Jump to content

TRS vallu mari chillar ga behaving …


Recommended Posts

Posted

Revant chepindi endi .. mundu release cheya mani.. ee pinkies family hadavidi.. apeya manadu ani..

 

  • Haha 1
Posted

Revanth Reddy: డ్రామారావు... నిన్న మేం ఎలక్షన్ కమిషన్‌కు చెప్పింది ఇదే: కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్ 

26-10-2023 Thu 16:35 | Telangana
  • ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు... అంటూ కేటీఆర్‌కు రేవంత్ చురకలు
  • మీకు అంత ప్రేమ ఉంటే నవంబర్ 2లోపు లబ్ధిదారులకు నిధులివ్వాలని డిమాండ్
  • నీలాంటి వాడిని చూసే నిజం చెప్పులేసుకునే లోపు అబద్దం ఊరంతా తిరిగి వచ్చిందనే సామెత పుట్టిందని ఎద్దేవా
 
Revanth Reddy counter to Minister KTR

రైతుబంధు ఆపేయాలంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విమర్శలు గుప్పించడంపై అదే ఎక్స్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్‌కు రైతులపై అంత ప్రేమ ఉంటే నవంబర్ 2లోపు రైతు బంధు, పెన్షన్, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

'ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు... నీకు రైతులపై ప్రేముంటే నవంబర్ 2 లోపు రైతుబంధు డబ్బులు ఇవ్వు... నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇవ్వు...
నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వు... నిన్న మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది ఇదే...' అని రేవంత్ పేర్కొన్నారు.

నీలాంటి వాడిని చూసే... 'నిజం చెప్పులు తొడుక్కునే లోపు... అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది' అనే సామెత పుట్టిందని విమర్శించారు. కేటీఆర్, బీఆర్ఎస్ తమ డ్రామాలు ఆపి నవంబర్ 2 లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వాలని సూచించారు. లేదంటే కాంగ్రెస్ వచ్చి పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుందని వ్యాఖ్యానించారు.

Posted

Harish Rao: స్వయంగా రేవంత్ రెడ్డి ఆ మాట చెప్పారు: మంత్రి హరీశ్ రావు 

26-10-2023 Thu 16:18 | Telangana
  • రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేయడమేమిటని నిలదీత
  • కర్ణాటకలో కాంగ్రెస్ రైతులకు ఐదు గంటల విద్యుత్ మాత్రమే ఇస్తోందని విమర్శ
  • రైతుబంధు అందకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపణ
  • డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారన్న హరీశ్ రావు
 
Harish Rao comments on rythu bandhu and power issue

రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడమేమిటని బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు నిలదీశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ఉచిత కరెంట్ అని గతంలో చెప్పి ఉత్త కరెంట్ చేసిందన్నారు. అన్నదాతలపై ఆ పార్టీకి కనికరం లేదని, కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడి రైతులకు కేవలం ఐదు గంటల విద్యుత్ మాత్రమే ఇస్తోందన్నారు.

ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని 61 లక్షలమంది రైతులు కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు చేస్తారన్నారు. రైతు బంధు అనేది కొత్త పథకమేమీ కాదని, కానీ ఇప్పటి వరకు పదకొండుసార్లు అందించామని, మరోసారి ఇవ్వబోతుంటే ఈసీకి ఫిర్యాదు చేయడం విడ్డూరమన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాంరాం చెబుతారన్నారు. రైతుబంధును నిలిపివేయాలని ఈసీని కాంగ్రెస్ ఎలా కోరుతుంది? అని ప్రశ్నించారు.

రైతుబంధు అందకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా మూడు గంటల విద్యుత్ ఇస్తామని చెప్పారని మండిపడ్డారు. డిసెంబర్ 3వ తేదీ తర్వాత కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారన్నారు. గత ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకోలేదని, తాము పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్లు, కేసీఆర్ కిట్ ఆపుతారేమో అని విమర్శించారు. రైతుల జోలికి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. కర్ణాటక రైతులు కొడంగల్, గద్వాలలో కరెంట్ విషయంలో ఆందోళన చేశారన్నారు. 

 

  • Haha 1
Posted

KTR: రైతుబంధు ఆపేయమంటారా? మీకు గుణపాఠం తప్పదు: కాంగ్రెస్ పై కేటీఆర్ ఫైర్ 

26-10-2023 Thu 14:14 | Telangana
  • ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతు బంధు నిలిపేయాలని ఈసీకి కాంగ్రెస్ లేఖ
  • కాంగ్రెస్ రైతు విరోధి అని మరోసారి తేలిపోయిందని కేటీఆర్ ఆగ్రహం
  • రైతు బంధు ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా అన్న కేటీఆర్
 
Minister KTR fires at Congress over Rythu Bandhu issue

పంట పెట్టుబడికి సాయంగా అందిస్తోన్న రైతుబంధును ఆపేయాలంటూ ఈసీకి కాంగ్రెస్ పార్టీ లేఖ రాసిందని, ఇది ఈ పథకానికి పాతరేసే ద్రోహం చేస్తున్నట్లేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలను ప్రజలు కట్ చేయడం పక్కా అన్నారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మళ్లీ రుజువైపోయిందన్నారు.

ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతుబంధును నిలిపివేయాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మాణిక్‌రావ్ ఠాక్రే సీఈసీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఎక్స్‌ వేదికగా మండిపడ్డారు. రైతు బంధు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్న ఓ వీడియోను రీట్వీట్ చేసిన కేటీఆర్ ఆ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఇంటింటికి మంచినీళ్లు.. ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటారేమో?..
అందులో కూడా కేసీఆరే కనిపిస్తాడు కదా?.
కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయింది. అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయింది.
పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరు. అన్నదాతల పొట్టకొట్టే.. కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరు.
రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నారు.
తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్‌కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.' అని కేటీఆర్ సుదీర్ఘ ట్వీట్ చేశారు. 

 

  • Haha 1
Posted
9 minutes ago, CrazyRobert777 said:

Why ate pulkas licking scamgress again? What happened to alliance with bjp? 10ge mannada shoe gaadu?

Topic ga related ga discuss cheyi.. cheta kaka pote pakkaki dobeyi

Posted
38 minutes ago, psycopk said:

Revant chepindi endi .. mundu release cheya mani.. ee pinkies family hadavidi.. apeya manadu ani..

 

Elections apudu  schemes meeda jagrathaga matured ga matladali anna, he might not have that intention , but telusu kada parties are fast to cash on

  • Haha 1
  • Upvote 1
Posted
41 minutes ago, psycopk said:

Topic ga related ga discuss cheyi.. cheta kaka pote pakkaki dobeyi

Topic ade ga…you sucking upto the scamgress and chamba’s paaleru potti rateEntha reddy

Posted

Anni parties chillarave... andaru politicians chillarolle...Grass scam chesina desam manadi...

Oka public entity anna sakkaga panichestada... anganwadi lo gudlu mayam, govt hospitals ki pothe leni rogalu vastayi... police is the licensed gunda...

politicians only care about caste...muncipality worst...

 

edo nadipistunaru anthe... 

 

Posted
29 minutes ago, Ara_Tenkai said:

Anni parties chillarave... andaru politicians chillarolle...Grass scam chesina desam manadi...

Oka public entity anna sakkaga panichestada... anganwadi lo gudlu mayam, govt hospitals ki pothe leni rogalu vastayi... police is the licensed gunda...

politicians only care about caste...muncipality worst...

 

edo nadipistunaru anthe... 

 

Nurse ayithay crazy … tablets injections and other equipments lepestharu … very dangerous .. anganwadi vallu food kosamey potharu adho pedda scam 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...