psycopk Posted October 4, 2023 Report Posted October 4, 2023 https://www.instagram.com/reel/Cx-CgTIpjWU/?igshid=MzRlODBiNWFlZA== Quote
psycopk Posted October 4, 2023 Author Report Posted October 4, 2023 https://www.instagram.com/reel/Cx8fZe7pzhq/?igshid=MzRlODBiNWFlZA== Quote
psycopk Posted October 4, 2023 Author Report Posted October 4, 2023 vangalapudi anitha: ఆ రోజు రోజా ఆడదనే విషయం మరిచిపోయిందా? లేక ఈ రోజు గుర్తుకు వచ్చిందా?: వంగలపూడి అనిత 04-10-2023 Wed 14:47 | Andhra రోజాకు తన వరకు వచ్చేసరికి ఆడతనం గుర్తుకు వచ్చిందా? అని నిలదీత రాష్ట్రంలో భారతి, రోజా తప్ప ఇంకెవరూ మహిళలు లేరా? అని ప్రశ్న అసెంబ్లీలో నా గురించి, పీతల సుజాత గురించి అసభ్యంగా మాట్లాడారని ఆగ్రహం రోజా ఇప్పుడు గ్లిజరిన్ ఏడుపులు ఏడ్చారా? మహానటి ఏడుపులా? అని ఎద్దేవా రోజా చేష్టలు, మాటల కారణంగానే రోజాకు ఏ మహిళ నుంచి మద్దతు లేదని వ్యాఖ్య తమ పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబాలపై అసభ్యంగా మాట్లాడిన రోజాకు తనవరకు వచ్చేసరికి ఆడతనం గుర్తుకు వచ్చిందా? అని టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతి, రోజా తప్ప ఇక మహిళలు ఎవరూ లేరా? అని ప్రశ్నించారు. ఆమె బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... గత అసెంబ్లీలో తన గురించి, పీతల సుజాత గురించి మంత్రి రోజా అసభ్యంగా మాట్లాడారని గుర్తు చేశారు. ఆమె నోటికి వచ్చినట్లు మాట్లాడారని, అప్పుడు తాను, తన పిల్లలు టీవీ, పేపర్ చూసేందుకు కూడా భయపడ్డామన్నారు. ఆ రోజు ఇదే రోజా తాను కూడా ఆడదానిని అనే విషయం మరిచిపోయిందా? లేక ఈ రోజే తాను ఆడదానిని అనే విషయం ఆమెకు గుర్తుకు వచ్చిందా? అని అడిగారు. పీతల సుజాత గురించి అసెంబ్లీ సాక్షిగా వికృత చేష్టలు చేసినప్పుడు ఈ ఆడతనం ఏమయిందో చెప్పాలన్నారు. ఇదే చంద్రబాబు గురించి అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడావ్? కామ సీఎం అన్నావని మండిపడ్డారు. గతంలో తాము ఏడిస్తే దొంగ ఏడుపులు అన్న రోజా ఇప్పుడు గ్లిజరిన్ ఏడుపులు ఏడ్చారా? లేక మహానటి ఏడుపులా? అని నిలదీశారు. ఈ రోజు నీవరకు వచ్చేసరికి తెలిసిందా? అన్నారు. ఇవాళ రోజా నీతులు మాట్లాడుతుంటే ఏమనుకోవాలన్నారు. రోజా ప్రవర్తన కారణంగా ఆమె ఎంత ఏడ్చినా ప్రజలు సానుభూతి చూపడం లేదన్నారు. నువ్వు చేసిన చేష్టలు, నువ్వు మాట్లాడిన మాటలు, నీ బాడీ లాంగ్వేజ్ కారణంగా ఈ రోజు ఏ మహిళ స్పందించడం లేదన్నారు. ఒకసారి రోజా తన పాత వీడియోలు తెప్పించుకొని చూసి, తన ప్రవర్తనను పునఃసమీక్షించుకోవాలన్నారు. బండారు సత్యనారాయణమూర్తి ఇప్పుడు నీపై చేసిన వ్యాఖ్యల కంటే గతంలో నీవు చేసిన వ్యాఖ్యలు చాలా దరిద్రంగా ఉన్నాయన్నారు. గన్ కంటే ముందు జగన్ వస్తాడని అసెంబ్లీలో సినిమా డైలాగ్లు చెప్పావని, కానీ లక్షా ఇరవై రెండువేల మంది ఆడబిడ్డల మానప్రాణాలు పోతుంటే రోజా ఎందుకు కనీసం కన్నీరు కార్చలేదు? అని నిలదీశారు. అమరావతి రైతుల గురించి, వారు కట్టుకున్న చీరల గురించి ఈ వెధవలు మాట్లాడారని నిప్పులు చెరిగారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మహిళ, ఆడతనం రోజాకు గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. అలాంటప్పుడు ఆమెకు ఎవరు మద్దతిస్తారన్నారు. భారతి గురించి మాట్లాడినా, రోజు గురించి మాట్లాడినా పోలీసులు వచ్చి కేసు పెడతారని, మరి మా గురించి మాట్లాడినప్పుడు పోలీసులు వచ్చి ఎందుకు కేసులు పెట్టడం లేదో చెప్పాలన్నారు. చంద్రబాబు, పవన్ కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు దూషించినప్పుడు రోజా ఎక్కడ ఉన్నారని నిలదీశారు. టీడీపీ మహిళా నేతలపై అసభ్యంగా మాట్లాడుతుంటే కేసులు ఉండవా? అన్నారు. Quote
psycopk Posted October 4, 2023 Author Report Posted October 4, 2023 Roja: లోకేశ్! నీ భార్య బ్రాహ్మణిని ఏమన్నారో చూడు: మంత్రి రోజా కంటతడి 03-10-2023 Tue 21:39 | Andhra లోకేశ్ మద్దతుతో అయ్యన్న, బండారు రెచ్చిపోయారని విమర్శ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మద్దతు ఎలా ఇచ్చావని బండారుకు ప్రశ్న జగన్ను సైకో అంటే ఎలా ఒప్పుకుంటామని నిలదీత బండారు మాటలు చూశాక మహిళలు చెప్పులతో కొడతారన్న రోజా తన క్యారెక్టర్ని జడ్జ్ చేయడానికి బండారు సత్యనారాయణ ఎవడు? అతనికి ఏం హక్కులు ఉన్నాయి? నన్ను తిట్టించడానికి బండారును, అయ్యన్న పాత్రుడ్ని టీడీపీ నేత నారా లోకేశ్ ఎంకరేజ్ చేస్తున్నాడు, కానీ.. అదే అయ్యన్న నీ భార్యని ఏమన్నాడో చూశావా? లోకేశ్ అంటూ మంత్రి రోజా నిప్పులు చెరిగారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని అనేశారు కాబట్టి తాను రోజాను విమర్శించానని బండారు చెప్పారని, కానీ ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన, చెప్పులేసిన, పార్టీ లాక్కున్న చంద్రబాబుకు ఎలా మద్దతు ఇచ్చావ్? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబు కాళ్లు ఎందుకు నొక్కుతున్నావ్? అని నిలదీశారు. ఆ రోజు నీ పౌరుషం చూపించాలి కదా అన్నారు. కానీ ఎన్టీఆర్కు అన్నం కూడా పెట్టని కూతుళ్లు, కొడుకులు, అల్లుళ్లు, మనవరాళ్ల గురించి మాట్లాడుతున్నావా? అని దుమ్మెత్తి పోశారు. ఈ రోజు మేం కూడా ఎన్టీఆర్ గురించే పోరాడుతున్నామన్నారు. ఆయనకు అన్నం పెట్టని, చెప్పులేసిన ప్రాణాలు తీసిన చంద్రబాబు కోసం రోడ్లమీదకు వచ్చి నందమూరి కుటుంబం డ్రామాలు చేస్తోందని, కానీ అదే ఎన్టీఆర్కు అన్యాయం జరిగినప్పుడు మీరు ఎక్కడకు వెళ్లారని తాము ప్రశ్నించామని, ఇందులో తప్పేముందన్నారు. తప్పు చేస్తే ఎవరూ ప్రశ్నించవద్దా? అన్నారు. ప్రశ్నిస్తే నా క్యారెక్టర్ పైన రాళ్ళేస్తారా? అని ప్రశ్నిస్తూ రోజా కంటతడి పెట్టుకున్నారు. లోకేశ్! అయ్యన్న బ్రాహ్మణిని ఏమన్నాడో చూడు... అసలు నువ్వెవడు నా క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయడానికి? నీకేం హక్కు ఉంది? ఈ రోజు లోకేశ్ తెలుసుకోవాలి... ఇలాంటి అయ్యన్న, బండారును ఎంకరేజ్ చేసి, తనను తిట్టించి నా నోరు మూయించాలనుకున్నావని, కానీ ఈ రోజు నీ పరిస్థితి ఏమయింది? అన్నారు. అదే అయ్యన్న నీ భార్య బ్రాహ్మణిని ఏమన్నాడో చూడు, బాలకృష్ణ కూతురు, లోకేశ్ పెళ్లాం, అదెవరు? దాని పేరు ఏంటి? అన్నాడన్నారు. కాబట్టి నాపై దుమ్మెత్తి పోయాలనుకుంటే అది మీ కళ్లల్లోనూ పడిందన్నారు. ఈరోజు అదే పరిస్థితి నీ పెళ్లానికి వచ్చిందన్నారు. బ్రాహ్మణి కూడా ఈ విషయం తెలుసుకోవాలన్నారు. జగన్ను సైకో అంటే ఎలా ఒప్పుకుంటాం? తాను హీరోయిన్గా ఉన్నప్పుడు బ్రాహ్మణి చాలా చిన్నపాప అని, ఆమెకు తామే జడలు వేసి, ఆడించుకునే వారమన్నారు. ఆమె ఇంత వరకు రాజకీయాలు మాట్లాడలేదు కాబట్టి మేమూ మాట్లాడలేదని, కానీ ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్ ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని జగన్ను సైకో అంటే తాము ఎలా అంగీకరిస్తామని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు నా గొంతు నొక్కాలనుకుంటే మీ వల్ల కాదని టీడీపీని ఉద్దేశించి అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకూ జగన్కు మద్దతుగా, మహిళలకు మద్దతుగా తన గళం వినిపిస్తూనే ఉంటానన్నారు. ఇకపై తప్పుడు మాటలు మాట్లాడితే.. కచ్చితంగా ఈసారి వదిలేది లేదని, ఎంతవరకైనా పోరాడతానని హెచ్చరించారు. బండారును అరెస్ట్ చేసినంత మాత్రాన వదిలేది లేదని, ఆయనపై పరువునష్టం దావా వేస్తానన్నారు. న్యాయపోరాటం చేస్తానన్నారు. మహిళల గురించి దిగజారుడుగా మాట్లాడాలంటే భయపడేవిధంగా ముందుకు సాగుతానన్నారు. చెప్పులతో కొడతారు బండారు మాట్లాడిన మాటలు చూస్తే ఈ రోజు మహిళలు చెప్పులతో కొడతారన్నారు. కానీ టీడీపీలోని మహిళలు మాత్రం ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారన్నారు. మీ ఇంట్లోని సభ్యులను ఎవరైనా ఇలా మాట్లాడితే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. మాట్లాడితే సినిమా వాళ్లు అంటారని, ఎన్టీఆర్ ఎక్కడి నుంచి వచ్చారన్నారు. బండారు భార్యను అడుగుతున్నానని, ఆ రోజే నీ భర్తను చెప్పుతో కొట్టి ఉంటే ఇలాంటి ఆలోచన రాకపోయి ఉండేదన్నారు. లోకేశ్ వీరి మాటలను సపోర్ట్ చేయడం సిగ్గుచేటు అన్నారు. తాను మంత్రిగా ఎదిగితే చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. Quote
Sreeven Posted October 4, 2023 Report Posted October 4, 2023 Deeniki anni baga back fire avutunnayi.. Quote
punyavathi Posted October 4, 2023 Report Posted October 4, 2023 She is loosing this time. Chaala narrow ga win ayindhi last time. Hatrick time win antha scene ledhu amma gariki Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.