Jump to content

Supreme court lo case— judgement reserved for friday


Recommended Posts

Posted

Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు కొనసాగిస్తున్న ముకుల్ రోహాత్గీ 

17-10-2023 Tue 15:02 | Andhra
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ అధినేత
  • వాదనలు వింటున్న అత్యున్నత న్యాయస్థానం
 
Mukul Rohatgi continue arguments in Supreme Court on Chandrababu quash petition

స్కిల్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో 17ఏ సెక్షన్ వర్తించదని రోహాత్గీ సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ ను వర్తింపజేయలేరని వివరించారు. 

17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫారసులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ప్రజాప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బందిపడకూడదనే ఈ చట్టం తీసుకువచ్చారని, అలాగని 17ఏ సెక్షన్ అవినీతిపరులకు రక్షణ చత్రం కాకూడదని రోహాత్గీ పేర్కొన్నారు. 

ఈ కేసులో ఉన్న ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవేనని తెలిపారు. అవినీతి కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారని, అవినీతి నిరోధక చట్టం కింద కేసులు పెట్టినప్పుడు ఐపీసీ సెక్షన్ల ప్రకారం కూడా విచారించే అధికారం ప్రత్యేక కోర్టులకు ఉంటుందని వివరించారు. న్యాయ పరిధికి సంబంధించి ఎలాంటి వివాదం లేదని, ప్రత్యేక కోర్టుకు సంపూర్ణ న్యాయపరిధి ఉందని ముకుల్ రోహాత్గీ సుప్రీం ధర్మాసనానికి  తెలియజేశారు.

వందల కోట్ల అవినీతి జరిగినట్టు ఆరోపణలు ఉన్నప్పుడు సీఆర్పీసీ 482 సెక్షన్ కింద క్వాష్ చేయలేము అని స్పష్టం చేశారు. అందుకు జస్టిస్ బేలా త్రివేది స్పందించారు. ఆరోపణలు ఉన్నప్పుడు చార్జిషీట్లు వేసి విచారణ జరిపి శిక్ష వేయవచ్చు... అంతేకానీ, కేవలం ఆరోపణలతోనే అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతామా? అని ప్రశ్నించారు. దాంతో, ముకుల్ రోహాత్గీ... ఈ అంశం అవినీతి కేసుల కిందకు వస్తుందంటే పరిగణనలోకి తీసుకోండి... లేదంటే  క్వాష్ చేయండి అని విన్నవించారు. 

ఈ క్రమంలో ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పందిస్తూ... ఇప్పుడు మనం మాట్లాడుతోంది ఈ కేసుకు 17ఏ వర్తిస్తుందా... లేదా? అనేదే కదా అని సూటిగా ప్రశ్నించారు. కేసుల నమోదు, చార్జిషీట్లు వేయడం, విచారణ అన్నీ కేసుల్లోనూ జరిగేవే కదా అని వ్యాఖ్యానించారు. 

అందుకు, ముకుల్ రోహాత్గీ బదులిస్తూ... అవినీతి కేసుల్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు ప్రత్యేక కోర్టుకు విచారించే న్యాయ పరిధి ఉంటుందని ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. ఈ కేసులో జీఎస్టీ, ఆదాయపన్ను దర్యాప్తులు కూడా ఉన్నాయని కోర్టుకు వివరించే ప్రయత్నం చేశారు. జీఎస్టీ, ఆదాయపన్ను శాఖతో పాటు మరికొన్ని విభాగాలు  కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయని రోహాత్గీ తెలిపారు. 

నేరం జరిగిందా లేదా, ఎఫ్ఐఆర్ నమోదైందా లేదా... అంతవరకే పరిమితం కావాలి అని అత్యున్నత న్యాయస్థానాన్ని ఒప్పించేందుకు యత్నించారు. ఏసీబీ కేసు అయినా, సాధారణ కేసు అయినా అదే పోలీసులు విచారణ చేస్తారని తెలిపారు. ఒకే పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను ఎలా క్వాష్ చేస్తారని రోహాత్గీ ప్రశ్నించారు.

Posted

Skill case completed.. fiber grid vadanalu and final

decision on skill case may be on friday…?

 

  • psycopk changed the title to Supreme court lo case is postponed to friday
  • psycopk changed the title to Supreme court lo case is going on
Posted

Chandrababu: ఫైబర్ నెట్ కేసును శుక్రవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు 

17-10-2023 Tue 15:45 | Andhra
  • ఫైబర్ నెట్ కేసులోనూ చంద్రబాబు ఆరోపణలు
  • సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
  • నేడు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పై కొనసాగుతున్న వాదనలు
  • మధ్యలో  ఫైబర్ నెట్  కేసు విచారణ అంశాన్ని గుర్తుచేసిన సిద్ధార్థ లూత్రా
  • ముందు క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిద్దామన్న ద్విసభ్య ధర్మాసనం
 
Supreme Court adjourns Fibernet case hearing till Friday

టీడీపీ అధినేత చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదిస్తున్నారు. 

అయితే, ఇవాళ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం వాదనలు వింటోంది. ఫైబర్ నెట్ కేసు విచారణ కూడా జరగాల్సి ఉండడంతో, ఈ వాదనల మధ్యలో సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకున్నారు. ఫైబర్ నెట్ కేసు విచారణకు అరగంట సమయం కోరారు. 

అయితే, ఫైబర్ నెట్ కేసును మరో రోజు చూద్దాం అని జస్టిస్ బేలా త్రివేది పేర్కొన్నారు. ముందు క్వాష్ పిటిషన్ విచారణ ముగిద్దాం అని జస్టిస్ అనిరుద్ధ బోస్ స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నాం అని తెలిపారు. ఆ మేరకు ఆదేశాలు ఇస్తాం అని వెల్లడించారు. 

అందుకు చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా స్పందిస్తూ.... ఈ కేసులో కోర్టు విచారణ పూర్తయ్యేవరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని గతంలో ఆదేశాలు ఇచ్చారు... ఆ ఆదేశాలను కూడా పొడిగిస్తున్నట్టే కదా అని ధర్మాసనం నుంచి మరింత స్పష్టత కోరారు. అందుకు జస్టిస్ అనిరుద్ధ బోస్ బదులిస్తూ... అవును, అది కూడా పొడిగిస్తున్నట్టే అని స్పష్టం చేశారు. అంతేకాదు, విచారణ ముగిసేంతవరకు అరెస్ట్ చేయవద్దన్న చంద్రబాబు అభ్యర్థనను అంగీకరించాలని ఏపీ ప్రభుత్వానికి సూచన చేశారు.

Posted

Chandrababu: న్యాయవాదులతో చంద్రబాబుకు ములాఖత్ కుదింపు... ఇక రోజుకు ఒకేసారి 

17-10-2023 Tue 15:52 | Andhra
  • ఇప్పటి వరకు చంద్రబాబుతో న్యాయవాదులకు రోజుకు రెండు ములాఖత్‌లు
  • సాధారణ ఖైదీలకు ఇబ్బంది ఏర్పడుతోందంటూ ములాఖత్‌ను కుదించిన జైలు అధికారులు
  • న్యాయవాదులతో రెండో ములాఖత్ రద్దు కుట్రగా టీడీపీ ఆరోపణ
 
Legal team Mulakath with Chandrababu shortened

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబుతో ఆయన న్యాయవాదుల బృందం ములాఖత్‌ను అధికారులు కుదించారు. లీగల్ ములాఖత్‌లు ఇప్పటి వరకు రెండు ఉండగా, దీనిని ఒకటికి కుదించారు. అంటే చంద్రబాబు న్యాయవాదులు రోజుకు రెండుసార్లు జైల్లో ఆయనను కలిసేవారు. కానీ ఇప్పుడు ఒకేసారి కలవాల్సి ఉంటుంది.

చంద్రబాబు ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై జైల్లో ఉన్నారు. ఆయనపై ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసులలోను చంద్రబాబు పేరు ఉంది. ఈ కేసుల నిమిత్తం కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసే నిమిత్తం చంద్రబాబుతో మాట్లాడేందుకు న్యాయవాదుల బృందం రోజుకు రెండుసార్లు చంద్రబాబుతో భేటీ అవుతోంది. కానీ ఇప్పుడు భద్రతా కారణాలతో ఒకేసారి కలిసేందుకు అవకాశం ఇస్తున్నారు.

చంద్రబాబు ములాఖత్‌ల వల్ల సాధారణ ఖైదీలకు ఇబ్బంది ఏర్పడుతోందని జైలు అధికారులు చెబుతున్నారు. పరిపాలనా కారణాలతో రెండో ములాఖత్ రద్దు చేసినట్లు తెలిపారు. అయితే.. చంద్రబాబును జైల్లో మరికొన్ని రోజులు ఉంచేందుకే కుట్రపూరితంగా రెండో ములాఖత్ రద్దు చేసినట్లు టీడీపీ అనుమానిస్తోంది.

  • psycopk changed the title to Supreme court lo case— judgement reserved for friday
Posted
1 hour ago, Anta Assamey said:

Skill development case Judgement reserved for Friday

brahmi-bramhi.gif

 

  • Haha 2
Posted
3 hours ago, psycopk said:

Skill case completed

Congrats bro… alage migatha cases kuda clear aithai.

Posted
3 hours ago, psycopk said:

Skill case completed..

 

QATm6V.gif

2 hours ago, Anta Assamey said:

Skill development case Judgement reserved for Friday

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...