-
Please note that signing in with a Display Name has been removed. Email addresses must be used instead to login.
-
-
-
-
Popular Contributors
-
1
johnydanylee
364 -
2
DaatarBabu2
129 -
3
Sucker
118 -
4
The_Mentalist
83 -
5
Shameless
81
-
-
-
Most Contributions
-
Methrencet
507477 -
Spartan
180910 -
psycopk
144366 -
k2s
114209 -
mustang302
108516
-
-
-
Activity Stream
-
14
Indian Consular Position in Seattle
[email protected] ki neeenu kuda email petina anna visa interview xoom lo schedule chesadu chudali second job kinda chestha cc @vetri_psyconandamuri @Android_Halwa @Teluguredu @Tellugodu to apply -
26,223
485 (GC), Ead , AP, Spillover issues
aunty why crying jab chesuko velli cc @vetri_psyconandamuri -
10
***** Na favourite food Millets *****
vadu feedback ichee position lo ledu polar bear ki buffalo dorkinattu ani @Rendu tolded iddaru waste couple -
0
***** Teenmaar Malligadu new party *****
errifook andarini CM ga chudala Telanagana lo Taagubotu KCR, Randa Revanth next evadu Lunzala Malligadu aithee neenu Vizag ki potha @Android_Halwa -
0
Shoban babu 90th birth anniversary
మా తాత 104 ఏళ్ళు బ్రతికారు. నాన్న 100 ఏళ్ళు బ్రతికారు నేను కనీసం 92 ఏళ్ళైనా ఉంటాను... అని ధీమాగా చెప్పేవారు ఆయన. వంశ పారంపర్యంగా కొందరు కొన్ని జబ్బులకు లోనయ్యే ఛాన్స్ ఎక్కువ. అందులో హార్ట్ అటాక్ ఒకటి. దేహ తత్వమన్నది ఆనువంశికమే కొంత వరకు. అందుకే ఆ ధీమా శోభన్ బాబుకు. స్మోక్_చెయ్యడు... కనీసంషాంపేన్_కూడా_తీసుకోడు!_మద్యం_ముట్టడు!... 45_ఏళ్ళుగా_అలవాటున్న_కాఫీ_కూడా_మానేశాడు_ఆరోగ్యానికి_మంచిది_కాదని!... కాఫీ కి బదులు మజ్జిగ అలవాటు చేసుకోవడమే గాక... అతిథులకు సైతం మజ్జిగే ఆఫర్ చేసేవాడాయన. 35_ఏళ్ళుగా_యోగా_సాధన_చేస్తున్నాడు..... మితాహారం_బరువు_పెరగకుండా_మెయింటెయిన్_చేస్తున్నాడు... సాయంత్రం 6 గంటలయ్యిందంటే ఎటువంటి పరిస్థితిలోనూ షూటింగ్ లో పాల్గొనడు. ఆదివారాలు...నో కాల్షీట్స్ సినీరంగాన అంత ఆస్తి పరుడు మరొకరు లేరు! క్రమశిక్షణంటే మహా ఇష్టం.... తనఅందమంటే ఇంకా ఇంకా ఇష్టం.... అంతులేని మెటీరియలిస్టిక్ సంపద ఉన్నా... ఇంటలెక్చువల్ సంపదంటే....మరీ మక్కువ... గతాన మహా మహులైన గొప్ప స్టార్లు....ఏ వ్యసనాల వలన...ఉన్నదంతా పోగొట్టుకుని వీధిపాలైనారో.... ఆ వ్యసనాలేవీ లేవు.... ఇన్ని_సుగుణాలున్న_వాడు... నారీ జన హృదయ మన్మధుడు... సోగ్గాడు.....ఉప్పు శోభనాచలపతి గారు....ఉరఫ్.... ఆంధ్రుల అందాల కథా నాయకుడు శోభన్ బాబు.. హఠాత్తుగా గుండెపోటుతో పోయారు! చనిపోవడానికి ముందే ప్రొధ్ధున్నే... కొడుకు కరుణ శేషు తో మద్రాస్ లో నిర్మిస్తున్న కొత్త బిల్డింగ్ టైల్స్... ఎక్కడ...ఏరకం తేవాలో చర్చించారట. కొడుకు బయటకు వెళ్ళగానే... భార్యకు మజ్జిగ తెమ్మని చెప్పి.. తనకు ఇష్టమైన ఉడన్ రాకింగ్ చెయిర్ లో కూర్చున్నారు. మజ్జిగ తావడం లేట్ అయ్యేసరికి...స్వయంగా అడుగుదామని లేచి... మాసివ్ హార్ట్ అటాక్ తో అలాగే ముందుకుపడిపోవడంతొ ముక్కు కు దెబ్బ తగిలి రక్తం వచ్చింది. వెంటనే ప్రాణం పోయింది. అందగాడు అనంతం లో కలిశాడు. అందమైన జ్ఞాపకంలా మిగిలాడు. -oo0oo- ఖగపతి యమృతము తేగా భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్ పొగ చుట్టై జన్మించెను పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్. అని మాంధాతల కాలంలో.... గిరీశం చెప్పాడు. హై సొసైటీ లేడీస్... సిగార్స్... లోక్లాస్ ఆడాళ్ళ...అడ్డ పొగలు.... మనకు తెలియనివి కావిప్పుడు. అనుదినమ్మును కాఫీయే అసలు కిక్కు... కొద్దిగా నైన పడకున్న పెద్ద చిక్కు... కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కు... అమృతమన్నది హంబక్కు......అయ్యలారా.... అనుకుంటూ... కాఫీ...ని ఆస్వాదించని బ్రతుకెందుకు?.... అనుకోవడం మాత్రం దాదాపు అందరం చేస్తాం. దేవేంద్రుడు తాగాడు రంభతోటి ఆడాడు.. బలరాముడు చుక్కేసి బజార్లెంట పడ్డాడు... కాళిదాసు తాగి తాగి కథలెన్నో పాడాడు... తాగినోడి కున్న తెలివి చెప్పడాని కెవుడికలివి... అనుకుంటూ....మగ - ఆడ అంటూ తేడా తెలీకుండా త్రాగేస్తున్నారిప్పుడు! చచ్చేక దొరికే ఆ రంభ కన్న.. ఇప్పుడు నచ్చినట్టి నెరజాణే.. భల్ అన్నులమిన్న.... ఒక్క లాంటి వాళ్ళురా.. జాజిపువ్వు...ఆడపిల్ల.. వాడిపోక ముందే... వాటిని అనుభవించరా... తప్పే లేదురా!.... అంటూ జల్సా చేసే మగరాయుళ్ళకు...కొదువేం లేదీ లోకంలో. ఒక్క విషయం...పక్కా. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే....మృత్యువు ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టం. ఓ విధంగా చూస్తే...ఈ రెస్ట్రిక్షన్లన్నీ పక్కన బెట్టి... మనకు నచ్చినట్లు మనం బ్రతకడంలో కనీసం ఫ్రీడం ఉంటుంది. జస్ట్ బ్రతకడం కాదు. జీవించానన్న తృప్తి అన్నా ఉంటుంది పోయేప్పుడు. -oo0oo- #ఆయనకిద్దరు!... #కావాలంటే_ముగ్గురుంటారు... #స్టోరీ_డిమాండ్_చేస్తే. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటారో...తిట్టుకుంటారో... త్యాగాలే చేసేసుకుంటారో... ఒద్దిగ్గా ఒకే ఇంట్లో వంతుల వారీగా సాగించుకుంటారో సంసారం... వాళ్ళ వాళ్ళ ఓపిక బట్టి ఉంటది. అంతగా కావాలంటే ..సివరాఖర్లో ఒకావిడ సూయిసైడ్ సేసుకుంటే సరి. శోభన్ బాబు కు మాత్రం ఏ లోటూ రాకూడదు ఈ విషయంలో. అసలాయన్ని తప్పే పట్టకూడదు. అయినా స్టైలిష్ గా...లాస్ట్ లో సింపుల్ గా క్షమించమంటాడేమో! అదే పెద్ద పనిష్ మెంట్ లెక్క ఆయనకి. అదో కల్ట్ లా ఉండేది అప్పట్లో. అసలింత వెసలుబాటు ఎప్పుడైనా...మరే హీరోకైనా ఉందా చెప్పండి! అట్టాంటి హీరో హఠాత్తుగా హార్ట్ అటాక్ తో పోయాడనేసరికి మహిళా లోకం తల్లడిల్లి పోయింది. మగోళ్ళు కూడా బాధ పడ్డారు లెండి. ఏదైనా సెకండ్ సెట్ అప్ పెట్టినా.. ఫలానా సినిమా లో శోభన్ బాబు టైపు నేను అని చెప్పుకోడానికిక వీలు కాదు కదా....అని. -oo0oo- కృష్ణా జిల్లా చిన నందిగామ లో జనవరి 14 న 1937 లో పుట్టిన శోభన్ అసలు పేరు ఉప్పు శోభనా చలపతి రావు. మైలవరం హైస్కూల్ లో చదువుతున్నప్పుడే నాటకాలలో వేశాడు. అందగాడు కదా మంచి పేరే వచ్చేది. తను చూసిన మొదటి సినిమా కీలుగుర్రమట. మల్లీశ్వరి 22 సార్లు చూశాడట. విజయవాడ లో డిగ్రీ పూర్తి చేశాక...లా కోర్స్ లో చేరినా పూర్తి చెయ్యలేదు. మనసంతా సినిమాల మీదే ఉంది శోభన్ బాబుకు మే 15, 1958న శాంత కుమారితో వివాహమయినది. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. వారి పేర్లు...కరుణ శేషు, మృదుల, ప్రశాంతి, నివేదిత. 1959లో దైవ బలం లో చిన్న పాత్ర. సీతారామ కల్యాణంలో లక్ష్మణుడు గా,... ప్రతిజ్ఞాపాలన(750 రూపాయలు పారితోషికం) పరమానందయ్య శిష్యుల కథ లో శివుని పాత్ర( పారితోషికం -1500 రూపాయలు. గూఢచారి 116 లో చిన్న పాత్ర అభిమన్యుడుగా నర్తనశాల, అర్జునుడుగా భీష్మ,...ఇలాంటి చిన్నపాత్రలు సైతం వేశాడు. వీరాభిమన్యు, లోగుట్టు పెరుమాళ్ళ కెరుక, పొట్టి ప్లీడర్ , పుణ్యవతి లలో శోభన్ బాబు నటనకు గుర్తింపు వచ్చినా... 1969 లో వచ్చిన మనుషులు మారాలి తో శోభన్ బాబుకు టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఇక ది మోస్ట్ గ్లామరస్ హీరో గా తెలుగు తెర మీద దూసుకు పోయాడు. మహిళా మానస చోరుడయ్యాడు. షుమారు 300 చిత్రాలలో కేవలం కథానాయకుడు గానే నటించారు. అబ్బా...నటనంటే ఇది. ఏం చేశాడు శోభన్ బాబు! మరెవ్వరూ చెయ్యలేరు! అనేట్టుగా లేకపోయినా తనదైన సహజ బాణిలో చేసుకుపోయాడు.పాత్రకు న్యాయం చేసేవాడు. నభూతో నభవిష్యతి వంటి చిత్రాలు శొభన్ కు లేవేమో! కానీ కమర్షియల్ సక్సెస్ లు మాత్రం ఎక్కువే. ఎన్నడూ చిత్ర నిర్మాత కావాలని అసలు అనుకోలేదు. -oo0oo- #ఎన్నటికీ_ప్రేక్షకులు_మనసులో_అందాల_హీరోగా_ఉండిపోవాలని_భావించిన_శోభన్_బాబు... #59వ_ఏట_నటజీవితానికి_స్వస్తి_చెప్పాడు. #వాణిశ్రీ_శారద_లక్ష్మి_కాంచన_మంజుల_జయసుధ_జయప్రద, #శ్రీదేవి_సుజాత_మొదలైన_హీరోయిన్లకు_శోభన్_ఋణపడిపోయాడు. #ఎందుకంటే_శోభన్_బాబు_గారిని... #స్టార్_చెయ్యడంలో... #కథానాయికల_పాత్ర_ఎక్కువని_చెప్పక_తప్పదు. జీవితం లో ఎక్కడా తప్పటడుగు లేదు. పక్కా ఇన్వెస్ట్మెంట్ ఇన్ లాండ్స్ & బిజినెస్. ప్రస్తుతం...ఆయన ఆస్తులతో పోలిస్తే...ఎవ్వరూ సాటి రారు! ఒకే ఒక్క తప్పటడుగు వేసినట్లు ...ఆయనే ఒప్పుకున్నారు. పేరు ఇప్పుడు చెప్పుకోవడం అనవసరం. ఇద్దరూ స్వర్గస్తులైపోయారు! 220 పైగా చిత్రాలలో నటించి 1996లో విడులయిన హలో గురూ చిత్రంతో తన 30 ఏళ్ళ నటజీవితానికి స్వస్తి చెప్పి... చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడిపేవాడు. శోభన్ బాబు 2008, మార్చి 20 ఉదయం గం.10:50ని.లకు చెన్నైలో గుండెపోటు తో మరణించారు. ఎవరైనా సరే...నూరేళ్ళు కాకపోయినా... ఓ 90 ఏళ్ళైనా బ్రతకాలనుకుంటారు. #కానీ_శోభన్_బాబు_మరణం_కూడా_శ్రీదేవి_మరణం_లాగే_మిస్టరీ. #ఎవరో_తోస్తేనే_మెట్ల_మీంచి_క్రింద_పడ్డట్లు_నమ్మకమైన_వారు_చెప్పిన_సమాచారం. #దీనికి_ఖచ్చితమైన_ఆధారాలు_ఇప్పుడు_మనకు_లేవు. #ఆస్తులు_మరీ_ఎక్కువ_ఉన్నా_ఇలాంటి_ప్రమాదాలు_తప్పవేమో! #నటభూషణ_ఆంధ్రా_అందగాడు_శోభన్_బాబు #జయంతి_ఈ_రోజు.(14-1-1937). #స్మృత్యంజలి.🌹 🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹
-
