psycopk Posted December 20, 2023 Report Posted December 20, 2023 Nara Lokesh: జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యే బ్లాక్ బస్టర్ బొమ్మ ఇది: నారా లోకేశ్ 20-12-2023 Wed 19:22 | Andhra 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నారా లోకేశ్ కుప్పంలో మొదలై విశాఖలో ముగిసిన పాదయాత్ర పోలిపల్లి వద్ద యువగళం నవశకం సభ వాడీవేడిగా ప్రసంగించిన లోకేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోలిపల్లిలో ఏర్పాటు చేసిన యువగళం విజయోత్సవ సభలో ఉత్సాహభరితంగా ప్రసంగించారు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర... కొండంత అండ కోస్తాంధ్ర... రత్నాల సీమ రాయలసీమ... అందాల విశాఖ అందరి విశాఖ అంటూ ప్రసంగం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవనన్నకు... మీ అందరికి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మామయ్య నందమూరి బాలకృష్ణ గారికి, టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక నమస్కారం అంటూ పేర్కొన్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ గురూ అంటూ యువగళం సక్సెస్ నేపథ్యంలో విజయ నినాదం చేశారు. ఏ బొమ్మ చూస్తే జగన్ కు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్ కు జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలో టీవీ పగులుతుందో... ఆ బొమ్మను నేడు మనమందరం చూస్తున్నాం అని లోకేశ్ వివరించారు. "విజనరీ చంద్రబాబు, పవర్ ఫుల్ పవనన్న, మన సింహం బాలయ్య బాబు గారు ఇవాళ ఒకే ఫ్రేములో ఉన్నారు. బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు... తాడేపల్లి కొంపలో ఉచ్చ పడాలి! ఇది యువగళం ముగింపు సభ కాదు... ఇది నవశకం. యుద్ధం మొదలైంది... తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు... యువగళం... మన గళం... ప్రజాబలం" అంటూ లోకేశ్ నినదించారు. "ఈ యువగళం నేను కుప్పం నుంచి మొదలుపెట్టాను. 226 రోజులు... 97 నియోజకవర్గాలు... 2108 గ్రామాలు... 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ఈ యువగళం ఆపేందుకు పోలీసులను పంపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చూపించి యువగళాన్ని ముందుకు తీసుకెళ్లాను. యువగళాన్ని ఆపేందుకు సైకో జగన్ జీవో నెం.1 తీసుకువచ్చాడు. ఆ రోజే చెప్పాను... జీవో నెం.1 మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో... ఈ లోకేశ్ తగ్గేదే లేదని చెప్పాను. జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు... మీ లోకేశ్ ది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం" అంటూ ప్రసంగించారు. 1 Quote
psycopk Posted December 20, 2023 Author Report Posted December 20, 2023 Nara Lokesh: వాళ్లిద్దరిని చూస్తే జగన్ కు భయం: నారా లోకేశ్ 20-12-2023 Wed 19:38 | Andhra పోలిపల్లిలో యువగళం నవశకం సభ హాజరైన నారా లోకేశ్ జగన్ కు ఉక్కపోత మొదలైంది అంటూ వ్యాఖ్యలు టీడీపీ అగ్రనేత, మాజీ మంత్రి నారా లోకేశ్ పోలిపల్లిలో ఏర్పాటు చేసిన యువగళం నవశకం సభలో ప్రసంగించారు. ఒక పక్క యువగళం... మరో పక్క చంద్రబాబు గారి భవిష్యత్తుకి గ్యారెంటీ... ఇంకోవైపు పవనన్న వారాహి యాత్రతో జగన్ కి, ఫ్యాన్ కి ఉక్కపోత మొదలైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవనన్న అంటే జగన్ కి భయం అని అన్నారు. మీ లోకేశ్ ని చూసినా జగన్ కు భయమేనని వ్యాఖ్యానించారు. "విజనరీ అంటే చంద్రబాబు... ప్రిజనరీ అంటే జగన్... ఇది ఫిక్స్. జగన్ అరెస్ట్ అయితే రోజుకో స్కామ్ బయటపడింది... చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే 15 ఏళ్లు సీఎంగా ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం బయటకు వచ్చింది. 53 రోజులు నిజాన్ని బంధించారు. కానీ ఆఖరికి నిజమే గెలిచింది. పవనన్న ఏపీకి వస్తుంటే అడ్డుకుంటారు ఈ వైసీపీ పిరికి సన్నాసులు. ఆయన రావాలి అనుకున్న ఫ్లయిట్ క్యాన్సిల్ చేస్తారు. పవనన్నని ఏపీ బోర్డర్ లో ఆపేస్తారు. ప్రజాస్వామ్యాన్ని నువ్వు దెబ్బ తీశావ్ జగన్... ప్రజాస్వామ్యం తిరగబడి దెబ్బకొడితే ఎలా ఉంటుందో నువ్వు త్వరలోనే చూస్తావ్" అంటూ లోకేశ్ హెచ్చరించారు. జరగబోయేది జగన్ అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం.... జగన్ అహంకారాన్ని 151 అడుగుల గొయ్యి తీసి పాతిపెడతాను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజనరీ చంద్రబాబు గారు రాష్ట్రానికి కావాలి... ప్రజలకు మంచి చెయ్యాలి అనుకునే పవర్ ఫుల్ నాయకుడు పవనన్న రాష్ట్రానికి కావాలి అని లోకేశ్ పిలుపునిచ్చారు. కోడికత్తి వారియర్స్ అని పేరు పెడితే బాగుంటుంది! జగన్ కొత్త స్కీం తెచ్చాడు దాని పేరు ఆడుదాం ఆంధ్రా అంట. నాలుగున్నర ఏళ్లుగా ప్రజల జీవితాలతో ఆడుకున్నావ్ సరిపోదా జగన్? స్టేడియంలు, గ్రౌండులలో ప్రాక్టీస్ చేయడానికి, ఆడడానికి వచ్చినవాళ్లని ఫీజులు కట్టకపోతే రావొద్దంటూ తరిమేస్తున్నాడు ఈ జగన్. జగన్ ఐపీఎల్ టీము పెడతామంటున్నాడు... దీనికి కోడికత్తి వారియర్స్ అని పేరు పెడితే బాగుంటుంది. సీనియర్ బ్యాట్స్ మన్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి, ఆల్ రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ భరత్, బూతుల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టర్ బియ్యం మధు!... అబ్బో మామూలు టీము కాదు. ప్రతి అడుగులో జగన్ విధ్వంసం చూశా పాదయాత్ర నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాయకుడు ఎంత బాధ్యతగా ఉండాలో తెలుసుకున్నాను. ఒక్క నాయకుడు చేసిన తప్పుల వలన రాష్ట్రం ఎంత నష్టపోయిందో కళ్లారా చూశాను. జగన్ విధ్వంసం ప్రతి అడుగులో చూశాను. ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు, నకిలీ విత్తనాలతో రైతన్న నష్టపోతున్నాడు, తాగునీటి కోసం మహిళలు బిందెలు మోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మనం తెచ్చిన ఎలక్ట్రానిక్స్, ఐటి కంపెనీలు కనిపించాయి... పాపాల పెద్దిరెడ్డి పది వేలకోట్ల అవినీతి సామ్రాజ్యం కనిపించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రన్న తెచ్చిన కియా, డ్రిప్ ఇరిగేషన్ కనపడింది... జగన్ తెచ్చిన కష్టాలు కనపడ్డాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తెచ్చిన విమానాశ్రయం, మెగా సీడ్ పార్క్, జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మెగా సోలార్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు, సాగునీటి ప్రాజెక్టులు కనిపించాయి... జగన్ మిగిల్చిన కన్నీరు కనిపించింది. 1 Quote
psycopk Posted December 20, 2023 Author Report Posted December 20, 2023 Nara Lokesh: అప్పుడు నాకు మొదట కాల్ చేసింది పవనన్న: నారా లోకేశ్ 20-12-2023 Wed 19:56 | Andhra యువగళం నవశకం సభలో లోకేశ్ ప్రసంగం పవనన్న అంటూ జనసేనానిపై అభిమానం ప్రదర్శించిన లోకేశ్ చంద్రబాబు అరెస్టయిన సమయంలో పవన్ అండగా నిలిచారని వెల్లడి తన తల్లి భువనమ్మ న్యాయం జరిగేంతవరకు ఇంటికి రావొద్దని చెప్పిందన్న లోకేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం నవశకం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ వేనోళ్ల కీర్తించారు. పవనన్న అంటూ పదే పదే సంబోధిస్తూ తన తన అభిమానాన్ని చాటుకున్నారు. సెప్టెంబరులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ రిమాండ్ కు పంపిన సమయంలో మొదట నాకు కాల్ చేసి అండగా నిలిచింది పవనన్న అని లోకేశ్ వెల్లడించారు. పవన్ తనలో ఎంతో భరోసా కలిగించారని కొనియాడారు. ధైర్యంగా ఉండు లోకేశ్ అని ఆయన ఆ రోజే చెప్పారు... మేమంతా నీ వెంట ఉన్నాం... బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు... నువ్వు నిబ్బరంగా ఉండు అని పవన్ కొండంత అండలా నిలిచారని వివరించారు. పవన్ బయటికొస్తే సైకో సైన్యానికి వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. అప్పటివరకు ఇంటి గడప తొక్కవద్దని మా అమ్మ చెప్పింది చంద్రబాబును రాజమండ్రి జైల్లో చూశాక చాలా బాధ కలిగిందని లోకేశ్ వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నిర్మించిన బ్యారక్ లోనే ఆయనను ఉంచారు. చంద్రబాబుతో ములాఖత్ అయిన రూం ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూం అని వెల్లడించారు. "దేవుడు మాకో పరీక్ష పెట్టాడని అనుకున్నాం... ఆ సమయంలో మా అందరి అమ్మ భువనమ్మ అండగా నిలబడింది. గుండెల్లో ఎంత బాధ ఉన్నా నువ్వు ప్రజల కోసం పోరాడు... న్యాయం జరిగాకే ఇంటి గడప తొక్కు... అప్పటివరకు ఇంటికి రావొద్దు అని మా అమ్మ భువనమ్మ నన్ను ముందుకు పంపింది" అని వివరించారు. వడ్డీతో సహా చెల్లిస్తాం టీడీపీ కార్యకర్తల జోలికి వచ్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టం. వడ్డీతో సహా చెల్లిస్తాం. చట్టాన్ని ఉల్లఘించిన వారి పేర్లు అన్ని రెడ్ బుక్ లో ఉన్నాయి వారికి శిక్ష తప్పదు. నా పాదయాత్ర లో కీలకంగా వ్యవహరించిన వాలంటీర్లు, ఇతర కమిటీలు సభ్యులను అభినందిస్తున్నాను. సైకో పోవాలి... సైకిల్ రావాలి ... సైకో పోవాలి... సైకిల్ రావాలి ... మరి మా పవనన్న పవర్ ఫుల్ డైలాగ్ కూడా చెప్పాలి కదా... హలో ఏపీ ... బై బై వైసీపీ. హలో ఏపీ ... బై బై వైసీపీ" అంటూ లోకేశ్ తన ప్రసంగాన్ని ముగించారు. 1 Quote
psycopk Posted December 20, 2023 Author Report Posted December 20, 2023 Pawan Kalyan: నువ్వు రావాల్సిందే అని లోకేశ్ ఆహ్వానించాడు: పవన్ కల్యాణ్ 20-12-2023 Wed 20:11 | Andhra టీడీపీ యువగళం సభకు పవన్ హాజరు సభలో లోకేశ్ ఉంటేనే బాగుంటుందని చెప్పానని వెల్లడి కానీ లోకేశ్ పట్టుబట్టి తనను ఆహ్వానించాడని వివరణ చంద్రబాబు కూడా కోరడంతో కాదనలేకపోయానన్న జనసేనాని Listen to the audio version of this article విజయనగరం జిల్లా పోలిపల్లిలో టీడీపీ ఏర్పాటు చేసిన యువగళం నవశకం సభకు జనసేనాని పవన్ కల్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఈ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. యువగళం సభకు ఆహ్వానించిన కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి, యువనేత నారా లోకేశ్ కు, టీడీపీ పెద్దలు, తెలుగుమహిళలు, తెలుగుదేశం కార్యకర్తలకు పేరుపేరునా హృదయపూర్వక నమస్సుమాంజలి అంటూ ప్రసంగం ప్రారంభించారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు, జనసేన శ్రేణులు, వీరమహిళలకు శుభాభివందనం... సోదరుడు నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక అభినందనలు అంటూ పేర్కొన్నారు. "నన్ను సభకు ఆహ్వానించినపుడు నేను ఒకటే చెప్పాను, 226 రోజులు, 3,132 కి.మీ. నడిచినందున యాత్ర ముగింపు సభలో లోకేశ్ ఉంటేనే బాగుంటుందని చెప్పాను. కానీ, ఈ సభలో నువ్వు ఉండాలి అంటూ లోకేశ్ ఆహ్వానించాడు. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ అనుభవజ్ఞుడు చంద్రబాబు కోరడంతో ఇక్కడకు వచ్చాను. లోకేశ్ యువగళం జగన్ లాంటి ఆషామాషీ పాదయాత్ర కాదు, మాటల యాత్ర కాదు, చేతల యాత్ర. ఈ సందర్భంగా లోకేశ్ కు అభినందనలు" అని వివరించారు. 1 Quote
psycopk Posted December 20, 2023 Author Report Posted December 20, 2023 Nadendla Manohar: లోకేశ్ గురించి పవన్ కల్యాణ్ ఏమన్నారో చెప్పిన నాదెండ్ల 20-12-2023 Wed 18:29 | Andhra పోలిపల్లిలో యువగళం విజయోత్సవ సభ హాజరైన పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ నారా లోకేశ్ పై నాదెండ్ల అభినందనల వర్షం Listen to the audio version of this article టీడీపీ యువగళం నవశకం సభలో జనసేన పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ ప్రసంగిస్తూ ఆసక్తికర అంశం వెల్లడించారు. నారా లోకేశ్ టీడీపీ పార్టీ కోసం ఓ కార్యకర్తలా బలంగా నిలబడ్డారని, ఇది నారా లోకేశ్ ను హైలైట్ చేయాల్సిన సభ అని పవన్ కల్యాణ్ చెప్పినట్టు నాదెండ్ల తెలిపారు. "ఈ సభ కోసం మాకు మొట్టమొదట ఆహ్వానం వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ గారి అభిప్రాయం ఎలా ఉందంటే... లోకేశ్ గారి నాయకత్వాన్ని పెంచాలి, ఈ సభలో నారా లోకేశ్ ముఖ్య అతిథిలా ఉంటేనే సభకు తగిన గౌరవం దక్కుతుంది, ఆ సభకు మనం వెళ్లడం వల్ల ఆ ఉద్దేశానికి భంగం కలుగుతుంది అని పవన్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని నేను లోకేశ్ గారికి తెలియజేశాను. అయితే, నారా లోకేశ్ స్పందించే మనస్తత్వం చూశాక పవన్ కల్యాణ్ ఎంతో ముగ్ధులయ్యారు. లోకేశ్ గారు అన్న మాట ఏంటంటే... నా పాదయాత్ర ముగింపు సందర్భంగా చేస్తున్న సభ కాదు ఇది. టీడీపీ, జనసేన కలిసి ఓ అద్భుత విజయం సాధించేందుకు నాందిగా ఏర్పాటు చేస్తున్న సభ అని చెప్పారు. ఇలాంటి సభకు పవన్ కల్యాణ్ గారు కచ్చితంగా రావాలి... పవన్ కల్యాణ్ గారు ముందుండి నడిచేలా అవసరమైతే నేనొక అడుగు వెనక్కి వేస్తాను అని లోకేశ్ గారు చెప్పారు. ఆ రోజు లోకేశ్ గారు వెలువరించిన నిర్ణయాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను" అంటూ నాదెండ్ల కొనియాడారు. 3,132 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన లోకేశ్ కు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్టు నాదెండ్ల పేర్కొన్నారు. పాదయాత్రలో లోకేశ్ సంపాదించిన అనుభవంతో సుపరిపాలన చేస్తారని దృఢమైన నమ్మకం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా రాబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీలను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. 1 Quote
psycopk Posted December 20, 2023 Author Report Posted December 20, 2023 Rammohan Naidu: రాబోయే 100 రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదులుతుంది: రామ్మోహన్ నాయుడు 20-12-2023 Wed 19:08 | Andhra యువగళం నవశకం కార్యక్రమంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడి ప్రసంగం యువగళానికి ఈ సభ మరో ఆరంభమని వ్యాఖ్య మరో వందరోజుల్లో ఏపీకి పట్టిన శని వదిలిపోతుందని వెల్లడి సభను చూసి ప్రత్యర్థులు భయపడతారని కామెంట్ యువగళం-నవశకం విజయోత్సవ సభకు పార్టీ శ్రేణులు, ప్రజలు పోటెత్తారు. జనసందోహంతో పోలిపల్లి సభా ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. ఈ సభలో ప్రసంగించిన టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు.. నేటి సభ ముగింపు కాదని ఆరంభమని వ్యాఖ్యానించారు. రాబోయే వంద రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదిలి టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తాయన్నారు. “ ‘యువగళం-నవశకం’ కార్యక్రమాన్ని జనసముద్రంగా మార్చిన కార్యకర్తలు.. వీర మహిళలు.. నిజంగా గర్వపడాల్సిన సమయం. ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఉత్తరాంధ్రలో ఈ కార్యక్రమం జరగడం మన అదృష్టం. దేశ రాజకీయ చరిత్రలో ఒక ఘట్టంగా నిలిచిపోయే గొప్ప కార్యక్రమం నేడు మనగడ్డపై జరుగుతోంది. యువగళం పాదయాత్ర ప్రారంభంతో చిత్తూరు చిందులేస్తే.. కడప కదిలింది. కర్నూలు కన్నుల పండువగా మారింది. అనంతపురం ఆత్మీయతను చాటుకుంది. నెల్లూరు నడుము బిగించింది. ఒంగోలు ఉరకలేసింది.. గుంటూరు గర్జించింది. కృష్ణా కృష్ణమ్మలా కరుణ చూపింది. గోదావరి గర్జించింది.. విశాఖపట్నం విజృంభిస్తే..విజయనగరం విజయపతాకం ఎగరేసింది. శ్రీకాకుళం శంఖారావం పూరించి.. ఉత్సాహంతో ఉరుముతూ ఉద్యమంతో ముందుకు ఉరికింది’ ‘నేటి ఈ కార్యక్రమం ముగింపు కాదు.. ఇప్పటినుంచే ఆరంభం. ఇదే ఉత్సాహంతో మరో 100 రోజులు కొనసాగిస్తే.. టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని చూస్తాం. 100 రోజుల్లో రాష్ట్రానికి పట్టిన శని వదిలించుకొని సైకోను తరిమితరిమి కొట్టబోతున్నాం. 100 రోజుల్లో దళితులు, ఆడబిడ్డలపై జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాలను కట్టడి చేయబోతున్నాం. 100 రోజుల్లో యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం. 100 రోజుల్లో రైతుల ముఖాల్లో ఆనందం నింపి, వారిని రారాజుల్ని చేయబోతున్నాం. 100 రోజుల్లో బడుగుబలహీన వర్గాల్ని పైకి తీసుకురాబోతున్నాం, 100 రోజుల్లో పోలవరం పూర్తిచేయడానికి శంఖారావం ఊదబోతున్నాం.. 100 రోజుల్లో మన రాష్ట్ర రాజధాని ఇదని గర్వంగా చెప్పుకోబో తున్నాం’ ‘అన్నింటికంటే ఘనంగా నేను తెలుగోడిని.. నేను ఆంధ్రుడిని అని ప్రతి ఒక్కరూ ప్రపంచం మొత్తం గర్వపడేలా రొమ్ము విరుచుకొని నడిచే రోజులు చూడబోతున్నాం. ఇదే ఉత్సాహంతో నాలుగున్నరేళ్లు పడిన కష్టాలు..బాధలు అధిగమించి మనం ముందుకు సాగాలి. 2019 ఎన్నికలు ముగిశాక చంద్రబాబు పని అయిపోయింది.. పసుపు రంగు కనిపించదు..తెలుగుగుదేశం కథ ముగిసింది అన్నారు. అలా అన్నవాళ్లు ఒక్కసారి ఇక్కడికొచ్చి చూస్తే.. కనుచూపు మేరలో కనిపిస్తున్న తెలుగుదేశం, జనసేన కార్యకర్తల్ని చూసి అదిరి పడతారు. ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం - జనసేన కార్యకర్తలు గుండెధైర్యంతోనే ముందుకు సాగారు’ రాబోయే 100 రోజులు క్రమశిక్షణతో, కలిసికట్టుగా ముందుకు సాగి అనుకున్న లక్ష్యాలు సాధించాలని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా.. తప్పు జరిగిందని అనిపించినా పెద్దమనస్సుతో పెద్దమనుషుల్లా క్షమించి, ఇది మన కార్యక్రమం అనుకొని సర్దుకుపోవాలని కోరుతున్నాను. ఈ సభను చూసి బాధపడాల్సింది తాడేపల్లిలోని పిల్లి మాత్రమేనని గుర్తుంచుకోండి” అని రామ్మోహన్ నాయుడు సూచించారు. 1 Quote
psycopk Posted December 20, 2023 Author Report Posted December 20, 2023 Balakrishna: మీరు ముందడుగు వేయండి... ఎవడు అడ్డొస్తాడో మేం చూసుకుంటాం: బాలకృష్ణ 20-12-2023 Wed 18:59 | Andhra పోలిపల్లిలో యువగళం నవశకం సభ హాజరైన నందమూరి బాలకృష్ణ లోకేశ్ పాదయాత్ర ప్రజల మధ్య విజయవంతం అయిందని వెల్లడి యువనేతపై ఈగ వాలకుండా ప్రజలే చూసుకున్నారన్న బాలయ్య నవశకం బహిరంగసభలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రసంగించారు. నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర అన్ని వర్గాల ప్రజలమధ్య విజయవంతంగా కొనసాగిందని తెలిపారు. ఇది యువగళం పాదయాత్ర ముగింపు సభ కాదు... వైసీపీ అంతిమ యాత్రకు ఆరంభ సభ అని అభివర్ణించారు. రాష్ట్ర యువత వైసీపీ పాలనలో తమకు జరిగిన అన్యాయం, ఇబ్బందులను గుర్తుపెట్టుకోవాలని అన్నారు. 1982లో ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపునకు కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా విశేష స్పందన వచ్చిందని తెలిపారు. అదేవిధంగా నేడు యువగళం పాదయాత్రకు అంతటి విశేష స్పందన వచ్చిందని బాలకృష్ణ చెప్పారు. లోకేశ్ పై ఈగ వాలకుండా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కాపాడుకుంటూ వచ్చారు... యువనేతకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని సినిమాకే కాకుండా ప్రజాసమస్యలపై పోరాటానికి అధికంగా కేటాయిస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని అనేక సమస్యలపై పవన్ తిరుగులేని పోరాటం చేశారని కితాబిచ్చారు. "చంద్రబాబు తన విజన్ తో ఐటీ, డ్వాక్రాను తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను చంద్రబాబు కొనసాగించి పేదలకు అండగా నిలిచారు. ప్రపంచదేశాలకు చంద్రబాబు తన విజన్ ను పరిచయం చేశాడు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు, విధ్వంసాలు, కూల్చివేతలను పరిచయం చేశాడు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిని నిర్వీర్యం చేసి రూ.10 లక్షల కోట్ల అప్పు చేశాడు. అరాచకపాలనలో ధరలు, పన్నులు, రేట్లు ఆకాశాన్నంటాయి... సామాన్యుడి జీవనం ప్రశ్నార్థకమైంది. జగన్ ల్యాండ్, శాండ్, మైన్ స్కాములతో దోచుకుంటున్నాడు... ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నాడు. ఏపీకి రాజధాని కోసం భూములిచ్చిన రైతులను వేధించాడు, అక్రమ కేసులతో బెదిరిస్తున్నాడు. పోలీసులు, ఉద్యోగులు, కార్మికులను జగన్మోహన్ రెడ్డి వేధిస్తున్నాడు. హిందూపురంలో ప్రభుత్వాసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో పెడితే జగన్ తన నిర్లక్ష్యంతో నేడు దానిలో పందులు, కుక్కలు తిరిగేలా పాడుబెట్టాడు. జగన్ పాలనలో ఒక్క గుంత పూడ్చలేదు... ఒక్క రోడ్డు వేయలేదు. సీఎం కుర్చీలో జగన్ కనకపు సింహాసనంపై శునకం మాదిరి ప్రవర్తిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానంటే అక్కడి ప్రజలు రాష్ట్ర సరిహద్దు వద్దే అడ్డుకుంటారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ప్రపంచ పటంలో ఏపీ ఉండదు... ఇది తథ్యం. సమయం లేదు మిత్రమా.... వచ్చే ఎన్నికల్లో విజయమా? వీరస్వర్గమా? అనేది రాష్ట్ర ప్రజలు తేల్చుకోవాలి. సొంత సామాజికవర్గానికి చెందిన వారిని స్థానాల నుండి మార్చకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలను మాత్రమే ఓడిపోయే స్థానాల్లోకి పంపుతున్నాడు... ఇంక సామాజిక న్యాయం ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి చూపించేది కపట ప్రేమ... సవతి తల్లి ప్రేమ... దయచేసి ఎవరూ నమ్మొద్దు. కప్ప బావి మాత్రమే తన ప్రపంచం అని భావించినట్లు... జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ మాత్రమే లోకం అనుకుంటున్నాడు. అణిచివేతలపై ఫ్రెంచి విప్లవం వచ్చిన విధంగా రాష్ట్ర ప్రజలు తమ హక్కుల కోసం పోరాడాలి. రానున్న ఎన్నికల్లో సుపరిపాలనకు స్వాగతం పలకాలి...ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. రాష్ట్రానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రజలంతా నడుం బిగించాలి. మీరు ముందడుగు వేయండి... ఎవడు అడ్డొస్తాడో మేం చూస్తాం" అంటూ బాలయ్య భరోసా ఇచ్చారు. 1 Quote
psycopk Posted December 20, 2023 Author Report Posted December 20, 2023 Atchannaidu: టీడీపీ, జనసేన కలిశాయి... వైసీపీకి దబిడిదిబిడే: అచ్చెన్నాయుడు 20-12-2023 Wed 18:46 | Andhra పోలిపల్లిలో టీడీపీ యువగళం నవశకం సభ హాజరైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టీడీపీ-జనసేన విజయాన్ని అడ్డుకోవడం జగన్ తరం కాదని వ్యాఖ్యలు విజయనగరం జిల్లా పోలిపల్లిలో టీడీపీ ఏర్పాటు చేసిన యువగళం నవశకం సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రసంగించారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిశాయని, ఇక వైసీపీకి దబిడిదిబిడేనని అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలుస్తారని వైసీపీ సైకోలు ఊహించలేదని తెలిపారు. కానీ, మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడానికి టీడీపీ, జనసేన ఏకం కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఏర్పడిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. "చంద్రబాబు పైసా అవినీతి చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసు పెట్టి 53 రోజులు జైల్లో ఉంచాడు. ప్రజలకు సుపరిపాలన దక్కనివ్వకూడదని సైకో జగన్ అనేక డ్రామాలాడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన రాకుండా అడ్డుకోవడం జగన్మోహన్ రెడ్డి తరం కాదు. టీడీపీ, జనసేనలో బలహీన వర్గాల వారు నాయకులుగా పనిచేస్తున్నారు... వైసీపీలో బానిసలుగా పనిచేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపికి డిపాజిట్లు కూడా రావు. వచ్చే ఎన్నికల్లో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీ మధ్య చిచ్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తాడు. మనం అప్రమత్తంగా ఉండాలి. 2024లో ఏపీకి పట్టిన దరిద్రాన్ని రాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపేయాలని కోరుతున్నా. 5 కోట్ల ఆంధ్రులంతా గుర్తుపెట్టుకోవాలి... రానున్న ఎన్నికలు టీడీపీ-జనసేనకు వైసీపీకి మధ్య ఎన్నికలు కాదు... రాష్ట్ర ప్రజలకు, దోపిడీదారుడికి మధ్య జరిగే యుద్ధం. ప్రజల కోసం ఒక్కటై టీడీపీ-జనసేన నాయకత్వాన్ని ఆదరించాలి, ఆశీర్వదించాలి" అని పిలుపునిచ్చారు. లోకేశ్ గురించి నేను ముందే చెప్పాను నారా లోకేశ్ చంద్రబాబు వారసుడే కాదు... రాజకీయ పరిణతి కలిగిన నాయకుడని కుప్పం సభలోనే చెప్పాను. పాదయాత్రలో నారా లోకేశ్ బలమైన సైనికుడు అని కూడా రుజువు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు మేం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు. యువగళంపై సైకో జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించాడో రాష్ట్రమంతా చూసింది. లోకేశ్ వాటన్నింటిని అధిగమించి తన పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు... బాధితులను ఓదార్చారు. అవినీతి నాయకుల బాగోతాన్ని ప్రజల్లో ఎండగట్టారు.. యువతకు భరోసానిచ్చారు. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు ఆ దమ్ముందా? జగన్ ఉత్తరాంధ్ర జిల్లాలను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి రాసిచ్చాడు. ఉత్తరాంధ్రను జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు... దోచుకున్నాడు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ కు చీము, నెత్తురు ఉంటే తక్షణమే వైసీపీకి రాజీనామా చేసి బయటకు రావాలి. ఉత్తరాంధ్రకు జగన్ చేస్తున్న అన్యాయంపై నిలదీసే దమ్ము మీకుందా? 1 Quote
Bendapudi_english Posted December 20, 2023 Report Posted December 20, 2023 28 minutes ago, psycopk said: Nara Lokesh: జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యే బ్లాక్ బస్టర్ బొమ్మ ఇది: నారా లోకేశ్ 20-12-2023 Wed 19:22 | Andhra 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నారా లోకేశ్ కుప్పంలో మొదలై విశాఖలో ముగిసిన పాదయాత్ర పోలిపల్లి వద్ద యువగళం నవశకం సభ వాడీవేడిగా ప్రసంగించిన లోకేశ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోలిపల్లిలో ఏర్పాటు చేసిన యువగళం విజయోత్సవ సభలో ఉత్సాహభరితంగా ప్రసంగించారు. ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర... కొండంత అండ కోస్తాంధ్ర... రత్నాల సీమ రాయలసీమ... అందాల విశాఖ అందరి విశాఖ అంటూ ప్రసంగం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవనన్నకు... మీ అందరికి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మామయ్య నందమూరి బాలకృష్ణ గారికి, టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక నమస్కారం అంటూ పేర్కొన్నారు. బొమ్మ బ్లాక్ బస్టర్ గురూ అంటూ యువగళం సక్సెస్ నేపథ్యంలో విజయ నినాదం చేశారు. ఏ బొమ్మ చూస్తే జగన్ కు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్ కు జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలో టీవీ పగులుతుందో... ఆ బొమ్మను నేడు మనమందరం చూస్తున్నాం అని లోకేశ్ వివరించారు. "విజనరీ చంద్రబాబు, పవర్ ఫుల్ పవనన్న, మన సింహం బాలయ్య బాబు గారు ఇవాళ ఒకే ఫ్రేములో ఉన్నారు. బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు... తాడేపల్లి కొంపలో ఉచ్చ పడాలి! ఇది యువగళం ముగింపు సభ కాదు... ఇది నవశకం. యుద్ధం మొదలైంది... తాడేపల్లి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు... యువగళం... మన గళం... ప్రజాబలం" అంటూ లోకేశ్ నినదించారు. "ఈ యువగళం నేను కుప్పం నుంచి మొదలుపెట్టాను. 226 రోజులు... 97 నియోజకవర్గాలు... 2108 గ్రామాలు... 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ఈ యువగళం ఆపేందుకు పోలీసులను పంపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చూపించి యువగళాన్ని ముందుకు తీసుకెళ్లాను. యువగళాన్ని ఆపేందుకు సైకో జగన్ జీవో నెం.1 తీసుకువచ్చాడు. ఆ రోజే చెప్పాను... జీవో నెం.1 మడిచి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో... ఈ లోకేశ్ తగ్గేదే లేదని చెప్పాను. జగన్ ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు... మీ లోకేశ్ ది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం" అంటూ ప్రసంగించారు. Postivi momentum undhi, Ilane continue avali next 100 days, thanks ra jagan ga padukuna TDP cadre ni encourage chesinandhuku Quote
Android_Halwa Posted December 20, 2023 Report Posted December 20, 2023 Ave cinema dialogues….teesukapoi jail la esthe okkadu kuda noru tervaaledu Motham comedy batch antha stage mida ne vundi Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.