Jump to content

సనాతన ధర్మాన్ని నిర్మూలించడమే 'ఇండియా' కూటమి ఉద్దేశం: మోదీ


Guest

Recommended Posts

సనాతన ధర్మం చుట్టూ ఇటీవల చెలరేగిన వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. విపక్ష ఇండియా కూటమికి భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని బినాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మోదీ గురువారం శంకుస్థాపన చేశారు.

భోపాల్: సనాతన ధర్మం (Sanatana Dharma) చుట్టూ ఇటీవల చెలరేగిన వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తొలిసారి స్పందించారు. విపక్ష ఇండియా (INDIA) కూటమికి భారతదేశ సంస్కృతిపై దాడి చేసి, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనే రహస్య ఎజెండా ఉందని ఆరోపించారు. స్వామి వివేకానంద, లోకమాన్య తిలిక్ స్ఫూర్తిగా నిలిచిన సనాతన ధర్మాన్ని పూర్తిగా చెరిపేయాలని వీరు కోరుకుంటున్నారని, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని విమర్శించారు. ఈరోజు సతాన ధర్మాన్ని బహిరంగంగా విమర్శించడంతో ఈ దాడులు ప్రారంభించారని, రేపు మనపై ఈ దాడులను ముమ్మరం చేస్తారని అన్నారు. దేశంలోని సనాతనధర్మ అనుయాయులు, దేశాన్ని ప్రేమించేవారంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి ప్రజలను అడ్డుకోవాలని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని బినాలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ సహా, రాష్ట్రంలో పది కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులకు ప్రధానమంత్రి గురువారంనాడు శంకుస్థాపన చేశారు. రూ.50,700 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా బినాలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...