Jump to content

Bjp manifesto... Elagu gelavam anduke emi ivam

Recommended Posts

Posted

Amit Shah: అమిత్ షా విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టో వివరాలివిగో 

18-11-2023 Sat 19:45 | Telangana
  • సకల జనుల సౌభాగ్య తెలంగాణ 'మన మోదీ గ్యారెంటీ... బీజేపీ భరోసా' పేరుతో విడుదల 
  • ప్రజలందరికీ సుపరిపాలన - సమర్థవంతమైన పాలన
  • రైతే రాజు... అందరికీ ఆహార భద్రత... నారీ శక్తి సహా పలు అంశాలు
  • సరికొత్త విద్యాశ్రీ, వైద్యశ్రీ
  • అధికారికంగా తెలంగాణ విమోచన దినం
 
Amit Shah releases bjp manifesto today

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం హైదరాబాద్‌లోని హోటల్ కత్రియా టవర్స్‌లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సకల జనుల సౌభాగ్య పేరుతో ఈ ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ ప్రధాని నరేంద్రమోదీ గ్యారెంటీ ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు బాగా అమలవుతాయన్నారు. గతంలో వాజ్‌పేయి మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. చిన్న రాష్ట్రాలకు బీజేపీ అనుకూలమన్నారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఇచ్చామన్నారు. తెలుగు రాష్ట్రాలకు మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కేటాయించామన్నారు.

10 అంశాలు కలిగిన... సకల జనుల సౌభాగ్య తెలంగాణ 'మన మోదీ గ్యారెంటీ... బీజేపీ భరోసా' పేరుతో విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు... 

1. ప్రజలందరికీ సుపరిపాలన - సమర్థవంతమైన పాలన
- అవినీతిని ఉక్కుపాదంతో అణచివేయడం - ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ నినాదంతో సుపరిపాలన
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్లుగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించి పెట్రో ఉత్పత్తుల ధరల తగ్గింపు
- ధరణి వ్యవస్థ స్థానంలో పారదర్శకమైన 'మీ భూమి' వ్యవస్థను తీసుకు వస్తాం
- కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నోడల్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు
- తెలంగాణ గల్ఫ్ నివాసితుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు
2. వెనుకబడిన వర్గాల సాధికారత - అందరికీ సమానంగా చట్టం వర్తింపు
3. కూడు, గుడు - ఆహార భద్రత, నివాసం
4. రైతే రాజు - అన్నదాతలకు అందలం. విత్తనాల కొనుగోలుకు రూ.2500 ఇన్‌పుట్ అసిస్టెన్స్
5. నారీ శక్తి - మహిళల నేతృత్వంలో అభివృద్ధి. మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పోరేషన్. మహిళలకు 10 లక్షల వరకు ఉద్యోగాలు
6. యువ శక్తి - యూపీఎస్సీ తరహాలో గ్రూప్ 1, గ్రూప్ 2 నిర్వహణ. ఈడబ్ల్యుఎస్ కోటాతో సహా అన్ని నియామకాలు ఆరు నెలల్లో పూర్తి.
7. విద్యాశ్రీ - నాణ్యమైన విద్య. మండల కేంద్రాల్లో నోడల్ స్కూళ్ల ఏర్పాటు అన్ని ప్రయివేటు స్కూళ్ళలో ఫీజుల విధానంపై పర్యవేక్షణ. 
8. వైద్యశ్రీ - నాణ్యమైన వైద్య సంరక్షణ. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రయివేటు ఆసుపత్రిల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం. జిల్లాస్థాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రోత్సాహం.
9. సమ్మిళిత అభివృద్ధి - పరిశ్రమలు, మౌలికవసతులు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రీయింబర్సుమెంట్స్.
10. వారసత్వం - సంస్కృతి, చరిత్ర. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినం. జాతీయస్థాయిలో సమ్మక్క - సారక్క జాతర ఉత్సవాలు. వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్ర. ఉమ్మడి పౌర స్మృతి కోసం కమిటీ ఏర్పాటు. బైరాన్ పల్లి, పరకాల ఊచకోతలను స్మరించుకుంటూ అగస్ట్ 27న రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినం.
- బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేయడం 
- ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితం 

Posted

Same sollu eedu MIM....MIm vadu vedidi patuku ennalu veladataru ra sannasulara

Amit Shah: బీఆర్ఎస్ గుర్తు కారు... స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది: వరంగల్ సభలో అమిత్ షా 

18-11-2023 Sat 18:26 | Telangana
  • ఈ ఎన్నికలు భారత్, తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్న అమిత్ షా
  • బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్.. లంచగొండి రాష్ట్ర సమితి అని విమర్శలు
  • అన్నింటా అవినీతి జరిగిందన్న అమిత్ షా
 
Amit Shah public meeting in Hyderabad

బీఆర్ఎస్‌కు వీఆర్ఎస్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధమయ్యారని కేంద్ర హోంశాఖమంత్రి, బీజేపీ నేత అమిత్ షా అన్నారు. వరంగల్‌లో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓరుగల్లు కాకతీయుల రాజధాని... ఇలాంటి గడ్డపై అందరికీ నమస్కరిస్తూ సభను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. భద్రకాళీ దేవాలయం, వేయి స్తంభాల గుడి, మల్లన్న దేవాలయం, రామప్ప దేవాలయం, కొలనుపాక జైనమందిరం... ఇవన్నీ తెలంగాణ వారసత్వానికి ప్రతీక అన్నారు. 

మీరు వేసే ఓటు భారత ప్రజల భవిష్యత్తును, తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. సర్‌ప్లస్‌లో ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. తెలంగాణను కేసీఆర్ అవినీతిమయంగా మార్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ లంచగొండి సమితి అన్నారు. మియాపూర్ భూముల కుంభకోణంలో రూ.4వేల కోట్ల దోపిడీ జరిగిందని, కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద కుంభకోణం జరిగిందన్నారు. మిషన్ కాకతీయలో రూ.22వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం చేసిన కుంభకోణాలు చెప్పడానికి వారం రోజులు కూడా సరిపోదన్నారు. తెలంగాణలో మద్యాన్ని వరదగా పారిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ప్రభుత్వం బుజ్జగింపు చర్యలకు, సంతుష్టీకరణ చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ విమోచన దినాన్ని కూడా నిర్వహించడం లేదన్నారు. మతోన్మాద రాజకీయంతో మజ్లిస్ పార్టీకి తలొగ్గిందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పుణ్యమా అని హైదరాబాద్... భారత్‌లో కలిసిందని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఓవైసీ ఒత్తిడికి లొంగి కేసీఆర్... రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తున్నారని ఆరోపించారు.

భద్రాచలం శ్రీరాములవారికి సమర్పించాల్సిన పట్టువస్త్రాలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్పించడం లేదన్నారు. బీఆర్ఎస్ గుర్తు కారు అని.. కానీ ఈ కారు స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందన్నారు. ప్రభుత్వాన్ని ఓవైసీ నడిపిస్తున్నారన్నారు. కేసీఆర్ యువతకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా యువత ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇస్తే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ప్రవళిక వంటి యువత ఆత్మహత్యలు జరగకుండా చూస్తామన్నారు. అత్యంత అవినీతిమయ ప్రభుత్వం కేసీఆర్‌దే అన్నారు. కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో ఉమ్మడి ఏపీకి రూ.2 లక్షల కోట్లు ఇస్తే, మోదీ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు. దీనిని ప్రజలు ఆలోచించాలన్నారు. ఎంజీఎం ఆసుపత్రిని పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఎంజీఎంకు రూ.1000 కోట్లు ఇస్తుందన్నారు.

70 ఏళ్లుగా కాంగ్రెస్ రామమందిర నిర్మాణాన్ని అడ్డుకుందని, బీజేపీ మందిరాన్ని నిర్మిస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే  మీ అందరికీ ఉచితంగా అయోధ్య శ్రీరాములవారి దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. బీజేపీ అభ్యర్థులందరినీ గెలిపిస్తే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ దళిత ముఖ్యమంత్రి హామీని నెరవేర్చలేదన్నారు.

  • 2 months later...
Posted
On 11/18/2023 at 10:32 AM, psycopk said:

Amit Shah: అమిత్ షా విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టో వివరాలివిగో 

18-11-2023 Sat 19:45 | Telangana
  • సకల జనుల సౌభాగ్య తెలంగాణ 'మన మోదీ గ్యారెంటీ... బీజేపీ భరోసా' పేరుతో విడుదల 
  • ప్రజలందరికీ సుపరిపాలన - సమర్థవంతమైన పాలన
  • రైతే రాజు... అందరికీ ఆహార భద్రత... నారీ శక్తి సహా పలు అంశాలు
  • సరికొత్త విద్యాశ్రీ, వైద్యశ్రీ
  • అధికారికంగా తెలంగాణ విమోచన దినం
 
Amit Shah releases bjp manifesto today

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం హైదరాబాద్‌లోని హోటల్ కత్రియా టవర్స్‌లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సకల జనుల సౌభాగ్య పేరుతో ఈ ఎన్నికల ప్రణాళికను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ ప్రధాని నరేంద్రమోదీ గ్యారెంటీ ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు బాగా అమలవుతాయన్నారు. గతంలో వాజ్‌పేయి మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. చిన్న రాష్ట్రాలకు బీజేపీ అనుకూలమన్నారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీ ఇచ్చామన్నారు. తెలుగు రాష్ట్రాలకు మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కేటాయించామన్నారు.

10 అంశాలు కలిగిన... సకల జనుల సౌభాగ్య తెలంగాణ 'మన మోదీ గ్యారెంటీ... బీజేపీ భరోసా' పేరుతో విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు... 

1. ప్రజలందరికీ సుపరిపాలన - సమర్థవంతమైన పాలన
- అవినీతిని ఉక్కుపాదంతో అణచివేయడం - ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా సబ్ కా సాథ్ - సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ నినాదంతో సుపరిపాలన
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్లుగా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించి పెట్రో ఉత్పత్తుల ధరల తగ్గింపు
- ధరణి వ్యవస్థ స్థానంలో పారదర్శకమైన 'మీ భూమి' వ్యవస్థను తీసుకు వస్తాం
- కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నోడల్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు
- తెలంగాణ గల్ఫ్ నివాసితుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు
2. వెనుకబడిన వర్గాల సాధికారత - అందరికీ సమానంగా చట్టం వర్తింపు
3. కూడు, గుడు - ఆహార భద్రత, నివాసం
4. రైతే రాజు - అన్నదాతలకు అందలం. విత్తనాల కొనుగోలుకు రూ.2500 ఇన్‌పుట్ అసిస్టెన్స్
5. నారీ శక్తి - మహిళల నేతృత్వంలో అభివృద్ధి. మహిళా రైతుల కోసం మహిళా రైతు కార్పోరేషన్. మహిళలకు 10 లక్షల వరకు ఉద్యోగాలు
6. యువ శక్తి - యూపీఎస్సీ తరహాలో గ్రూప్ 1, గ్రూప్ 2 నిర్వహణ. ఈడబ్ల్యుఎస్ కోటాతో సహా అన్ని నియామకాలు ఆరు నెలల్లో పూర్తి.
7. విద్యాశ్రీ - నాణ్యమైన విద్య. మండల కేంద్రాల్లో నోడల్ స్కూళ్ల ఏర్పాటు అన్ని ప్రయివేటు స్కూళ్ళలో ఫీజుల విధానంపై పర్యవేక్షణ. 
8. వైద్యశ్రీ - నాణ్యమైన వైద్య సంరక్షణ. అర్హత కలిగిన కుటుంబాలకు ప్రయివేటు ఆసుపత్రిల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం. జిల్లాస్థాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ప్రోత్సాహం.
9. సమ్మిళిత అభివృద్ధి - పరిశ్రమలు, మౌలికవసతులు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ. కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను రీయింబర్సుమెంట్స్.
10. వారసత్వం - సంస్కృతి, చరిత్ర. సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినం. జాతీయస్థాయిలో సమ్మక్క - సారక్క జాతర ఉత్సవాలు. వృద్ధులకు ఉచితంగా అయోధ్య, కాశీ యాత్ర. ఉమ్మడి పౌర స్మృతి కోసం కమిటీ ఏర్పాటు. బైరాన్ పల్లి, పరకాల ఊచకోతలను స్మరించుకుంటూ అగస్ట్ 27న రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినం.
- బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేయడం 
- ఉజ్వల లబ్ధిదారులకు ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితం 

sorry For you anna 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...