Jump to content

Recommended Posts

Posted

Chandrababu: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉంచిన హైకోర్టు 

05-10-2023 Thu 17:55 | Andhra
  • ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
  • హైకోర్టులో నిన్నటి వాదనలకు నేడు కొనసాగింపు
  • ఇరుపక్షాల వాదనలు పూర్తి
  • రేపు నిర్ణయం వెలువరించనున్న హైకోర్టు ధర్మాసనం
 
AP High Court reserves verdict on Chandrababu Naidu bail petition

ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు వాదనలు కొనసాగించింది. ఇరు వర్గాల నుంచి వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. 

కాగా, చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు చంద్రబాబును ఎలా బాధ్యుడ్ని చేస్తారంటూ వారు ప్రశ్నించారు. చంద్రబాబుపై రాజకీయ కక్షతో ఈ కేసు నమోదు చేశారని ఆరోపించారు. రెండేళ్ల క్రితమే కేసు నమోదు చేసి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వలేదని లూథ్రా, అగర్వాల్ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికిప్పుడు ఈ కేసులో చంద్రబాబు పేరు చేర్చారని స్పష్టం చేశారు. 

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ నిన్నటి నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న కొంత మేర వాదనలు విన్న న్యాయమూర్తి, తదుపరి విచారణ కొనసాగింపును నేటికి వాయిదా వేశారు.

  • Haha 1
Posted

Chandrababu: చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రత్యేక గీతం విడుదల 

05-10-2023 Thu 19:06 | Andhra
  • పాటను రచించి, రూపొందించిన గుమ్మడి గోపాలకృష్ణ
  • కన్నీళ్లు కాదు కాదు.. కళ్లు ఎరుపెక్కాలి, అంతు తేల్చుకోవాలి అనే పల్లవితో సాగే గీతం
  • చంద్రబాబు అరెస్ట్ అక్రమమని సాగే గీతం
 
Special song released opposing chandrababu arrest

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ రచించి, రూపొందించిన ప్రత్యేక గీతాన్ని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. కన్నీళ్లు కాదు కాదు... కళ్లు ఎరుపెక్కాలి, అంతు తేల్చుకోవాలి అనే పల్లవితో ఈ గీతం ప్రారంభమవుతుంది. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, దీనిని వ్యతిరేకిస్తూ ఈ గీతాన్ని రూపొందించారు.

ఈ గీతాన్ని బాగా రాశారని గోపాలకృష్ణను అచ్చెన్నాయుడు ప్రశంసించారు. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, వర్ల రామయ్య, పట్టాభిరాం, మాజీ ఎమ్మెల్యే సునీల్‌, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ, కౌన్సిల్‌ మాజీ చైర్మన్‌ షరీఫ్‌, ఎమ్మెల్సీ అశోక్ బాబు పాల్గొన్నారు. 

  • Haha 1
Posted
15 minutes ago, psycopk said:

Samara…ie song vunda YouTube lo ? 

  • Haha 1
Posted

not 100% supporting CBN overall, but clearly judicial system sold out in this case

Posted
12 minutes ago, Android_Halwa said:

Samara…ie song vunda YouTube lo ? 

  • Haha 1
Posted

Atchannaidu: జగన్ వాటిని కూడా తప్పుబడుతున్నాడు: అచ్చెన్నాయుడు 

05-10-2023 Thu 20:52 | Andhra
  • ఎలక్టోరల్ బాండ్ల ద్వారా టీడీపీకి నిధులు
  • స్కిల్ నిధులు మళ్లించారని జగన్ ఆరోపిస్తున్నాడని అచ్చెన్న ఆగ్రహం
  • కేంద్ర చట్టాలను అపహాస్యం చేస్తున్నాడని విమర్శలు
 
Atchannaidu take a dig at CM Jagan

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై ఏపీ సీఐడీ మోపిన ఆరోపణల నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ సేకరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ చట్టం కూడా చేసిందని అన్నారు. కానీ జగన్ రెడ్డి వాటిని కూడా తప్పుబడుతూ, అదో కుంభకోణం అన్నట్లుగా మాట్లాడుతూ కేంద్ర చట్టాలను అపహాస్యం చేస్తున్నాడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 

చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి ఉంచడానికి కుట్ర చేస్తున్నారని ఈ వ్యాఖ్యలతోనే అర్ధమవుతోందని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థను సైతం తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం ద్వారా ప్రజాహక్కుల్ని, రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని వివరించారు. 

"స్కిల్ డెవలప్ మెంట్‌కి సంబంధించి రూ.27 కోట్ల నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాకు మళ్లించారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. రాజకీయ పార్టీకి రూ.20 వేలకు మించి నగదు రూపంలో విరాళం ఇచ్చినట్లైతే అలాంటి వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి, ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు సదరు పార్టీ వారు తెలియజేస్తారు. అవి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంటాయి. 

ఏప్రిల్ 2023లో ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుండి తెలుగుదేశం పార్టీ నిధుల వివరాలను సీఐడీ అధికారికంగా డౌన్ లోడ్ చేసింది. అందులోనే ఎవరు ఏ రోజు ఎంత మొత్తంలో విరాళాలిచ్చారో స్పష్టంగా ఉంది. 

వాటిపై ఆరు నెలల పరిశోధన చేసిన సీఐడీ, ఎలాంటి అవకతవకలు లేకున్నా బురద జల్లడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని చెప్పడం, దానిని అక్రమ కేసులకు ముడిపెట్టడం దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు తలొగ్గి చట్ట వ్యతిరేకంగా పని చేస్తున్నాయని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం" అన్నారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...