psycopk Posted December 28, 2023 Report Posted December 28, 2023 Biyyapu Madhusudhan Reddy: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పీఏ ఆత్మహత్య 28-12-2023 Thu 11:04 | Andhra గత రాత్రి ఇంట్లోనే ఉరివేసుకున్న రవి నాాలుగున్నరేళ్లపాటు తిరుమల దర్శన వ్యవహారాలు చూసుకున్న రవి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసుల ఆరా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) రవి ఆత్మహత్య చేసుకున్నారు. నాలుగున్నరేళ్లపాటు తిరుమల దర్శన వ్యవహారాలు చూసుకున్న ఆయన గత రాత్రి ఇంట్లో ఉరివేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని రవి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరాతీస్తున్నారు. రవి ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే పీఏ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. Quote
psycopk Posted December 28, 2023 Author Report Posted December 28, 2023 Kethiredddy Pedda Reddy: ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. రెండుమూడు నెలల్లో వేట మొదలెడతా.. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు 28-12-2023 Thu 11:24 | Andhra మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతానన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ కుటుంబం, వారి వెంట తిరిగే వారిని లక్ష్యంగా చేసుకుంటానని హెచ్చరిక దారినపోయే వారు రాళ్లేస్తుంటే ఓపిక నశించిపోయిందన్న వైసీపీ ఎమ్మెల్యే మళ్లీ పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ హెచ్చరికలు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ తర్వాత రెండుమూడు నెలల్లో వేట మొదలెడతానని, జేసీ కుటుంబం, వారి వెంట తిరిగే కొంతమందిని లక్ష్యంగా చేసుకుంటానంటూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురం ఆర్అండ్‌బీ అతిథిగృహంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతానని, తనలోని పాత పెద్దారెడ్డిని చూస్తారంటూ జేసీ కుటుంబాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేసీ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, తాను అవినీతికి పాల్పడినట్టు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని, ఇకపై ఇలాంటి వాటిని సహించబోనని తేల్చి చెప్పారు. ప్రజలందరినీ భయపెట్టాలన్నది తన ఉద్దేశం కాదన్న ఆయన జేసీ కుటుంబం, వారి వెంట తిరిగే కొందరిని లక్ష్యంగా చేసుకుంటానని తెలిపారు. ఇది సమయం కాదనే ఊరుకున్నానని, ఎన్నికలయ్యాక మాత్రం పంటకు పురుగు పడితే తీసేసినట్టు ఏరిపారేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. 1985 నుంచి 2004 వరకు ఎలా ఉన్నానో ఆ రూపాన్ని చూస్తారని పేర్కొన్నారు. దారినపోయే ప్రతి ఒక్కరు రాయి వేస్తుంటే ఓపిక నశిస్తోందన్నారు. పాత జీవితంలోకి మళ్లీ వెళ్లాలన్న ఆలోచన ఉందని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. Quote
psycopk Posted December 28, 2023 Author Report Posted December 28, 2023 https://www.instagram.com/reel/C1TZwcqNe5g/?igsh=MW04YmNheGNyZW0waw== Quote
psycopk Posted December 28, 2023 Author Report Posted December 28, 2023 https://www.instagram.com/p/C1WNsVExIhh/?igsh=dGIxOXAwMm5vam1k Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.