Mediahypocrisy Posted December 31, 2023 Report Posted December 31, 2023 Jayaprada Missing: టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి మేటి నటిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా రాజకీయాల్లో సైతం తనకంటూ ఖ్యాతి సంపాదించిన నటి జయప్రద. ఇప్పుడు ఉదయం నుంచి ఆమె కన్పించడం లేదనే వార్త వైరల్ అవుతోంది. ఆమె ఎక్కడికి వెళ్లింది, ఏమైందనేది తెలియడం లేదు. అసలు జయప్రద మిస్సింగ్ అనే వార్త వ్యాపించడానికి కారణం ఆమెపై జారీ అయిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్‌లో ఆమె ప్రాతినిధ్యం వహించి రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలో నిలిచిన జయప్రద కోడ్ అమల్లో ఉన్నా కూడా ఓ రోడ్డును ప్రారంభించారు. దాంతో అక్కడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై..ఇప్పటికీ ఆ కేసు రాంపూర్ కోర్డులో నడుస్తోంది. ఈ కేసులో ఎన్నిసార్లు కోర్టు కోరినా ఇప్పటివరకూ ఆమె హాజరుకాలేదు. దాంతో ఆగ్రహించిన కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత నెల అంటే నవబంర్ 8వ తేదీన విచారణకు వచ్చింది. నవంబర్ 17న నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇన్ని రోజులూ కోర్టు సమయం వృధా చేయడంతో ఆగ్రహించిన కోర్టు జనవరి 10వ తేదీ లోగా జయప్రదను కోర్టులో హాజరుపర్చాలని రాంపూర్ పోలీసుల్ని కోర్టు ఆదేశించింది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.