southyx Posted December 18, 2023 Report Posted December 18, 2023 రుణకంఠుడు! వారిని చూసి... రిజర్వు బ్యాంకే భయపడింది... కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది... ఎస్‌బీఐ తలుపులు మూసుకుంది... స్టాక్ ఎక్స్ఛేంజీ మదుపరులను ట్రేడింగ్‌లో అప్రమత్తం చేసింది... రాష్ట్ర అప్పులు, చెల్లింపుల మొత్తం భారం పది లక్షల కోట్లు దాటించిన ఘనుడు మరింత పెంచేందుకు ఎప్పటికప్పుడు కసరత్తులు కేంద్రం వద్దంటున్నా.. ఆర్బీఐ హెచ్చరిస్తున్నా బేఖాతరు సీఎం జగన్ తీరుతో ప్రజలపై మోయలేని రుణభారం ఈనాడు, అమరావతి వారిని చూసి... రిజర్వు బ్యాంకే భయపడింది... కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది... ఎస్‌బీఐ తలుపులు మూసుకుంది... స్టాక్ ఎక్స్ఛేంజీ మదుపరులను ట్రేడింగ్‌లో అప్రమత్తం చేసింది... ఇంతకూ దేశంలోని ఆర్థిక దిగ్గజాలందరినీ ఇంతలా భయపెట్టింది ఎవరబ్బా అనుకుంటున్నారా... ఇంకెవరు మన ఘనత వహించిన జగన్ సర్కారు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల వేటను చూసి యావద్దేశం ఆశ్చర్యపోతోంది! ఇదేం అప్పుల అప్పారావు ప్రభుత్వంరా బాబూ... అని తలబాదుకుంటోంది! పాలన ఇలా కూడా చేస్తారా అని నోరెళ్లబెడుతోంది. ఆర్థిక క్రమశిక్షణలో ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం నేడు... అప్పుల కుప్పగా మారటాన్ని చూసి విస్తుబోతోంది. అమ్మో...!! ఏకంగా పద్నాలుగు అంకెల సంఖ్యనా... ఇన్ని డబ్బులు ఏమిటని అనుకుంటున్నారా... ఇంత భారీ మొత్తం ఎవరి వద్ద ఉంటుందని ఆలోచిస్తున్నారా...? ఆంధ్రప్రదేశ్‌పై.. అంటే మనందరిపై ఇంత అప్పులు, చెల్లింపుల భారం పడింది. జగనన్న సర్కారు విచ్చలవిడి అప్పుల వల్ల, బిల్లులు చెల్లించకుండా పెండింగు పెడుతూ రావడం వల్ల రాష్ట్రంపై మొత్తం భారం ఈ స్థాయికి చేరిపోయింది. ఎక్కడ దొరికితే అక్కడ... ఏది కావాలంటే దాన్ని తాకట్టు పెడుతూ... రాష్ట్ర భవిష్యత్తును అగమ్యగోచరం చేస్తూ జగన్ సర్కార్ రుణభారాన్ని పెంచేసింది!!! మరి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని మదింపు చేసే కేంద్రం, దాని సంస్థలు ఏమీ అనడం లేదా..? అబ్బే... ఇక్కడ ఉన్నది వైకాపా ప్రభుత్వం!!! కేంద్రం హెచ్చరిస్తున్నా... ఆర్బీఐ తప్పు పడుతున్నా ఖాతరు చేయడంలేదీ సర్కారు...! రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది సరే... వాటిని సాధ్యమైనంత వేగంగా తీర్చేందుకు ఏమైనా చేస్తోందా...? అదీ లేదు... మరిన్ని కొత్త అప్పులను ఎక్కడి నుంచి తేవాలో దారి కనుక్కోండంటూ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. అప్పుల కుప్ప.. అయ్యారే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ కార్పొరేషన్లకు రుణాలు ఇస్తుంటే కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. అక్కడ నిబంధనలన్నీ ఉల్లంఘించి అప్పులు తీసుకుంటున్నారు’ అని కేంద్ర ఆర్థిక శాఖ ఏకంగా రిజర్వు బ్యాంకు ద్వారా జాతీయ బ్యాంకులను అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌కు ఇవ్వాల్సిన రూ.1,800 కోట్ల అప్పును స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిలిపేసింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి డిపాజిట్లు స్వీకరించింది. చేసిన డిపాజిట్లకు వడ్డీలు చెల్లిస్తామంటూ వాటికి హామీలు ఇచ్చింది. ఈ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వమే వినియోగించుకుంది. ఇదీ ఒక తరహా అప్పే. ఇలా చేయడం తప్పని రిజర్వు బ్యాంకు తప్పు పట్టింది. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుంటున్న తీరు రాజ్యాంగ విరుద్ధమని, ఇది ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి విరుద్ధమని సాక్షాత్తూ కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి సైతం స్పష్టంచేశారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్... రూ.5,000 కోట్లను నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల రూపంలో సమీకరించేందుకు ప్రయత్నించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడింగుకు ప్రయత్నించింది. ఆ ట్రేడింగులో ఎవరూ పాల్గొనవద్దని స్టాక్ ఎక్స్ఛేంజీ సీనియర్ మేనేజర్ హెచ్చరించారంటే రాష్ట్ర అప్పుల దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అప్పులు విశ్వరూపం దాల్చాయి. జగన్ సర్కారు చేసిన భారీ రుణాలతో సహా తాజా పరిస్థితుల ప్రకారం రాష్ట్రం మొత్తం రుణాలు, చెల్లింపుల భారాలు కలిపి మొత్తం రూ.10.11 లక్షల కోట్లకు చేరింది. కేంద్ర ప్రభుత్వం బహుపరాక్ అని హెచ్చరిస్తున్నా... శ్రీలంకను చూసి కళ్లు తెరవండని సాక్షాత్తూ కేంద్ర మంత్రి దిల్లీలో సమావేశం నిర్వహించి అప్రమత్తం చేసినా... వైకాపా ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. మరోవైపు గుత్తేదారులకు, సరఫరాదారులకు చెల్లింపులు చేయలేక చేతులెత్తేస్తోంది. ఆ భారమూ రూ.1,70,000 కోట్ల వరకు చేరినట్లు అనధికారిక అంచనా. ఆ పెండింగు బిల్లులూ ఒకరకంగా అప్పుల్లాంటివే. వెరసి రాష్ట్రం రుణాల సుడిగుండంలో చిక్కుకుపోతోంది. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా అంతో ఇంతో అప్పులు అవసరమే. అయితే రాష్ట్ర మొత్తం నికర ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ)లో అవి 35% మించకూడదనేది ఆర్థిక సంఘం సూత్రం. దాన్ని జగన్ వినిపించుకోరు... పట్టించుకోరు. ఫలితంగా అప్పులు 42% దాటిపోయాయని కాగ్ హెచ్చరిస్తోంది. అనధికారిక అప్పులు కూడా కలిపితే రుణాలు ఏకంగా 65% దాటిపోతున్న దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. Quote
Funkops Posted December 18, 2023 Report Posted December 18, 2023 Anduke why not 175 antunna @ARYA Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.