psycopk Posted December 9, 2023 Report Posted December 9, 2023 Nara Lokesh: జగన్ మాటలు విన్నాక పాదయాత్ర చేసింది ఆయనేనా అనే అనుమానం కలుగుతోంది: లోకేశ్ 09-12-2023 Sat 21:44 | Andhra నేడు పిఠాపురం, తుని నియోజకవర్గాల్లో యువగళం తుని నియోజకవర్గంలో యనమల ఆధ్వర్యంలో లోకేశ్ కు ఘనస్వాగతం పెరుమాళ్లపురం వద్ద మత్స్యకారులతో లోకేశ్ సమావేశం మత్స్యకారులను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని వెల్లడి చేతగాని సీఎం అవసరమా అంటూ వ్యాఖ్యలు రోడ్ల గురించి కూడా పట్టించుకోండి దాడిశెట్టి గారూ..అంటూ మంత్రికి విజ్ఞప్తి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 217వరోజు పిఠాపురం నియోజకవర్గం శీలంవారిపాకలు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. పెరుమాళ్లపురం వద్ద టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, తుని ఇన్ చార్జి యనమల దివ్య నేతృత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు లోకేశ్ కు ఘనస్వాగతం పలికారు. జీఎంఆర్ హాస్పటల్ వద్ద మత్స్యకారులతో నారా లోకేశ్ ముఖాముఖి సమావేశయ్యారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. జగన్ ఎక్కడ చదివాడో తెలియదు! మత్స్యకారుల పొట్ట కొడుతూ జగన్ తెచ్చిన జీవో నెం.217 టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేసి, చెరువులు తిరిగి మత్స్యకారులకు అందిస్తాం. ఉల్లి గడ్డకి, బంగాళాదుంపకి తేడా తెలియని వ్యక్తి మనకి ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్ ఎక్కడ చదివాడో తెలియదు. టెన్త్ పేపర్లు కొట్టేసి పాసయ్యాడు. ఆయన మాటలు విన్నాక పాదయాత్ర చేసింది జగనా లేక డూప్ తో చేయించారా అనే అనుమానం కలుగుతోంది. తుపాను వలన మత్స్యకారులు, రైతులు నష్టపోతే పరామర్శించే మనస్సు జగన్ కి రాలేదు. మత్స్యకారులు కష్టాన్ని నమ్ముకొని బతుకుతారు. సాయం చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. గంగమ్మనే నమ్ముకొని మత్స్యకారులు జీవిస్తారు. బాబు హయాంలో ఏపీ మత్స్యకార ప్రదేశ్ అనిపించుకుంటే... జగన్ హయాంలో ఫినిష్ ఆంధ్ర అనిపించుకుంది. మత్స్యకారులను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా ఇక్కడ పైప్ లైన్ కారణంగా నష్టపోతున్న మత్స్యకారులను టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదుకుంటాం. మత్స్యకారుల పిల్లల చదువుల కోసం 3 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది టీడీపీ. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరో 5 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బోట్లకి ఇన్స్యూరెన్స్ అందిస్తాం. మత్స్యకారులను గుండెల్లో పెట్టుకొని కాపాడుకునే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ట్రీట్ మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం జగన్ ప్రభుత్వం ఆక్వా రంగాన్ని, హేచరిస్ ని చంపేసింది. పొల్యూషన్ లేని కంపెనీలు తీసుకొచ్చి స్థానికంగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కెమికల్, ఫార్మా కంపెనీల వ్యర్ధాలు సముద్రంలో కలవకుండా పొల్యూషన్ ట్రీట్మెంట్ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఎలా అయితే బోట్లు, ఇంజిన్, వలలు, జీపీఎస్, ఐస్ బాక్సులు ఇచ్చామో... తిరిగి అదే విధానాన్ని అమలు చేస్తాం. మత్స్యకారులకు అవసరమైనవి సబ్సిడీలో అందిస్తాం. చేతగాని సీఎం అవసరమా... వై ఏపీ నీడ్స్ జగన్? ఇది తుని నియోజకవర్గం పెరుమాళ్లపురంలో జగన్ సర్కారు ఫిష్ ఆంధ్ర పేరుతో ఏర్పాటు చేసిన చేపల దుకాణం. పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడం చేతకాని జగన్ రెడ్డి... మత్స్యకారుల పొట్టగొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. 90 శాతం ఫిష్ ఆంధ్రా అవుట్ లెట్లు ఫినిష్ అయ్యాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అయిదేళ్ల పుణ్యకాలమూ పూర్తయిపోయింది. నమ్మకద్రోహం, అబద్ధాలు, వంచనకు ప్యాంటు, షర్టు వేస్తే జగన్... ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ఇటువంటి చేతగాని, చేవలేని దద్దమ్మ ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరమా... వై ఏపీ నీడ్స్ జగన్? కాస్త రోడ్ల గురించి కూడా పట్టించుకోండి దాడిశెట్టి గారూ...! ఇవి తుని నియోజకవర్గం పెరుమాళ్లపురంలో జగనన్న గుంతల పథకంలో ఏర్పాటైన భారీగోతులు! పైగా ఇది రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం. ఆర్ అండ్ బి మంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిధ్యం వహిస్తున్న చోటే రోడ్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇక రాష్ట్రం మొత్తమ్మీద ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లకు వివిధ విభాగాల ద్వారా రూ.2 లక్షల కోట్లకు పైగా బకాయిలు పెట్టడంతో ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా జలగన్న దివాలాకోరు మొఖం చూసి రోడ్లు వేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. సందు దొరికినప్పుడల్లా ప్రతిపక్షాలపై నోరేసుకుని దాడిచేయడం కాదు... కాస్త రోడ్లపై కూడా దృష్టిసారించండి దాడిశెట్టి గారూ! *యువగళం పాదయాత్ర వివరాలు* ఈరోజు నడిచిన దూరం 16.4 కి.మీ. *ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2990.4 కి.మీ.* *218వరోజు (10-12-2023) యువగళం వివరాలు* *తుని అసెంబ్లీ నియోజకవర్గం* *ఉదయం* 8.00 – ఒంటిమామిడి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం. 8.15 – ఒంటిమామిడి జంక్షన్ లో మత్స్యకారులతో సమావేశం. 9.45 – తొండంగి హనుమాన్ జంక్షన్ లో రైతులతో సమావేశం. 10.00 – తొండంగి ఎమ్మార్వో ఆఫీసు వద్ద స్థానికులతో సమావేశం. 10.45 – శృంగవృక్షంలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం. 11.15 – శృంగవృక్షంలో భోజన విరామం. మధ్యాహ్నం 3.00 – శృంగవృక్షంలో కాకినాడ సెజ్ రైతులతో ముఖాముఖి. సాయంత్రం 4.00 – శృంగవృక్షం నుంచి పాదయాత్ర కొనసాగింపు. 5.00 – వలసపాకల గ్రామంలో స్థానికులతో సమావేశం. 5.30 – టి.తిమ్మాపురం ఎన్టీఆర్ విగ్రహం వద్ద పెరికలతో సమావేశం. 6.30 – తిమ్మాపురం అంబేద్కర్ సెంటర్ లో దళితులతో సమావేశం. రాత్రి 7.45 – తేటగుంట పంజాబీ దాబా వద్ద విడిది కేంద్రంలో బస. ****** 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.