Jump to content

Squash petition ki bail ki teda teliyadu.. ee yedava minister


Recommended Posts

Posted

Anil Kumar Yadav: చంద్రబాబు మరిన్ని కేసులు ఎదుర్కోబోతున్నారు: అనిల్ కుమార్ యాదవ్ 

28-09-2023 Thu 16:47 | Andhra
  • స్కిల్ డెవలప్ మెంట్ లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు ఆధారాలు ఉన్నాయన్న అనిల్
  • ఆధారాలు ఉండటం వల్లే కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదని వ్యాఖ్య
  • వైసీపీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు లేనిపోని హడావుడి చేస్తున్నారని మండిపాటు
 
Chandrababu going to face many cases says Anil Kumar Yadav

టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు పక్కా ఆధారాలు ఉన్నాయని... అన్ని ఆధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందని చెప్పారు. ఆధారాలు ఉండటం వల్లే ఆయనకు కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదని అన్నారు. ఏ వయసులో తప్పు చేసినా నేరం నేరమేనని చెప్పారు. భవిష్యత్తులో చంద్రబాబు మరిన్ని కేసులు ఎదుర్కోబోతున్నారని తెలిపారు. 

 
చంద్రబాబు లక్కీ నెంబర్ 23 అని... తమ పార్టీకి చెందిన 23 మందిని ఆయన లాక్కున్నారని... 2019లో ఆయనకు వచ్చిన సీట్లు కూడా 23 అని... ఆయన జైలుకు వెళ్లిన తేదీ కూడా 23 అని అనిల్ ఎద్దవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతలే సైలెంట్ గా ఉన్నారని... తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు మాత్రం లేనిపోని హడావుడి చేస్తున్నారని విమర్శించారు.
Posted

Chandrababu: చంద్రబాబుపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు 

28-09-2023 Thu 17:27 | Andhra
  • చంద్రబాబు కేసులో తమ వాదనలు వినాలన్న ఏపీ ప్రభుత్వం
  • విద్యార్థులకు శిక్షణ పేరుతో కోట్లాది రూపాయల స్కాం జరిగిందని ఆరోపణ
  • ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది జీఎస్టీ శాఖ అని వెల్లడి
 
AP government files caveat petition in Supreme Court

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయన కస్టడీ, బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై కోర్టుల్లో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.

చంద్రబాబుపై నమోదైన కేసులో తమ వాదనలు కూడా వినాలని అందులో కోరింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై చాలా ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చెప్పి కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని, నిధులను షెల్ కంపెనీలకు దారి మళ్లించి ఎన్ క్యాష్ చేసుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని జీఎస్టీ శాఖ అని తెలిపింది. ఈ కేసులో తమ వాదనను కూడా మీ ముందు ఉంచడానికి అనుమతివ్వాలని కోరింది.

Posted

Nakka Anand Babu: జగన్ శునకానందం పొందుతున్నారు: నక్కా ఆనందబాబు 

28-09-2023 Thu 16:36 | Andhra
  • తండ్రిని అడ్డు పెట్టుకుని జగన్ వేల కోట్లు కొల్లగొట్టారన్న ఆనందబాబు
  • స్కిల్ డెవలప్ మెంట్ లో కుంభకోణం జరిగినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
  • చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా
 
Nakka Anand Babu fires on Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శలు గుప్పించారు. శాసనసభలో టీడీపీ అధినేత చంద్రబాబును మంత్రులు, ఎమ్మెల్యేల చేత తిట్టిస్తూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. తండ్రి వైఎస్సార్ ను అడ్డం పెట్టుకుని వేల కోట్లను కొల్లగొట్టిన చరిత్ర జగన్ దని ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడిపిన వ్యక్తి జగన్ అని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో ఎలాంటి అవకతవకలు జరగకపోయినా... కుంభకోణం జరిగినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. 

కక్షపూరితంగానే చంద్రబాబును అరెస్ట్ చేయించిట్టు ప్రజలకు అర్థమైపోయిందని అన్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో లోకేశ్ పై కేసు పెట్టి... ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని... వచ్చే ఎన్నికల్లో ఆయనకు మళ్లీ పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. జగన్ కు బుద్ధి చెప్పే సమయం కోసం జనాలు ఎదురు చూస్తున్నారని చెప్పారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...