psycopk Posted November 18, 2023 Report Posted November 18, 2023 Amaravati: అమరావతి, పోలవరంలో నిప్పులు పోశారు: రఘురామకృష్ణరాజు 18-11-2023 Sat 07:10 | Andhra అమరావతి, పోలవరం ప్రాజెక్టులను చూస్తే బాధ కలుగుతోందని వ్యాఖ్య చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్‌కు ధీటుగా అమరావతిని నిర్మిస్తారని ఆశాభావం హైదరాబాద్‌లో జరిగిన‘సీబీఎన్ విజన్-2047 ఫోరం’ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్ట్‌లో నిప్పులు పోశారని, ఈ రెండింటిని చూస్తే ఎంతో బాధ కలుగుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే హైదరాబాద్‌కు ధీటుగా అమరావతిని అభివృద్ధి చేయగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు లాంటి దూరదృష్టి ఉన్న నాయకుడికి ఈసారి పట్టాభిషేకం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ఏపీకి రెండోసారి సీఎం అయి ఉంటే రాజధాని అమరావతి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేవారని అన్నారు. చంద్రబాబుపై అభిమానంతో పలువురు మహిళలు ‘సీబీఎన్ విజన్-2047 ఫోరం’ ఏర్పాటు చేశారు. ఈ ఫోరం ప్రారంభోత్సవం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని కొండాపూర్‌లో జరిగింది. మినర్వా హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురామకృష్ణరాజుతోపాటు పలువురు హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్రతోపాటు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, మాజీ ఎంపీ మాగంటి బాబు, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాంతోపాటు పలువురు పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలుగు మహిళలంతా అండగా ఉన్నారని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు. చంద్రబాబు కోసం ఒక ఫోరం ఏర్పాటుచేసి దాని ద్వారా ఆయన ఆలోచనలను జనాలకు వెల్లడించడం గొప్ప విషయమని కొల్లు రవీంద్ర అన్నారు. ‘సీబీఎన్ విజన్-2047 ఫోరం’ ఏర్పాటు చేసిన మహిళలను ఆయన అభినందించారు. Quote
psycopk Posted November 18, 2023 Author Report Posted November 18, 2023 CBN Vision-2047: హైదరాబాదులో సీబీఎన్ విజన్-2047 ఫోరం ఆవిష్కరణ 17-11-2023 Fri 22:10 | Andhra ఇటీవల విజన్-2047 ప్రకటించిన చంద్రబాబు హైదరాబాదులోని మినర్వా గ్రౌండ్స్ లో కార్యక్రమం హాజరైన కొల్లు రవీంద్ర, రఘురామ, ఉండవల్లి శ్రీదేవి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇటీవల విజన్-2047 ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, హైదరాబాదులో సీబీఎన్ విజన్-2047 ఫోరంను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కొండాపూర్ లోని మినర్వా గ్రౌండ్ లో జరిగింది. టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, దేశంలో మరే నాయకుడు ఆలోచించని విధంగా చంద్రబాబు విజన్-2047కి రూపకల్పన చేశారని కొనియాడారు. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవడం దురదృష్టకరమని, టీడీపీ అధికారంలో ఉండుంటే ఏపీ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం అయ్యేదని అన్నారు. చంద్రబాబు ఎంతో దార్శనికతతో నదుల అనుసంధానం చేపట్టారని వెల్లడించారు. ఏపీ ప్రజలు మరోసారి తప్పు చేయకుండా, రాష్ట్రాన్ని కాపాడుకోవడాలని కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ, చంద్రబాబు గతంలో విజన్-2020 పేరుతో యావత్ ప్రపంచం దృష్టిని ఏపీ వైపు తిప్పారని కొనియాడారు. చంద్రబాబుకు తెలుగు మహిళలంతా అండగా ఉన్నారని తెలిపారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.