Jump to content

Recommended Posts

Posted

It's always last minute plan to come in weekends unannounced... Escape the arrest

  • Haha 1
Posted
4 hours ago, Sucker said:

Anna paduko plz at least weekend aina 

 

4 hours ago, KOMPELLA_SUBBAR said:

Sampi 10gi CM aithadu @PappuLokesh . @C . B . N killed his father-in-law, now own son killing him. Karma is a BlTCH 

 

Posted

Chandrababu: చంద్రబాబును చూడగానే బాధ కలిగింది... మాట్లాడలేకపోతున్నారు: కాసాని 

14-10-2023 Sat 16:34 | Both States
  • భువనేశ్వరి, లోకేశ్‌తో పాటు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని ములాఖత్
  • చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న కాసాని
  • తెలంగాణలో టీడీపీ పోటీకి సంబంధించి సూచనలు తీసుకున్న కాసాని
 
family meets chandrababu in jail

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ మధ్యాహ్నం కలిశారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి, తనయుడు లోకేశ్‌తో పాటు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ అధినేతతో ములాఖత్ అయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు వారి ములాఖత్ ముగిసింది. 

ములాఖత్ అనంతరం కాసాని జ్ఞానేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఆయన మాట్లాడలేకపోతున్నట్లు చెప్పారు. జైల్లో ఆయన పరిస్థితి చూడగానే బాధ కలిగిందన్నారు.

కాగా, తెలంగాణలో టీడీపీ పోటీకి సంబంధించి అధినేత నుంచి కాసాని పలు సూచనలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

  • Haha 1
Posted

Chandrababu: జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ల కీలక నివేదిక! 

14-10-2023 Sat 15:21 | Andhra
  • ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా గుర్తించిన రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు
  • చేతులు, ముఖం సహా పలుచోట్ల దద్దుర్లు, అలర్జీ ఉన్నట్లు నిర్ధారణ
  • అధిక ఎండల కారణంగా డీహైడ్రేషన్‌తో ఇబ్బంది పడుతున్నట్లు నివేదిక
 
Key report on Chandrababu Naidu health

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు శనివారం నాడు ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక నివేదిక అందించినట్లుగా తెలుస్తోంది. గణనీయ స్థాయిలో ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు రాజమండ్రి ప్రభుత్వ వైద్యుల నివేదిక వెల్లడించినట్లుగా తెలుస్తోంది. 

టీడీపీ అధినేతకు చేతులు, ముఖం సహా ఇతర చోట్ల దద్దుర్లు, అలర్జీ ఉన్నట్లుగా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. తీవ్రమైన ఎండల కారణంగా డీహైడ్రేషన్‌తో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు చెప్పారని తెలుస్తోంది. కాగా, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన అవసరం లేదని నిన్న జైలు అధికారులు మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే.

  • Haha 1
Posted

CPI Ramakrishna: చంద్రబాబు ఆరోగ్యంపై చెప్పాల్సింది డాక్టర్లు... డీఐజీ ఎలా చెబుతారు?: సీపీఐ రామకృష్ణ 

14-10-2023 Sat 14:05 | Andhra
  • చంద్రబాబు ఆరోగ్యంపై రాజకీయం చేయడం సరికాదన్న రామకృష్ణ
  • ఆరోగ్యం బాగాలేదని చెబితే ఎగతాళిగా మాట్లాడటం ఏమిటని ప్రశ్న
  • నీటి పారుదల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శ
 
CPI Ramakrishna on chandrababu health issue

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై రాజకీయం చేయడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆయన విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆరోగ్యం బాగాలేదని చెబితే ఎగతాళిగా మాట్లాడటం ఏమిటన్నారు. అసలు ఆరోగ్యంపై చెప్పాల్సింది డాక్టర్లని, కానీ డీఐజీ ఎలా మాట్లాడుతారు? అని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో నీటిపారుదల ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కృష్ణా జలాల అంశంపై హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సదస్సు నిర్వహిస్తున్నారని, ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణలో దీనిని నిర్వహిస్తున్నారన్నారు. కృష్ణా జలాల పునఃపంపిణీపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్ ఢిల్లీలో ఉన్నారని, కానీ అడ్డుకోలేకపోయారన్నారు. అసలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. 

 

  • Haha 2
Posted

This is what I like about CBN. He does not leave any card . Even TG protests strategy or using jail for any extent to gain sympathy and media . 
 

2024 will tell how effective all these strategies were 

  • Haha 2
Posted

Chandrababu: చంద్రబాబుకు చల్లని వాతావరణం అవసరం అని సిఫారసు చేశాం: డాక్టర్ శివకుమార్ 

14-10-2023 Sat 19:06 | Andhra
  • రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు అలర్జీ సమస్యలు
  • నేడు జైల్లోకి వెళ్లి మరో వైద్య బృందం
  • మీడియా సమావేశంలో పాల్గొన్న డాక్టర్ శివకుమార్
 
Dr Sivakumar talks about Chandrababu health

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ప్రభుత్వ వైద్యులతో కూడిన మరో బృందం నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులోకి వెళ్లింది. చంద్రబాబును పరీక్షించిన అనంతరం డాక్టర్ శివకుమార్ తో కూడిన వైద్య బృందం మీడియా సమావేశంలో పాల్గొంది. ఈ మీడియా సమావేశంలో జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ, జైల్లోకి వెళ్లి చంద్రబాబుకు పలు వైద్య పరీక్షలు చేశామని చెప్పారు. బీపీ చూశాం, ఆక్సిజన్ శాచ్యురేషన్ పరీక్షించాం, ఊపిరితిత్తుల పనితీరును కూడా పరీక్షించాం అని వెల్లడించారు. చంద్రబాబు పేర్కొంటున్న సమస్యలను మినహాయిస్తే ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అన్నారు. మేం చూసొచ్చి మీకు చెబుతున్నాం అని డాక్టర్ శివకుమార్ స్పష్టం చేశారు. 

"ఐదుగురితో కూడిన మా వైద్యబృందం జైల్లోకి వెళ్లి చంద్రబాబును పరిశీలించింది. నీరసం అని ఆయనేమీ చెప్పలేదు. మాతో ఎంతో యాక్టివ్ గా మాట్లాడారు. ఆయన చుట్టూ కూర్చున్న మాతో చక్కగా మాట్లాడారు... మేం అడిగిన ప్రతి అంశానికీ స్పందించారు. ఆయన ఏ ఆహారం తీసుకుంటారు, ఆహార వేళలు అన్నీ అడిగాం... ఆయన కూడా హ్యాపీగా సమాధానం చెప్పారు. 

నీరసంగా ఉన్న వ్యక్తి అయితే బెడ్ పై పడుకుని ఉంటాడు... మేం చంద్రబాబు బీపీ చెక్ చేసిన తర్వాతే మాట్లాడుతున్నాం. మేం చంద్రబాబును పరీక్షించిన దానిపై జైలు అధికారులకు ఓ నివేదిక ఇస్తాం. ఆయనను ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం కనిపించడంలేదు. అయితే, చంద్రబాబుకు చల్లని వాతావరణం అవసరం అని మేం సిఫారసు చేస్తున్నాం. 

ఇవాళ చంద్రబాబు బరువు కూడా చూశాం... ఆయన 67 కిలోల బరువున్నారు. చంద్రబాబుకు ఒంటిపై ర్యాష్ వచ్చింది. ర్యాష్ ఎందుకు వచ్చిందనేదానికి చాలా కారణాలు ఉంటాయి. అన్నీ చెప్పలేం. తగిన చికిత్సను మేం సూచించాం. అయితే చంద్రబాబు తనకు ఓ పాలసీ ఉందన్నారు. తనకు వ్యక్తిగత వైద్యుడు ఉన్నారని ఆయన చెప్పారు. ఆయన తన పర్సనల్ డాక్టర్ ను సంప్రదించి చికిత్స విధానంపై నిర్ణయం తీసుకుంటారు. 

చంద్రబాబు గత హెల్త్ రిపోర్ట్స్ గురించి మాకేమీ తెలియదు. ఇప్పుడున్న ఆరోగ్య సమస్యల గురించే మేం పరీక్షలు జరిపాం. అయితే, ఆయన జైలుకు వచ్చాక నమోదైన మెడికల్ రికార్డులన్నీ మేం చూశాం. స్థానిక డాక్టర్ ఇచ్చిన ట్రీట్ మెంట్ గురించి కూడా తెలుసుకున్నాం. మా బృందంలోని ఓ వైద్యురాలు ఇప్పటికే ఒక నివేదిక ఇచ్చారు. అందులోని అంశాలే బయటికి వచ్చాయని మాట్లాడుకుంటున్నారు. 

ఇక, చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారు అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. చంద్రబాబుకు చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఇవ్వడంలేదని నిజాయతీగా చెబుతున్నాం. మూత్ర విసర్జన సమస్యలు ఏవైనా ఉన్నాయా అంటే, అలాంటివేమీ లేవని చంద్రబాబు చెప్పారు. మిగిలిన వ్యక్తిగత మెడికల్ కంప్లెయింట్స్ ను నేను మీడియా ముందు చెప్పలేను. కొన్ని విషయాలు నేను మాట్లాడకూడదు" అని డాక్టర్ శివకుమార్ వివరించారు.

  • Haha 2
Posted

Nail records lone undi kada ra tuppas yedavalara… admit aainapudu 72 undi ani ipudu 67 ..aa 72 kuda 48 hrs no sleep tarwata

Posted

Nara Lokesh: ములాఖత్ సమయంలో డీఐజీపై అసహనం వ్యక్తం చేసిన నారా లోకేశ్ 

14-10-2023 Sat 19:35 | Andhra
  • బాబు ఆరోగ్యం గురించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారని మండిపాటు
  • వైద్యలు సూచనలను 48 గంటలు గడిచినా అమలు చేయలేదని అసహంన
  • మాజీ సీఎం పట్ల ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని ప్రశ్న
 
Nara Lokesh anger on DIG

తన తండ్రి చంద్రబాబును టీడీపీ యువనేత నారా లోకేశ్ ఈ మధ్యాహ్నం ములాఖత్ ద్వారా కలిశారు. తన తల్లి భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వైద్యులు ఇచ్చిన నివేదికను చూపించి అక్కడే ఉన్న డీఐజీని లోకేశ్ నిలదీశారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు స్పష్టమైన నివేదికలు ఉన్నప్పటికీ... ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు కల్పించాల్సిన సౌకర్యాలపై వైద్యులు సూచనలు చేసి 48 గంటలు గడిచినా వాటిని అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. డీహైడ్రేషన్ బారిన పడిన చంద్రబాబును చల్లటి వాతావరణంలో పెట్టాలన్న వైద్యుల సూచనలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మరోవైపు లోకేశ్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వని డీఐజీ రవికిరణ్... ములాఖత్ సమయం అయిపోయిందని, వెంటనే వెళ్లిపోవాలని లోకేశ్ కు చెప్పారు. 

 

  • Haha 2
Posted

Chandrababu: చంద్రబాబు ఆరోగ్యంపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదులు 

14-10-2023 Sat 20:19 | Andhra
  • వైద్యుల సూచనలను అధికారులు పాటించేలా చూడాలని పిటిషన్‌లో విజ్ఞప్తి
  • మెడికల్ రిపోర్టులు కోర్టుకు సమర్పించి మెరుగైన వైద్యం అందించాలని కోరిన న్యాయవాదులు
  • పిటిషన్‌పై వాదనలు విననున్న ఏసీబీ న్యాయస్థానం
 
Chandrababu lawyers file petition on his health

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై న్యాయవాదులు కోర్టుకు వెళ్లారు. ఈ మేరకు ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ వైద్యుల సూచనలను జైలు అధికారులు పాటించేలా చూడాలని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు మెడికల్ రిపోర్టులను కోర్టుకు సమర్పించి మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. న్యాయవాదుల పిటిషన్‌పై ఏసీబీ న్యాయస్థానం వాదనలు విననుంది.

చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తోన్న టీడీపీ కోర్టుకు వెళ్లాలని, న్యాయవాదుల ద్వారా పిటిషన్ దాఖలు చేయించాలని ఈ రోజు నిర్ణయించింది. దీంతో న్యాయవాదులు ఇందుకు సంబంధించి పిటిషన్‌ను సిద్ధం చేసి, ఆ తర్వాత కోర్టులో దాఖలు చేశారు. నేడు, రేపు సెలవులు ఉన్నాయి.

  • Haha 1
  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...