psycopk Posted December 3, 2023 Report Posted December 3, 2023 https://www.instagram.com/reel/C0ZNGvmpihy/?igshid=MzRlODBiNWFlZA== 2 Quote
psycopk Posted December 3, 2023 Author Report Posted December 3, 2023 KTR: ఈ ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే: కేటీఆర్ 03-12-2023 Sun 18:35 | Telangana తెలంగాణలో 64 స్థానాలతో కాంగ్రెస్ జయభేరి 39 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమైన అధికార బీఆర్ఎస్ రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అని కేటీఆర్ వెల్లడి ఎన్నికల ఫలితాల సరళి ఒక వేవ్ లా అనిపించడంలేదని వివరణ తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా ఎదుటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని తేలిగ్గా తీసుకున్నారు. రాజకీయాలన్న తర్వాత గెలుపు ఓటములు సహజం అని పేర్కొన్నారు. పార్టీ కోసం తమ నేతలు ఎంతో కష్టపడ్డారని, గతం కంటే మంచి మెజారిటీ సాధిస్తామని భావించామని వెల్లడించారు. ఫలితాలు నిరాశకు గురిచేసినా అసంతృప్తి మాత్రం లేదని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని, మాకు 70 ప్లస్ సీట్లు వస్తాయని మొన్న చెప్పాను కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని, అందుకే తానేమీ బాధపడడంలేదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల సరళి చూస్తే ఒక వేవ్ లా అనిపించడంలేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో, మెదక్ జిల్లాలో ఫలితాలు దాదాపు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఏకపక్షంగా ఉన్నాయని, కరీంనగర్ జిల్లాలో 40:60 నిష్పత్తిలో ఫలితాలు వచ్చాయని వివరించారు. ఈ పరిస్థితి తమకు కూడా అర్థం కాకుండా ఉందని అన్నారు. ఓటమికి కారణాలు ఇప్పుడే చెప్పలేమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడిన తర్వాత, మా అభ్యర్థుల అనుభవాలు కూడా తెలుసుకుని ఓటమి కారణాలు ఏవన్నది నిర్ణయిస్తాం అని తెలిపారు. "పెద్దపల్లి పార్లమెంటు స్థానం పరిధిలోని చెన్నూరు నియోజకవర్గంలో సోదరుడు బాల్క సుమన్ చేసినంత అభివృద్ధి గతంలో మంత్రులుగా పనిచేసినవాళ్లు కూడా చేయలేదు. కానీ సుమన్ ఓడిపోయారు. మందమర్రిలో కూడా ఇలాంటి ప్రతికూల ఫలితమే వచ్చింది. సింగరేణికి మేం చేసినంత మేలు మరెవ్వరూ చేయలేదు. సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకున్నాం, సింగరేణి కార్మికులకు 32 శాతం బోనస్ ఇచ్చాం. కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన 10 హామీలు నెరవేర్చాం. వారసత్వ ఉద్యోగాలు వంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించాం. కానీ ఇవాళ అక్కడ కాంగ్రెస్ పార్టీకి అసాధారణమైన మెజారిటీలు వచ్చాయి. నాకు తెలిసి అంత మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ వాళ్లు కూడా ఊహించి ఉండరు. అందుకే మా ఓటమికి ఇప్పటికిప్పుడు కారణాలు చెప్పలేను కానీ, భిన్నమైన అంశాలు మా ఓటమికి దారి తీసి ఉంటాయని భావిస్తున్నాను" అని వివరించారు. గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతున్నానని, ఇకపై సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని కేటీఆర్ వెల్లడించారు. 39 స్థానాల్లో గెలిచేందుకు మా నేతలు ఎంతో శ్రమించారు... వారికి నా అభినందనలు అంటూ పేర్కొన్నారు. 1 Quote
psycopk Posted December 3, 2023 Author Report Posted December 3, 2023 Errabelli: పాలకుర్తిలో సంచలనం... ఎర్రబెల్లి దయాకరరావును ఓడించిన 26 ఏళ్ల యశస్విని రెడ్డి 03-12-2023 Sun 18:18 | Telangana ఆరు సార్లు గెలిచిన ఎర్రబెల్లిపై 26 ఏళ్ల యశస్విని రెడ్డి గెలుపు 14వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించిన యశస్విని వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ గెలుపు మంత్రి, బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకరరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు. మంత్రిపై యశస్విని 14వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి... 26 ఏళ్ల యశస్విని చేతిలో ఓడిపోయారంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు, ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు వరంగల్ తూర్పు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా సురేఖ చేతిలో ప్రదీప్ రావు ఓడిపోయారు. కాగా, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు మదన్ మోహన్ రావు విజయం సాధించారు. Quote
psycopk Posted December 3, 2023 Author Report Posted December 3, 2023 Entire credit harish ke ivali congress vallu.. esp with the slight margin win Harish Rao: ముఖ్యమంత్రి అయినా కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారు: హరీశ్ రావు 17-10-2023 Tue 18:49 | Telangana దశాబ్దం క్రితం తెలంగాణలో కరవు తాండవించిందన్న హరీశ్ రావు ఇప్పుడు పది రాష్ట్రాలకు తెలంగాణ అన్నం పెడుతోందన్న మంత్రి వేసవికాలంలోనూ చెరువులు జలకళ సంతరించుకున్నాయన్న హరీశ్ రావు ముఖ్యమంత్రి అయినప్పటికీ కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ... దశాబ్దం క్రితం తెలంగాణలో కరవు తాండవించిందని, కానీ ఇప్పుడు పది రాష్ట్రాలకు మన రాష్ట్రం అన్నం పెడుతోందన్నారు. సిద్దిపేటకు గోదావరి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రైతుబిడ్డ కాబట్టి కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారన్నారు. రైతులలో ముఖ్యమంత్రి కేసీఆర్ ధైర్యం నింపారన్నారు. తెలంగాణలో వేసవికాలం కూడా వర్షాకాలం మాదిరి కనిపిస్తోందన్నారు. ఎండాకాలంలోనూ చెరువులు జలకళతో కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో కరవు అనే పదాన్ని శాశ్వతంగా తొలగించామన్నారు. సిద్దిపేట రైలు మార్గాన్ని త్వరితగతిన పూర్తి చేశామన్నారు. Quote
psycopk Posted December 3, 2023 Author Report Posted December 3, 2023 Vijayashanti: తెలంగాణకు మంచి రోజులు వచ్చాయి: విజయశాంతి 03-12-2023 Sun 18:20 | Telangana కాంగ్రెస్ పార్టీది ధర్మవిజయమన్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన వారందరికీ విజయశాంతి ధన్యవాదాలు రేవంత్ రెడ్డి తనను ప్రశంసించిన వీడియోను ట్వీట్ చేసిన రాములమ్మ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది ధర్మవిజయమని ఆ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి అన్నారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణకు మంచి రోజులు వచ్చాయన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అలాగే సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత తనకు ధన్యవాదాలు తెలుపుతూ రేవంత్ రెడ్డి మాట్లాడిన మరో వీడియోను విజయశాంతి ట్వీట్ చేశారు. విజయశాంతి పార్టీ కోసం జోరుగా ప్రచారం నిర్వహించారని, ఆమె ప్రచారంలో పాల్గొని... కాంగ్రెస్‌ను తనదైన శైలిలో ముందుకు నడిపించారని, కాంగ్రెస్ కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపారని రాములమ్మను రేవంత్ రెడ్డి ఆ వీడియోలో ప్రశంసించారు. కాగా, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నంత సేపు సీఎం.. సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తుండడం ఆ వీడియోలో కనిపించింది. Quote
psycopk Posted December 3, 2023 Author Report Posted December 3, 2023 Kalvakuntla Kavitha: కాంగ్రెస్ విజయంపై కవిత స్పందన 03-12-2023 Sun 19:21 | Telangana తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 64 సీట్లు శుభాకాంక్షలు తెలిపిన కల్వకుంట్ల కవిత ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో శ్రమించారని కితాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం అందుకుంది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేశారు. గెలిచిన ఎమ్మెల్యేలందరికీ అభినందనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎంతో శ్రమించారని కొనియాడారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా మనందరం తెలంగాణ ప్రజలకు సేవకులమేనని పేర్కొన్నారు. తెలంగాణ మన మాతృభూమి... రాష్ట్రం కోసం మనస్ఫూర్తిగా పాటుపడదాం అని పిలుపునిచ్చారు. కాగా, కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ విజయం సాధించారు. సంజయ్ కుమార్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ పై నెగ్గారు. దీనిపై కవిత స్పందించారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. Quote
psycopk Posted December 3, 2023 Author Report Posted December 3, 2023 Cbn supporters ante only community anukune pichi kukka Vijayasai Reddy: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు 03-12-2023 Sun 19:29 | Both States చంద్రబాబు, పురంధేశ్వరి వల్ల కాంగ్రెస్, బీజేపీలకు ఒరిగింది ఏమిటని ప్రశ్న వీళ్ల సామాజికవర్గం బలంగా ఉందని చెప్పుకుంటున్న చోట్ల కూడా బీఆర్ఎస్ గెలిచిందని విమర్శలు కాంగ్రెస్ గెలుపుతో టీడీపీ సహకారం ఉందని విశ్లేషణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు తెలంగాణ అధికార పీఠం ‘హస్త’గతమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 64 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా మిత్ర పక్షం సీపీఐ 1 స్థానంలో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు కూడా మొదలైంది. అయితే కాంగ్రెస్ సునాయాస విజయానికి దోహదపడ్డ అంశాల విశ్లేషణలో టీడీపీ కూడా పేరు వినిపిస్తోంది. పసుపు పార్టీ పరోక్షంగా కాంగ్రెస్‌కు సాయపడిందనే వాదన గట్టిగానే వినిపిస్తోంది. అంతేకాదు.. ఒక సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు మొగ్గుచూపిందనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ఈ విశ్లేషణలపై వైఎస్సార్‌సీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి నివాసాలున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడని ప్రస్తావించారు. వీళ్ల సామాజికవర్గం బలంగా ఉందని చెప్పుకునే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలను కూడా బీఆర్ఎస్ సొంతం చేసుకుందని అన్నారు. మరి చంద్రబాబు, పురంధేశ్వరి వల్ల కాంగ్రెస్, బీజేపీలకు ఒరిగింది ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఇదిలావుండగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, సీపీఐ 1, ఎంఐఎం 7 స్థానాల్లో విజయం సాధించాయి. Quote
psycopk Posted December 3, 2023 Author Report Posted December 3, 2023 G. Kishan Reddy: కామారెడ్డిలో కాటిపల్లి గెలుపు, జనసేనతో పొత్తుపై కిషన్ రెడ్డి స్పందన 03-12-2023 Sun 19:56 | Telangana ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించి బీజేపీ అభ్యర్థిని గెలిపించిన కామారెడ్డి ప్రజలకు కిషన్ రెడ్డి థ్యాంక్స్ వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు రేపటి నుంచే పూర్తిస్థాయిలో సంసిద్ధమవుతామని వెల్లడి జనసేనతో పొత్తు వల్ల తమకు నష్టం జరగలేదని స్పష్టీకరణ ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించి... బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిని గెలిపించిన కామారెడ్డి ప్రజలకు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కొన్నేళ్లుగా ప్రజలకు సేవలు అందిస్తూ రాజకీయ పోరాటం చేసి బీజేపీ జెండా పాతినందుకు కార్యకర్తలకూ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు రేపటి నుంచే పూర్తిస్థాయిలో సంసిద్ధమవుతామని వెల్లడించారు. ఆ దిశగా కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు. జనసేనతో పొత్తు వల్ల తమకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. Quote
psycopk Posted December 3, 2023 Author Report Posted December 3, 2023 anasuya bharadwaj: కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన యాంకర్ అనసూయ భరద్వాజ్ 03-12-2023 Sun 18:37 | Telangana మీరు నిజమైన నాయకుడు సర్.. ఎందరికో స్పూర్తినిస్తున్నారని కితాబు బలమైన ప్రతిపక్ష నేతగా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తున్నానని వ్యాఖ్య హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని వ్యాఖ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పరాభవం ఎదురైంది. 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా, బీఆర్ఎస్ 39 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో కేటీఆర్ తమకు రెండుసార్లు అవకాశమిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ, కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు చెప్పారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌పై బుల్లితెర యాంకర్ అనుసూయ స్పందించారు. 'మీరు నిజమైన నాయకుడు సర్... ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉండవచ్చు. బలమైన ప్రతిపక్షంగా మీరు కూడా చేయాల్సింది ఉంటుంది. ప్రతిపక్ష నేతగా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తున్నాను. హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్ది ఈ నగరంతో ప్రేమలో పడేలా చేసినందుకు ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు. Quote
psycopk Posted December 3, 2023 Author Report Posted December 3, 2023 Sunil Kanugolu: ఇడుగో ఇతనే సునీల్ కనుగోలు... కాంగ్రెస్ విజయం వెనుక మాస్టర్ మైండ్! 03-12-2023 Sun 18:02 | Telangana తెలంగాణలో కాంగ్రెస్ విజయం 64 సీట్లు గెలిచిన హస్తం పార్టీ చాపకింద నీరులా పనిచేసుకుపోయిన సునీల్ కనుగోలు అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు సునీల్ మార్కు ప్రశాంత్ కిశోర్ సహచరుడే ఈ సునీల్ కనుగోలు! తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ఎలాంటి సందేహాలు లేకుండా ఎగ్జిట్ పోల్సే నిజమయ్యాయి. హ్యాట్రిక్ కొట్టాలన్న అధికార బీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ఓడిపోవడం ఇదే మొదటిసారి. తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా ట్యాగ్ లైన్ ను సొంతం చేసుకున్న సీఎం కేసీఆర్ వంటి రాజకీయ దిగ్గజాన్ని గద్దె దింపిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతమైంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజలపై బలమైన ముద్ర వేసినా, ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు మెరుగైన ఓట్ షేర్ లభించినా, రేవంత్ రెడ్డి మొదలు కోమటి రెడ్డి వెంకటరెడ్డి, వి.హనుమంతరావు, జానారెడ్డి వంటి సీనియర్లందరూ ఏకతాటిపై నిలిచినా, కాంగ్రెస్ అగ్రనాయకత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణపై అధిక దృష్టి పెట్టినా... ఇలా ప్రతి అంశం వెనుక ఉన్న హస్తం... సునీల్ కనుగోలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా అని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన క్షణం నుంచే సునీల్ కనుగోలు పేరు ఘనంగా వినిపించడం మొదలైంది. చాపకింద నీరులా పనిచేసుకుపోయే 39 ఏళ్ల సునీల్ కనుగోలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. అధికార బీఆర్ఎస్ ను మించిపోయేలా కాంగ్రెస్ ప్రచారం కొనసాగడంలో సునీల్ ది ప్రముఖ పాత్ర. సునీల్ తన సామర్ధ్యం నిరూపించుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ జయభేరి మోగించడం వెనుక ఉన్నది కూడా ఇతడే. అతడి వ్యూహ చతురతకు మెచ్చి కర్ణాటక సర్కారు క్యాబినెట్ మినిస్టర్ హోదాతో ప్రభుత్వ సలహాదారుగా నియమించుకుంది. ఇప్పటివరకు దేశంలో ఎన్నికల వ్యూహకర్త అంటే ప్రశాంత్ కిశోర్ పేరు వినిపించేది. దేశవ్యాప్తంగా ఆయన పనిచేసిన పార్టీలు విజయం సాధించిన ఉదంతాలే ఎక్కువ. ఏపీలోనూ వైసీపీని అధికారంలోకి తీసుకురావడంతో ఆయన పేరు మార్మోగిపోయింది. ఇప్పుడు అంతకంటే సునీల్ కనుగోలు పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే... దాదాపు పతనం అంచుల వరకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీని కర్ణాటకలో అధికారంలోకి తీసుకురావడమే కాదు, తెలంగాణలోనూ రూపురేఖలు కోల్పోయిన హస్తానికి జీవం పోయడం సునీల్ కే చెల్లింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... సునీల్ కనుగోలు గతంలో ప్రశాంత్ కిశోర్ సహచరుడే. 2014లో ప్రశాంత్ కిశోర్, సునీల్ కనుగోలు బీజేపీ కోసం పనిచేశారు. ప్రశాంత్ కిశోర్ కంటే ముందే సునీల్ కనుగోలు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత వ్యూహకర్తగా పనిచేశారు. సునీల్ కనుగోలు, ప్రశాంత్ కిశోర్ అప్పట్లో సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సీఏజీ) స్థాపించి ప్రధానిగా నరేంద్ర మోదీని గద్దెనెక్కించడం కోసం కృషి చేశారు. సునీల్ కనుగోలు తన పేరు మీదే 'ఎస్కే... అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్' సంస్థను ప్రారంభించి దేశంలో 14 ఎన్నికల్లో పలు పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించారు. 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించడం వెనుక ఉన్నది సునీల్ కనుగోలు తెలివితేటలే. సునీల్ కనుగోలు కర్ణాటకలోని బళ్లారిలో ఓ తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత వాళ్ల కుటుంబం చెన్నైలో స్థిరపడింది. సునీల్ కనుగోలు కుటుంబం విజయవాడ నుంచి వలస వెళ్లినట్టు తెలుస్తోంది. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసిన సునీల్... ప్రఖ్యాత కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సేలో పనిచేశాడు. ఆ తర్వాత భారత్ వచ్చి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీమ్ లో చేరాడు. ఆ తర్వాత ప్రశాంత్ కిశోర్ సంస్థ నుంచి విడిపోయి సొంతంగా సంస్థను స్థాపించి, కొద్దికాలంలోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. అయితే, సొంత పబ్లిసిటీ పెద్దగా ఇష్టపడని సునీల్ కనుగోలు ఇతర పార్టీలకు పబ్లిసిటీ కల్పించడంలో మాత్రం దిట్ట. ఆ విషయం తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుతో నిరూపితమైంది. 2022 నుంచి సునీల్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. గతంలో బీజేపీ కోసం తాను ఉపయోగించిన వ్యూహాలనే ఇప్పుడు కాంగ్రెస్ కోసం అమలు చేసి సక్సెస్ అయ్యాడీ సరికొత్త చాణక్యుడు. కాంగ్రెస్ తో జట్టుకట్టిన తొలినాళ్లలోనే సునీల్ ప్లానింగ్ లో పదును ఏంటో సోనియా గాంధీ గుర్తించారు. అందుకే అతడ్ని తమ లోక్ సభ ఎలక్షన్స్-2024 టాస్క్ ఫోర్స్ లో సభ్యుడిగా నియమించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కోసం సునీల్ కనుగోలు సాధించిన తొలి విజయం కర్ణాటక అసెంబ్లీని చేజిక్కించుకోవడం అయితే, ఆ తర్వాతి విజయం భారత్ జోడో యాత్ర. 2022 సెప్టెంబరు 7 నుంచి 2023 జనవరి 30 వరకు 14 రాష్ట్రాల మీదుగా రాహుల్ గాంధీ 4,080 కిలోమీటర్ల మేర సాగించిన భారత్ జోడో యాత్ర రూపకల్పన వెనుక ఉన్నది కూడా సునీల్ కనుగోలే. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీతో కలవకముందు సునీల్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో వివిధ పార్టీల కోసం పనిచేశారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా అప్పటి సీఎం బసవరాజ్ బొమ్మైని నేరుగా టార్గెట్ చేసే విధంగా పేసీఎమ్, 40 పర్సెంట్ సర్కార్ వంటి విమర్శనాస్త్రాలకు రూపకల్పన చేసింది కూడా సునీలే. అంతేకాదు, తమిళనాడులో 2015 ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ కోసం నమకు నామే (మనకు మనమే పాలించుకుందాం) అనే నినాదాన్ని కూడా సునీలే సిద్ధం చేశాడు. 39 ఏళ్ల సునీల్ కనుగోలుపై వివాదాలు కూడా ఉన్నాయి. 2022 డిసెంబరులో తెలంగాణ పోలీసులు సునీల్ కు చెందిన మైండ్ షేర్ అనలిటిక్స్ సంస్థ కార్యాలయంపై దాడులు చేపట్టారు. సీఎం కేసీఆర్ పైనా, బీఆర్ఎస్ పార్టీ పైనా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై ఈ చర్యలకు దిగారు. అయితే ఈ దాడులు కక్ష సాధింపు చర్యలంటూ అప్పట్లో కాంగ్రెస్ తిప్పికొట్టింది. ఇప్పుడు సునీల్ కనుగోలు కాంగ్రెస్ పార్టీలో విడదీయరాని భాగమయ్యాడు! అతడి తదుపరి లక్ష్యాల్లో ఒకటైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనేది సక్సెస్ ఫుల్ గా పూర్తయింది. Quote
psycopk Posted December 3, 2023 Author Report Posted December 3, 2023 KCR: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా... ఆమోదించిన గవర్నర్ తమిళిసై 03-12-2023 Sun 17:19 | Telangana తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా సమర్పణ ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖను పంపించిన కేసీఆర్ 64 చోట్ల గెలిచి మేజిక్ ఫిగర్ (60) సాధించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. మరోవైపు, ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాభవం అనంతరం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఆయన తన సొంత వాహనంలో ఫామ్ హౌస్ చేరుకున్నారు. 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 64 చోట్ల విజయం సాధించి, మేజిక్ ఫిగర్‌ను అందుకుంది. బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలవడం లేదా ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్‌కు మేజిక్ ఫిగర్ రావడంతో కేసీఆర్ రాజీనామాను సమర్పించారు. Quote
BattalaSathi Posted December 3, 2023 Report Posted December 3, 2023 3 minutes ago, psycopk said: anasuya bharadwaj: కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన యాంకర్ అనసూయ భరద్వాజ్ 03-12-2023 Sun 18:37 | Telangana మీరు నిజమైన నాయకుడు సర్.. ఎందరికో స్పూర్తినిస్తున్నారని కితాబు బలమైన ప్రతిపక్ష నేతగా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తున్నానని వ్యాఖ్య హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని వ్యాఖ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు పరాభవం ఎదురైంది. 64 సీట్లతో కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా, బీఆర్ఎస్ 39 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో కేటీఆర్ తమకు రెండుసార్లు అవకాశమిచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ, కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు చెప్పారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్‌పై బుల్లితెర యాంకర్ అనుసూయ స్పందించారు. 'మీరు నిజమైన నాయకుడు సర్... ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. మన రాష్ట్ర స్థితిని అవతలి వైపు నుంచి చూడాల్సిన అవసరం ఉండవచ్చు. బలమైన ప్రతిపక్షంగా మీరు కూడా చేయాల్సింది ఉంటుంది. ప్రతిపక్ష నేతగా మీరు చేయాల్సింది చేస్తారని ఆశిస్తున్నాను. హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్ది ఈ నగరంతో ప్రేమలో పడేలా చేసినందుకు ధన్యవాదాలు' అని ట్వీట్ చేశారు. Quote
lokesh_rjy Posted December 3, 2023 Report Posted December 3, 2023 23 minutes ago, psycopk said: Errabelli: పాలకుర్తిలో సంచలనం... ఎర్రబెల్లి దయాకరరావును ఓడించిన 26 ఏళ్ల యశస్విని రెడ్డి 03-12-2023 Sun 18:18 | Telangana ఆరు సార్లు గెలిచిన ఎర్రబెల్లిపై 26 ఏళ్ల యశస్విని రెడ్డి గెలుపు 14వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించిన యశస్విని వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ గెలుపు మంత్రి, బీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకరరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి చేతిలో ఓడిపోయారు. మంత్రిపై యశస్విని 14వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి... 26 ఏళ్ల యశస్విని చేతిలో ఓడిపోయారంటూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు, ఆయన సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు వరంగల్ తూర్పు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా సురేఖ చేతిలో ప్రదీప్ రావు ఓడిపోయారు. కాగా, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకరరావు అల్లుడు మదన్ మోహన్ రావు విజయం సాధించారు. Ante mundu mundhu pedda speed brakers unnayi antunada Quote
lokesh_rjy Posted December 3, 2023 Report Posted December 3, 2023 1 minute ago, psycopk said: KCR: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా... ఆమోదించిన గవర్నర్ తమిళిసై 03-12-2023 Sun 17:19 | Telangana తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా సమర్పణ ఓఎస్డీ ద్వారా రాజీనామా లేఖను పంపించిన కేసీఆర్ 64 చోట్ల గెలిచి మేజిక్ ఫిగర్ (60) సాధించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. మరోవైపు, ఎన్నికల్లో బీఆర్ఎస్ పరాభవం అనంతరం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ చేరుకున్నారు. ఆయన తన సొంత వాహనంలో ఫామ్ హౌస్ చేరుకున్నారు. 119 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 64 చోట్ల విజయం సాధించి, మేజిక్ ఫిగర్‌ను అందుకుంది. బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలవడం లేదా ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 8 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్‌కు మేజిక్ ఫిగర్ రావడంతో కేసీఆర్ రాజీనామాను సమర్పించారు. Kcr ki own vehicle ledu kada ela poyadu Mari own vehicle lo Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.