psycopk Posted January 8, 2024 Report Posted January 8, 2024 CEC: విజయవాడ చేరుకున్న కేంద్ర ఎన్నికల బృందం 08-01-2024 Mon 20:54 | Andhra మూడ్రోజుల పాటు విజయవాడలోనే ఉండనున్న సీఈసీ బృందం ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ రేపు, ఎల్లుండి భేటీలు నిర్వహించనున్న సీఈసీ బృందం సీఈసీ బృందాన్ని రేపు కలవనున్న చంద్రబాబు, పవన్ Listen to the audio version of this article కేంద్ర ఎన్నికల బృందం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చింది. ఈ సాయంత్రం కేంద్ర ఎన్నికల బృందం విజయవాడ చేరుకోగా... విమానాశ్రయంలో కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీ వారికి స్వాగతం పలికారు. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీఈసీ రాజీవ్ కుమార్, చంద్రపాండే, అరుణ్ గోయాల్ రాష్ట్రానికి వచ్చారు. సీఈసీ బృందం నేటి నుంచి మూడ్రోజుల పాటు విజయవాడలో ఉండనుంది. రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం రేపు (జనవరి 9) సమావేశం కానుంది. సీఎస్, డీజీపీ సహా వివిధ శాఖల అధికారులతో సీఈసీ బృందం ఎల్లుండి (జనవరి 10) భేటీ అవుతుంది. కాగా, రేపు ఉదయం విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇందుకోసమే వారు ఇప్పటికే రేపు వెంకటగిరిలో జరగాల్సిన రా కదలిరా సభను వాయిదా వేసుకున్నారు. Quote
psycopk Posted January 8, 2024 Author Report Posted January 8, 2024 Chandrababu: రేపు పవన్ కల్యాణ్ కు చంద్రబాబు అల్పాహార విందు 08-01-2024 Mon 21:15 | Andhra రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం విజయవాడలో మకాం వేసిన సీఈసీ కమిటీ రేపు ఉదయం 8.30 గంటలకు ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి పవన్ నోవోటెల్ హోటల్లో సీఈసీ బృందాన్ని కలవనున్న చంద్రబాబు, పవన్ Listen to the audio version of this article కేంద్ర ఎన్నికల సంఘం బృందం నేడు రాష్ట్రానికి వచ్చిన సంగతి తెలిసిందే. సీఈసీ బృందం విజయవాడలో మకాం వేసి వివిధ సమావేశాలు నిర్వహించనుంది. కాగా, రేపు ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ విజయవాడలో కేంద్ర ఎన్నికల బృందాన్ని కలవనున్నారు. పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి రేపు ఉదయం విజయవాడ రానున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఉదయం 8.30 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళతారు. చంద్రబాబు నివాసంలో జనసేనాని అల్పాహార విందు స్వీకరిస్తారు. అనంతరం, చంద్రబాబు, పవన్ విజయవాడలో సీఈసీ కమిటీ సభ్యులను కలిసేందుకు బయల్దేరతారు. రాష్ట్రంలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయంటూ కొన్నాళ్లుగా టీడీపీ, జనసేన నేతలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన అంశాలను చంద్రబాబు, పవన్ కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నారు. ఓట్ల అవకతవకలపై చంద్రబాబు ఇప్పటికే ఢిల్లీలో ఓసారి సీఈసీని కలిశారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి సీఈసీతో భేటీ కానుండడం ఇదే ప్రథమం. రేపు విజయవాడ నోవోటెల్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం బృందాన్ని కలవనున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.