psycopk Posted September 13, 2023 Report Posted September 13, 2023 Sajjala Ramakrishna Reddy: ఓ దొంగను అరెస్ట్ చేస్తే ఉల్లంఘనా? ఇంట్లో ఉంటానంటే అరెస్ట్ ఎందుకు?: సజ్జల రామకృష్ణారెడ్డి 13-09-2023 Wed 17:48 | Andhra స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దర్యాఫ్తు సంస్థలకు ఓ కేస్ స్టడీగా మారుతోందని వ్యాఖ్య పూర్తి ఆధారాలతో చంద్రబాబును అరెస్ట్ చేస్తే హడావుడి ఎందుకని ప్రశ్న ఈ వ్యవహారంలో తాము లేమని సీమెన్స్ కంపెనీ చెబుతోందని వెల్లడి అరెస్టయ్యాక ఎవరికీ కల్పించని సౌకర్యాలు కల్పించామన్న సజ్జల దొంగను అరెస్ట్ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందా? అని నిలదీత స్కిల్ డెవలప్‌మెంట్ కేసు జాతీయ, అంతర్జాతీయ దర్యాఫ్తు సంస్థలకు ఓ కేస్ స్టడీగా మారుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్రబాబును పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఓ దొంగను పట్టుకుంటే ఎల్లో మీడియా హడావుడి ఎక్కువైందన్నారు. కోర్టు కూడా ఏకీభవించాక హడావుడి ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన హయాంలో కుట్రలతో కూడిన యజ్ఞంలా ఆర్థిక అక్రమాలు చేశారన్నారు. షెల్ కంపెనీల పేరుతో వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో తాము లేమని సీమెన్స్ చెబుతోందని, అగ్రిమెంట్ జరగలేదని చెప్పిందన్నారు. హవాలాపై ఈడీ కూడా విచారిస్తోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం, జైల్లో ఉంచడమే తప్పన్నట్లుగా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. తనను హౌస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారని, దేశంలో ఉండే చట్టాలు ఆయనకు వర్తించవా? అని ప్రశ్నించారు. అరెస్టయ్యాక ఎవరికీ కల్పించని సౌకర్యాలను చంద్రబాబుకు కల్పించామన్నారు. హౌస్ కస్టడీలో ఉంటే దానిని అరెస్ట్ అంటారా? ఇంట్లో ఉంచే దానికి అరెస్ట్ చేయడం దేనికి? అని వ్యాఖ్యానించారు. ఆయన అరెస్ట్, జైలులో ఉంచడంలో ఎలాంటి రాజకీయ కక్ష లేదన్నారు. అరెస్టయ్యాక ఎవరికీ కల్పించని సౌకర్యాలు ఆయనకు కల్పించినట్లు చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్, యువత పేరు చెప్పి దోచుకున్నారన్నారు. సానుభూతి, రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు పాకులాడుతున్నారన్నారు. ఓ దొంగను అరెస్ట్ చేస్తే మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందా? చెప్పాలన్నారు. గోబెల్స్ ప్రచారం చేస్తే తప్పులు ఒప్పులు కావన్నారు. దోచుకోవడానికే ఈ పథకం పెట్టారని, దానిని విజయవంతంగా అమలు చేశారన్నారు. సీమెన్స్‌కు డబ్బులిచ్చామని టీడీపీ నేతలు చెబుతుంటే, తమకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని సీమెన్స్ చెబుతోందన్నారు. ఆ డబ్బు షెల్ కంపెనీలకు వెళ్లినట్లుగా అర్థమైందన్నారు. రూ.371 ప్రజాధనం చంద్రబాబు దోచుకున్నారని బలమైన ఆధారాలు ఉన్నాయన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో రాష్ట్రానికి వందల కోట్ల నష్టం జరిగిందన్నారు. Quote
psycopk Posted September 13, 2023 Author Report Posted September 13, 2023 Ani adharalu unte high court lo ventane counter enduku veyaledu ra jaffa Quote
psycopk Posted September 13, 2023 Author Report Posted September 13, 2023 Anduke na 10yrs ga 38 cases cold storage lo unai.. inka kodi katti babai case aaite ano naa butho naa bhavishyat YV Subba Reddy: చంద్రబాబు ఇప్పటివరకు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చాడు: వైవీ సుబ్బారెడ్డి 13-09-2023 Wed 16:16 | Andhra స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ చట్టం ముందు అందరూ సమానమేన్న వైవీ సుబ్బారెడ్డి అన్ని అంశాలు పరిశీలించాకే చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిందని వెల్లడి విపక్ష నేత చంద్రబాబు ఇప్పటివరకు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చాడని, 2014లో ఓటుకు నోటు కేసును కూడా అలాగే మేనేజ్ చేశాడని వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చోటుచేసుకున్న పరిణామాలపై వైవీ ఇవాళ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. న్యాయస్థానం అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే చంద్రబాబుకు రిమాండ్ విధించిందని ఆయన స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ విషయంలోనే కాకుండా, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఏపీ ఫైబర్ నెట్ లోనూ దోపిడీ జరిగిందని ఆరోపించారు. 2014-19 మధ్య కాలంలో భారీగా అవినీతి జరిగిందని తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.