Jump to content

Recommended Posts

Posted

AP Unemployment Rate: ఏపీలో నిరుద్యోగిత దేశంలోనే అధికం.. ఇవిగో ఆధారాలు: నారా లోకేశ్ 

12-12-2023 Tue 09:57 | Andhra
  • ఏపీలోని నిరుద్యోగిత రేటు 24 శాతమన్న లోకేశ్
  • ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని ఆగ్రహం
  • యువత నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన
 
Andhra Pradesh has THE HIGHEST UNEMPLOYMENT RATE in the country says Nara Lokesh

దేశంలోనే అత్యధిక నిరుద్యోగిత రేటు కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 24 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఒకప్పుడు ఓ వెలుగువెలిగిన రాష్ట్రాన్ని వైఎస్ జగన్ నాశనం చేశారని, అట్టడుగుకు చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఉద్యోగాల్లేక యువత నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి అభివృద్ధి సాధించే అర్హత ఉందని, యువతకు వృద్ధిలోకి వస్తారని పేర్కొన్నారు. ఏపీలో నిరుద్యోగిత రేటుపై తాను చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపుతూ ఓ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం క్లిప్లింగ్‌ను లోకేశ్ జతచేశారు.

20231212fr6577df6959289.jpg

 

  • Haha 1
Posted

Kaushal Kishore: విశాఖ మెట్రో రుణంపై ఏపీ ప్రతిపాదనలు పంపలేదు: కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ 

12-12-2023 Tue 09:55 | Andhra
  • వైజాగ్ మెట్రోకు నిధులిచ్చేందుకు గతంలో కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకు నిస్సహాయత
  • ఇతర బ్యాంకు రుణాలపై ఏపీ ఎటువంటి ప్రతిపాదనలు పంపలేదన్న కేంద్ర మంత్రి
  • రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి 
 
Minister kaushal kishore on vizag metro

వైజాగ్ మెట్రో ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి కొరియన్ ఎగ్జిమ్ బ్యాంకు నిస్సహాయత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, మరేదైనా సంస్థ నుంచి ప్రాజెక్టు రుణం ఇప్పించాలని ఏపీ ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. రాజ్యసభలో సోమవారం టీడీపీ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. పట్టణ రవాణా వ్యవస్థకు సంబంధించి ప్రణాళిక, నిర్వహణ, నిధుల సమీకరణ, పర్యవేక్షణ, అమలు బాధ్యత సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలనే అని ఆయన స్పష్టం చేశారు. కర్నూలు విమానాశ్రయం నుంచి బెంగళూరు, వైజాగ్, చెన్నైకి విమానాలు నడపడానికి ఇండిగో ఎయిర్‌‌లైన్స్ షెడ్యూల్ సమర్పించినట్టు కేంద్ర పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు. ప్రాంతీయ అనుసంధాన పథకం కింద ఈ ఎయిర్‌పోర్టును రూ.241 కోట్లతో అభివృద్ధి చేసినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. 

Posted

Correct e AP lo nirudhyogam ekkuve....andulo first unnadi rajakeeya nirudhyogi Lokesham! Janaalu odinchi intlo kurchobettaru! 

Posted
11 hours ago, Android_Halwa said:

Proof ante edo anukunna….ori lokesha…endi ra ayya ?

 

  • Haha 2
Posted

Pattabhi: నిరుద్యోగంలో ఏపీని దేశంలోనే నెంబర్ 1గా నిలిపిన ఘనుడు జగన్: పట్టాభిరామ్ 

13-12-2023 Wed 22:11 | Andhra
  • నిరుద్యోగ రేటులో బీహార్ ను ఏపీ మించిపోయిందన్న పట్టాభి
  • నిరుద్యోగం పెరగడానికి జగన్ అసమర్థతే కారణమని విమర్శ
  • నిరుద్యోగ భృతికి కూడా మంగళం పాడారని మండిపాటు
 
Pattabhi fires on Jagan

ముఖ్యమంత్రి జగన్ సాధించిన ఘనతలతో రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని టీడీపీ నేత పట్టాభిరామ్ విమర్శించారు. నిరుద్యోగ రేటులో ఏపీని దేశంలోనే నెంబర్ 1గా నిలిపిన ఘనత జగన్ దేనని అన్నారు. మన దేశంలోని పట్టభద్రుల్లో ఎక్కువగా నిరుద్యోగులు ఏపీలోనే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ నివేదికలో వెల్లడయిందని చెప్పారు. 24 శాతం నిరుద్యోగ రేటుతో బీహార్ ను ఏపీ మించిపోయిందని విమర్శించారు. నిరుద్యోగ రేటు తెలంగాణలో 16.6 శాతంగా, తమిళనాడులో 16.3 శాతంగా, బీహార్ లో 16.6 శాతంగా, కేరళలో 19.8 శాతంగా ఉందని చెప్పారు.     

 
రాష్ట్రంలో నిరుద్యోగ రేటు పెరగడానికి జగన్ అసమర్థతే కారణమని పట్టాభిరామ్ దుయ్యబట్టారు. గత నాలుగేళ్లలో ఉద్యోగాలు రాక 1,745 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఏపీకి రూ. 1,26,615 కోట్ల పెట్టుబడులు వచ్చాయని... జగన్ సీఎం అయిన తర్వాత ఏడాదికి రూ. 13,515 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని తెలిపారు. ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో చంద్రబాబు అందించిన నిరుద్యోగ భృతికి కూడా జగన్ మంగళం పాడారని విమర్శించారు. ప్రభుత్వ అవినీతి, వైసీపీ నేతల వేధింపులను భరించలేకే ఏపీకి పెట్టుబడులు రావడం లేదని చెప్పారు.
  • Haha 1
Posted
On 12/12/2023 at 10:34 AM, rushmore said:

Correct e AP lo nirudhyogam ekkuve....andulo first unnadi rajakeeya nirudhyogi Lokesham! Janaalu odinchi intlo kurchobettaru! 

vella ayya ivhina jobs anni etu poinaioo 

ippude lechadu bidda arustunnadu jobs levani

  • Haha 2

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...