psycopk Posted December 6, 2023 Author Report Posted December 6, 2023 DK Shivakumar: ముఖ్యమంత్రి విషయంలో అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంది: డీకే శివకుమార్ 06-12-2023 Wed 15:19 | Telangana ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకొని అధిష్ఠానానికి నివేదిక ఇచ్చామన్న డీకే శివకుమార్ తెలంగాణ ప్రజలు అధికారం కట్టబెట్టారన్న కర్ణాటక ఉపముఖ్యమంత్రి ప్రజలకు సుపరిపాలన అందిస్తామని హామీ Listen to the audio version of this article ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో తాము ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకొని అధిష్ఠానానికి నివేదిక అందించామని, ఢిల్లీ పెద్దలు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నిర్ణయించారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. అధిష్ఠానానికి అన్ని అంశాలను నివేదించినట్లు చెప్పారు. ఇక నుంచి అధిష్ఠానమే అన్ని నిర్ణయాలను తీసుకుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక అంశంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారన్నారు. వారికి సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా రేపు... రేవంత్ ప్రమాణ స్వీకారానికి డీకే శివకుమార్ హాజరు కానున్నారు. Quote
psycopk Posted December 6, 2023 Author Report Posted December 6, 2023 Revanth Reddy: ముఖ్యమంత్రిగా ఆమెకు తొలి ఉద్యోగం... రేపు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి సంతకం 06-12-2023 Wed 16:27 | Telangana కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దివ్యాంగురాలికి ఉద్యోగం ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఈ మేరకు యువతికి గ్యారెంటీ కార్డుపై సంతకం చేసిచ్చిన రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం Listen to the audio version of this article తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మొదటి ఉద్యోగాన్ని ఓ దివ్యాంగురాలికి ఇవ్వనుంది. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రేవంత్ రెడ్డి... రజని అనే యువతికి ఉద్యోగం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆమెకు ఆహ్వానం పంపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తామంటూ గత అక్టోబర్ నెలలో రజనికి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తాను పీజీ పూర్తి చేసినప్పటికీ ప్రయివేటు లేదా ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రజని నాంపల్లికి చెందిన యువతి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే వస్తారని.. వారి సమక్షంలోనే ఉద్యోగం ఇస్తామని ఆమెకు రేవంత్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆమెకు రేవంత్ రెడ్డి గ్యారెంటీ కార్డును రాసి ఇచ్చారు. రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రజనికి ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రమాణ స్వీకారానికి రజనికు కూడా అహ్వానం పంపించారు. Quote
psycopk Posted December 6, 2023 Author Report Posted December 6, 2023 Revanth Reddy: ట్విస్ట్... ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాక అధిష్ఠానం పిలుపు.. వెనక్కి వెళ్లిన రేవంత్ రెడ్డి 06-12-2023 Wed 16:58 | Telangana పార్టీ అగ్రనేతలతో భేటీ అనంతరం హైదరాబాద్‌కు వచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్ అధిష్ఠానం పిలుపుతో విమానాశ్రయం నుంచి మహారాష్ట్ర సదన్‌కు చేరుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో సమావేశం Listen to the audio version of this article టీపీసీసీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు వచ్చేందుకు ఢిల్లీ విమానాశ్రయం వరకు వచ్చి మళ్లీ వెనక్కి వెళ్లారు. ఆయన విమానాశ్రయం నుంచి మహారాష్ట్ర సదన్‌కు వెళ్లారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఆయన నిన్న ఢిల్లీకి వెళ్లారు. నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం రేవంత్ రెడ్డి పలువురు నేతలను కలుస్తున్నారు. నిన్న రాత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలిశారు. పలువురు నేతలు మిఠాయి తినిపించి.. రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. వరుస భేటీల అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్ పయనమయ్యారు. అయితే విమానాశ్రయానికి వచ్చాక, వెనక్కు రావాల్సిందిగా ఆయనకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో విమానాశ్రయం నుంచి మహారాష్ట్ర సదన్‌కు వెళ్లారు. ఇక్కడ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. Quote
psycopk Posted December 6, 2023 Author Report Posted December 6, 2023 Revanth Reddy: 'మీ రేవంత్‌రెడ్డి.. సీఎల్పీ నాయకుడు' అంటూ ప్రజలకు కాబోయే ముఖ్యమంత్రి లేఖ 06-12-2023 Wed 17:29 | Telangana తెలంగాణ ప్రజలను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డి లేఖ రేపు మధ్యాహ్నం గం.1:04 కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు వెల్లడి విద్యార్థుల పోరాటం, సోనియా ఉక్కు సంకల్పంతో తెలంగాణ ఏర్పడిందని వ్యాఖ్య Listen to the audio version of this article తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తూ లేఖ రాశారు. ప్రజా ప్రభుత్వ స్వీకారానికి ఆహ్వానం పలుకుతున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం లేఖను విడుదల చేశారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు... విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేరే ఇందిరమ్మ రాజ్యస్థాపనకు సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనార్టీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్ 7న మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుందన్నారు. ఈ మహోత్సవానికి రావాల్సిందిగా అందరికీ ఆహ్వానం పంపుతున్నామని పేర్కొన్నారు. Quote
psycopk Posted December 6, 2023 Author Report Posted December 6, 2023 Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు: డీజీపీ 06-12-2023 Wed 17:46 | Telangana సీఎస్, సీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ ప్రమాణ స్వీకారానికి వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపిన డీజీపీ లక్షమంది ప్రజలు రావొచ్చునని చెప్పిన డీజీపీ రవిగుప్తా Listen to the audio version of this article రేపు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని డీజీపీ రవిగుప్తా తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు తెలిపారు. డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతికుమారి, సీపీ సందీప్ శాండిల్య, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ తదితరులు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ... సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం నేపథ్యంలో రేపు ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. దాదాపు లక్షమంది సభకు హాజరు కావొచ్చునని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, ఎల్బీ స్టేడియంలో ముప్పై వేలమంది కూర్చోవచ్చునని స్పష్టం చేశారు. మిగిలిన వారి కోసం స్టేడియం బయట ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. Quote
Popular Post ManOffSteel Posted December 6, 2023 Popular Post Report Posted December 6, 2023 Anna confuse ainattunnav eedu manodu kadu 4 Quote
Sucker Posted December 6, 2023 Report Posted December 6, 2023 16 minutes ago, ManOffSteel said: Anna confuse ainattunnav eedu manodu kadu Ila own cheskotam not new maaku. He is CBN student. 2 Quote
pizzaaddict Posted December 6, 2023 Report Posted December 6, 2023 1 minute ago, Sucker said: Ila own cheskotam not new maaku. He is CBN student. Db venu swamy alias @csrcsr ki , neeku idhey Pani ga 2 Quote
psycopk Posted December 6, 2023 Author Report Posted December 6, 2023 19 minutes ago, ManOffSteel said: Anna confuse ainattunnav eedu manodu kadu 2 minutes ago, Sucker said: Ila own cheskotam not new maaku. He is CBN student. meku edi convinent ga unte aa point meda edavandi… mee bratuku ante.. 1 Quote
Sucker Posted December 6, 2023 Report Posted December 6, 2023 1 minute ago, psycopk said: meku edi convinent ga unte aa point meda edavandi… mee bratuku ante.. Hi thatha congress vaallu inka exciting feel avvatam ledhu. Quote
psycopk Posted December 6, 2023 Author Report Posted December 6, 2023 4 minutes ago, Sucker said: Hi thatha congress vaallu inka exciting feel avvatam ledhu. Neku antaga em kanipinchindi vayya.. Quote
Sucker Posted December 6, 2023 Report Posted December 6, 2023 1 minute ago, psycopk said: Neku antaga em kanipinchindi vayya.. Kaannivvu thatha. We need more fun. 1 Quote
CanadianMalodu Posted December 6, 2023 Report Posted December 6, 2023 Confidence , hard work ee kaadhu MOOTALU, MOOTALU, Babori MOOTALU kooda. Ippudu CM ayyaka, Telangana prajala nunchi manchi MOOTALU pampali, MP elections ki. 1 Quote
andhra_jp Posted December 6, 2023 Report Posted December 6, 2023 20 hours ago, psycopk said: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఆయన ఎల్లుండి సాయంత్రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచింది. మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ సీఎం కావాలని అధిష్ఠానానికి సూచించారు. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీఎం అభ్యర్థిపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాజకీయ జీవిత ప్రయాణం గురించి కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ట్విట్టర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. - 1969 - నవంబరు 8న నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్ - 2006 - మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం. - 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక. - 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు. - 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్. - 2014–17 మధ్య టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్. - 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా - 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిక. - 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. - 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి. - 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం. - 2021 జూన్ 26న పీసీసీ అధ్యక్ష్యుడిగా రేవంత్ నియామకం. - 2021 జులై 7న టీపీసీపీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం. - 2023 డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా బాధ్యతలు. paina Revanth Anna timeline journey loo vote for note scam leedu emiti ani CBN fans asking 1 Quote
futureofandhra Posted December 6, 2023 Report Posted December 6, 2023 Just now, andhra_jp said: paina Revanth Anna timeline journey loo vote for note scam leedu emiti ani CBN fans asking just like kcr n jagan buying mlas list lo vundavu ga in their journey idhi anthey Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.