Jump to content

Jaffas feeling purandeswari heat


Recommended Posts

Posted

Paytm kukkalaki script ichi vadilaru

Posani Krishna Murali: చెప్పండి పురందేశ్వరి మేడమ్... మీరెందుకు ఈ లేఖ రాశారు?: పోసాని 

07-11-2023 Tue 20:18 | Andhra
  • జగన్, విజయసాయిలపై సీజేఐకి లేఖ రాసిన పురందేశ్వరి
  • నిప్పులు చెరుగుతున్న వైసీపీ నేతలు
  • పురందేశ్వరిపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు
  • పురందేశ్వరి మేకవన్నె పులి అంటూ పోసాని ఫైర్ 
 
Posani Krishna Murali take a dig at Purandeswari

సీఎం జగన్ పై ఉన్న కేసులను తిరగదోడాలని, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి సుప్రీంకోర్టుకు సీజేఐకి లేఖ రాయడం వైసీపీ నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. పురందేశ్వరిని లక్ష్యంగా చేసుకుని వారు తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. తాజాగా, ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి కూడా పురందేశ్వరిపై ధ్వజమెత్తారు. పురందేశ్వరి ఒక మేకవన్నె పులి అని విమర్శించారు. 

"పురందేశ్వరి గారూ... మీరు మేకవన్నె పులి. ఉన్నాడు కదా... మీ మరిది... అతగాడేమో ఒక మగ వగలాడి! మీరు నన్ను తిట్టండి, కొట్టండి, చంపండి... మా కమ్మ వాళ్లకు చెబుతున్నా, మా కాపు సోదరులకు చెబుతున్నా. ఇలాంటి దుర్మార్గులైన రాజకీయ నాయకులను మీరు నమ్మకండి. ఈవిడ (పురందేశ్వరి) కోర్టులను తప్పుదోవ పట్టించి పెద్ద నీతిమంతురాలి లాగా, పెద్ద పుడింగి లాగా మాట్లాడుతోంది. 

అయ్యో చీఫ్ జస్టిస్ గారూ... వీళ్లిద్దరూ బయట ఉంటే భారతదేశం నాశనమైపోతోంది, సమాజం అల్లకల్లోలమైపోతోంది అంటూ గగ్గోలు పెట్టారు. ఎందుకంటే... జగన్ బయటుంటే మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారు... నా మరిది ముఖ్యమంత్రి కాలేడు... నా మరిది ముఖ్యమంత్రి అయితే నేను ఎంపీగా గెలవొచ్చు... కేంద్రంలో ఎవరున్నా సరే కేంద్రమంత్రి అవ్వొచ్చు... పురందేశ్వరి ఆలోచన ఇదే. బాబు అంటే అంత నమ్మకం ఆమెకు. 

చెప్పండి పురందేశ్వరి మేడమ్... ఎందుకు లెటర్ రాశారు మీరు? ఇలాంటి లెటర్లు ఎవరు రాయాలి? నిజమైన సామాజిక కార్యకర్త, ఉత్తముడు, భారతదేశాన్ని ప్రేమించేవాళ్లు, న్యాయస్థానాన్ని ప్రేమించేవాళ్లు, న్యాయవ్యవస్థ వర్ధిల్లాలి అని కోరుకునేవాళ్లు ఇలాంటి లేఖలు రాయాలి. కానీ మీరెందుకు రాశారు? 

జగన్ గారు మీ మరిదిలాగా అవినీతి చేసి ఆధారాలతో సహా దొరికిపోయి జైలుకు వెళ్లలేదు. ఆ రోజు నీ తమ్ముడి కోసం నువ్వు ఎలా న్యాయస్థానం విలువలు నాశనం చేశావో, బాబు కూడా అంతే. న్యాయస్థానం విలువలను నాశనం చేసి, తప్పుదోవ పట్టించి జగన్ పై అవినీతి ముద్ర వేసి జైల్లో పెట్టించాడు" అంటూ పోసాని పేర్కొన్నారు.

Posted

Visa reddy tittadu makes sense , why this pichi Posanj gadu kuda tidutunadu 

Posted
2 minutes ago, pandemkodi said:

Visa reddy tittadu makes sense , why this pichi Posanj gadu kuda tidutunadu 

Paytm Dogs no logics

Posted
29 minutes ago, pandemkodi said:

Visa reddy tittadu makes sense , why this pichi Posanj gadu kuda tidutunadu 

Ysrcp spokesperson ... Paytm gaadu.. like RGV...

Posted

Vijay Sai Reddy: ఆ ఆధారాలేవో సీఐడీకి ఇవ్వొచ్చుగా.. పురందేశ్వరిని కోరిన విజయసాయిరెడ్డి 

12-11-2023 Sun 12:28 | Andhra
  • పురందేశ్వరి టార్గెట్‌గా విజయసాయి విమర్శనాస్త్రాలు
  • లిక్కర్ స్కాంలో తన వద్దనున్న ఆధారాలను సీఐడీకి ఇవ్వాలని సూచన
  • సాక్షిగా వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్న వైసీపీ నేత
 
Vijaya Sai Reddy Once Again X Against Purandeswari

ఇటీవలి కాలంలో బీజేపీ నేత పురందేశ్వరిని టార్గెట్ చేసుకున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తరచూ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ద్వారా విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యక్తిగతంగానూ ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. కన్నతండ్రికి కూడా ముద్ద పెట్టలేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. 8 ఏళ్లు కేంద్రమంత్రిగా పనిచేసిన ఆమెకు డబ్బు వ్యామోహం తప్ప మరోటి లేదని తూర్పారబట్టారు. మరీ ముఖ్యంగా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ అయిన తర్వాత పురందేశ్వరిని విజయసాయి లక్ష్యంగా చేసుకున్నారు.

తాజాగా మరోమారు పురందేశ్వరిపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏ-3గా నమోదైన లిక్కర్ కుంభకోణం కేసులో తన వద్ద ఆధారాలు ఉన్నాయంటున్న పురందేశ్వరి వాటిని సీఐడీకి అందజేయాలని సూచించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు సమాచారంతో తమపై నిందలు వేయడం సరికాదన్నారు. వాస్తవాలు బయటపడాలంటే సాక్షిగా తన వాంగ్మూలం ఇచ్చి నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోరారు.

Posted

Vijayasai Reddy: అసలు అక్కడ పురందేశ్వరికి ఓటు ఉందా?: విజయసాయిరెడ్డి 

14-11-2023 Tue 12:19 | Andhra
  • పురందేశ్వరిని మరోసారి టార్గెట్ చేసిన విజయసాయి
  • కారంచేడు 145వ బూత్ లో బీజేపీకి 6 ఓట్లు మాత్రమే వచ్చాయని ఎద్దేవా
  • బావ పక్షపాతి అంటూ విమర్శ
 
Vijayasai Reddy comments on Purandeswari

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. కారంచేడు 145 బూత్ లో బీజేపీకి కేవలం 6 ఓట్లు మాత్రమే పడ్డాయని... అసలు అక్కడ పురందేశ్వరికి ఓటు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. మీ సొంత బీజేపీ అభ్యర్థికి రాష్ట్ర అధ్యక్షులు ఓటు వేయలేదా? అని అడిగారు. మీ బావ పక్షపాతివైన మీకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కంటగింపు అయిపోయిందని విమర్శించారు. బీజేపీలాంటి సిద్ధాంతాలు ఉన్న పార్టీలో... సిద్ధాంతాలను గాలికి వదిలేసే మీరు ఎన్ని రోజులు ఉంటారని ప్రశ్నించారు. గట్టిగా మాట్లాడితే... మా ఓటు అక్కడ లేదు, వైజాగ్ లోనో రాజంపేటలోనే ఉండిపోయిందని బొంకుతారని ఎద్దేవా చేశారు. 

Posted

lol tdp fans has become so dumb 

pushpams child jaggad ani telisi kooda whats this drama

Posted

Vijayasai Reddy: అది సరే... పార్టీలో లోకేశ్, భువనేశ్వరి గారు అందరూ ఏమయ్యారు?: విజయసాయిరెడ్డి 

19-11-2023 Sun 14:30 | Andhra
  • సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
  • టీడీపీ పనైపోయిందా ఏంటి అంటూ వ్యంగ్యం
  • టీడీపీ భారమంతా పురందేశ్వరిపైనే పెట్టారా? అంటూ వ్యాఖ్యలు
 
Vijayasai Reddy comments on TDP

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అనారోగ్యం, బెయిల్ షరతులు సరే... పార్టీలో లోకేశ్, భువనేశ్వరి గారు అందరూ ఏమయ్యారు? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా? తెలంగాణ తరహాలోనే ఆంధ్రాలో కూడా టీడీపీ జెండా పీకేశారా? లేక, టీడీపీ భారమంతా పురందేశ్వరిపైనే పెట్టారా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఆమె సొంత పార్టీ బీజేపీని ముంచడంలో దిట్ట కావొచ్చేమో కానీ, బావ గారి పార్టీ టీడీపీని బతికించడంలో దిట్ట కాదు సుమా! అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

  • Haha 1
Posted
2 hours ago, psycopk said:

Vijayasai Reddy: అది సరే... పార్టీలో లోకేశ్, భువనేశ్వరి గారు అందరూ ఏమయ్యారు?: విజయసాయిరెడ్డి 

19-11-2023 Sun 14:30 | Andhra
  • సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
  • టీడీపీ పనైపోయిందా ఏంటి అంటూ వ్యంగ్యం
  • టీడీపీ భారమంతా పురందేశ్వరిపైనే పెట్టారా? అంటూ వ్యాఖ్యలు
 
Vijayasai Reddy comments on TDP

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు అనారోగ్యం, బెయిల్ షరతులు సరే... పార్టీలో లోకేశ్, భువనేశ్వరి గారు అందరూ ఏమయ్యారు? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా? తెలంగాణ తరహాలోనే ఆంధ్రాలో కూడా టీడీపీ జెండా పీకేశారా? లేక, టీడీపీ భారమంతా పురందేశ్వరిపైనే పెట్టారా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఆమె సొంత పార్టీ బీజేపీని ముంచడంలో దిట్ట కావొచ్చేమో కానీ, బావ గారి పార్టీ టీడీపీని బతికించడంలో దిట్ట కాదు సుమా! అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.

Everyone watching cricket and you as always widow crying continue anna..

  • Haha 2
  • 2 weeks later...
Posted

Daggubati Purandeswari: నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తతపై పురందేశ్వరి ఫైర్.. ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేందుకేనని వ్యాఖ్య 

30-11-2023 Thu 12:36 | Both States
  • ఎన్నికల వేళ నీటి ఆలోచన రావడం ఓట్లకోసమేనని ఆరోపణ
  • ఇది ఘోరాతి ఘోరమని మండిపాటు
  • 400 మండలాల కరవును 100 మండలాలకే పరిమితం చేశారని ఆగ్రహం
 
AP BJP Chief Purandeswari Fires On Naragarjuna Sagar Issue
Listen to the audio version of this article

నాగార్జున సాగర్ డ్యామ్‌ను గత అర్ధరాత్రి ఏపీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకోవడం, తదనంతర పరిణామాలతో ఉద్రిక్తత నెలకొనడంపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ నీటి ఆలోచన రావడం ఓట్లకోసమేనని ఆరోపించారు. ఇది ఘోరాతి ఘోరమని మండిపడ్డారు. 

ఇది రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టే ఘటన తప్ప మరోటి కాదన్నారు. నాలుగు వందల మండలాల్లో కరవు ఉంటే వంద మండలాలకే దానిని పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరవు గురించి అధికారులు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. వ్యవసాయశాఖ మంత్రి ఎవరో తెలియక ప్రజలు ఆయన కోసం వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఈ ఘటనపై విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న వేళ ఓట్ల కోసం వేసిన ఎత్తుగడ తప్ప మరోటి కాదని ఆరోపించారు.

Posted

Vijayasai Reddy: మరోసారి చంద్రబాబు, పురందేశ్వరిలపై విజయసాయి విమర్శలు 

30-11-2023 Thu 14:39 | Andhra
  • అప్పట్లో సుబ్బరామిరెడ్డి ఇంటికి ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి భోజనానికి వెళ్లారన్న విజయసాయి
  • టీడీపీని కాంగ్రెస్ లో కలిపేస్తున్నారంటూ చంద్రబాబు, పురందేశ్వరి ప్రచారం చేశారని వెల్లడి
  • పీవీకి ఎన్టీఆర్ అనుకూలంగా మాట్లాడితేనే తట్టుకోలేకపోయారని విమర్శలు
 
Vijayasai slams Chandrababu and Purandeswari
Listen to the audio version of this article

టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు.

అప్పట్లో కేవలం సుబ్బరామిరెడ్డి ఇంటికి ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి భోజనానికి వెళితేనే టీడీపీని కాంగ్రెస్ లో కలిపేస్తున్నారంటూ చంద్రబాబు, పురందేశ్వరి ప్రచారం చేశారని విజయసాయి వెల్లడించారు. తెలుగువాడన్న ఉద్దేశంతో పీవీ నరసింహారావుకు ఎన్టీఆర్ అనుకూలంగా మాట్లాడితే తట్టుకోలేకపోయారని తెలిపారు. 

మరి ఇప్పుడు తెలంగాణలోనూ, ఏపీలోనూ కాంగ్రెస్ తో మీరిద్దరూ ఎలా అంటకాగుతున్నారు బాబు, చెల్లెమ్మా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ లో కలిసిపోయారా? అంటూ ప్రశ్నించారు. అంతకన్నా బంగాళాఖాతంలో కలపడం బెటర్ కదా! అంటూ విమర్శించారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...