Jump to content

Jagan failed to implement 85% of his promises book by TDP


Recommended Posts

Posted

Atchannaidu: జగన్ రెడ్డి ఎంత మోసగాడో ప్రజలకు తెలియజేయడానికే ఈ పుస్తకం తీసుకువచ్చాం: అచ్చెన్నాయుడు 

28-12-2023 Thu 15:41 | Andhra
  • సీఎం జగన్ పై విమర్శనాత్మక పుస్తకం విడుదల చేసిన టీడీపీ
  • మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పుస్తకం విడుదల
  • హాజరైన అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ అగ్రనేతలు
 
Atchannaidu terms CM Jagan a cheater
Listen to the audio version of this article

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేతలు ఇవాళ ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో అచ్చెన్నాయుడు తదితరులు ‘నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్ (నవరత్నాలు నవమోసాలయ్యాయి)’ అనే 150 పేజీల పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, జగన్ రెడ్డి ఎంత మోసగాడో, ఎంత పచ్చి అబద్ధాలకోరో ప్రజలకు తెలియచేయడానికే ఈ పుస్తకం తీసుకొచ్చామని వెల్లడించారు. జగన్ రెడ్డి మోసాలను ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తెలియచేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే పార్లమెంటు స్థానాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహించి జగన్ రెడ్డి వంచనను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామని తెలిపారు. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ప్రచారం చేసిన జగన్ రెడ్డి హామీలన్నీ జనం ముందు ఉంచుతామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

"పచ్చి అబద్ధాలు,  మోసాలకు నిలువెత్తు ప్రతిరూపం జగన్ రెడ్డి అని ప్రజలకు తెలియాలి. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని ప్రతిపక్షనేతగా గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి రాకముందు ఎన్ని హామీలు ఇచ్చి, ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని నెరవేర్చాడో ప్రజలు తెలుసుకోవాలి. 

తన మేనిఫెస్టో బైబిల్ తో సమానమని చెప్పుకునే జగన్ రెడ్డి... మేనిఫెస్టోలోని అంశాలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. మాటమీద నిలబడకుంటే పదవికి రాజీనామా చేయాలని గతంలో ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి... ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయనందుకు లెంపలేసుకొని, తప్పుఒప్పుకొని తక్షణమే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి" అని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

  • Haha 2
Posted

Bonda Uma: అధికారం కోసం అవాస్తవాలు... సీఎం అయ్యాక కక్ష సాధింపులు... ఇదీ జగన్ రెడ్డి నైజం!: బొండా ఉమ 

28-12-2023 Thu 15:55 | Andhra
  • సీఎం జగన్ పై పుస్తకం ఆవిష్కరించిన టీడీపీ నేతలు
  • మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పుస్తకావిష్కరణ
  • హాజరైన అచ్చెన్నాయుడు, బొండా ఉమ, వర్ల రామయ్య, టీడీ జనార్దన్ తదితరులు
 
Bonda Uma fires on CM Jagan

మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ‘నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85 శాతం ఫెయిల్ (నవరత్నాలు నవమోసాలయ్యాయి)’ అనే పుస్తకం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ సీనియర్ నేతలు బొండా ఉమ, వర్ల రామయ్య, నక్కా ఆనంద్ బాబు, టీడీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

అధికారం కోసం అవాస్తవాలు చెప్పడం, సీఎం అయ్యాక కక్ష సాధింపులు, దోపిడీలకు పాల్పడడమే జగన్ రెడ్డి నైజం అని మండిపడ్డారు. “అధికారంకోసం జగన్ రెడ్డి ప్రజలకు చెప్పిన అవాస్తవాలకు ప్రతిరూపమే టీడీపీ విడుదలచేసిన పుస్తకం. అలానే సాక్షి టీవీలో ప్రసారమైన జగన్ రెడ్డి హామీల తాలూకా వీడియో క్లిప్పింగ్స్ ను కూడా ప్రజలముందుకు తీసుకొచ్చాం. మరో 3 నెలల్లో జగన్ రెడ్డి ఇంటికెళ్లడం ఖాయం. ఈ నేపథ్యంలో మోసకారి జగన్ రెడ్డి మాటలు, హామీలు ప్రజలకు గుర్తుచేయడానికే టీడీపీ ఈ పుస్తకాన్ని విడుదల చేసింది. 

కేవలం అధికారం కోసమే భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఇవ్వనన్ని హామీలు జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చాడు. అధికారం చేతికందగానే కక్షసాధింపులు, దోపిడీయే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. మూడు రాజధానులంటూ మూడుముక్కలాట ఆడి, విశాఖపట్నంలో వేలకోట్ల విలువైన భూములు కొట్టేశాడు. జాబ్ క్యాలెండర్, ప్రత్యేక హోదా పేరుతో యువత, నిరుద్యోగుల్ని వంచించాడు. 

అవినీతి, దోపిడీతో పారిశ్రామిక వేత్తల్ని భయపెట్టి, రాష్ట్రంలోని పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోయేట్టు చేశాడు. ఇసుక దోపిడీతో భవనిర్మాణ కార్మికులు సహా, వివిధ రంగాల కార్మికుల పొట్టకొట్టాడు. ఇంత మోసకారీ ముఖ్యమంత్రి భారతదేశంలో మరెవరూ ఉండరు.  జగన్ రెడ్డి మోసాలు, అబద్ధాలు ప్రజలకు తెలియచేసి, అతనిచ్చిన హామీలను జనం ముందు ఉంచి, అతని బాగోతం బట్టబయలు చేస్తాం” అని బొండా ఉమ స్పష్టం చేశారు.  

మద్యపాన సేవనం పెంచి 30 లక్షల మందిని ఆసుపత్రుల పాల్జేశాడు: వర్ల రామయ్య 

 
మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేశాకే ఓట్లు అడగడానికి మీ ముందుకు వస్తానని జగన్మోహన్ రెడ్డి గతంలో అన్నది నిజం కాదా? అలా చెప్పిన వ్యక్తి ఈ 4 ఏళ్ల 8 నెలల్లో మద్యపాన సేవనాన్ని పెంచాడు. తన ధనదాహంతో మహిళల పుస్తెలు తెంచాడు. చివరకు జగన్ రెడ్డి నిర్వాకంతో తాగుబోతులు మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటివరకు రూ.2.50 లక్షల కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని జగన్ రెడ్డి విక్రయించారు. 

కేవలం ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలన్న ఉబలాటం తప్ప, జగన్ రెడ్డికి ప్రజల యోగక్షేమాలు, సాదకబాధకాలు పట్టవని అర్థమైంది. జగన్ రెడ్డి అమ్ముతున్న కల్తీ మద్యంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది పేదలు ఆసుపత్రుల పాలయ్యారు. ఇంత చేసిన ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొని మహిళల ఓట్లు అడుగుతారు? జగన్ రెడ్డి మేనిఫెస్టో అంతా పచ్చి బూటకం... అబద్ధాల పుట్ట, ఇక ఆయన్ని, ఆయన ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరు” అని రామయ్య తేల్చిచెప్పారు. 

జగన్ రెడ్డి ఎంత మోసకారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి: టీడీ జనార్థన్ 

తెలుగుదేశం పార్టీ నేడు విడుదల చేసిన ఈ పుస్తకంలో జగన్ రెడ్డి హామీలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన అంశాలనే పొందుపరిచాం. నియోజకవర్గాల వారీగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్లలో 102 సభల్లో జగన్ రెడ్డి చెప్పిన అంశాలు, వివిధ సందర్భాల్లో ఎక్కడికక్కడ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా త్వరలోనే జనంలో ఎండగడతాం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జగన్ రెడ్డి ఎంత మోసకారో తెలుసుకోవాలి.
  • Haha 2
Posted

AP Capital: విశాఖకు కార్యాలయాల తరలింపు.. ప్రభుత్వ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ తిరస్కరణ 

28-12-2023 Thu 14:17 | Andhra
  • కార్యాలయాలను విశాఖకు తరలించొద్దంటూ రైతుల పిటిషన్లు
  • త్రిసభ్య ధర్మాసనానికి పంపిన సింగిల్ జడ్జి బెంచ్
  • తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా
 
AP Govt lunch motion petition rejected by AP High Court
Listen to the audio version of this article

విశాఖపట్నంకు కార్యాలయాల తరలింపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారంటూ రాజధాని ప్రాంత రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపుతూ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారు. త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులను వెలువరించేంత వరకు చర్యలు తీసుకోబోమని ధర్మాసనానికి ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.

Posted

At least you can find YCP manifesto. TDP eeyte elections eeypogane delete chestadi 

😂 

  • Haha 2

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...