psycopk Posted January 6, 2024 Report Posted January 6, 2024 Bhanuprakash Reddy: జగన్ తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు... ఆయనను సాగనంపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు: భానుప్రకాశ్ రెడ్డి 06-01-2024 Sat 15:26 | Andhra టీడీపీతో పొత్తు విషయాన్ని హైకమాండ్ చూసుకుంటుందన్న భానుప్రకాశ్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా జగన్ చేసిన హామీ ప్రకటనలు ఏమయ్యాయని ప్రశ్న ఆంధ్రప్రదేశ్ అంధకారప్రదేశ్ గా మారిపోయిందని ఆవేదన ఏపీలో పొత్తులపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. టీడీపీతో పొత్తు విషయాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ వదిలిన బాణం యూటర్న్ తీసుకుని ఆయన వైపే వస్తోందని అన్నారు. ఇలాంటి కోట్ల బాణాలను జగన్ మీదకు వదలడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలతో జగన్ పాలన సాగుతోందని... ఆయనను ఇంటికి సాగనంపడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. తన కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని జగన్ అంటున్నారని... ఆయన కుటుంబంలో చిచ్చు పెట్టాల్సిన అవసరం ఎవరికుందని భానుప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. మాట తప్పను, మడమ తిప్పను అంటూ అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన హామీ ప్రకటనలు ఏమయ్యాయని అడిగారు. కేంద్ర పథకాలకు స్టిక్కర్లు మార్చి రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగా చెప్పుకోవడం మినహా... గత నాలుగున్నర ఏళ్లలో ఆయన చేసిందేముందని ప్రశ్నించారు. సర్వేల పేర్లతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ అభ్యర్థులను ఆయన మార్చడం కాదని... ప్రజలే ఆయనను మారుస్తారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి, ఆలస్యం ఎవరి వల్ల జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ అరాచక పాలన కారణంగా అన్నపూర్ణగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ అంధకారప్రదేశ్ గా మరిపోయిందన ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. Quote
psycopk Posted January 6, 2024 Author Report Posted January 6, 2024 Raghu Rama Krishna Raju: వైసీపీకి కేంద్రం అనుకూలమనే అపవాదును బీజేపీ నేతలు తొలగించుకోవాలనుకుంటున్నారు: రఘురామకృష్ణరాజు 06-01-2024 Sat 13:09 | Andhra అయోధ్య వేడుక తర్వాత శుభవార్త వింటారన్న రఘురాజు జగన్ ప్రభుత్వ తప్పులను ఖండించాలని బీజేపీ నేతలు నిర్ణయించారని వ్యాఖ్య వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయని ఆశాభావం Listen to the audio version of this article సీఎం జగన్ కు, వైసీపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అనుకూలమనే అపవాదును తొలగించుకోవాలని బీజేపీ అగ్ర నేతలు యోచిస్తున్నారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ వేడుక అనంతరం రాష్ట్ర ప్రజలు శుభవార్తను వింటారని చెప్పారు. జగన్ ప్రభుత్వం ఎన్నో తప్పులు చేసిందని, ఆ తప్పులను తీవ్రంగా ఖండించాలని బీజేపీ నేతలు నిర్ణయించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లాలని తాను ఆశిస్తున్నానని చెప్పారు. సీపీఎస్ ను రద్దు చేయాలని మహారాష్ట్రలోని బీజేపీ, శివసేన ప్రభుత్వం నిర్ణయించిందని రఘురాజు తెలిపారు. ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ముందుకు సాగనుండటంతో... ఓపీఎస్ కోసం రాష్ట్ర ఉద్యోగులంతా ఈ కూటమికి మద్దతుగా నిలవాలని కోరారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.