Mediahypocrisy Posted December 30, 2023 Report Posted December 30, 2023 ED Notice To MLA Vinod: హెచ్‌సీఏ నిధుల గోల్‌మాల్‌పై ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు నోటీసులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో (HCA) జరిగిన 20 కోట్ల రూపాయల నిధుల గోల్‌మాల్‌పై ఈడీ (enforcement directorate) దర్యాప్తు వేగవంతం చేసింది. హెచ్‌సీఏ కమిటీ మాజీ అధ్యక్ష, కార్యదర్శులను ఈడీ విచారించింది. మాజీ క్రికెటర్లు ఆర్షద్ అయూబ్ (Arshad Ayub), శివలాల్ యాదవ్‌లను (Shivalal Yadav) కూడా విచారించింది. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్యే వినోద్‌కు (MLA Vinod) నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో విచారణకు హాజరుకావాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు నోటీసులను ఈడీ అధికారులు ఇచ్చారు. వినోద్ సోదరుడు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి (MLA Vivek Vekata Swamy) యాజమాన్యంలోని సంస్థలకు డబ్బు బదిలీ జరిగిందని ఈడీ అనుమానిస్తోంది. రూ.28 కోట్లకుపైగా లావాదేవీలు జరిపిన వివేక్ ఆస్తులపై గతంలోనే దాడులు ఈడీ చేసింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణ సమయంలో మనీ లాండరింగ్‌పై ఏసీబీ (ACB) చార్జిషీట్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. హెచ్‌సీఏలో నిధుల దుర్వినియోగం జరిగిందని చార్జిషీట్‌లో ఏసీబీ పేర్కొంది. ఆఫీస్ బేరర్లు, ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యి మార్కెట్ ధరల కంటే అధికంగా కాంట్రాక్టర్లకు టెండర్లు కేటాయించారని ఈడీ వాదనలు వినిపిస్తోంది. Quote
Mediahypocrisy Posted December 30, 2023 Author Report Posted December 30, 2023 Malli party lu marutara Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.