psycopk Posted December 15, 2023 Report Posted December 15, 2023 https://www.instagram.com/reel/C01V3KBp6YW/?igshid=MzRlODBiNWFlZA== Quote
psycopk Posted December 15, 2023 Author Report Posted December 15, 2023 KCR Secutiry: కేసీఆర్ కు జడ్ ప్లస్ సెక్యూరిటీని తొలగించిన రేవంత్ ప్రభుత్వం 15-12-2023 Fri 11:03 | Telangana ఇప్పటి వరకు జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్న కేసీఆర్ భద్రతను వై కేటగిరీకి కుదించిన ప్రభుత్వం 4 ప్లస్ 4 గన్ మెన్లు, కాన్వాయ్ లో ఒక వాహనం కేటాయింపు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భద్రతను కుదించింది. ఇప్పటి వరకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న కేసీఆర్ కు వై కేటగిరీ భద్రతను ఏర్పాటు చేశారు. వై కేటగిరీ భద్రత కింద కేసీఆర్ కు 4 ప్లస్ 4 గన్ మెన్లతో పాటు, ఇంటి దగ్గర సెంట్రీ ఉంటుంది. కాన్వాయ్ కు సంబంధించి ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తారు. మాజీ మంత్రులుగా పని చేసి, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి 2 ప్లస్ 2 భద్రతను కల్పించారు. మాజీ ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ల ఛైర్మన్లకు భద్రతను పూర్తిగా తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగో ప్రముఖుల సెక్యూరిటీపై కూడా సమీక్ష జరిగింది. మాజీలలో ఎవరికైనా భద్రత అవసరమైన వారికి, ఏజెన్సీ ఏరియాలో ఉన్న వారికి గన్ మెన్లను ఇచ్చే అవకాశం ఉంది. అయితే, వీరికి సంబంధించి పూర్తిగా రివ్యూ చేసిన తర్వాతే గన్ మెన్లను ఇవ్వడంపై తుది నిర్ణయం తీసుకుంటారు. Quote
psycopk Posted December 15, 2023 Author Report Posted December 15, 2023 Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం... మాజీలకు గన్మన్ల తొలగింపు 14-12-2023 Thu 22:13 | Telangana మాజీ మంత్రులతో పాటు మాజీ ఎమ్మెల్యేలకూ గన్ మన్ల తొలగింపు ఎవరికి గన్మన్లు అవసరమనే దానిపై సమీక్షించనున్న ఇంటెలిజెన్స్ అధికారులు Listen to the audio version of this article తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భద్రతను తొలగించింది. వారికి గన్మన్లను తొలగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గన్మన్లను పోలీస్ శాఖ ఉపసంహరించుకుంటోంది. ఎవరికి గన్మన్లు అవసరమనే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షించనున్నారు. ఆ తర్వాతే మాజీలకు గన్మన్లను కేటాయిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై దృష్టి సారించింది. ఇప్పుడు మాజీ మంత్రుల సెక్యూరిటీని తొలగించింది. Quote
psycopk Posted December 15, 2023 Author Report Posted December 15, 2023 Gas Cylinder: లబ్ధిదారుల ఎంపిక ఎలా?.. రూ. 500కే గ్యాస్ సిలిండర్‌పై రేవంత్ ప్రభుత్వం కసరత్తు 15-12-2023 Fri 09:28 | Telangana కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో రూ. 500కు గ్యాస్ సిలిండర్ ఒకటి రెండు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రతిపాదనలో రేషన్‌కార్డు ఉన్న వారితోపాటు లేనివారిలోనూ లబ్ధిదారుల ఎంపిక రెండో ప్రతిపాదనలో రేషన్‌కార్డుతో పనిలేకుండానే సిలిండర్ పంపిణీ లబ్ధిదారులను బట్టి ప్రభుత్వంపై భారం Listen to the audio version of this article ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒకటైన రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకం హామీని నిలబెట్టుకునేందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెడీ అవుతోంది. మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్‌ను అందించనుండగా, ఇందుకోసం రెండు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రేషన్‌కార్డు ఉన్న వారితోపాటు లేని వారిలోనూ లబ్ధిదారులను ఎంపిక చేయడం అందులో మొదటిది కాగా, రేషన్‌కార్డుతో పనిలేకుండా లబ్ధిదారులకు అందించడం రెండోది. రాష్ట్రంలో మొత్తం 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా వీరిలో 44 శాతం మంది (52.80 లక్షల మంది) ప్రతి నెల రీఫిల్ బుక్ చేసుకుంటున్నారు. రేషన్‌కార్డు ఉన్న కుటుంబాలు 89.99 లక్షలు. ఈ లెక్కన తొలి ప్రతిపాదన ప్రకారం ఈ పథకాన్ని త్వరగానే అమలు చేయవచ్చు, కాకపోతే అనర్హులు కూడా లబ్ధిదారులయ్యే అవకాశం ఉంది. అంటే దాదాపు కోటిమందికి రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే, రెండో ప్రతిపాదనను కనుక పరిగణనలోకి తీసుకుంటే లబ్ధిదారుల గుర్తింపు కోసం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ‘గివ్ ఇట్ అప్’లో భాగంగా రాష్ట్రంలోని 4.2 లక్షల మంది రాయితీని వదులుకున్నారు. దీంతో మిగిలిన వినియోగదారుల్లో ఎంతమందిని ఈ పథకానికి ఎంపిక చేస్తారనేది ఆసక్తిగా మారింది. పథకానికి ఎంపికయ్యే లబ్ధిదారులకు ఏడాదికి 6 సిలింండర్లు ఇస్తే ప్రభుత్వంపై దాదాపు రూ. 2,225 కోట్ల అదనపు భారం పడుతుంది. అదే రూ. 12 సిలిండర్లు ఇస్తే కనుక ఇది రెండింతలు అవుతుంది. Quote
psycopk Posted December 15, 2023 Author Report Posted December 15, 2023 TSRTC: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు నేటి నుంచి జీరో టికెట్స్ 15-12-2023 Fri 08:53 | Telangana గురువారం రాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వచ్చిన ‘జీరో టికెటింగ్’ విధానం టిమ్ మెషిన్లలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన టీఎస్ఆర్టీసీ ప్రయోగాత్మక పరిశీలన విజయవంతమవ్వడంతో శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన విధానం Listen to the audio version of this article ఎన్నికల హామీల్లో భాగంగా ‘మహాలక్ష్మి’ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తోంది. కాగా గురువారం రాత్రి 12 గంటల నుంచి ‘జీరో టికెటింగ్’ విధానం అమ్లలోకి వచ్చింది. శుక్రవారం నుంచి జీరో టికెట్లను జారీ చేయాలని ఆర్టీసీ అధికారులకు ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానాన్ని గురువారం రాత్రి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. అది విజయవంతమవ్వడంతో అమల్లోకి తీసుకొచ్చారు. ఈ మేరకు టికెట్లు జారీ చేసే టిమ్ మెషిన్లలో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు, ప్రయాణించేది ఆర్డినరీ బస్సా లేక ఎక్స్‌ప్రెస్ బస్సా అనే వివరాలు ‘జీరో టికెట్’పై రికార్డ్ అవుతున్నాయి. బుధవారం రాత్రి నుంచే వీటి పనితీరుని పరిశీలించారు. కుషాయిగూడ, మిధాని సిటీ డిపోల్లో ప్రయోగాత్మకంగా జీరో టికెటింగ్‌ను అమలు చేసి పరిశీలించారు. మరోవైపు రెగ్యులర్ బస్సులతోపాటు ప్రత్యేక బస్సుల్లో కూడా మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. పండుగలు, జాతరల సమయాల్లో నడిపే బస్సు సర్వీసుల్లో కూడా ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపింది. వారాంతాల్లో నడిపే అదనపు బస్సులకూ ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు జీరో టికెట్‌పై ప్రయాణించవచ్చు. కొమురవెల్లి, నాగోబా వంటి జాతరలతోపాటు ప్రధానమైన పండుగలకు ప్రత్యేకంగా నడిపే సర్వీసుల్లో ఈ వెసులుబాటు మహిళలకు అందుబాటులో ఉంటుంది. Quote
JaiBalayyaaa Posted December 15, 2023 Report Posted December 15, 2023 9 minutes ago, psycopk said: https://www.instagram.com/reel/C01V3KBp6YW/?igshid=MzRlODBiNWFlZA== Old video Quote
psycopk Posted December 15, 2023 Author Report Posted December 15, 2023 Amrapali: హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలికి బాధ్యతలు అప్పగించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం 14-12-2023 Thu 20:08 | Telangana కొందరి బదిలీ.. మరికొందరికి అదనపు బాధ్యతలు డిప్యూటీ సీఎం మల్లు భట్టి ఓఎస్డీగా కృష్ణ భాస్కర్ నియామకం వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా మంత్రి శ్రీధర్ బాబు భార్య Listen to the audio version of this article తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు అధికారులను బదిలీ చేసింది... మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఓఎస్డీగా కృష్ణ భాస్కర్‌ను నియమించింది. ఇంధన శాఖ కార్యదర్శిగా అలీ ముర్తుజా రిజ్వీనిను నియమించింది. ట్రాన్స్‌కో, జెన్కోగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా ఆమ్రపాలికి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం... మూసీ అభివృద్ధి సంస్థ ఇంచార్జ్ ఎండీగా అదనపు బాధ్యతలు కేటాయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేసింది. మంత్రి శ్రీధర్ బాబు భార్య, ఐఏఎస్ శైలజా రామయ్యర్‌ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ట్రాన్స్ కో ఎండీగా సందీప్ కుమార్ ఝా, దక్షిణ డిస్కమ్ సీఎండీగా ముషారఫ్ అలీ, ఉత్తర డిస్కమ్ సీఎండీగా కర్ణాటి వరుణ్ రెడ్డి, వ్యవసాయ శాఖ బి.గోపికి బాధ్యతలు అప్పగించారు. Quote
psycopk Posted December 15, 2023 Author Report Posted December 15, 2023 Seethakka: అంగన్వాడీలకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ 14-12-2023 Thu 19:09 | Telangana తన ఛాంబర్లో వేదమంత్రోచ్చారణల మధ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సీతక్క మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ రూపొందిన ఫైలుపై సంతకం అంగన్వాడీ టీచర్ల వేతనాల పెంపు ఫైలుపై సంతకం Listen to the audio version of this article తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అంగన్వాడీలకు శుభవార్త చెప్పారు. తెలంగాణ సచివాలయంలో తన ఛాంబర్లో వేదమంత్రోచ్చారణల మధ్య ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మినీ అంగన్వాడీలుగా ఉన్న కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తూ రూపొందిన ఫైలుపై సంతకం చేశారు. ఈ నిర్ణయంతో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు... ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మారనున్నాయి. ఇదిలా ఉండగా, అంగన్వాడీ టీచర్లకు మంత్రి తీపి కబురు చెప్పారు. అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుతూ నిర్ణయించిన ఫైల్ మీద కూడా సంతకం చేశారు. దీంతో ఇప్పటివరకు రూ.7,500 వేతనం ఇక నుంచి రూ.13,500కు పెరగనుంది. మొదటి సంతకంతోనే మంత్రి సీతక్క తమ జీతాలు పెంచడంపై అంగన్వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Quote
psycopk Posted December 15, 2023 Author Report Posted December 15, 2023 1 minute ago, JaiBalayyaaa said: Old video Thanks thought latest one Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.