Guest Posted October 22, 2023 Report Posted October 22, 2023 చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో చనిపోయిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఈ నెల 25 నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. ఈనాడు, అమరావతి: చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో చనిపోయిన తెదేపా కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను ఈ నెల 25 నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా వారానికి మూడు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి పరామర్శిస్తారు. స్థానికంగా జరిగే సభలు, సమావేశాల్లోనూ పాల్గొంటారు. మొదట రాయలసీమ జిల్లాల్లో ఈ పర్యటన సాగనుంది. 24న భువనేశ్వరి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, అదేరోజు నారావారిపల్లెకు వెళ్తారు. 25న చంద్రగిరిలో యాత్ర ప్రారంభిస్తారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ చేపట్టే మూడు కీలక కార్యక్రమాలపై నిర్ణయాలు తీసుకున్నారు. భువనేశ్వరి చేపట్టే ‘నిజం గెలవాలి యాత్ర’ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా, యాత్రతోపాటు రాత్రి బస ప్రాంతాల్లోనూ బందోబస్తు కల్పించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీకి శనివారం లేఖ రాశారు. ఈ మేరకు అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలివ్వాలని కోరారు. Quote
Popular Post Sizzler Posted October 22, 2023 Popular Post Report Posted October 22, 2023 Once they made fun of Odarpu Yatra. Now they are following the same. Kala Mahima ante idhenemo! 4 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.