Jump to content

Sharu self criticism


Recommended Posts

Posted
17 minutes ago, Point said:

What about mama vennupotu scheme alludu?

Nee kodi brain ki edo tadutundi kada.. ade patuku veladu

Posted

Ganta Srinivasa Rao: జగనన్న వదిలిన బాణాన్ని అని మీకోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లికి అన్యాయం చెయ్యమని ఏ పార్టీ చెప్పింది?: గంటా శ్రీనివాసరావు 

04-01-2024 Thu 11:11 | Andhra
  • వైఎస్ హయాంలో ఒకటిగా ఉన్న కుటుంబం జగన్ నిర్వాకంతో రెండుగా చీలిపోయిందన్న గంటా
  • తల్లి, చెల్లి కష్టాన్ని వాడుకుని సీఎం అయ్యాక బయటకు పంపించేశారని విమర్శ
  • కుటుంబాన్ని గౌరవించలేని వాడు సమాజాన్ని గౌరవించలేడని వ్యాఖ్య
 
Ganta Srinivas Rao comments on Jagan
Listen to the audio version of this article

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి విమర్శలు గుప్పించారు. మీ నాన్న గారి హయాంలో ఒకే మాట, ఒకే బాటగా ఉండే కుటుంబం తమరి నిర్వాకంతోనే రెండుగా చీలిపోయిందన్న లోగుట్టు ప్రపంచానికంతా తెలుసు జగనన్నా అని ఎద్దేవా చేశారు. మా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ ఈరోజు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. 

మీరు జైల్లో ఉన్న సమయంలో మీ విజయానికి అహర్నిశలు శ్రమించిన మీ తల్లి, చెల్లి కష్టాన్ని వాడుకుని సీఎం అయ్యాక వారిని బయటకి తరిమేసిన మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల్లో జగనన్న వదిలిన బాణాన్ని అని మీ కోసం రాష్ట్రమంతా తిరిగిన చెల్లికి అన్యాయం చెయ్యమని ఏ పార్టీ చెప్పింది? ఏ నాయకుడు చెప్పాడు? అని ప్రశ్నించారు. మీ చెల్లికి ఆస్తి పంపకాల్లో అన్యాయం చెయ్యమని, ఎంపీ టికెట్ ఇవ్వొద్దని ఏ పార్టీ చెప్పింది? ఏ నాయకుడు చెప్పాడు? అని అడిగారు. ఢిల్లీలో తన తండ్రి హత్య కేసు నిందితుల్ని శిక్షించాలని కాళ్ళు అరిగేలా తిరుగుతున్న మరొక చెల్లికి న్యాయం చెయ్యొడ్డని ఏ పార్టీ చెప్పింది? ఏ నాయకుడు చెప్పాడు? అని ప్రశ్నించారు.  

తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని గౌరవించలేనివాడు.. సమాజాన్ని కూడా గౌరవించలేడనే విషయం మరోసారి మీ ద్వారా నిరూపితమయిందని అన్నారు. మీరు పెట్టిన చిచ్చే రాబోయే ఎన్నికల్లో మిమ్మల్నే చుట్టుముట్టబోతోందనే విషయాన్ని గమనించండి జగన్మోహన్ రెడ్డి గారూ అని గంటా పేర్కొన్నారు. 

 

Posted

YS Sharmila: కాంగ్రెస్ లో చేరిన షర్మిల.. కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే, రాహుల్ 

04-01-2024 Thu 11:17 | Both States
  • వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల
  • దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అంటూ వ్యాఖ్య
  • వైఎస్సార్ కూతురుగా కాంగ్రెస్ లో చేరుతున్నందుకు సంతోషంగా ఉందని హర్షం  
 
YSRTP Chief YS Sharmila Joins Congress
Listen to the audio version of this article

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్సార్ తన జీవితకాలం కష్టపడ్డారని చెప్పారు. ఆయన చివరిక్షణం వరకూ పార్టీకి సేవ చేశారని గుర్తుచేశారు. ఆయన కూతురుగా ఈ రోజు తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఈరోజు దేశంలోనే అతిపెద్ద సెక్యూలర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించారు. 

ఇటీవల మణిపూర్ లో జరిగిన అల్లర్లు, ప్రాణనష్టం తనను ఎంతగానో బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఐక్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని, ఆ ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ తనతో పాటు దేశ ప్రజలలో ఆత్మవిశ్వాసం నింపారని చెప్పారు. అందుకే తను కాంగ్రెస్ లో చేరానని, తన పార్టీ వైఎస్సార్ టీపీని విలీనం చేశానని వివరించారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేసిన షర్మిల.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్ టీపీ ఎన్నికలకు దూరంగా ఉందని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం తన తండ్రి వైఎస్సార్ కల అని, ఆ కలను నెరవేర్చడానికి కృషి చేస్తానని షర్మిల వివరించారు.

Posted

paapam pulkas..

last ki sharmila ni nettina pettukovalsi vastundi ABN and CBN ki.

  • Haha 1
Posted

Poine le vadu evado teliyadu ana ledu antuna halwa

YS Sharmila: కుటుంబాల మధ్య చిచ్చు గురించి జగన్ వ్యాఖ్యలపై షర్మిల స్పందన 

04-01-2024 Thu 12:29 | Andhra
  • జగన్ ఏం మాట్లాడారో తనకు తెలియదన్న షర్మిల
  • కాంగ్రెస్ లో చేరడం సంతోషంగా ఉందని వ్యాఖ్య
  • ఎక్కడ బాధ్యతలను అప్పగించినా పార్టీ విజయం కోసం పని చేస్తానన్న షర్మిల
 
Sharmila response on Jagan comments on rift between families

కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేందుకు, కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కాసేపటి క్రితం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా... జగన్ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ... కుటుంబంలో చిచ్చు గురించి జగన్ ఏం మాట్లాడారో తనకు తెలియదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు. పార్టీ హైకమాండ్ తనకు ఇంకా బాధ్యతలను అప్పజెప్పలేదని... ఆంధ్ర అయినా, అండమాన్ అయినా ఎక్కడ బాధ్యతలను అప్పగించినా పార్టీ విజయం కోసం పని చేస్తానని చెప్పారు. తనకు అప్పగించే బాధ్యతలపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని తెలిపారు.

Posted

 Vijayamma ki belt treatment ichi vastadu emo sunny babu

Jagan: రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్ నివాసానికి వెళ్తున్న జగన్ 

04-01-2024 Thu 12:47 | Andhra
  • కేసీఆర్ ను పరామర్శించిన జగన్
  • కేసీఆర్ నివాసంలో భోజనం చేయనున్న ఏపీ సీఎం
  • అనంతరం లోటస్ పాండ్ లో తన తల్లిని కలవనున్న జగన్
 
Jagan going to Lotus Pond house after 2 years

ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ కు వచ్చారు. ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన నేరుగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఇటీవల హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ను జగన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ నివాసంలోనే ఆయన భోజనం చేయనున్నారు. అనంతరం లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు. లోటస్ పాండ్ లో ఉన్న తన తల్లి విజయమ్మను జగన్ కలవనున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్ కు వెళ్తుండటం గమనార్హం.

Posted

YV Subba Reddy: తెలంగాణ పరిస్థితులను బట్టే షర్మిల కాంగ్రెస్ లో చేరారు: వైవీ సుబ్బారెడ్డి 

04-01-2024 Thu 18:55 | Andhra
  • కాంగ్రెస్ లో వైస్సార్టీపీ విలీనం
  • కాంగ్రెస్ కండువా కప్పుకున్న షర్మిల
  • వైసీపీలో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారన్న వైవీ
  • ఎవరు ఏ పార్టీలో చేరినా ప్రజలు జగన్ వైపేనని ధీమా
 
YV Subbareddy reacts to Sharmila joining in Congress

వైఎస్ షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం తెలిసిందే. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. షర్మిల తాజా నిర్ణయం వల్ల ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం ఉండదని అన్నారు. 

వైసీపీలో అవకాశం లేకపోవడం వల్లే షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారని, తెలంగాణలో పరిస్థితులను బట్టే కాంగ్రెస్ లో విలీనం నిర్ణయం తీసుకున్నారని వైవీ సుబ్బారెడ్డి వివరించారు. షర్మిలే కాదు... ఎవరు ఏ పార్టీలో చేరినా, ఎన్ని పార్టీలు కూటమి కట్టినా ప్రజల మద్దతు జగన్ కే ఉందని స్పష్టం చేశారు. జగన్ కాకుండా మరొకరు సీఎం అయితే రాష్ట్రంలోని పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. 

ఇవాళ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల... పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని... ఆంధ్రప్రదేశ్ కు పంపినా, అండమాన్ కు పంపినా పార్టీ కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. 

 

Posted

Kodali Nani: షర్మిల ఓట్లు చీల్చుతారన్న వాదనలపై కొడాలి నాని లాజిక్ ఇదే! 

04-01-2024 Thu 16:48 | Andhra
  • కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసిన షర్మిల
  • షర్మిల కాంగ్రెస్ లో చేరడం వల్ల తమకేమీ ఇబ్బంది లేదన్న కొడాలి నాని
  • కాంగ్రెస్ కు ఏం ఓటు బ్యాంకు వుందని ఓట్లు చీలతాయని వ్యంగ్యం
  • పురందేశ్వరి బీజేపీలో చేరితే టీడీపీ ఓట్లు చీలతాయా అంటూ వ్యాఖ్యలు
 
Kodali Nani reaction on Sharmila joins Congress Party
Listen to the audio version of this article

వైఎస్సార్టీపీ చరిత్ర ముగిసింది. పార్టీ ఏర్పడిన కొన్నేళ్లకే జాతీయ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైపోయింది. ఇవాళ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లో చేరడం తెలిసిందే. కాగా, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికరంగా స్పందించారు.

షర్మిల కాంగ్రెస్ లో చేరడం వల్ల వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీ ఓట్లు ఎందుకు చీలతాయి? అలాంటప్పుడు పురందేశ్వరి బీజేపీలో చేరితే టీడీపీ ఓట్లు చీలవా? అంటూ లాజిక్ ను ప్రదర్శించారు. ఏపీలో కాంగ్రెస్ కు ఒక్క శాతం ఓటు బ్యాంకు కూడా లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. వైసీపీకి పనికిరానివాళ్లంతా టీడీపీకి పనికివస్తారని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్ పార్టీ ఇంత దారుణ పరిస్థితికి దిగజారడానికి రెండు కారణాలు ఉన్నాయని తెలిపారు. "ఒకటి... రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీని గాలికి వదిలేశారు.... రెండోది, రాష్ట్రంలో చనిపోయిన కాంగ్రెస్ పార్టీని బతికించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని చనిపోయాక ముద్దాయిగా చేశారు... ఆయన కుటుంబంలోని జగన్ మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఈ రెండు కారణాలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దిక్కుమాలిన పరిస్థిని ఎదుర్కొంటోంది" అని విమర్శించారు. ఈ రెండు కారణాలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జగన్ కు క్షమాపణలు చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.

Posted

Vellampalli Srinivasa Rao: వెల్లంపల్లి వర్గం, మల్లాది వర్గం అని వేర్వేరు వర్గాలు ఉండవు: వెల్లంపల్లి శ్రీనివాస్ 

04-01-2024 Thu 16:36 | Andhra
  • నియోజకవర్గం మారాలంటే బాధగానే ఉంటుందన్న వెల్లంపల్లి
  • పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వ్యాఖ్య
  • ఏ పార్టీలో చేరాలనేది షర్మిల ఇష్టమన్న వెల్లంపల్లి
 
Vellampalli Srinivas comments on YS Sharmila
Listen to the audio version of this article

తాము గేట్లు తెరిస్తే వైసీపీలో ఉన్న వాళ్లంతా టీడీపీలోకి వస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారని... మరి ఇంతవరకు ఆయన గేట్లు ఎందుకు తెరవలేదని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. తన నియోజకవర్గాన్ని విజయవాడ సెంట్రల్ కు మార్చడంపై స్పందిస్తూ... నియోజకవర్గం మారాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుందని... కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. మల్లాది విష్ణుతో కలిసి విజయవాడ సెంట్రల్ లో వైసీపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ వెస్ట్ లో మైనార్టీ అభ్యర్థిని పెట్టాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని, అందుకే తనను సెంట్రల్ కు మార్చారని చెప్పారు. వెల్లంపల్లి వర్గం, మల్లాది వర్గం అని వేర్వేరు వర్గాలు ఉండవని... అంతా వైసీపీ వర్గమేనని చెప్పారు. ఏ పార్టీలో చేరాలనేది వైఎస్ షర్మిల ఇష్టమని... ఆమె ఏం మాట్లాడతారో వేచి చూడాల్సి ఉందని అన్నారు.

Posted

Brother Anil Kumar: ఏపీ రాజకీయాల్లో షర్మిల ప్రభావం కచ్చితంగా ఉంటుంది: బ్రదర్ అనిల్ కుమార్ 

04-01-2024 Thu 15:50 | Andhra
  • కాంగ్రెస్ హైకమాండ్ ఏ బాధ్యతలను అప్పగించినా షర్మిల స్వీకరిస్తారన్న అనిల్
  • కాంగ్రెస్ కుటుంబంలో ఉండటమే తమకు ముఖ్యమని వ్యాఖ్య
  • హైకమాండ్ ఆదేశాల మేరకు షర్మిల పూర్తి స్థాయిలో పని చేస్తారన్న అనిల్
 
There will be lot of Sharmila impact on AP politics says Brother Anil Kumar
Listen to the audio version of this article

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సమక్షంలో ఆమె కాంగ్రెస్ లో చేరారు. షర్మిలకు రాహుల్, ఖర్గేలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా హాజరయ్యారు. షర్మిల పక్కనే ఆయన వేదికపై ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో బ్రదర్ అనిల్ మాట్లాడుతూ... కాంగ్రెస్ కుటుంబంలో తాము కూడా సభ్యులమే అని చెప్పారు. ఈ దేశానికి మంచి జరుగుతుందని అన్నారు. 

పార్టీ హైకమాండ్ ఏ బాధ్యతలను అప్పగించినా షర్మిల స్వీకరిస్తారని... కాంగ్రెస్ కుటుంబంలో ఉండటమే తమకు ముఖ్యమని చెప్పారు. కాంగ్రెస్ లో షర్మిల చేరడం ఏపీ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందా? అనే ప్రశ్నకు సమాధానంగా... ఏపీలో కచ్చితంగా షర్మిల ప్రభావం ఉంటుందని అన్నారు. మీ బావమరిది, సీఎం జగన్ కు వ్యతిరేకంగా పని చేయమని హైకమాండ్ ఆదేశిస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా... అధిష్ఠానం ఆదేశాల మేరకు షర్మిల పూర్తి స్థాయిలో పని చేస్తారని చెప్పారు.

Posted

Jagan: తల్లి విజయమ్మను కలిసిన అనంతరం బయల్దేరిన జగన్.. ముగిసిన హైదరాబాద్ పర్యటన 

04-01-2024 Thu 14:20 | Both States
  • కేసీఆర్ తో 45 నిమిషాల పాటు ఏకాంత చర్చలు జరిపిన జగన్
  • లోటస్ పాండ్ లో తన తల్లిని కలిసిన సీఎం
  • లోటస్ పాండ్ నుంచి ఎయిర్ పోర్టుకు పయనం
 
Jagan Hyderabad trip ended
Listen to the audio version of this article

ఏపీ ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ పర్యటన ముగిసింది. ఉదయం హైదరాబాద్ కు వచ్చిన వెంటనే ఆయన నేరుగా మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లారు. కేసీఆర్ ను పరామర్శించిన తర్వాత దాదాపు 45 నిమిషాల పాటు ఆయనతో ఏకాంతంగా చర్చలు జరిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రానున్న ఎన్నికలపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ తో చర్చలు ముగిసిన వెంటనే ఆయన లోటస్ పాండ్ లోని తన నివాసానికి వెళ్లారు. తన తల్లి విజయమ్మతో అరగంట సేపు మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన నేపథ్యంలో వీరి కలయిక ఆసక్తికరంగా మారింది. తల్లితో సమావేశం తర్వాత ఆయన బేగంపేట్ ఎయిర్ పోర్టుకు బయల్దేరారు

Posted

Peddireddi Ramachandra Reddy: షర్మిలను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాం: మంత్రి పెద్దిరెడ్డి 

04-01-2024 Thu 14:05 | Andhra
  • వైసీపీలో అవకాశం లేక తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టుకున్నారన్న పెద్దిరెడ్డి
  • షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి, ఏపీ రాజకీయాలకు సంబంధం లేదని వ్యాఖ్య
  • ఎన్ని జాకీలను పెట్టినా లోకేశ్ లేవడని ఎద్దేవా
 
We will see YS Sharmila as plitical opponent
Listen to the audio version of this article

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో అవకాశం లేక షర్మిల తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారని... ఇప్పుడు ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారని చెప్పారు. షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి, ఏపీ రాజకీయాలకు సంబంధం లేదని అన్నారు. జగన్ ను జైలుకు పంపించిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా... వారిని తాము రాజకీయ ప్రత్యర్థులుగానే చూస్తామని అన్నారు. తమ నాయకుడు జగన్ కోసం తాము ఎప్పటికీ పని చేస్తూనే ఉంటామని చెప్పారు. జగన్ ను మరోసారి సీఎంగా చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేయడం చంద్రబాబు, సోనియాగాంధీల నైజం అని విమర్శించారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా నారా లోకేశ్ లేవడని అన్నారు. 

Posted

Whatever it is Jagan did a big mistake.. CM power vundi kuda Chelli ki adigindi iyyaka ee lolli enti? Jail lo vunnapudu anna kosam bhane tirigindi kada. CM padavi lo vundi intha kakkurthi enduko? Dabbu and premium lands tisukodam jujubi villaku. Oka Kadapa MP and konni asthulu icheste intha lolli vundedi kadu kada. Jagan anna thappu chesadu anipistundi.

  • Upvote 1

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...