Jump to content

Recommended Posts

Posted

Chandrababu: చంద్రబాబు కస్టడీ నేపథ్యంలో సీఐడీకి జడ్జి విధించిన కండిషన్స్ ఇవే! 

22-09-2023 Fri 15:21 | Andhra
  • చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు
  • విచారణ ఫొటోలు, వీడియోలు బయటకు రాకూడదని ఆదేశం
  • చంద్రబాబు లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలని కండిషన్
 
ACB Court conditions to CID for Chandrababu custody

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు తీర్పును వెలవరించింది. ఈ సందర్భంగా సీఐడీకి ఏసీబీ కోర్టు జడ్జి పలు కండిషన్లను విధించారు. 

 
ఏసీబీ కోర్టు జడ్జి కండిషన్స్:
  • విచారణ ఫొటోలు, వీడియోలు బయటకు రాకూడదు
  • విచారణ వివరాలను మీడియాకు వెల్లడించకూడదు
  • కస్టడీ విచారణ నివేదికను సీల్డ్ కవర్ లో ఇవ్వాలి
  • విచారణ అధికారుల వివరాలు ఇవ్వాలి
  • చంద్రబాబును ఆయన లాయర్ల సమక్షంలోనే విచారించాలి
  • చంద్రబాబు ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
  • చంద్రబాబు ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
  • చంద్రబాబు విచారణను తాము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం
  • కస్టడీ మగిసిన వెంటనే కోర్టులో ప్రవేశ పెట్టాలి.
 
మరోవైపు చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తామని కోర్టుకు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు.
  • Haha 1
Posted

Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ జడ్జి పేర్కొన్న అంశాలు ఇవే! 

22-09-2023 Fri 15:08 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్... 14 రోజుల రిమాండ్
  • హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన చంద్రబాబు
  • చంద్రబాబు పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు
  • పోలీసుల విచారణలో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ 
 
Judge mentions some points during the hearing on Chandrababu petition

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు హైకోర్టులో తీవ్ర నిరాశ కలిగిన సంగతి తెలిసిందే. స్కిల్ కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కొన్ని అంశాలను ప్రస్తావించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 140 మంది సాక్షులను విచారించారని, 4 వేల కాపీలను అందజేశారని వెల్లడించారు. పోలీసుల విచారణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. ఈ దశలో క్వాష్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోలేమని తెలిపారు. ఈ సందర్భంగా నీహారిక వర్సెస్ మహారాష్ట్ర కేసులో  సుప్రీంకోర్టు ఆదేశాలను న్యాయమూర్తి ఉదహరించారు

Posted

Chandrababu: చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు 

22-09-2023 Fri 15:04 | Andhra
  • రెండు రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు
  • కస్టడీ తేదీలను తర్వాత ప్రకటిస్తామన్న కోర్టు
  • రాజమండ్రి జైల్లోనే చంద్రబాబును విచారిస్తామన్న సీఐడీ
 
ACB Court gives Chadrababu to CID custody

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సీఐడీ కస్టడీకి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లబోతున్నారు. రెండు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అప్పగిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే రెండు రోజుల కస్టడీ తేదీలను మాత్రం కోర్టు వెల్లడించలేదు. తేదీలను తర్వాత ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీఐడీ కోరింది. అయితే, ఐదు రోజులు కాకుండా రెండు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. ఇంకోవైపు, చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తామని కోర్టుకు సీఐడీ తెలిపింది. మరోవైపు రెండు రోజుల పాటు చంద్రబాబు రిమాండ్ ను కూడా కోర్టు పొడిగించిన సంగతి తెలిసిందే.

Posted

Chandrababu: హైకోర్టులో చంద్రబాబుకు నిరాశ.. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో టీడీపీ 

22-09-2023 Fri 14:46 | Andhra
  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ
  • క్వాష్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు
  • సుప్రీంకోర్టులో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్న బాబు లాయర్లు
 
Chandrababu lawyers challenging AP High Court verdict in Supreme Court

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైన సంగతి తెలిసిందే. ఆయన వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో టీడీపీ సవాల్ చేయనుంది. ఈ కేసును సుప్రీంకోర్టులో తేల్చుకోవాలని చంద్రబాబు తరపు లాయర్లు నిర్ణయించారు. మరోవైపు ఢిల్లీలోని సీనియర్ లాయర్లతో నారా లోకేశ్, టీడీపీ నేతలు చర్చిస్తున్నారు. ఇంకోవైపు కాసేపట్లో చంద్రబాబు పోలీస్ కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించనుంది. 

  • Haha 1
Posted

Chandrababu: చంద్రబాబు రిమాండ్ పొడిగింపు.. రిమాండ్ ను శిక్షగా భావించొద్దని చంద్రబాబుకు చెప్పిన జడ్జి! 

22-09-2023 Fri 11:05 | Andhra
  • మరో రెండు రోజుల పాటు రిమాండ్ ను పొడిగించిన జడ్జి
  • వర్చువల్ గా కోర్టుకు హాజరైన చంద్రబాబు
  • జైల్లో ఇబ్బంది కలుగుతోందా? అని బాబును అడిగిన జడ్జి
  • సీఐడీ మిమ్మల్ని రిమాండ్ కు అడుగుతోందని చెప్పిన వైనం
  • తానేంటో దేశం, రాష్ట్రంలో అందరికీ తెలుసన్న బాబు
  • రాజకీయ కక్షతో అరెస్ట్ చేశారన్న చంద్రబాబు
 
Chandrababu judicial remand extended

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ను విజయవాడలోని ఏసీబీ కోర్టు పొడిగించింది. మరో రెండు రోజుల పాటు (ఈ నెల 24 వరకు) మీరు రిమాండ్ లోనే ఉంటారని జడ్జి చంద్రబాబుకు తెలిపారు. ఈరోజుతో చంద్రబాబు రిమాండ్ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో జైలు నుంచి చంద్రబాబును వర్చువల్ గా కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. 

విచారణ సందర్భంగా... మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతోందని చంద్రబాబుకు జడ్జి తెలిపారు. మీకు విధించిన రిమాండ్ ను శిక్షగా భావించొద్దని చెప్పారు. జైల్లో మీకు ఇబ్బందేమైనా కలుగుతోందా? అని ప్రశ్నించారు. మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని, నేరం నిరూపణ కాలేదని, దర్యాప్తులో అన్నీ తేలుతాయని చెప్పారు. చట్టం అందరికీ సమానమేనని అన్నారు. ఇంకోవైపు, జైల్లో చంద్రబాబుకు కల్పిస్తున్న వసతులపై పూర్తి వివరాలను ఇవ్వాలని జైలు అధికారులను జడ్జి ఆదేశించారు.  

 
తన గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసని జడ్జికి చంద్రబాబు తెలిపారు. రాజకీయ కక్షలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని తెలిపారు. తన వివరణ తీసుకోకుండానే అరెస్ట్ చేశారని, తన అరెస్ట్ అక్రమమని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం కలిగిన తనకు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. తన తప్పు ఉంటే విచారించి, అరెస్ట్ చేయాల్సిందని అన్నారు. తన హక్కులను కాపాడాలని, న్యాయాన్ని రక్షించాలని జడ్జిని కోరారు. 

రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశానని చంద్రబాబు తెలిపారు. తనను జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని చెప్పారు. ఈ వయసులో తనకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ కస్టడీపై మీ అభిప్రాయం చెప్పాలని చంద్రబాబును న్యాయమూర్తి అడిగారు. న్యాయం గెలవాలని, చట్టం ముందు అందరూ సమానవేనని చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు చెప్పిన విషయాలను నోట్ చేసుకున్నట్టు జడ్జి తెలిపారు. 

మరోవైపు చంద్రబాబు తరపు లాయర్లు తమ వాదననలు వినిపిస్తూ... చంద్రబాబును కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. కాగా, చంద్రబాబు కస్టడీపై కాసేపట్లో తీర్పు వెలువడే అవకాశం ఉంది. కస్టడీ తీర్పు నేపథ్యంలో సర్వత్ర తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Posted

@psycopk qq why is TDP hoing for quash petition

negative remark padtadi kada janallo kuda

any strong  reason behind it?  apart from prolonging tactics from Jaffa

Posted
Just now, Spartan said:

@psycopk qq why is TDP hoing for quash petition

negative remark padtadi kada janallo kuda

any strong  reason behind it?  apart from prolonging tactics from Jaffa

Not sure sitti.. 

  • Haha 1
Posted
Just now, psycopk said:

Not sure sitti.. 

instead of squash petition they should ask to speed up the process as election is nearing

also there is a option to move it out of state kuda he can try in Karnataka 

Posted
1 minute ago, Spartan said:

instead of squash petition they should ask to speed up the process as election is nearing

also there is a option to move it out of state kuda he can try in Karnataka 

Adi jaragadu kada… chustunav ga varusaga oka 10 tuppas casela tho ready ga unnaru.. they just want to delay.. ipudu 2 days aaiyaka we need more time

antaru

  • Sad 1
Posted
39 minutes ago, psycopk said:

Chandrababu: ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు: జడ్జితో చంద్రబాబు వ్యాఖ్యలు 

22-09-2023 Fri 15:18 | Andhra
  • హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత
  • వర్చువల్ గా విచారణలో పాల్గొన్న చంద్రబాబు
  • తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని వెల్లడి
  • తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆక్రోశం
  • తనపై ఉన్నవి ఆరోపణలేనని, ఇంకా నిర్ధారణ కాలేదని స్పష్టీకరణ
 
Chandrababu attends high court hearing via virtual mode

టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ నేడు కొట్టివేతకు గురైంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఇవాళ్టి విచారణలో వర్చువల్ గా పాల్గొన్నారు. 

తనది 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అని చంద్రబాబు హైకోర్టు న్యాయమూర్తికి తెలిపారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, తాను తప్పు చేసి ఉంటే విచారణ జరిపి అరెస్ట్ చేయాల్సిందని పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందని, అలాంటి తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు వాపోయారు. 

"ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన... ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. నాపై ఉన్నవి కేవలం ఆరోపణలే. అవి నిర్ధారణ కాలేదు. చట్టం ముందు అందరూ సమానమే... నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని. న్యాయం గెలవాలని కోరుకుంటున్నాను" అని చంద్రబాబు ఆక్రోశించారు.

 

 

pedda-uploads.gif

పెద్ద Punishment ఏ ఇది! 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...