-
Please note that signing in with a Display Name has been removed. Email addresses must be used instead to login.
-
-
-
-
Popular Contributors
-
1
johnydanylee
303 -
2
DaatarBabu2
145 -
3
Shameless
143 -
4
Sucker
93 -
5
pizzaaddict
42
-
-
-
Most Contributions
-
Methrencet
507477 -
Spartan
180756 -
psycopk
142974 -
k2s
114201 -
mustang302
108516
-
-
-
Activity Stream
-
-
-
351
-
9
CBN meets Central ministers
Nitin Nabin: బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో చంద్రబాబు భేటీ 19-12-2025 Fri 17:33 | Andhra కొత్త బాధ్యతలు చేపట్టిన నబీన్‌కు అభినందనలు తెలిపిన చంద్రబాబు ప్రధాని మోదీ నాయకత్వాన్ని కొనియాడిన ఏపీ ముఖ్యమంత్రి నబీన్ నాయకత్వంలో బీజేపీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్ష బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన నాయకత్వంలో బీజేపీ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం శరవేగంగా పురోగమిస్తోంది. ఈ ప్రయాణంలో మేమంతా కలిసికట్టుగా పనిచేశాం. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం’’ అని స్పష్టం చేశారు. నితిన్ నబీన్‌ను యువకుడు, ఉత్సాహవంతుడిగా అభివర్ణించిన చంద్రబాబు, ఆయన వరుస విజయాలతో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. ‘‘ప్రధాని మోదీ భారతదేశ బ్రాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టారు. రైట్ టైమ్, రైట్ లీడర్, రైట్ డెసిషన్.. ఇదే నరేంద్ర మోదీ. అలాంటి కీలకమైన పార్టీకి నితిన్ నబీన్ బాధ్యతలు చేపట్టడం శుభపరిణామం. వారి నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశిస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. -
9
CBN meets Central ministers
Chandrababu Naidu: ఆ రెండు నగరాల్లో మెట్రో రైలు సేవలు అత్యంత ఆవశ్యకం: కేంద్రమంత్రి ఖట్టర్ కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి 19-12-2025 Fri 17:35 | Andhra కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఖట్టర్‌తో సీఎం చంద్రబాబు భేటీ విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులపై కీలక చర్చ మెట్రో ప్రాజెక్టులను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి కేంద్రానికి సవరించిన డీపీఆర్‌లు పంపినట్టు వెల్లడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా, శుక్రవారం కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, విజయవాడలలో మెట్రో రైలు ప్రాజెక్టులను వెంటనే ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ రెండు నగరాల్లో పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సేవలు అత్యంత ఆవశ్యకమని చంద్రబాబు మంత్రికి వివరించారు. మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి సవరించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు పంపినట్లు ఆయన తెలిపారు. ఈ డీపీఆర్‌లను క్షుణ్ణంగా పరిశీలించి, వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పట్టణ రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
-
