Jump to content

Train accident in srikakulam :(


Recommended Posts

Posted

Train Accident: విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీ... ముగ్గురి మృతి 

29-10-2023 Sun 21:24 | Andhra
  • కొత్తవలస మండలంలో ఆగివున్న రైలును ఢీకొన్న మరో రైలు
  • పట్టాలు తప్పిన మూడు బోగీలు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
 
Two trains collides in Vijayanagaram district

ఏపీలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. విశాఖ నుంచి పలాస వెళుతున్న స్పెషల్ ప్యాసింజర్ రైలును విశాఖ-రాయగడ రైలు ఢీకొట్టింది. కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం విశాఖ-పలాస ప్యాసింజర్ రైలు ఆగి ఉంది. అయితే, అదే ట్రాక్ పై వచ్చిన విశాఖ-రాయగడ రైలు ప్యాసింజర్ ను ఢీకొనడంతో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఘటన స్థలి వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. రైళ్లు ఢీకొనడంతో వైర్లు తెగిపోయాయి. దాంతో ఇక్కడంతా అంధకారం నెలకొని ఉంది.

Posted

YS Jagan: విజయనగరం రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి 

29-10-2023 Sun 21:34 | Andhra
  • విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీ... ముగ్గురి మృతి
  • అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం జగన్
  • వెంటనే సహాయచర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం
 
CM jagan responds on train collision in Vijayanagaram district

విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొని ముగ్గురు మృతి చెందిన సంఘటనపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొత్తవలస మండలంలో రైలు ప్రమాదం జరిగిన తీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సహాయచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్దేశించారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుంచి సంఘటన స్థలి వద్దకు వీలైనన్ని అంబులెన్స్ లు పంపించాలని స్పష్టం చేశారు. ఘటన స్థలికి సమీపంలోని ఆసుపత్రుల్లో క్షతగాత్రులకు వైద్యం అందించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.

Posted
36 minutes ago, JackSeal said:

Monnane bihar lo aeindhi something wrong with railways

Workers are lazy ... 

 

Efficient workers retire ayyaru... 

 

Lazy and reserved workers in top.. 

 

 

  • Upvote 2
Posted
4 hours ago, johnydanylee said:

Aaagi unna train ni dash ivvatam ento :3D_Smiles:

Signaling system 

Posted

Rail Accident: విజయనగరం రైలు ప్రమాదంలో 14కు పెరిగిన మృతుల సంఖ్య 

30-10-2023 Mon 06:46 | Andhra
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
  • వందల సంఖ్యలో క్షతగాత్రులు
  • అర్ధరాత్రి వరకు 10 మృతదేహాల వెలికితీత
  • రాయగడ రైలులోని లోకోపైలట్లు ఇద్దరూ మృతి
 
Death toll increase to 14 in vizjanagram rail accident

విజయనగరం జిల్లాలో గతరాత్రి జరగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 14కు పెరిగింది. కంటకాపల్లి-అలమండ మధ్య నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో ముందు వెళ్తున్నవిశాఖపట్టణం-పలాస (08532) రైలును వెనక నుంచి వచ్చిన విశాఖ-రాయగఢ (08504) రైలు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మూడు బోగీలు నుజ్జునుజ్జయ్యాయ. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నా వారి సంఖ్య వందకుపైనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంలో రాయగడ రైలు బోగీలు నుజ్జయ్యాయి. మరో ట్రాక్‌పై ఉన్న గూడ్సురైలు బోగీలపై దూసుకెళ్లాయి.

రైళ్ల ఢీ ఘటనతో ఒక్కసారిగా అక్కడ భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులు రైలు దిగి భయంతో పరుగులు తీశారు. చిమ్మచీకటిగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. సిగ్నల్ కోసం వేచివున్నపలాస ప్యాసింజర్ రైలును వెనక నుంచి వేగంగా వచ్చిన రాయగడ రైలు ఢీకొట్టినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన బాలేశ్వర్ రైలు ప్రమాద ఘటనను ఇది తలపించింది.

రెండు ప్యాసింజర్ రైళ్లు, గూడ్సు రైలులో కలిపి మొత్తం ఏడు బోగీలు నుజ్జయ్యాయి. రాయగడ రైలులోని దివ్యాంగుల బోగీ పట్టాలు తప్పి పొలాల్లో పడింది. రెండు ప్యాసింజర్ రైళ్లలోనూ కలిపి దాదాపు 1400 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య 40 నుంచి 50 వరకు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు 10 మృతదేహాలను వెలికి తీశారు. మృతులను విజయనగరం జిల్లా జామి మండలం గుడికొమ్ముకు చెందిన కె.రవితోపాటు గరివిడి మండలం కాపుశంభం గ్రామానికి చెందిన పెరుమజ్జి గౌరినాయుడు, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మంలం ఎస్ఆర్ పురానికి చెందన గిడిజాల లక్ష్మి (40)గా గుర్తించారు. అలాగే, పలాస రైలులోని వెనక బోగీలో ఉన్న గార్డు ఎంఎస్ రావు, రాయగడ రైలు లోకో పైలట్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

Posted

Viziangararam Rail Accident: విజయనగరం రైలు ప్రమాదం.. నేడు పలు రైళ్ల రద్దు 

30-10-2023 Mon 07:12 | Andhra
  • విశాఖ-పలాస మార్గంలో పలు రైళ్లను రద్దు చేసిన రైల్వే
  • ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
  • ఎక్స్‌గ్రేషియా ప్రకటన
  • మృతులకు రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షలు ప్రకటించిన ఏపీ సీఎం జగన్
 
Some Trains Cancelled Due To Viziangaram Train Accident

విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు పలు రైళ్లు రద్దయ్యాయి. కోర్బా-విశాఖపట్టణం, పారాదీప్-విశాఖపట్టణం, పలాస-విశాఖపట్టణం, విశాఖపట్టణం-గుణుపూర్, గుణుపూర్-విశాఖపట్టణం, విజయనగరం-విశాఖపట్టణం రైళ్లు రద్దయ్యాయి.

విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు ఏపీ సీఎం జగన్‌‌మోహన్‌రెడ్డి ఏపీ మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. ఇతర రాష్ట్రాల మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...