Peruthopaniemundhi Posted October 9, 2023 Report Posted October 9, 2023 గులాబీ దళం దూకుడు.. 15 నుంచి మేనిఫెస్టోతో మొదలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో అధికార భారాస వేగంగా వ్యూహాలు రచిస్తోంది. హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో అధికార భారాస వేగంగా వ్యూహాలు రచిస్తోంది. భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. అక్టోబర్ 15 నుంచి ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. ఇప్పటికే ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థులతో ఈ నెల 15న తెలంగాణ భవన్‌లో సమావేశం కానున్నారు. అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేసి నామినేషన్‌లు వేసే సమయంలో జాగ్రత్తలు, ఎన్నికల నియామవళి, ప్రచార వ్యూహాలను వివరించనున్నారు. అదే సమయంలో అభ్యర్థుల సమక్షంలో భారాస మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేయనున్నారు. ఇందులో ఆసరా పింఛన్‌లు, రైతుబంధు సాయం పెంపు వంటి రైతు, మహిళ, బీసీ, మైనారిటీలు, యువతను ఆకర్షించేలా పలు హామీలు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో మాదిరే హుస్నాబాద్ నుంచే.. ఆ తర్వాత సుమారు వంద నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళిక చేసిన కేసీఆర్.. ఈ నెల 15నే నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు శ్రీకారం చుట్టనున్నారు. గత ఎన్నికల మాదిరిగా హుస్నాబాద్ నుంచే ఈసారి కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించేలా ప్రణాళిక చేశారు. తెలంగాణ భవన్‌లో సమావేశం ముగియగానే.. హైదరాబాద్ నుంచి నేరుగా హుస్నాబాద్‌కు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 16న జనగామ, భువనగిరిలో.. 17న సిద్దిపేట, సిరిసిల్లలో కేసీఆర్ సభలు నిర్వహిస్తారు. సెంటిమెంట్ ప్రకారం కోనాయపల్లిలో పూజలు ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్లలో.. సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ బహిరంగ సభల్లో గులాబీ దళపతి ప్రచారం నిర్వహిస్తారు. ఈసారి కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్.. నవంబరు 9న నామినేషన్లు వేయనున్నారు. నవంబరు 9న తన సెంటిమెంట్ ప్రకారం కోనాయపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి గజ్వేల్‌లో నామినేషన్ వేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో కూడా నామినేషన్ దాఖలు చేసి.. అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.