు. మరోవైపు ఆ ప్రాంతానికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిరసనకారులను అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. 1 1 Quote
psycopk Posted September 13, 2023 Author Report Posted September 13, 2023 Rajinikanth: నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు... లోకేశ్ కు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన రజనీకాంత్ 13-09-2023 Wed 15:34 | Andhra స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత లోకేశ్ కు ఫోన్ చేసి మాట్లాడిన రజనీకాంత్ చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకు రక్ష అని వెల్లడి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా రాజమండ్రి నుంచే అన్ని వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో, నారా లోకేశ్ కు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి పరామర్శించారు. ఇలాంటి సమయాల్లో ధైర్యంగా ఉండాలని సూచించారు. తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు అని, ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకు రక్ష అని ఈ సందర్భంగా రజనీకాంత్ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప నేత అని కొనియాడారు. ఈ తప్పుడు కేసులు... అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని రజనీకాంత్ ధీమా వ్యక్తంచేశారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు. 1 Quote
psycopk Posted September 13, 2023 Author Report Posted September 13, 2023 Pawan Kalyan: రేపు రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ములాఖత్! 13-09-2023 Wed 15:15 | Andhra అరెస్టయిన సమయంలోనే చంద్రబాబును కలిసేందుకు పవన్ యత్నం అడ్డుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు తాజాగా కేంద్రకారాగారంలో ములాఖత్‌కు అనుమతి జనసేన అధినేత పవన్ కల్యాణ్... రేపు రాజమండ్రి కేంద్రకారాగారంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును కలవనున్నారు. మూడు రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబును నిన్న ఆయన కుటుంబ సభ్యులు నారా లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి కలిశారు. జైలు పరిసరాల్లో ఇప్పటికే 144 సెక్షన్ కొనసాగుతోంది. రేపు పవన్ రాక నేపథ్యంలో మరింత భద్రతను ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు అరెస్టయిన సమయంలోనే ఆయనను కలిసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. కానీ ఏపీ పోలీసులు అందుకు అనుమతించలేదు. బేగంపేట విమానాశ్రయంలో పవన్ వెళ్లాల్సిన ప్రత్యేక విమానానికి అనుమతి నిరాకరించారు. మరోసారి రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు జనసేనానిని అడ్డుకున్నారు. ఇప్పుడు కేంద్రకారాగారంలో ములాఖత్‌కు అనుమతి లభించింది. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా నేటి సాయంత్రం నాలుగు గంటలకు జైల్లో చంద్రబాబుతో భేటీ కానున్నారు. 1 Quote
psycopk Posted September 13, 2023 Author Report Posted September 13, 2023 Gone Prakash Rao: చంద్రబాబు నెత్తిమీద జగన్ పాలు పోశాడు.. టీడీపీకి 151కి పైగా సీట్లు వస్తాయి: గోనె ప్రకాశ్ రావు 13-09-2023 Wed 15:12 | Both States చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి మేలు చేస్తుందన్న గోనె ప్రకాశ్ రావు జగన్ శాడిస్ట్ గా వ్యవహరిస్తున్నాడని విమర్శ కాంగ్రెస్ ను రేవంత్ నాశనం చేస్తున్నాడని మండిపాటు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని అన్నారు. గత ఎన్నికల రికార్డును సైతం బద్దలు కొడుతూ టీడీపీ 151కి పైగా సీట్లను గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఖాయమని... ఆయన నెత్తిమీద జగన్ పాలు పోశారని అన్నారు. జగన్ శాడిస్టులా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ప్రాథమిక ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై గోనె ప్రకాశ్ రావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ అనేవాడు నాశనం చేస్తున్నాడని అన్నారు. తెలంగాణ నుంచి పోటీ చేయాలనుకుంటున్న షర్మిలను రాకుండా అడ్డుకుంటున్నాడని... 2014లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైసీపీ నుంచి గెలుపొందాడని, మరి ఆయనను కాంగ్రెస్ లోకి ఎందుకు తీసుకున్నాడని ప్రశ్నించారు. డబ్బులు ఇస్తే తీసుకున్నాడని ఆరోపించారు. 1 Quote
psycopk Posted September 13, 2023 Author Report Posted September 13, 2023 Ayyanna Patrudu: చంద్రబాబు అరెస్ట్‌పై ఢిల్లీ పెద్దలు ఎందుకు స్పందించడం లేదు?: అయ్యన్నపాత్రుడు 13-09-2023 Wed 14:16 | Andhra ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఢిల్లీలోని పెద్దలకు కనిపించడం లేదా? అని నిలదీత ఇంత జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్న కేంద్రం ఇచ్చే నిధులను కూడా జగన్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణ తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి అరెస్ట్‌పై కేంద్ర పెద్దలు ఎందుకు స్పందించడం లేదని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఢిల్లీలోని పెద్దలకు కనిపించడం లేదా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో కేంద్ర పెద్దలకు తెలియదా? ఓ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడరా? అన్నారు. జీ20 సదస్సు వల్ల ఏం ఉపయోగమన్నారు. ఏపీలో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలన్నారు. ఏపీకి కేంద్రం ఇచ్చే నిధులను జగన్ పక్కదారి పట్టిస్తున్నారని, అయినప్పటికీ ఢిల్లీ పెద్దలు మాట్లాడటం లేదన్నారు. నిధులు పక్కదోవ పట్టడం వారికి కనిపించడం లేదా? అన్నారు. తన నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణ పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు. 1 Quote
psycopk Posted September 13, 2023 Author Report Posted September 13, 2023 Ashwini Dutt: వాళ్లకు పుట్టగతులు ఉండవు.. చంద్రబాబుకు 160 సీట్లు వస్తాయి: అశ్వనీదత్ 13-09-2023 Wed 14:07 | Entertainment చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్న అశ్వనీ దత్ దుర్మార్గంగా అరెస్ట్ చేసి, బీభత్సం చేశారని ఆగ్రహం ఎన్నికల్లో శిక్షను అనుభవిస్తారని వ్యాఖ్య టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని సినీ నిర్మాత అశ్వనీ దత్ మండిపడ్డారు. అదొక దురదృష్టకరమైన రోజని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశానికి ఒక గొప్ప ప్రైమ్ మినిస్టర్ ను, ఒక గొప్ప లోక్ సభ స్పీకర్ ను, ఒక గొప్ప రాష్ట్రపతిని ఇచ్చిన ది గ్రేట్ లెజెండరీ చంద్రబాబును ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేసి, లేనిపోని బీభత్సం చేసిన వారికి కచ్చితంగా పుట్టగతులు ఉండవని అన్నారు. దీనికి పరిష్కారం ఎన్నో రోజుల్లో లేదని... మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు రాగానే వాళ్లు శిక్షను అనుభవిస్తారని చెప్పారు. 175 సీట్లకు కచ్చితంగా 160 సీట్లను చంద్రబాబు గెలిచి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు మరో సినీ నిర్మాత నట్టి కుమార్ కూడా నిన్న చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చిత్రపరిశ్రమకు శ్రేయోభిలాషి వంటి వ్యక్తి అని, అలాంటి వ్యక్తి అరెస్ట్ అయితే చిత్ర పరిశ్రమ పెద్దలు ఎవరూ స్పందించకపోవడం దారుణమని నట్టి కుమార్ వ్యాఖ్యానించారు 2 Quote
psycopk Posted September 13, 2023 Author Report Posted September 13, 2023 Nara Lokesh: నారా లోకేశ్ ను కలిసి సంఘీభావం తెలిపిన విశాఖ జిల్లా జనసేన నేతలు 13-09-2023 Wed 15:43 | Andhra స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ చంద్రబాబుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ రాజమండ్రిలో లోకేశ్ ను పరామర్శించిన విశాఖ జనసేన నేతలు కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు విశాఖ జిల్లా జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్, చోడవరం ఇంచార్జ్ పి.ఎస్.ఎన్.రాజు, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఇవాళ రాజమండ్రిలో లోకేశ్ ను కలిసి పరామర్శించారు. చంద్రబాబును తప్పుడు కేసులతోనే జైలుపాలు చేశారని మండిపడ్డారు. అక్రమ కేసులతో ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతోందని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందించారు. తనకు అండగా నిలుస్తున్న జనసేన నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీని రాష్ట్రం నుండి తరిమికొట్టేందుకు అంతా కలిసి పోరాడతామన్నారు. 1 Quote
psycopk Posted September 13, 2023 Author Report Posted September 13, 2023 Somireddy Chandra Mohan Reddy: సీఐడీ... ముఖ్యమంత్రి బూట్ల కింద నలిగిపోతోంది: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 13-09-2023 Wed 16:12 | Andhra కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రిపై కేసు పెడతారా? వైసీపీ నేతల పాపాలు పండాయని, అనుభవిస్తారని వ్యాఖ్య మచ్చలేని డిజైన్ టెక్ సంస్థ చైర్మన్‌ను జైలుకు పంపించారని ఆగ్రహం కార్పోరేషన్‌లో అక్రమాలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రిపై కేసు పెడతారా? అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. అక్రమాలు నిజమే అయితే బాధ్యులైన అధికారులను ప్రశ్నించరా? అని నిలదీశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ తన నాలుగున్నరేళ్ల కాలంలో తమ పార్టీ అధినేతపై ఒక్క నేరాన్ని కూడా నిరూపించలేక కడుపు మంటతో రగిలిపోతున్నాడన్నారు. చివరకు ఆధారాలు లేని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును ఇరికించి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఈ కేసులో ఒక్క ఆధారం కూడా లేక కుట్రపన్ను తప్పుడు కేసు పెట్టారన్నారు. దేశంలో మోడీ హయాంలో సీమెన్స్ కంపెనీ గుజరాత్‌లో మొదటగా మోడీ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు అమలు చేశారన్నారు. దానిని చూసిన తర్వాతే ఏపీలోని విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇప్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, డిజైన్ టెక్, సీమెన్స్ కంపెనీ మూడూ కలిసి ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసుకున్నాయన్నారు. డిజైన్ టెక్ ఎండి వికాస్ కన్వేల్కర్‌ను సీఐడీ పోలీసులు అరెస్టు చేసి ఈ కేసులో అక్రమంగా జైలుకు పంపారన్నారు. గొంతువ్యాధితో బాధపడుతున్న ఆయన నిన్న ఒక వీడియోను విడుదల చేశారన్నారు. 40 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు అవసరమైన కంప్యూటర్ల, ఎక్విప్ మెంట్‌ను సరఫరా చేశామని చెబుతూ... వెండార్లు సరఫరా చేసిన మెటీరియల్స్‌కు చేసిన చెల్లింపుల వివరాలను వికాస్ కన్వేల్కర్ విడుదల చేశారన్నారు. మొత్తం రూ.371.25 కోట్లలో ఖర్చులు పోను తమకు రూ.17.85కోట్లు అంటే 4.8 శాతం మాత్రమే లాభం వచ్చిందని కన్వేల్కర్ వివరించారన్నారు. అయినా సీఐడీ పోలీసులు తనను అరెస్టు చేసి, చంద్రబాబు పేరు చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టారని చెప్పారన్నారు. తమ అకౌంట్లను కూడా చెక్ చేసుకోవచ్చునని ఆయన స్టేట్‌మెంట్ విడుదల చేశారన్నారు. సీఐడీ పెట్టిన ఇబ్బందులకు కన్వేల్కర్ ఆరోగ్యం చెడిపోయిందని, గొంతులో పక్షవాతం వచ్చిందని, చివరకు హైకోర్టు చీవాట్లు పెట్టడంతో ఆయనను విడుదల చేశారన్నారు. ఈ కేసులో చంద్రబాబుకు ఒక్క రూపాయి కూడా ముట్టలేదని ఆధారాలు ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందన్నారు. రూ.371 కోట్లలో ఒక్క రూపాయి ఏదైనా కంపెనీ నుండి చంద్రబాబుకు ముట్టిందంటే తాము దేనికైనా సిద్ధమన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్... భారతీ సిమెంట్, సాక్షి కంపెనీల నుండి నిధులు దోచుకున్నారని ఆరోపించారు. క్విడ్ ప్రో కో ను ఈ దేశానికి పరిచయం చేసింది జగనే అన్నారు. 2019లో జూన్ నుంచి నవంబర్ మధ్యలో ఏమీ చేయకుండానే జగన్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో దేశంలో మొదటి స్థానం సాధించామని పేపర్లలో యాడ్ లు వేయించుకున్నారన్నారు. వికాస్ కన్వేల్కర్ నిన్న మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా 2.13లక్షల మందికి శిక్షణ, 75వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని, 350 ట్రక్కుల్లో కంప్యూటర్లు తరలించామని చెప్పారన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులు, ఎక్విప్ మెంట్ తరలించిన వాహనాల వివరాలతో సహా ఆధారాలన్నీ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తమ పాలనలో స్కిల్ డెవలప్మెంట్ పెట్టకపోతే ఇప్పుడున్న సెంటర్లు, వాటిలో ఉన్న ఎక్విప్‌మెంట్ నేడు విమర్శించే సుందరాంగులు, సుందరీమణులు పెట్టారా? వాళ్ల తాతలు తెచ్చి పెట్టారా? అని నిప్పులు చెరిగారు. కేంద్రం ఏజెన్సీ వెరిఫికేషన్‌కు వచ్చి, మొత్తం పరిశీలించి సర్టిఫై చేసిన తర్వాత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్‌కు ఆమోదం తెలిపారన్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్ కంటే తక్కువ రేటుకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు పెట్టడమే చంద్రబాబు చేసిన పాపమా? అన్నారు. అప్పటి స్కిల్ డెవలప్‌మెంట్ ఎండీ ఎన్ ప్రేమ్ చంద్రారెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ కల్లాంలు ఈ నిధులను విడుదల చేస్తే వాళ్లను ఎందుకు ప్రశ్నించడం లేదో చెప్పాలన్నారు. సీఐడీ జగన్మోహన్ రెడ్డి బూట్ల కింద నలిగిపోతోందని, నిష్పక్షపాతంగా కేసులు విచారణ చేయడం లేదన్నారు. ఇలాంటి వాళ్లకు పోలీసు డ్రస్ వేసుకోవడానికి సిగ్గు లేదా? అన్నారు. అఖిలపక్షంతో కలిసి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల పరిశీలనకు తాము సిద్ధమన్నారు. 40 సెంటర్లను తాము పెట్టామని తేలితే ఇప్పుడు విమర్శిస్తున్న వాళ్లంతా ప్రజల ముందు చెంపలు వేసుకోవాలన్నారు. వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో ఇసుక, మట్టి, శ్మశానాలతో సహా దోచుకున్నారన్నారు. వీటిని తాము విమర్శించాలంటే అయిదేళ్ళు కూడా చాలదన్నారు. సీమెన్స్ కంపెనీ అంటే మోడీకి చాలా గౌరవమని, ఒప్పందం మేరకు రూ.371 కోట్లతో మెటీరియల్ సప్లయ్ చేసినట్లు ఆధారాలు ఉన్నట్లు తెలిపారు. వైసీపీ పాపాలు పండే రోజులు ముందున్నాయని, ప్రతి ఒక్కరూ ఫలితం అనుభవిస్తారన్నారు. సీఎం నుండి మంత్రులు, వైసీపీ నేతలంతా ఫలితం అనుభవిస్తారన్నారు. సీఐడీ ఏడీజీ ఎన్ సంజయ్ డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్వేల్కర్ అరెస్టుకు కారణాలు చెప్పాలని నిలదీశారు. వైసీపీ నేతలు, అధికారులకు దమ్ముంటే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు లేవని నిరూపించాలన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎఫ్ఐఆర్‌లో 37వ నిందితుడిగా చేసి, న్యాయ స్థానాలను తప్పుదోవ పట్టించడం సిగ్గుమాలిన చర్య అన్నారు. 1 Quote
Popular Post JackSeal Posted September 13, 2023 Popular Post Report Posted September 13, 2023 IT employees sanghibhavam telputhe, CBN ne release cheyali ani demand chestharu kani why political dharna la psyco povali cycle ravali ani arusthunnaru ? Ante vallu kuda ....... 4 Quote
psycopk Posted September 13, 2023 Author Report Posted September 13, 2023 Renuka Chowdary: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగిన రేణుకా చౌదరి... వీడియో ఇదిగో! 13-09-2023 Wed 16:58 | Both States స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేయడమేంటన్న రేణుకా చౌదరి జగన్ ఒక మూర్ఖుడని కామెంట్ త్వరలోనే మదం తగ్గుతుందని వ్యాఖ్యలు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి ఘాటుగా స్పందించారు. ఏపీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ఒక మూర్ఖుడిగా, మానసిక రోగిగా అభివర్ణించారు. అసలు జగన్ మోహన్ రెడ్డి 'స్కిల్ డెవలప్ మెంట్' కు ఎవరూ సరితూగరని ఎద్దేవా చేశారు. మోసాలు చేయడానికి, బాబాయ్ ని చంపుకోవడంలోనూ, తండ్రి శవం వద్ద సంతకాల కోసం ప్రయత్నించడంలోనూ ఆయన 'స్కిల్' అందరికీ తెలిసిందేనని వ్యంగ్యం ప్రదర్శించారు. అధికార దాహంతో జగన్ రొప్పుతున్నాడని, అతి త్వరలో అతడి మదం తగ్గుతుందని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. "ఆ సీఐడీ పోలీస్ సంస్థ ఏంటండీ బాబూ... ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, ఎలాంటి లోపాలు లేకుండా అరెస్ట్ చేస్తారా? జగన్ ఒక మెంటల్ కేసు. రాజ్యాంగంలో ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఐదేళ్లకు ఇలాంటి నాయకులకు మానసిక వైద్య పరీక్షలు చేసి, మానసికంగా సరిగ్గా ఉన్నారా లేదా అనేది నిర్ధారించాలి. ఇంతవరకు ఒక్క రాజధానే రాలేదు కానీ, మూడు రాజధానులు అని మాట్లాడిన మూర్ఖుడు జగన్. ఒక మాజీ ముఖ్యమంత్రితో వ్యవహరించే తీరు ఇలాగేనా?" అంటూ రేణుకా చౌదరి మండిపడ్డారు. Quote
psycopk Posted September 13, 2023 Author Report Posted September 13, 2023 Raghavendra Rao: మళ్లీ ఆ వెంకటేశ్వరస్వామే చంద్రబాబును కాపాడతాడు: దర్శకుడు రాఘవేంద్రరావు 13-09-2023 Wed 17:21 | Andhra స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత తిరుమల వెంకన్నపై భారం వేసిన రాఘవేంద్రరావు గతంలో చంద్రబాబును అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి కాపాడాడని వెల్లడి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును జైలు నుంచి బయటికి తీసుకువచ్చేందుకు ఆయన న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆసక్తికరంగా స్పందించారు. గతంలో చంద్రబాబు శ్రీ వెంకటేశ్వరస్వామి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు. ఇప్పుడు కూడా ఆ స్వామి వారే చంద్రబాబును కాపాడతారని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. వెంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులతో చంద్రబాబు ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా జైలు నుంచి తప్పకుండా బయటపడతారని పేర్కొన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత సినీ రంగం నుంచి స్పందించిన మొదటి వ్యక్తి రాఘవేంద్రరావే. Quote
psycopk Posted September 13, 2023 Author Report Posted September 13, 2023 Raghu Rama Krishna Raju: చంద్రబాబును పవన్ కల్యాణ్ కలవనుండడంపై రఘురామ స్పందన 13-09-2023 Wed 17:35 | Andhra స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు రేపు టీడీపీ అధినేతతో పవన్ కల్యాణ్ ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు అని అభివర్ణించిన రఘురామ జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ రేపు (సెప్టెంబరు 14) రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో, చంద్రబాబును కలిసేందుకు పవన్ కల్యాణ్ జైలు అధికారులకు ములాఖత్ దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. రేపు రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబును పవన్ కల్యాణ్ కలుస్తుండడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఏపీ రాజకీయాల్లో ఇది కీలక మలుపు అని రఘురామ అభివర్ణించారు. ఆపదలో అండగా నిలిచేవాడే స్నేహితుడు అని ఉద్ఘాటించారు. Quote
psycopk Posted September 13, 2023 Author Report Posted September 13, 2023 2 minutes ago, JackSeal said: IT employees sanghibhavam telputhe, CBN ne release cheyali ani demand chestharu kani why political dharna la psyco povali cycle ravali ani arusthunnaru ? Ante vallu kuda ....... Buddi Unna vadu evadu aaina ade mata antadu. Ante Quote
psycopk Posted September 13, 2023 Author Report Posted September 13, 2023 7 minutes ago, Balibabu said: Antha manavalley Like leader .. cader anta kante em cheptundi.. ala chepuku bratakalsinde Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.