psycopk Posted October 30, 2023 Report Posted October 30, 2023 Chandrababu: చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తి... రేపు తీర్పు 30-10-2023 Mon 16:19 | Andhra స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ ముగిసిన వాదనలు... తీర్పు రిజర్వ్ లో ఉంచిన న్యాయమూర్తి స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ లో ఉంచింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును రేపు (అక్టోబరు 31) వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అంతేకాకుండా, చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు ఎప్పుడనేది రేపు నిర్ణయిస్తామని చెప్పారు. చంద్రబాబు తరఫున న్యాయవాదులు మధ్యాహ్నం వరకు వాదనలు వినిపించగా, మధ్యాహ్నం తర్వాత ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. Quote
psycopk Posted October 30, 2023 Author Report Posted October 30, 2023 Nara Bhuvaneswari: చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఆయన చేసిన అద్భుతాలు బయటికి వచ్చాయి: నారా భువనేశ్వరి 30-10-2023 Mon 15:03 | Andhra హైదరాబాదులో గతరాత్రి సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ఈ కార్యక్రమం అందరి మనసులు తడిమిందన్న నారా భువనేశ్వరి తెలుగు ప్రజల హృదయాలను కదిలించిందని వెల్లడి హైదరాబాదులో గత రాత్రి జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ తెలుగు ప్రజల హృదయాలను కదిలించిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమం అందరి మనసులను తడిమిందని పేర్కొన్నారు. ఒక నేత పాలనలో, పాలసీలతో లబ్దిపొందిన వర్గాలు ఇలా కృతజ్ఞత తెలిపేందుకు వేలాదిగా తరలి రావడం నేటి రాజకీయాల్లో అత్యంత అరుదైన విషయం అని భువనేశ్వరి వివరించారు. ఒక నాయకుడిగా చంద్రబాబు గారికి ఇంతకంటే ఇంకేం కావాలని పేర్కొన్నారు. "ఎవరినైనా అరెస్ట్ చేస్తే వారి అక్రమాలు బయటికి వస్తాయి. కానీ చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఆయన చేసిన అద్భుతాలు బయటికి వచ్చాయి" అని వివరించారు. చంద్రబాబు గారిని జైల్లో పెట్టాం అని కొందరు ఆనందపడుతున్నారు... కానీ ఆయన కోట్ల మంది హృదయాల్లో ఉన్నారని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. వెలకట్టలేని మీ కృతజ్ఞతలకు అభివందనాలు అంటూ ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. 1 Quote
psycopk Posted October 30, 2023 Author Report Posted October 30, 2023 Telugudesam: కృతజ్ఞతా కచేరి మా హృదయాలను ఉప్పొంగించింది: నారా బ్రాహ్మణి 30-10-2023 Mon 18:27 | Andhra చంద్రబాబు 52 రోజులపాటు బయట లేకున్నా ప్రజలను ఏకం చేసిన తీరు ఆశ్చర్యం రోజు గడిచే కొద్దీ చంద్రబాబుకు మద్ధతు రెట్టింపు అవుతోందని వ్యాఖ్య గచ్చిబౌలి ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’పై బ్రాహ్మణి ట్వీట్ చంద్రబాబు నాయుడి కోసం గచ్చిబౌలిలో నిర్వహించిన ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’ నిజంగా తమ హృదయాలను ఉప్పొంగించిందని ఆయన కోడలు, నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి వ్యాఖ్యానించారు. చంద్రబాబు లాంటి ఒక రాజనీతిజ్ఞుడు మాత్రమే ఈ విధంగా తెలుగు సమాజాన్ని హృదయపూర్వకంగా స్పందింపజేయగలిగారని ఆమె కొనియాడారు. 52 రోజులపాటు ఆయన బయటలేకున్నా ప్రజలను ఏకం చేసిన తీరుకు ఆశ్చర్యపోవాల్సిందేనని అన్నారు. గడిచే ప్రతి రోజూ చంద్రబాబు మద్ధతును రెట్టింపు చేస్తున్నట్టుగా ఉందని బ్రాహ్మణి అన్నారు. నిజాయతీగా, ముక్కుసూటిగా వ్యవహరించే రాజనీతిజ్ఞుడి ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు ఎంత ప్రయత్నించినా సత్యం ఏంటో ప్రజలకు తెలుసునని, వాళ్లంతా చంద్రబాబు పక్షాన బలంగా నిలబడతారని ఆమె ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం జరిగిన ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’పై ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. ఇదివుండగా సైబర్టవర్స్ నిర్మాణం జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ‘తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్’ ఆధ్వర్యంలో ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’ జరిగింది. ఈ ఈవెంట్లో చంద్రబాబు అభిమానులు, ఐటీ ఉద్యోగులు, గ్రేటర్ హైదరాబాద్లోని పలుప్రాంతాలవారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Quote
psycopk Posted October 30, 2023 Author Report Posted October 30, 2023 Chandrababu: చంద్రబాబుపై మరో కేసు నమోదు చేసిన ఏపీ ప్రభుత్వం 30-10-2023 Mon 19:07 | Andhra ఇప్పటికే మూడు కేసులు ఎదుర్కొంటున్న చంద్రబాబు మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని తాజా ఆరోపణలు చంద్రబాబును ఏ3గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ విచారణకు అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు చంద్రబాబును మరోసారి అరెస్ట్ చేసే అవకాశం ఇప్పటికే పలు కేసుల్లో సతమతమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం మరో కేసు నమోదు చేసింది. సీఎంగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. చంద్రబాబు ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ప్రస్తుతం స్కిల్ కేసుకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మద్యం అనుమతుల కేసులో ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో, చంద్రబాబును మరోసారి అరెస్ట్ చేసేందుకు సీఐడీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. Quote
psycopk Posted October 30, 2023 Author Report Posted October 30, 2023 Chandrababu: చంద్రబాబు రెండో కంటికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంది: హైకోర్టుకు తెలిపిన న్యాయవాదులు 30-10-2023 Mon 15:38 | Andhra స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు నేడు వాదనలు వింటున్న న్యాయస్థానం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో వాదనలు చేపట్టారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫున ఆయన న్యాయవాదులు వాదనలు వినిపించారు. చంద్రబాబు రెండో కంటికి శస్త్రచికిత్స చేయాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ కేసులో చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా వర్చువల్ గా వాదనలు వినిపించారు. ఆయన వాదనలు ఉదయమే ముగిశాయి. లూథ్రా కూడా చంద్రబాబు ఆరోగ్యపరమైన అంశాలపైనే వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు పూర్తి కాగా, కాసేపట్లో మధ్యాహ్న భోజన విరామానంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించనున్నారు. అటు, చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు సమయం కావాలని అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టును కోరారు. పొన్నవోలు విజ్ఞప్తి నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు రేపటికి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. Quote
pirangi Posted October 30, 2023 Report Posted October 30, 2023 No bail.. will celebrate Diwali in jail.. thoti khaidi lu tapasulu kooda techaranta baboriki..paamu billalu kaakara poolu chichu buddilu Quote
perugu_vada Posted October 30, 2023 Report Posted October 30, 2023 match aipoyaka ostha e thread ki .. plz paathaalam lo ki thokkakandi till then .. lift chesthuune undandi e thread ni jaffas president of AFDB @csrcsr ki e thread kanipinchakunda hide ayye option unte enable cheyandi plz Quote
lokesh_rjy Posted October 30, 2023 Report Posted October 30, 2023 Just now, perugu_vada said: match aipoyaka ostha e thread ki .. plz paathaalam lo ki thokkakandi .. jaffas president of AFDB @csrcsr ki e thread kanipinchakunda hide ayye option unte enable cheyandi plz OK Anna match ayyaka lepudam thread ni Quote
Vaaaampire Posted October 30, 2023 Report Posted October 30, 2023 1 hour ago, psycopk said: Nara Bhuvaneswari: చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఆయన చేసిన అద్భుతాలు బయటికి వచ్చాయి: నారా భువనేశ్వరి 30-10-2023 Mon 15:03 | Andhra హైదరాబాదులో గతరాత్రి సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ఈ కార్యక్రమం అందరి మనసులు తడిమిందన్న నారా భువనేశ్వరి తెలుగు ప్రజల హృదయాలను కదిలించిందని వెల్లడి హైదరాబాదులో గత రాత్రి జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ తెలుగు ప్రజల హృదయాలను కదిలించిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమం అందరి మనసులను తడిమిందని పేర్కొన్నారు. ఒక నేత పాలనలో, పాలసీలతో లబ్దిపొందిన వర్గాలు ఇలా కృతజ్ఞత తెలిపేందుకు వేలాదిగా తరలి రావడం నేటి రాజకీయాల్లో అత్యంత అరుదైన విషయం అని భువనేశ్వరి వివరించారు. ఒక నాయకుడిగా చంద్రబాబు గారికి ఇంతకంటే ఇంకేం కావాలని పేర్కొన్నారు. "ఎవరినైనా అరెస్ట్ చేస్తే వారి అక్రమాలు బయటికి వస్తాయి. కానీ చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే ఆయన చేసిన అద్భుతాలు బయటికి వచ్చాయి" అని వివరించారు. చంద్రబాబు గారిని జైల్లో పెట్టాం అని కొందరు ఆనందపడుతున్నారు... కానీ ఆయన కోట్ల మంది హృదయాల్లో ఉన్నారని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. వెలకట్టలేని మీ కృతజ్ఞతలకు అభివందనాలు అంటూ ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. Agreed buvi aunty. Rajamandry jail cbn 1800’s lo kattaru ani advutam telisindi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.