-
Please note that signing in with a Display Name has been removed. Email addresses must be used instead to login.
-
-
-
-
Popular Contributors
-
1
johnydanylee
290 -
2
DaatarBabu2
180 -
3
Sucker
94 -
4
Shameless
88 -
5
The_Mentalist
57
-
-
-
Most Contributions
-
Methrencet
507477 -
Spartan
180739 -
psycopk
142809 -
k2s
114201 -
mustang302
108516
-
-
-
Activity Stream
-
-
1
ఇథియోపియాలో 'వందేమాతరం'.. పులకించిపోయిన ప్రధాని మోదీ.. ఇదిగో వీడియో
PM Modi: ఇథియోపియాలో 'వందేమాతరం'.. పులకించిపోయిన ప్రధాని మోదీ.. ఇదిగో వీడియో! 17-12-2025 Wed 13:47 | International ఇథియోపియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ మోదీ గౌరవార్థం విందు ఏర్పాటు చేసిన ఇథియోపియా ప్రధాని విందులో 'వందేమాతరం' ఆలపించిన స్థానిక గాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ చప్పట్లతో అభినందించిన ప్రధాని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రధాని నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలో భాగంగా ఇథియోపియాలో పర్యటిస్తున్నారు. జోర్డాన్ పర్యటన ముగించుకుని ఇథియోపియా చేరుకున్న ఆయనకు అక్కడ అరుదైన, మర్చిపోలేని స్వాగతం లభించింది. 15 ఏళ్ల తర్వాత ఆ దేశంలో పర్యటిస్తున్న భారత ప్రధానికి గౌరవ సూచకంగా ఇథియోపియా గాయకులు భారత జాతీయ గీతం 'వందేమాతరం' ఆలపించారు. ఈ అద్భుత ప్రదర్శనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్.. ప్రధాని మోదీ గౌరవార్థం ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా స్థానిక గాయకులు 'వందేమాతరం' గీతాన్ని ఎంతో శ్రావ్యంగా ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు. తమ దేశానికి వచ్చిన భారత ప్రధానికి ఈ విధంగా స్వాగతం పలికారు. ఈ పరిణామంతో పులకించిపోయిన ప్రధాని మోదీ.. గాయకుల ప్రదర్శనను చప్పట్లతో అభినందించారు. భారతదేశానికి స్ఫూర్తినిచ్చిన వందేమాతరం గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో విదేశీ గడ్డపై ఈ గీతాన్ని ఆలపించడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ అరుదైన ఘట్టం ఇరు దేశాల మధ్య సాంస్కృతిక బంధానికి నిదర్శనంగా నిలిచింది. PM Modi: స్వయంగా కారు నడిపి మోదీని ఎయిర్ పోర్టు నుంచి హోటల్ కు తీసుకొచ్చిన ఇథియోపియా ప్రధాని 17-12-2025 Wed 14:59 | International మోదీకి కారు డ్రైవర్గా మారిన ఇథియోపియా ప్రధాని ఇరు దేశాల చారిత్రక బంధాన్ని గుర్తుచేసిన ప్రధాని మోదీ 'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పౌర పురస్కారం ప్రధాని నరేంద్ర మోదీ తన ఇథియోపియా పర్యటనలో భాగంగా ఈరోజు ఆ దేశ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. భారత్, ఇథియోపియా మధ్య వాతావరణంలోనే కాకుండా స్ఫూర్తిలోనూ సారూప్యత ఉందని అన్నారు. ఈ పర్యటన సందర్భంగా మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్ అలీ స్వయంగా కారు నడుపుతూ విమానాశ్రయం నుంచి హోటల్ వరకు మోదీని తీసుకువచ్చారు. పార్లమెంటులో మోదీ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య రెండు వేల ఏళ్ల నాటి చారిత్రక, వాణిజ్య సంబంధాలను గుర్తుచేశారు. ఆధునిక కాలంలో ఇథియోపియా విముక్తి కోసం భారత సైనికులు కూడా పోరాడారని తెలిపారు. ముఖ్యంగా వేలాది మంది భారతీయ ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దారని, వారు ఇథియోపియా ప్రజల హృదయాలను గెలుచుకున్నారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో భారత్ 150కి పైగా దేశాలకు మందులు, వ్యాక్సిన్లు పంపిందని, అందులో భాగంగా ఇథియోపియాకు 4 మిలియన్లకు పైగా డోసులు అందించడం గర్వకారణమని అన్నారు. అంతకుముందు 'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమంలో భాగంగా ఇథియోపియా ప్రధానితో కలిసి మోదీ అడిస్ అబాబాలో ఒక మొక్కను నాటారు. అనంతరం చారిత్రక అద్వా యుద్ధ విజయ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించారు. ఈ స్మారకం 1896లో ఇటలీ ఆక్రమణదారులపై ఇథియోపియా సైన్యాలు సాధించిన చారిత్రక విజయానికి ప్రతీక. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పౌర పురస్కారం 'గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా'ను ప్రదానం చేశారు. ఈ గౌరవానికి ఆయన ఇథియోపియా ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నిన్న అడిస్ అబాబా చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. -
16,163
Prime, Netflix and Hotstar Movie Updates
ade chepe vadini… akhanda kosam tokutunava antaru ani ala vesa -
2,520
-
-
