psycopk Posted October 12, 2023 Report Posted October 12, 2023 Chandrababu: అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్పై రేపు తీర్పు! 12-10-2023 Thu 14:21 | Andhra అగస్ట్ 14న అన్నమయ్య జిల్లాలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత చంద్రబాబు ఏ-1గా 179 టీడీపీ నేతలపై కేసులు ఇప్పటికే పలువురు టీడీపీ నేతలకు బెయిల్ మంజూరు చంద్రబాబు ముందస్తు బెయిల్పై నేడు ముగిసిన వాదనలు అంగళ్లు కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో గురువారం విచారణ పూర్తయింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును శుక్రవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఫైబర్ నెట్ పీటీ వారెంట్ పిటిషన్పై ఈ రోజు వాదనలు కొనసాగనున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పేరుతో అగస్ట్ 14న చంద్రబాబు అన్నమయ్య జిల్లాలో పర్యటించారు. అంగళ్లు మీదుగా ఆయన వెళ్తున్నప్పుడు వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తత నెలకొన్నది. ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన 179 మంది నేతలపై కురబలకోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ అంగళ్లు కేసులో చంద్రబాబును ఏ-1గా చేర్చారు. హత్యాయత్నంతో పాటు ఇతర సెక్షన్లపై కేసు నమోదు చేశారు. దీనిపై టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్లారు. విచారణ క్రమంలో కొంతమందికి బెయిల్ వచ్చింది. ఈ కేసులో ఏ-1గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో, నేడు ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం రేపు తీర్పు వెలువరించనుంది. Quote
psycopk Posted October 12, 2023 Author Report Posted October 12, 2023 Nara Lokesh: లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్పోజ్ చేసిన ఏపీ హైకోర్టు 12-10-2023 Thu 14:03 | Andhra స్కిల్ కేసులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ కేసులో లోకేశ్ ను నిందితుడిగా చూపలేదన్న సీఐడీ లోకేశ్ ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు తెలిపిన వైనం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఈ కేసులో లోకేశ్ ను నిందితుడిగా చూపలేదని... అందువల్ల ఆయనను అరెస్ట్ చేయబోమని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఒకవేళ కేసులో లోకేశ్ పేరును చేర్చితే... అప్పుడు 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్పింది. అరెస్ట్ చేయబోమని సీఐడీ స్పష్టం చేయడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. Quote
psycopk Posted October 12, 2023 Author Report Posted October 12, 2023 Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసిన హైకోర్టు 12-10-2023 Thu 11:16 | Andhra స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పై హైకోర్టులో వాదనలు కేసు దర్యాప్తు పూర్తయిందన్న చంద్రబాబు తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలన్న ప్రభుత్వం తరపు న్యాయవాది ఈ నెల 17కి తదుపరి విచారణను వాయిదా వేసిన హైకోర్టు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈనాటి విచారణ సందర్భంగా ఈ కేసులో చంద్రబాబు తరపున విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశామని... ఈ పిటిషన్ పై సుదీర్ఘ వాదనల అనంతరం బెయిల్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించిందని చంద్రబాబు తరపు లాయర్లు హైకోర్టుకు తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు ఏ37గా ఉన్నారని, ఇప్పటికే రెండు రోజుల సీఐడీ కస్టడీలో బాబు ఉన్నారని చెప్పారు. స్కిల్ కేసులో ఇతర నిందితులంతా ముందస్తు బెయిల్, బెయిల్ పై ఉన్నారని తెలిపారు. కేసు దర్యాప్తు దాదాపు పూర్తయిందని, చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ కూడా 30 రోజులు దాటిపోయిందని చెప్పారు. చంద్రబాబుకు కూడా బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో సీఐడీ తరపు న్యాయవాది స్పందిస్తూ... ఈ అంశంపై తాము ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాల్సి ఉందని, తాము కౌంటర్ దాఖలు చేస్తామని, తమకు కొంత సమయం కావాలని హైకోర్టును కోరారు. దీంతో, తదుపరి విచారణను హైకోర్టు 17వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 17లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. Quote
psycopk Posted October 12, 2023 Author Report Posted October 12, 2023 Chandrababu: చంద్రబాబుకు షాక్.. పీటీ వారెంట్ కు ఆమోదం తెలిపిన ఏసీబీ కోర్టు 12-10-2023 Thu 16:21 | Andhra ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ పీటీ వారెంట్ సోమవారం చంద్రబాబును కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరు పరచాలని ఆదేశాలు విజయవాడ ఏసీబీ కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరాశ ఎదురయింది. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ కు ఏసీబీ కోర్టు ఆనుమతించింది. సీఐడీ వేసిన పీటీ వారంట్ పై వాదనలను విన్న తర్వాత కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. సోమవారం నాడు చంద్రబాబును నేరుగా కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు హాజరుపరచాలని ఆదేశాలు జరీ చేసింది. కోర్టులో చంద్రబాబు తరపున దమ్మలపాటి శ్రీనివాస్, సీఐడీ తరపున వివేకానంద వాదనలు వినిపించారు. Quote
Anta Assamey Posted October 12, 2023 Report Posted October 12, 2023 PT warrant lu execute ayyayi kada... Monday roju in person CBN will be Court... Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.