psycopk Posted September 23, 2023 Report Posted September 23, 2023 Jagan Bail: జగన్ బెయిల్‌పై బయటకు వచ్చి నేటికి సరిగ్గా పదేళ్లు.. ఈ ఘనత సాధించిన దేశంలోని ఒకే ఒక్క వ్యక్తి అని పట్టాభి ఎద్దేవా 23-09-2023 Sat 11:24 | Andhra తండ్రి వైఎస్ హయాంలో జగన్ భారీ అవనీతికి పాల్పడ్డారన్న పట్టాభి 23 సెప్టెంబరు 2013లో బెయిలుపై బయటకు వచ్చారన్న టీడీపీ నేత దేశంలో ఎవరూ పదేళ్లపాటు బెయిలుపై బయట లేరని, ఇదో రికార్డని ఎద్దేవా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ ఘనత రికార్డు చేయాలని విజ్ఞప్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిలుపై బయట ఉండి నేటికి 10 సంవత్సరాలు పూర్తయిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం పేర్కొన్నారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీ అవినీతికి పాల్పడిన కేసుల్లో అరెస్ట్ అయిన జగన్‌కు 23 సెప్టెంబరు 2013న బెయిలు మంజూరైనట్టు చెప్పారు. అప్పటి ఇప్పటి వరకు పదేళ్లుగా కోర్టుల నుంచి తప్పించుకుని బెయిలుపై తిరుగుతున్నారని విమర్శించారు. దేశంలో ఇదో రికార్డని, ఇప్పటి వరకు దేశంలో ఎవరూ ఇలాంటి ఘనత సాధించలేదని ఎద్దేవా చేశారు. కాబట్టి కోర్టు బెయిలుపై పదేళ్లుగా బయట ఉంటున్నందుకు ఈ రికార్డును ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేయాలని ఆ సంస్థకు విజ్ఞప్తి చేశారు.ఈ రికార్డు సర్టిఫికెట్‌ను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు చక్కగా ఫ్రేమ్ కట్టి తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చి అందజేస్తారని జగన్ ఉద్దేశించి పట్టాభిరామ్ పేర్కొన్నారు. జగన్ ఏ కాలేజీ చదువుకున్నారో, ఏ సర్టిఫికెట్ వచ్చిందో ఎవరికీ ఇప్పటి వరకు తెలియదని, కాబట్టి ఇండియాబుక్ ఆఫ్ రికార్డ్స్ అందించే ఈ సర్టిఫికెట్‌ను ఇంటి గోడలతోపాటు పార్టీ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసి ఈ సర్టిఫికెట్‌ను ప్రముఖంగా ప్రదర్శించాలని కోరుతున్నట్టు పేర్కొన్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు సహా ఇప్పటి వరకు ఓ వ్యక్తి ఎవరూ దేశంలో ఇన్నేళ్లుగా బెయిలుపై ఉన్న ఘనత సాధించలేదని పట్టాభి ఎద్దేవా చేశారు. Quote
psycopk Posted September 23, 2023 Author Report Posted September 23, 2023 Andhra Pradesh: జగన్ కుటుంబ సభ్యులకు విదేశాల్లోనూ ఎస్ఎస్ జీ సెక్యూరిటీ 23-09-2023 Sat 10:58 | Andhra ప్రత్యేక చట్టం తీసుకువస్తున్న ఏపీ ప్రభుత్వం శాసన సభలో బిల్లును ప్రవేశ పెట్టిన అధికార పక్షం విదేశాల్లో చదువుతున్న సీఎం కూతుళ్లకు రక్షణ ఏర్పాట్లు ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబ సభ్యుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త చట్టం తీసుకువస్తోంది. దీనికి సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టింది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఈ బిల్లు ప్రకారం.. ముఖ్యమంత్రి, భార్య/ భర్త, పిల్లలు, తల్లిదండ్రులకు నిరంతరం రక్షణ కల్పిస్తారు. సీఎం సమీప కుటుంబ సభ్యుల నివాసం వద్ద, ప్రయాణాల్లో, ఏదైనా ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా రక్షణ ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లినపుడు సెక్యూరిటీ కల్పిస్తారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో నివసిస్తున్నట్లయితే అక్కడ కూడా సెక్యూరిటీ కల్పించేందుకు ఈ బిల్లులో ప్రతిపాదనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ యాక్ట్- 2023 బిల్లు చట్టంగా మారి అమలులోకి వస్తే.. విదేశాల్లో చదువుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ ఇద్దరు కూతుళ్లకు ఏపీ ప్రభుత్వ ఖర్చుతో సెక్యూరిటీ కల్పిస్తారు. Quote
psycopk Posted September 23, 2023 Author Report Posted September 23, 2023 M Nageswar Rao IPS: చంద్రబాబు అరెస్ట్ పై మాజీ ఐపీఎస్ నాగేశ్వరరావు మరో సంచలన ట్వీట్ 23-09-2023 Sat 10:11 | Andhra చంద్రబాబు అరెస్ట్ ను తొలి నుంచి కూడా తప్పుపడుతున్న నాగేశ్వరరావు సంసారులపై బురద చల్లడానికి వ్యభిచారులు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారంటూ తాజా ట్వీట్ అది లైంగిక వ్యభిచారులైనా లేక రాజకీయ వ్యభిచారులైనా అని విమర్శ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమమంటూ మాజీ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు తొలి నుంచి కూడా చెపుతున్న సంగతి తెలిసిందే. సీఐడీ అధికారుల అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆయన పలు సందర్భాల్లో ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ఆయన తొలిరోజే చెప్పారు. గవర్నర్ అనుమతి లేకుండా, దర్యాప్తు కూడా చేయకుండానే అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. గవర్నర్ అనుమతి తీసుకోకపోతే అది అక్రమ నిర్బంధం అవుతుందని... అక్రమంగా నిర్బంధించిన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. అంతేకాదు, లీగల్ గా ఎలా ప్రొసీడ్ అయితే బెటర్ అనే సూచనలు కూడా ఇచ్చారు. తాజాగా ఆయన మరో సంచలన ట్వీట్ చేశారు. 'సంసారులపై బురద చల్లడానికి వ్యభిచారులు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. అది లైంగిక వ్యభిచారులైనా లేక రాజకీయ వ్యభిచారులైనా' అని పరోక్షంగా ఏపీలోని అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. Quote
psycopk Posted September 23, 2023 Author Report Posted September 23, 2023 https://x.com/naralokesh/status/1705449045437632781?s=46&t=WANebzfm_Wx9lEoXx-qPpw Quote
TuesdayStories Posted September 23, 2023 Report Posted September 23, 2023 https://www.instagram.com/reel/CvJc-i9hpnp/?igshid=NzZhOTFlYzFmZQ== 1 Quote
Android_Halwa Posted September 23, 2023 Report Posted September 23, 2023 Lol…10 years out on bail…16 months as under trail… ippatiki money trail establish cheyaledu CBI…regukar hearing kuda bandh ayindi…accountsbattached anni idisesinaru…of all the charges filed, end of the day PMLA charges mida nadustundi case ipudu which has max sentence rod two years, out of which 16 months served as undertrail. And then there is visionary…paisal 10gesinava leda ante domalu kudutunayi, naku home food kavale ani kathalu. 1 Quote
psycopk Posted September 23, 2023 Author Report Posted September 23, 2023 Raghu Rama Krishna Raju: సీఎం జగన్ బెయిల్ పొంది పదేళ్లు... కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రఘురామ 23-09-2023 Sat 16:52 | Andhra సీఎం జగన్ బెయిల్ పై రఘురామ సెటైర్లు ఇవాళ మా పార్టీ వాళ్లు సంబరాలు చేసుకునే రోజు అంటూ వ్యంగ్యం రూ.43 వేల కోట్ల అవినీతి కేసులో బెయిల్ కొనసాగించడం జగన్ కే చెల్లిందని వ్యాఖ్యలు ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ పొంది పదేళ్లయిన సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ సెటైర్లు సంధించారు. కేక్ కట్ చేసి సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. సెప్టెంబరు 23వ తేదీ మా పార్టీ వాళ్లు సంబరాలు చేసుకునే రోజు అని వ్యంగ్యం ప్రదర్శించారు. రూ.43 వేల కోట్ల అవినీతి కేసులో బెయిల్ పై రావడం, ఆ బెయిల్ ను విజయవంతంగా కొనసాగించడం జగన్ కే సాధ్యమైందని ఎద్దేవా చేశారు. కోర్టుకు హాజరు కావాల్సిన పనిలేదని ఆర్డర్ తెచ్చుకున్నారని, ఇంత ఘనత వహించిన జగన్ కు శుభాకాంక్షలు అంటూ రఘురామ వ్యాఖ్యానించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.