Jump to content

Recommended Posts

Posted

Chandrababu: బెల్జియం, లండన్ లోనూ చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు 

17-09-2023 Sun 19:33 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబుకు మద్దతుగా కదం తొక్కుతున్న తెలుగు ప్రజలు
  • బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో నిరసనలు
  • అమెరికాలోని ఫిలడెల్ఫియాలో చంద్రబాబుకు తెలుగు సంఘాల మద్దతు
  • లండన్ లో వీధుల్లోకి వచ్చిన తెలుగు ప్రజలు
 
Chandrababu supporters protests in Belgium and London

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ కేసులో  అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విదేశాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నిరోజులుగా ప్రవాసాంధ్రులు అనేక దేశాల్లో చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు చేపడుతున్నారు. 

తాజాగా యూరప్ లోని బెల్జియం దేశంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 'మేము సైతం బాబు గారికి తోడుగా' కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ మేము సైతం బాబు గారికి తోడుగా అనే కార్యక్రమాన్ని బెల్జియంలోని బ్రసెల్స్ నగరం అటోమియం ముందు శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూడా పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. భవిష్యత్తులో ఉమ్మడిగా మరిన్ని కార్యక్రమాలు చేపడదాం అని తెలిపారు. 

అటు, అమెరికాలోని ఫిలడెల్ఫియాలోనూ పలు తెలుగు సంఘాలకు చెందినవారు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సాఫ్ట్ వేర్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి, ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చిన గొప్ప నేత చంద్రబాబు అని అమెరికా ప్రవాసాంధ్రులు కొనియాడారు. హైదరాబాదును సాఫ్ట్ వేర్ హబ్ గా మార్చిన విజినరీ లీడర్ అని కీర్తించారు. 

బ్రిటన్ లోనూ చంద్రబాబుకు సంఘీభావంగా ప్రదర్శనలు చేపట్టారు. లండన్ నగరంలో తెలుగు ప్రజలు చంద్రబాబుకు మద్దతుగా వీధుల్లోకి వచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని నినదించారు.
20230917fr650706a6be45f.jpg20230917fr650706b7f2ef1.jpg20230917fr650706c753a20.jpg20230917fr650706d62d029.jpg20230917fr650706e44c163.jpg20230917fr6507070661452.jpg20230917fr650707210bb83.jpg20230917fr6507072e407dd.jpg

  • Upvote 1
Posted

KS Rama Rao: చంద్రబాబు అరెస్టుపై ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాసిన సినీ నిర్మాత కేఎస్ రామారావు 

17-09-2023 Sun 12:07 | Entertainment
  • మీకు తెలియకుండానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందా? అని ప్రశ్న
  • తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టీకరణ
  • నిరాధార ఆరోపణలతో చంద్రబాబును అరెస్ట్ చేయడంతో తన హృదయం రగిలిపోయిందన్న నిర్మాత
  • ప్రజా వేదిక కూల్చివేతతో ఏపీలో విధ్వంసక పాలన ప్రారంభమైందన్న రామారావు
  • మీరు శంకుస్థాపన చేసిన రాజధాని విషయంలో జగన్ అలా చేయకుండా ఆపాల్సిందన్న కేఎస్ఆర్
  • ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్
  • అప్పుడు మాత్రమే తెలుగు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారన్న టాలీవుడ్ నిర్మాత
 
Tollywood Producer KS Rama Rao Writes Open Letter To PM Modi On Chandrababu Arrest

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై టాలీవుడ్ సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు ప్రధాని నరేంద్రమోదీకి బహిరంగ లేఖ రాశారు. మీకు తెలియకుండానే ఈ అరెస్ట్ జరిగిందా? అని ప్రశ్నించారు. ఏపీలో విచ్చలవిడిగా సాగుతున్న రాజకీయ కక్షలు, స్కాములు, అక్రమ కేసులు, అభద్రతాభావం, దిగజారుతున్న శాంతిభద్రతలు.. వంటివి చూసి రాష్ట్ర ప్రజల తరపున బాధతో, బాధ్యతతో ఈ లేఖ రాసినట్టు పేర్కొన్నారు. మీరు జీ20 సదస్సులో హడావుడిగా ఉన్నప్పుడు, సీఎం జగన్ లండన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలతో చంద్రబాబును జైలులో పెట్టడం చూసి తన హృదయం రగిలిపోయిందని అన్నారు.

తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని లేఖలో స్పష్టం చేసిన కేఎస్ రామారావు.. రాష్ట్ర పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా ఏపీలో ప్రస్తుత పరిస్థితులు చూసి విసిగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అంటూ లేని రాష్ట్రానికి చంద్రబాబు అమరావతిని రాజధానిగా ప్రకటించారని, శంకుస్థాపనకు మీరూ వచ్చారని గుర్తుచేశారు. ఆర్థిక మోసాల కేసులో 16 నెలలు జైలులో గడిపి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజా వేదిక కూల్చివేతతో విధ్వంసక పాలన మొదలుపెట్టారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. 

మీరు శంకుస్థాపన చేసిన రాజధాని విషయంలో అలా చేయకూడదని మీరు హెచ్చరించి ఉండాల్సిందని అన్నారు. చంద్రబాబు కారణంగానే నేడు లక్షలాదిమంది ఐటీ రంగంలో పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులను చంద్రబాబు అరెస్ట్ వార్త కదిలించిందని, వారంతా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతున్న వైనాన్ని గమనించాలని కోరారు.

దివంగత ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా ఉన్నప్పుడు బీజేపీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తిని జైలులో పెట్టి ఇబ్బందులు పెడుతుంటే తెలుగు ప్రజల హృదయాలు రగిలిపోతున్నాయని పేర్కొన్నారు. జైలు నుంచి చంద్రబాబును విడుదల చేయించి జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరారు. అంతేకాదు, రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడు మాత్రమే తెలుగు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని స్పష్టం చేశారు. వెంటనే స్పందించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని ఆ లేఖలో కేఎస్ రామారావు కోరారు.

Posted

Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ దక్షిణాఫ్రికా, దుబాయ్‌లో నిరసనలు.. ఫొటోలు ఇవిగో 

17-09-2023 Sun 10:41 | Andhra
  • చంద్రబాబు అరెస్టుకు నిరసనగా దేశవిదేశాల్లో నిరసనలు
  • దక్షిణాఫ్రికా, దుబాయ్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు
  • సైకో ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం వస్తుందని నినాదాలు
 
NRI TDP Protest In South Africa and Dubai Against Chandrababu Arrest

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఏపీలో పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు, చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ విదేశాల్లోనూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. దక్షిణాఫ్రికాలోని హాఫ్‌వే హౌస్‌ 78 లారెన్స్ స్ట్రీట్‌లో టీడీపీ ఎన్నారై ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. టీడీపీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైకో ప్రభుత్వం పోయి ప్రజా ప్రభుత్వం వచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 
20230917fr650689a58c57e.jpg
20230917fr650689bd61002.jpg
ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో దుబాయ్‌లోనూ పెద్ద ఎత్తున నిరనసలు జరిగాయి. ఇక్కడి జెబెల్ అలీ హిందూ ఆలయంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీడీపీ సానుభూతిపరులు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో సైకో ప్రభుత్వం ఇంటికెళ్లిపోవడం పక్కా అని నినదించారు.

20230917fr650689d51f1a4.jpg

 

  • Upvote 1
Posted

TDP: కొనసాగుతున్న టీడీపీ శ్రేణుల నిరసనలు... ఫొటోలు ఇవిగో! 

16-09-2023 Sat 23:26 | Andhra
  • టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్
  • టీడీపీలో భగ్గుమంటున్న ఆగ్రహ జ్వాలలు
  • రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, సంతకాల కార్యక్రమం
 
TDP cadre continues protests in state

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్ట్ కు నిరసనగా పార్టీ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాలుగో రోజు కూడా దీక్షలు, సంతకాల కార్యక్రమం కొనసాగాయి. పలు చోట్ల ప్రజలు కాగడాలు చేతబూని చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. 

తెలుగుదేశం పార్టీ నేతలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుక్కపట్నం చౌడేశ్వరి అమ్మవారికి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పొర్లు డండాలు చేశారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన తెలుగు మహిళ నేతలు తలపై పొంగళ్లు పెట్టుకుని వెళ్లి విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో, పేరాల శివాలయంలో, కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పొన్నూరు నియోజకవర్గంలోని పెదకాకాని శివాలయంలోనూ పూజలు చేశారు.

అటు, టీడీపీ నాయకత్వం పోస్టు కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. బాబుతోనే నేను అనే సందేశంతో కూడిన పోస్టు కార్డులను రాజమండ్రి జైలుకు పంపాలని నేతలు పిలుపునిచ్చారు.

పలాస నియోజకవర్గంలో మహిళలు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గుంటూరు నగరంలో లాడ్జి సెంటర్ వరకు మహిళలు ర్యాలీ చేపట్టారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో విద్యార్దులు ర్యాలీ చేపట్టారు. అనంతరం దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాగడాల ర్యాలీ చేపట్టారు. 

ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, కిమిడి కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, ఎండీ షరీఫ్, బొండా ఉమా, ఎన్.ఎండి ఫరూక్, రెడ్డెప్పగారి శ్రీనివాస్ రెడ్డి, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున, పల్లా శ్రీనివాస్, బుద్దా నాగజగధీష్, జ్యోతుల నవీన్, రెడ్డి అనంతకుమారి, కె.ఎస్ జవహార్, గన్నీ వీరాంజనేయులు, కొనకళ్ళ నారాయణ, నెట్టెం రఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, జీవి ఆంజనేయులు, గొల్లా నరసింహాయాదవ్, పులివర్తి నాని, మల్లెల లింగారెడ్డి, బి.కె పార్థసారథి, ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, గణబాబు, వెగుళ్ళ జోగేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గద్దె రామ్మోహన్ రావు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, డోలా బాలవీరంజనేయస్వామి, మాజీ మంత్రులు దేవినేని ఉమా, పరిటాల సునీత, ఆలపాటి రాజా, ప్రత్తిపాటి పుల్లారావు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, పరిశీలకులు, రాష్ట్ర మండల నాయకులు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జులు పాల్గొన్నారు.
20230916fr6505eb7f893d6.jpg20230916fr6505eb8a51150.jpg20230916fr6505eb96dfdf3.jpg20230916fr6505eba3c201f.jpg20230916fr6505ebb254123.jpg20230916fr6505ebbf69bdc.jpg20230916fr6505ebcbeba51.jpg20230916fr6505ebdaf21ae.jpg
20230916fr6505ec4e2cb0c.jpg

 

Posted

Sudheer Reddy: హైదరాబాదులో చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీ.... హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే 

17-09-2023 Sun 21:30 | Both States
  • స్కిల్ కేసులో చంద్రబాబు
  • రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు
  • దేశంలోని వివిధ ప్రాంతాల్లో చంద్రబాబుకు మద్దతుగా ర్యాలీలు
  • వనస్థలిపురం ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
 
BRS MLA Sudheer Reddy attends TDP Rally in support for Chandrababu

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు సెప్టెంబరు 22 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాగా, చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

ఇవాళ హైదరాబాదులోని వనస్థలిపురంలోనూ చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ ర్యాలీలో నిర్వహించారు. అయితే, ఈ ర్యాలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొనడం విశేషం. ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సుధీర్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ఈ ర్యాలీకి హాజరై టీడీపీ మద్దతుదారులకు సంఘీభావం తెలిపారు. 

కాగా, ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిమేర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ర్యాలీలో బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి కూడా పాల్గొన్నారు.

Posted
4 hours ago, psycopk said:

Chandrababu: బెల్జియం, లండన్ లోనూ చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు 

17-09-2023 Sun 19:33 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబుకు మద్దతుగా కదం తొక్కుతున్న తెలుగు ప్రజలు
  • బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో నిరసనలు
  • అమెరికాలోని ఫిలడెల్ఫియాలో చంద్రబాబుకు తెలుగు సంఘాల మద్దతు
  • లండన్ లో వీధుల్లోకి వచ్చిన తెలుగు ప్రజలు
 
Chandrababu supporters protests in Belgium and London

టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ కేసులో  అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ విదేశాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నిరోజులుగా ప్రవాసాంధ్రులు అనేక దేశాల్లో చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శనలు చేపడుతున్నారు. 

తాజాగా యూరప్ లోని బెల్జియం దేశంలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో 'మేము సైతం బాబు గారికి తోడుగా' కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ మేము సైతం బాబు గారికి తోడుగా అనే కార్యక్రమాన్ని బెల్జియంలోని బ్రసెల్స్ నగరం అటోమియం ముందు శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూడా పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. భవిష్యత్తులో ఉమ్మడిగా మరిన్ని కార్యక్రమాలు చేపడదాం అని తెలిపారు. 

అటు, అమెరికాలోని ఫిలడెల్ఫియాలోనూ పలు తెలుగు సంఘాలకు చెందినవారు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సాఫ్ట్ వేర్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చి, ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చిన గొప్ప నేత చంద్రబాబు అని అమెరికా ప్రవాసాంధ్రులు కొనియాడారు. హైదరాబాదును సాఫ్ట్ వేర్ హబ్ గా మార్చిన విజినరీ లీడర్ అని కీర్తించారు. 

బ్రిటన్ లోనూ చంద్రబాబుకు సంఘీభావంగా ప్రదర్శనలు చేపట్టారు. లండన్ నగరంలో తెలుగు ప్రజలు చంద్రబాబుకు మద్దతుగా వీధుల్లోకి వచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ, చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని నినదించారు.
20230917fr650706a6be45f.jpg20230917fr650706b7f2ef1.jpg20230917fr650706c753a20.jpg20230917fr650706d62d029.jpg20230917fr650706e44c163.jpg20230917fr6507070661452.jpg20230917fr650707210bb83.jpg20230917fr6507072e407dd.jpg

CBN ni yeedho rafe case lo irikinchinattu feel avuthunnaaru, adhi just 15 days remand raa naayana… ee vishayam theliyaka mana Paccha Thammullu kastapaduthunnaaru

  • Haha 1
Posted
1 hour ago, bharathicement said:

CBN ni yeedho rafe case lo irikinchinattu feel avuthunnaaru, adhi just 15 days remand raa naayana… ee vishayam theliyaka mana Paccha Thammullu kastapaduthunnaaru

youtube videos, news, statements, bandh lu, rallies are not going to change the law or the due process - no use and time/energy waste yavvaralu. 1.5cr a day paid lawyer could not change anything. It doesn’t matter what anyone thinks or believes or likes. It matters what gets proven in the court.

anni telisinattu matlade wanna be know it all gallu chala mandi unnar ee db la. Em chestam?

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...