JackSeal Posted January 7, 2024 Report Posted January 7, 2024 న్యూయార్క్‌కు చెందిన డేటా బేసిక్స్ కార్పొరేషన్ అనే కంపెనీ అధినేత డాన్ లీల్స్.. నారాయణమూర్తి పట్ల కొన్ని సందర్భాల్లో అనుచితంగా ప్రవర్తించేవాడు. తరచుగా చెల్లింపులను ఆలస్యం చేసేవాడు. మ్యాన్‌హట్టన్ వెళ్లినప్పుడు తనకే కాకుండా ఇతర ఇన్ఫోసిస్ సహచరులకు సైతం హోటల్‌లను బుక్ చేసుకోవడానికి అనుమతినిచ్చేవాడు కాదు. ఇలా మూర్తి ఒకసారి క్లయింట్ వర్క్ కోసం యూఎస్ వెళ్ళినప్పుడు, డాన్ లీల్స్ ఆయన్ను స్టోర్‌రూమ్‌లో పడుకోబెట్టాడు. కిటికీలు కూడా లేని ఉన్న ఆ రూంలో చుట్టూ అట్టపెట్టెల మధ్యే ఆ రాత్రి ఆయన నిద్రించాడు. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న కంపెనీ కోసం నారాయణమూర్తి ఇలాంటి అవమానాలను ఎన్నో సహించారు. 1 Quote
JackSeal Posted January 7, 2024 Author Report Posted January 7, 2024 అతిథి దేవుడిలాంటివారని తన అమ్మ అంటుండేదని, అతిథులతో వ్యవహరించిన తీరుని బట్టే నువ్వు ఎలాంటివాడివో తెలుస్తుందని చెబుతూ ఈ ఘటన గురించి భార్య సుధా మూర్తితో నారాయణమూర్తి చెప్పారు. అనుకోకుండా వాళ్ల నాన్న ఎవరినైనా ఇంటికి ఆహ్వానించినప్పుడు తన తల్లి తాను తినకుండా అతిథికి అన్నం పెట్టేదని గుర్తు చేసుకున్నారు. కానీ డాన్ లీల్స్ తాను విలాసవంతమైన బెడ్‌పై పడుకుని తనను మాత్రం స్టోర్‌రూంలో పెట్టెపై పడుకోబెట్టాడని నారాయణమూర్తి చెప్పగా సుధామూర్తికి మాత్రం ఈ ఘటన కోపం తెప్పించినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. Quote
TrishaManiac Posted January 7, 2024 Report Posted January 7, 2024 aa adbhuthamaina vyakthi mana kosam enno kashtaalu bharinchaadu 1 Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.