psycopk Posted September 17, 2023 Report Posted September 17, 2023 Nuvvu valdina dialogues aa ra ivi daridrapu yedava kanesam script manam chadavocha leda anedi kuda check chesko va.. https://www.instagram.com/reel/CxKcwcUJeXd/?igshid=MzRlODBiNWFlZA== Ambati Rambabu: ఏ విధంగా చూసినా పవన్ కు నైతిక విలువలు లేవు: అంబటి రాంబాబు 17-09-2023 Sun 21:07 | Andhra స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ పవన్ ఎక్కువ బాధపడిపోతున్నాడన్న అంబటి పవన్ మాట్లాడేవన్నీ అబద్ధాలేనని వెల్లడి చంద్రబాబుతో పవన్ కలిస్తే ఏమీ జరగదన్న మంత్రి స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబును అరెస్ట్ చేశారని, కానీ చంద్రబాబు కుటుంబ సభ్యుల కంటే పవన్ కల్యాణ్ ఎక్కువ బాధపడిపోతున్నాడని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజి గమనిస్తే అతడు అబద్ధాలు చెబుతున్నాడన్న విషయం స్పష్టమవుతుందని అన్నారు. ఏ విధంగా చూసినా పవన్ కు నైతిక విలువలు లేవని, రాజకీయంగా, వ్యక్తిగతంగా విలువల్లేని వ్యక్తి అని విమర్శించారు. ఒకరితో పెళ్లి, మరొకరితో కాపురం.. ఇదీ పవన్ నైజం అని అంబటి పేర్కొన్నారు. చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తామని పవన్ అంటున్నాడని, రెండంకెలు కలిస్తే కొత్త అంకె ఏర్పడుతుందేమో కానీ, రెండు సున్నాలు కలిస్తే వచ్చేది సున్నాయేనని ఎద్దేవా చేశారు. నాదెండ్ల మనోహర్ కొంగు పట్టుకుని పవన్ సముద్రంలో ఈదుతున్నాడని వ్యంగ్యం ప్రదర్శించారు. ఏపీలో జనసేన, టీడీపీ కలిసి వచ్చినా సరే వైసీపీ విజయాన్ని ఆపలేరని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.