Jump to content

Revant hits on jagan revenue stream


psycopk

Recommended Posts

Revanth Reddy: తెలంగాణలో డ్రగ్స్ అనే మాట వినపడవద్దు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

11-12-2023 Mon 22:21 | Telangana
  • సోమవారం ఐదు కీలక శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం
  • ప్రతి నెల నార్కోటిక్ బ్యూరోపై సమీక్ష నిర్వహిస్తానన్న సీఎం
  • సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఆమ్రపాలి
Revanth Reddy reviw on drugs

తెలంగాణ రాష్ట్రంలో ఇక నుండి డ్రగ్స్ అనే మాట వినపడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన సోమవారం ఐదు కీలక శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, నార్కోటిక్ అండ్ డ్రగ్స్, ఎక్సైజ్, టీఎస్‌పీఎస్సీ, సింగరేణిలపై సమీక్ష నిర్వహించారు. నార్కోటిక్ అండ్ డ్రగ్స్‌పై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మన రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడవద్దన్నారు. ఇక నుంచి ప్రతి నెల నార్కోటిక్ బ్యూరోపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. టీఎస్‌పీఎస్సీపై మరోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

రేవంత్ రెడ్డిని కలిసిన ఆమ్రపాలి

ఐఏఎస్ ఆమ్రపాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇటీవల కేంద్ర సర్వీసులో ఆమ్రపాలి డిప్యుటేషన్ పూర్తి కావడంతో రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని కలిశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె రిపోర్ట్ చేశారు.

  • Haha 1
Link to comment
Share on other sites

Tollywood Drugs: తాట తీస్తాం.. డ్రగ్స్ పై టాలీవుడ్ ను హెచ్చరించిన హైదరాబాద్ కొత్త కమిషనర్ 

13-12-2023 Wed 18:44 | Entertainment
  • హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలను స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి
  • టాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగం ఉందని తెలుస్తోందని వ్యాఖ్య
  • సీఎం ఆదేశాల మేరకు ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిక
 
Hyderabad police commissioner warning to Tollywood on Drugs

గత కొన్నేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమను డ్రగ్స్ భూతం పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో విచారణను కూడా ఎదుర్కొన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత... రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాట వినపడకూడదని స్పష్టంగా చెప్పారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. ఆయన చెప్పినట్టుగానే కార్యాచరణ మొదలయినట్టుగా కనిపిస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఈరోజు బాధ్యతలను స్వీకరించిన కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తొలిసారి మీడియాతో మాట్లాడుతూ... డ్రగ్స్ మాఫియాకు హెచ్చరికలు జారీ చేశారు. 

సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం ఉందని తెలుస్తోందని హైదరాబాద్ సీపీ అన్నారు. టాలీవుడ్ లో డ్రగ్స్ మూలాలు ఉన్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించే పరిస్థితి లేదని హెచ్చరించారు. డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి సినీ పెద్దలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పబ్స్, ఫామ్ హౌస్ యజమానులు, రెస్టారెంట్లను నిర్వహించేవారు డ్రగ్స్ ను ప్రోత్సహిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. డ్రగ్స్ భూతాన్ని కూకటివేళ్లతో పెకిలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. 

Link to comment
Share on other sites

3 hours ago, Funkops said:

Emi legal chesaru. Only weed. Not Meth, cocaine etc

Yes.. now many more people started using weed and next step is heroin or cocaine.. 

Now synthetic drugs are all over the place.. just oka tablet veskunte meth ki konni times high isthundanta.. that is a leading contributor to all drug related deaths

Link to comment
Share on other sites

sandeep sandilya: తెలంగాణలో అల్ఫాజోలం డ్రగ్ తలనొప్పిగా మారింది.. కొకైన్ కంటే ప్రమాదకరం: సందీప్ శాండిల్య 

25-12-2023 Mon 22:08 | Both States
  • అల్ఫాజోలం అక్రమంగా తరలిస్తున్నవారిని ఉపేక్షించేది లేదన్న సందీప్ శాండిల్య
  • ఇటీవల వరుసగా అల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి
  • హైదరాబాద్‌లో 66 కేసులు నమోదయ్యాయన్న సందీప్ శాండిల్య
 
TS Nyab director on Alprazolam

తెలంగాణలో అల్ఫాజోలం తలనొప్పిగా మారిందని, ఇది మాదకద్రవ్యాల్లోని కొకైన్ కంటే ప్రమాదకరంగా తయారయిందని టీఎస్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య అన్నారు. అల్ఫాజోలం అక్రమంగా తరలిస్తున్నవారిని ఉపేక్షించేది లేదన్నారు. ఇటీవల 3.14 కోట్ల రూపాయల విలువ చేసే 31.42 కిలోల అల్ఫాజోలంను నాగర్ కర్నూలు జిల్లాలో పట్టుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత రెండు రోజలు క్రితం జిన్నారంలో 14 కిలోల నార్డజెపమ్ డ్రగ్‌ను పట్టుకున్నట్లు తెలిపారు. మరో కేసులో సూరారం పరిధిలో నరేందర్ అనే వ్యక్తి నుంచి పది కిలోల అల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో కేసులో విధుల నుంచి తొలగించిన ఏఆర్ కానిస్టేబుల్ ఇలాంటి దందాలో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో అల్ఫాజోలంకు సంబంధించి 66 కేసులు నమోదయినట్లు తెలిపారు

Link to comment
Share on other sites

మరో కేసులో విధుల నుంచి తొలగించిన ఏఆర్ కానిస్టేబుల్ ఇలాంటి దందాలో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు

epic

Link to comment
Share on other sites

On 12/18/2023 at 9:35 PM, Thokkalee said:

Yes.. now many more people started using weed and next step is heroin or cocaine.. 

Now synthetic drugs are all over the place.. just oka tablet veskunte meth ki konni times high isthundanta.. that is a leading contributor to all drug related deaths

Fentanyl 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...