southyx Posted December 28, 2023 Report Posted December 28, 2023 మునుగుతున్న నావ? ఇలా ఒకరి తర్వాత ఒకరుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరికొందరు నేతలు వైకాపాను ఎందుకు వీడుతున్నారు? వైకాపా పూర్తిగా మునిగిపోతున్న నావ అని వారు భావిస్తున్నారా? అక్కడే ఉండి తామూ మునగడం కంటే బయటకు వెళ్లడం మంచిదని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వైకాపా వర్గాల నుంచే వస్తోంది. వైకాపాలో రాజీనామాలు, పార్టీ మార్పుల కలకలం పార్టీ పనైపోయిందనే భావనకు నేతలు వచ్చేశారా? వై నాట్ 175 అనే జగన్ మాటలు మేకపోతు గాంభీర్యమేనా? ఎమ్మెల్యేలకు ఆయనపై నమ్మకం పోయిందా? ఈనాడు - అమరావతి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి: ఎమ్మెల్యే పదవికి, వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు: ఓ సామాజికవర్గం పెత్తనాన్ని తట్టుకోలేక రాజకీయాల నుంచే విరమణ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్: వైకాపాను వీడి జనసేనలోకి ఇలా ఒకరి తర్వాత ఒకరుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరికొందరు నేతలు వైకాపాను ఎందుకు వీడుతున్నారు? వైకాపా పూర్తిగా మునిగిపోతున్న నావ అని వారు భావిస్తున్నారా? అక్కడే ఉండి తామూ మునగడం కంటే బయటకు వెళ్లడం మంచిదని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వైకాపా వర్గాల నుంచే వస్తోంది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో.. వైకాపా వర్గాల్లో చర్చలను చూస్తుంటే... ఆ పార్టీ పుట్టి మునుగుతోందని వారు భావిస్తున్నట్లుగా ఉంది. అలాంటిచోట కొనసాగేందుకు ధైర్యం చేయలేకపోతున్నట్లున్నారు. ‘వై నాట్ 175’ అంటున్న సీఎం జగన్ మాటలన్నీ మేకపోతు గాంభీర్యమేనని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భావిస్తున్నట్లుంది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల పవనాలు తప్పవనే అంచనాకొచ్చి నేతలు తెగతెంపులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ఉన్నారు. 81 వేల మెజారిటీతో గెలిచినా.. 2019 ఎన్నికల్లో గిద్దలూరు నుంచి అన్నా వెంకట రాంబాబు 81వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. రాష్ట్రంలో సీఎం జగన్ తర్వాత రెండో అత్యధిక మెజారిటీ ఆయనదే. అలాంటి ఆయన రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడం వైకాపా తిరోగమనానికి అద్దం పడుతోంది. అంత భారీ మెజారిటీతో గెలిచినా.. ఆయనకు నియోజకవర్గంలో పరపతి లేకుండా చేశారు. పార్టీలో, ప్రభుత్వంలో పెత్తనం సాగిస్తున్న ఒక ప్రధాన సామాజికవర్గ నేతలు తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని పలు సందర్భాల్లో పార్టీ అధిష్ఠానం ముందు రాంబాబు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయలేకపోయానని తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైకాపా తరఫున పోటీచేసి జనంలో పలుచన కావడం కంటే ఊరుకోవడం ఉత్తమమనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్సీ అయినా.. విశాఖకు చెందిన వంశీకృష్ణ యాదవ్‌కు ఎమ్మెల్సీగా ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉంది. అయినా పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. వైకాపా ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉండి.. విశాఖలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అక్కడ పార్టీకి ఒక బీసీ సామాజికవర్గం మద్దతును కూడగట్టారు. కానీ, 2019లో ఆయనకు టికెట్ ఎగ్గొట్టారు. తర్వాత విశాఖ మేయర్‌ని చేస్తామని హ్యాండిచ్చారు. ఆనక ఎమ్మెల్సీ ఇచ్చి సర్దుకోమని చెప్పారు. ఆయన కోరుకుంటున్న విశాఖ తూర్పు నియోజకవర్గంలో స్థానం లేకుండా చేశారు. 2024లోనైనా టికెట్ ఇవ్వాలని వంశీ కోరుతున్నా... విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఆ స్థానాన్ని అప్పగించారు. ఇప్పటికే విశాఖ మేయర్ వెంకటకుమారి, వీఎంఆర్డీయే ఛైర్పర్సన్ విజయనిర్మల వర్గాలు నియోజకవర్గంలో వంశీకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే ఇప్పుడు వారికి తోడుగా ఎంపీ కూడా కలిశారు. వాటన్నింటినీ భరిస్తూ ఇంతకాలం నెట్టుకొచ్చారు. ప్రభుత్వం, పార్టీలోని పెద్దలు విశాఖలో చేస్తున్న అరాచకాలకు అక్కడి జనంలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇలాగే పార్టీలో కొనసాగితే... తాను, తన కేడర్ నిండా మునిగిపోవాల్సిందే అనే ఆందోళనతోనే వంశీ వైకాపాను వీడారు. సొంత మనిషే సైడైపోయారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కుటుంబం సీఎం కుటుంబానికి సన్నిహితమైంది. వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు జగన్ కంటే, తెదేపాను ఇరుకున పెట్టేందుకు ఆర్కేనే ఎక్కువ పనిచేశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కూడా తెదేపాపైన, చంద్రబాబుపైన లేనిపోని కేసులు పెట్టి న్యాయస్థానాల చుట్టూ తిప్పుతూ.. వేధించారు. తన సొంత నియోజకవర్గంలో రాజధాని వస్తున్నా జగన్ కోసమే వ్యతిరేకించారు. తెదేపా ప్రధానకార్యదర్శి లోకేశ్‌పై గెలిచిన ఆర్కేను మంత్రివర్గంలోకి తీసుకుంటానన్న జగన్.. తర్వాత మాట తప్పినా అలాగే కొనసాగారు. జగన్‌కు అంత సొంత మనిషిగా ఉన్న ఆర్కే కూడా ఇప్పుడు వైకాపాకు గుడ్‌బై చెప్పారు. తన ఎమ్మెల్యే పదవినీ ఆయన వదులుకున్నారు. వైకాపాలో అభ్యర్థులను జగన్ ఎడాపెడా మార్చేస్తున్న విధానం చూశాక.. ఇక పార్టీ పరిస్థితి కష్టమేనన్న అంచనాకు వచ్చి ఆర్కే రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. ‘ఇష్టం లేని వ్యక్తుల కోసం మనసు చంపుకొని పనిచేయాల్సి వస్తోంది. రాజకీయాల్లో కొనసాగాలంటే ఇలా పనిచేయక తప్పదు’ అని ఎంపీ మోపిదేవి వెంకటరమణ లాంటి సీనియర్ నేతలు అంటున్నారంటే వైకాపాలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు. ‘మాకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా పర్లేదు. ఎక్కడ నుంచి పోటీ చేయాలని చెబితే అక్కడ నుంచే చేస్తాం’ అని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నదంతా పైకి మాత్రమేనని... వారూ ప్రత్యామ్నాయాల వేటలో ఉన్నారని వైకాపా నేతలే చెబుతున్నారు. గెలిస్తే తలెత్తుకుని తిరగలేకపోయేవాడిని ‘2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పర్చూరులో నేను ఓడిపోవడమే మంచిదైంది. అప్పుడు గెలిస్తే ఇప్పుడిలా నియోజకవర్గంలో తలెత్తుకుని తిరగ్గలిగేవాడిని కాను’ అని మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవల కారంచేడులో వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.