Jump to content

Recommended Posts

Posted

Chandrababu: చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ 21వ రోజూ కొనసాగిన ఆందోళనలు

03-10-2023 Tue 22:16 | Andhra
  • చంద్రబాబు విడుదల కావాలని ఆలయంలో 101 టెంకాయలు కొట్టిన మాదినేని
  • రాక్షసపాలనను అంతమొందించాలని అమ్మవారిని మొక్కిన బండారు సత్యానందరావు
  • పెదకూరపాడులో చేతులకు సంకెళ్లు వేసుకొని మాజీ ఎమ్మెల్యే నిరసన
  • వెలగపూడి ఆధ్వర్యంలో తలకిందులుగా నిరసన 
  • శ్రీకాకుళంలో భారీ ర్యాలీ చేపట్టిన టీడీపీ శ్రేణులు
tdp protest for 21st day against chandrababu arrest

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ శ్రేణుల ఆందోళనలు 21వ రోజూ కొనసాగాయి. చంద్రబాబు వెంటనే విడుదల కావాలని కోరుకుంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండలో మారెమ్మ ఆలయంలో 101 టెంకాయలు కొట్టి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శింగనమల నియోజకవర్గం నార్పలలో రాష్ట్ర కార్యదర్శి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

 
 

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. రాక్షస పాలనను అంతమొందించాలని మహిసాసురవర్ధిని రూపంలో అమ్మవారిని కోరుకున్నారు. రావులపాలెంలో సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరులో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పుట్టావారిపాలెం అడ్డరోడ్డు జంక్షన్ నుంచి కామేపల్లిలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు.

పెదకూరపాడులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలిపాటి శ్రీధర్ వినూత్నంగా నిరసన తెలిపారు. చేతులకు సంకేళ్లు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆధ్వర్యంలో లో తలకిందులుగా నిరసన వ్యక్తం చేశారు. పెద్దాపురం నియోజకవర్గం చాళుక్య కుమార రామ భీమేశ్వరస్వామి దేవాలయం వద్ద గోదావరిలో జలదీక్ష చేపట్టి నిరసన తెలిపారు. కనిగిరి నియోజకవర్గంలో ఇన్‌చార్జ్ ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో చెవిలో పూలు పెట్టుకొని దీక్షలో పాల్గొన్నారు.

పెనమలూరు నియోజకవర్గం పోరంకి సీతాపురం కాలనీలో బోడె ప్రసాద్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులు తిరుపతిలో ర్యాలీ నిర్వహించారు. తిరుపతి టౌన్ క్లబ్ ఎన్టీఆర్ సర్కిల్ నుండి పాదయాత్ర నాలుకాల మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో ఉమ్మడి నాయకులు భారీ నిర్వహించారు. శ్రీకాకుళంలోని జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ 7వ జంక్షన్ మీదుగా అంబేడ్కర్ విగ్రహాం ర్యాలీ చేపట్టారు.

నిరసన కార్యక్రమాలలో పోలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, కిమిడి కళా వెంకటరావు, నక్కా ఆనంద్ బాబు, ఎంఏ షరీఫ్, బోండా ఉమామహేశ్వరరావు, రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, పార్లమెంట్ అధ్యక్షులు బుద్దా నాగజగదీష్, గన్నీ వీరాంజనేయులు, కొనకళ్ళ నారాయణ, నెట్టెం రఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, జీవి ఆంజనేయులు, నూకసాని బాలాజీ, బికె పార్థసారథి, గొల్లా నరసింహాయాదవ్, పులివర్తి నాని, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు,  గంటా శ్రీనివాసరావు, గణబాబు, వేగుళ్ళ జోగేశ్వరరావు, నిమ్మల రామనాయుడు, మంతెన రామరాజు, గద్దె రామ్మోహన్ రావు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయస్వామి, నియోజకవర్గ ఇన్‌చార్జులు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

20231003fr651c451c37d25.jpg       
                  
20231003fr651c45323b0b4.jpg                    

20231003fr651c45506201a.jpg                     


20231003fr651c456a0b02e.jpg
  • Upvote 1
Posted

NTR profile photo petukuni chandra babu ni support chestunnav choodu? 🙏

Posted

21 endi…24 days kada ?

Akariki isonti news la kuda neeyath lekapothe etla ? 

Posted

21st day protest news ae 24th day esinaru anukunta….lekka aina change cheyali kada…

Skill development quality kanipistundi…Induke bokkala esinaru.

Posted

Babu garu inthe oka 6 months unte leaders pockets kali

Nri lu gattiga try chesukovachu tkts

3l9arp.gif

 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...