Jump to content

Recommended Posts

Posted

AP High Court: రాజధాని కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో: ఏపీ హైకోర్టు 

20-12-2023 Wed 20:33 | Andhra
  • రాజధాని కార్యాలయాల తరలింపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ హైకోర్ట్
  • రైతుల పిటిషన్‌ను పరిశీలించాల్సి ఉందన్న ధర్మాసనం
  • రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆదేశాలు తీసుకుంటామన్న ప్రభుత్వ తరపున లాయర్
  • కేసు విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
 
AP High Court directs Status Quo on Shifting of Capital Offices
Listen to the audio version of this article

రాజధాని కార్యాలయాల తరలింపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టేటస్ కో విధించింది. క్యాంప్ కార్యాలయాల పేరిట రాజధాని కార్యాలయాలు తరలించడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని తరలింపు వ్యవహారంపై ఇప్పటికే విచారణ పెండింగ్‌లో ఉందని, ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని హైకోర్ట్ స్పష్టం చేసింది. రైతుల పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రైతుల పిటిషన్‌ను త్రిసభ్య ధర్మాసనానికి పంపుతామని తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆదేశాలు తీసుకుంటామని ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీంతో ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి(రేపు) వాయిదా వేసింది.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...