psycopk Posted November 24, 2023 Report Posted November 24, 2023 Jagan Bail: జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్.. జగన్, సీబీఐలకు సుప్రీంకోర్టు నోటీసులు 24-11-2023 Fri 12:38 | Andhra జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంలో రఘురాజు పిటిషన్ విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని విన్నపం ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా అని ప్రశ్నించిన ధర్మాసనం అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించింది. జగన్ బెయిల్ ను సీబీఐ, ఈడీ కూడా సవాల్ చేయడం లేదని రఘురాజు తరపు న్యాయవాది ధర్మాసనంకు తెలిపారు. జగన్ తోపాటు, సీబీఐ, ప్రతివాదులందరికీ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మరోవైపు విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని తన పిటిషన్ లో రఘురాజు కోరారు. దీన్ని పిటిషన్ కు జతచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా బెయిల్ ఇప్పుడే రద్దు చేయాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. తొలుత నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియను చేపట్టాలని రఘురాజు న్యాయవాది కోర్టును కోరారు. 2 Quote
ARYA Posted November 24, 2023 Report Posted November 24, 2023 ivvani jarigee panulu kaavu samara 1 Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 CPI Narayana: కేసీఆర్ కు సవాల్ విసిరిన సీపీఐ నారాయణ.. జగన్ పై తీవ్ర విమర్శలు! 24-11-2023 Fri 11:09 | Both States లిక్కర్ స్కామ్ లో కవితను తప్పించేందుకు బీజేపీతో కేసీఆర్ చేతులు కలిపారన్న నారాయణ కేసీఆర్ కు దమ్ముంటే ఓయూలో ఓట్లు అడగాలని సవాల్ కేసుల కోసం మోదీ కాళ్ల ముందు జగన్ తలవంచారని విమర్శ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన కూతురు కవితను లిక్కర్ స్కామ్ నుంచి కాపాడుకోవడానికి బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. స్కామ్ నుంచి కవితను తప్పించడానికి బీజేపీకి దాసోహమయ్యారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితను అరెస్ట్ చేయలేదని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒకటేనని చెప్పారు. కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ అయిన ఉస్మానియా యూనివర్శిటీకి వచ్చి ప్రచారం చేయాలని, ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో ఒకే దెబ్బకు మూడు పిట్టలు పడిపోతాయని... బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఓడిపోవడం ఖాయమని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఖమ్మం సీపీఐ కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. తన కేసుల కోసం ప్రధాని మోదీ కాళ్ల ముందు ఆయన తల వంచారని అన్నారు. కేంద్రం కాళ్లపై పడటం వల్లే పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని చెప్పారు. మన దేశంలో ఇంతకాలం బెయిల్ పై ఉన్న ఏకైక వ్యక్తి జగన్ మాత్రమేనని అన్నారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 5 minutes ago, ARYA said: ivvani jarigee panulu kaavu samara Ofcourse .. kani prayatnam cheyatam lo tapu ledu ga Quote
ARYA Posted November 24, 2023 Report Posted November 24, 2023 3 minutes ago, psycopk said: Ofcourse .. kani prayatnam cheyatam lo tapu ledu ga Enduku vadiki malli hype ivvtam elago potadu esari Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 1 minute ago, ARYA said: Enduku vadiki malli hype ivvtam elago potadu esari Poina pokapoina pottodu lopalike anna msg ivali kada Quote
psycopk Posted November 24, 2023 Author Report Posted November 24, 2023 Raghu Rama Krishna Raju: తప్పించుకు తిరిగేందుకు జగన్ అర్హుడైతే.. పిల్ వేసేందుకు నేను కూడా అర్హుడినే: రఘురామకృష్ణరాజు 24-11-2023 Fri 09:38 | Andhra ఏపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందని రఘురామరాజు పిటిషన్ జగన్ సహా 41 మందికి నోటీసులిచ్చిన ఏపీ హైకోర్టు పిల్ వేసేందుకు రఘురామరాజుకు అర్హత లేదన్న ఏజీ శ్రీరామ్ శ్రీరామ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్న రఘురామరాజు 11 ఛార్జ్ షీట్లలో జగన్ నిందితుడిగా ఉన్నారని వ్యాఖ్య ఏపీ ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడుతోందని, సంక్షేమ పథకాల మాటున అవకతవకలు జరుగుతున్నాయంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ముఖ్యమంత్రి జగన్ సహా 41 మందికి హైకోర్టు నోటీసులు పంపించింది. విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... పిటిషన్ వేసేందుకు రఘురాజుకు అర్హత లేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఏజీ శ్రీరామ్ పై రఘురామరాజు విమర్శలు గుప్పించారు. 11 ఛార్జ్ షీట్లలో నిందితుడైన జగన్ పదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నారని... అలాంటి జగన్ సీఎం పదవికి అర్హుడైనప్పుడు, పిల్ వేసేందుకు తాను కూడా అర్హుడినే అని అన్నారు. తనపై శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పారు. జగన్ పై సీబీఐ రూ. 43 వేల కోట్ల ఆర్థిక నేరాల అభియోగాలను నమోదు చేసిందని అన్నారు. కోర్టుకు హాజరు కాకుండా జగన్ తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. తాను వైసీపీ ఎంపీనని తప్పుడు ధ్రువీకరణపత్రం ఇచ్చినట్టు శ్రీరామ్ అన్నారని... ఇది మరింత ఆశ్చర్యకరంగా ఉందని రఘురాజు అన్నారు. తనను ఇంకా వైసీపీ నుంచి సస్పెండ్ చేయలేదనే విషయాన్ని శ్రీరామ్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. వైసీపీ నుంచి తనను బహిష్కరించాలని తొలుత జగన్ కు సలహా ఇవ్వాలని... ఆ పని చేస్తే సాధారణ ఎంపీగా ధ్రువీకరణపత్రాన్ని సమర్పిస్తానని చెప్పారు. తనను లాకప్ లో వేసి చిత్రహింసలకు గురి చేశారని... అయినా తన మిత్రుడి కొడుకైన జగన్ పై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని అన్నారు. Quote
andhra_jp Posted November 24, 2023 Report Posted November 24, 2023 Jagan cases pakkana pedadam... i am wondering if RRR hair is original or wig ? Whats the need for politician to put a wig ? Is he trying in movies or what ? Quote
dallas_amaravathi Posted November 24, 2023 Report Posted November 24, 2023 7 minutes ago, andhra_jp said: Jagan cases pakkana pedadam... i am wondering if RRR hair is original or wig ? Whats the need for politician to put a wig ? Is he trying in movies or what ? Aaaadu manishi kaada? Only heros ee pettukovalna endi? 1 1 Quote
futureofandhra Posted November 24, 2023 Report Posted November 24, 2023 8 minutes ago, andhra_jp said: Jagan cases pakkana pedadam... i am wondering if RRR hair is original or wig ? Whats the need for politician to put a wig ? Is he trying in movies or what ? evadi choice vadidhi 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.